*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --1* 🌷
🕉️ నేను (అమర) *“ఒక రోజు శస్త్ర చికిత్స చేయించుకుంటున్నాను. నాకు మత్తు మందు ఇచ్చి పది వరకు అంకెలు లెక్క పెట్టమన్నారు. నేను ఆరు వరకు లెక్కపెట్టి ఆపైన శరీర స్పృహ కోల్పోయాను. అయితే అది వేరే తలాల ఉనికి అని అదే సూక్ష్మ శరీరయానం అనీ ఆ తరువాత తెలుసుకున్నాను. సుదూర ప్రాంతం నుండి ఒక వినూత్న సంగీతాన్ని విన్నాను. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలి అనుకొన్న తక్షణమే అద్భుతమైన వేగంతో అటువైపు ప్రయాణించాను. పై కప్పు ద్వారా బయటకు వచ్చి అంతరిక్షంలో ప్రయాణించాను.
🌏 *“మన భూమి ఒక పెద్ద చంద్రుడిలాగా కనిపించింది. చీకటిలో విస్తరిస్తున్న అంతరిక్షంలో నేను త్వరత్వరగా చంద్రుడు, శుక్రుడు, బుధ గ్రహాలను దాటి వెళ్ళాను. చివరగా సూర్యుణ్ణి చేరుకుని లోపలకు వెళ్ళాను. తేజోవంతమైన మరి మండుతున్న పై భాగం నుండి ప్రయాణం చేసి సూర్యుని లోపల ఉన్న నీలి రంగు భాగంలో ప్రవేశించాను. అక్కడ అనేక భూగోళాలను చూడగలిగాను. సంగీతం మధ్య భూగోళం నుండి వస్తోంది. ఆ మధ్య భూగోళంలోని ఒక పట్టణంలో దిగాను దాని”* మధ్యలో ఒక పెద్ద భవంతి ఉంది. చాలా మంది అందులోంచి లోపలికి బయటకు వెళ్తూ వస్తూ ఉన్నారు. సంగీతం నిలిచిపోయిందన్న విషయాన్ని మరచిపోయి నేను కూడా లోపలికి వెళ్ళాను.
🌳 ఒక విశాలమైన హాలులోకి ప్రవేశించి మిరుమిట్లు కొలుపుతున్న సింహాసనం పై కిరీట ధారియై కూర్చొనివున్న ఒక అందమైన వ్యక్తిని చూశాను. జనులు అతనికి నమస్కరిస్తున్నారు. నేను కూడా నమస్కరించాను. అప్పుడు నా భుజం పైన ఒక చేతి స్పర్శను అనుభూతి చెందాను. నేను అటు వైపు తిరిగి పరిచయం ఉన్న ముఖాన్ని చూశాను. *“ఇక్కడ ఏం చేస్తున్నావు”* అని అడిగాడు అతను. నేను వివరించాను. అతడు నాకు గత జన్మలో నా స్నేహితుణ్ణని చెప్తూ మరణానికి ముందు ఇక్కడికి వచ్చేందుకు సాధ్యపడదు అన్నాడు. ఆ హాలు నుండి బయటకు వస్తుండగా సింహాసనం పైనున్న వ్యక్తిని గురించి అడిగాను. ఆయన సూర్య భగవానుడని చెప్పగానే నేను పులకరింతకు గురయ్యాను.
🏵️ మేము బయట గుడారాల మాదిరి అనేక కట్టడాలు ఉన్న ప్రదేశానికి వచ్చాము. అక్కడ ఒక గుడారంలోకి ప్రవేశించి ఒక దృఢకాయుడైన ఋషి చుట్టూ సప్తర్షులు కూర్చుని ఉండటం గమనించాము. ఆ ధృఢకాయుడు విశ్వా మిత్రుడనీ, ఆయన చుట్టూ కూర్చుని ఉన్నవారు - భృగు, అత్రి, అంగీరస, వశిష్ట, పులస్త్య, పులాహ, మలిక్రతు అనే సప్తర్షులని నా మిత్రుడు చెవిలో చెప్పాడు. నా మిత్రుడు నా గురించి వారికి తెలియ చేశాడు. విశ్వామిత్ర మహర్షి ఒక క్షణం నావైపు చూసి ప్రేమతో, మరి వాత్సల్యంతో మాట్లాడారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌳 *కాంతి ద్వారాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సినవాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --2* 🌷
🍀 “ఒకానొక పౌర్ణమి రాత్రి కిటికీ నుండి ఆకాశంలోకి చూస్తూ ఒక నక్షత్రం కదుల్తూన్న ఉదంతం గమనించాను. అది కొన్ని క్షణాల్లో నా గదిలోకి వచ్చి నా ఎదుట నిలబడింది. అది కలకాదు. *"నేను వస్తానని నీకు మాట ఇచ్చాను అందుకే వచ్చాను. నన్ను చూడటానికి నీవు సిద్ధంగా ఉన్నావా?”* అనే మాటలు వినిపించాయి. *"అవును, ఎదురు చూస్తున్నాను”* అని తక్కువ స్వరంతో అన్నాను. *"మొదట ఆ రూపం అస్పష్టంగా ఉండి తరువాత ఘనీభవించి, క్షణమాత్ర కాలంలో విశ్వామిత్ర రూపం ప్రత్యక్షమైంది. అది నమ్మశక్యంగా లేదు. నేను కలవర పడ్డాను. ఆయన నన్ను వారి చేతుల్లోకి తీసుకొని, చాలా సేపు అలాగే పట్టుకున్నారు. అదొక సుందర మధురానుభూతి”*.
🏵️ తరువాత వారు ఇలా అన్నారు *“నేనే నిన్ను శ్రావ్యమైన సంగీతంతో ఇక్కడికి రప్పించాను. ఇప్పుడు మా పనికొరకు నిన్ను తయారు చేసేందుకు వచ్చాను. నేను ప్రతి దినం నీకు యోగ శిక్షణ, ఆధ్యాత్మిక బోధ చేసేందుకు వస్తాను. అది నీకు సమ్మతమేనా?"* నేను తల ఊపాను. ఆ విధంగా రెండున్నర సంవత్సరాలుగా నాకు శిక్షణ నేర్పించడం జరిగింది. వారు నాకు ప్రాణాయామ, ధ్యానం, నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించడం, అందులో నుండి బయటకు రావడం, కుండలిని జాగృతం చేయడం, సూక్ష్మ శరీరయానం, శరీరాన్ని బహు శరీరాలుగా పెంపొందించడం, ప్రత్యక్షీకరించడం, సంయమ రహస్యాలు మరి అనేక ఇతర రహస్యాలను నేర్పించారు.
🌹 ఆపై ఒక రాత్రి హిమాలయాల్లో ఋషులు ప్రతి రాత్రి ఎక్కడ సమావేశమవుతారో రహస్య స్థలానికి సూక్ష్మయానంలో తీసుకువెళ్ళారు. అక్కడ ఒక పెద్ద సమావేశం జరుగుతోంది. అక్కడ వేదిక పై కూర్చుని ఉన్న ఋషికి నన్ను చూపి *"నేను ఒక యువ ఋషిని మీ కార్యం కొరకు తీసుకుని వచ్చాను"* అని చెప్పారు. నేను ఆ ఋషికి నమస్కరించాను. *"ఆయన మార్కండేయ మహర్షి. మా కార్యక్రమాలకు ప్రస్తుత కార్యాధికారి”*. నాకు నమ్మశక్యం కాలేదు. అతడు అతి పిన్న వయస్కుడిగా వున్నారు. ఆయన సూక్ష్మ శరీరంలో కాక, భౌతిక శరీరంతో ఉన్నారు. *'అతని పేరేమిటి?'* అని మార్కండేయ మహర్షి అడిగారు. *“ఇప్పటి నుండి అతడు అమర అని పిలువబడుతాడు"* అని విశ్వామిత్ర మహర్షి బదులిచ్చారు. విధంగా నాకు ఆ పేరు వచ్చింది మరి సూక్ష్మ లోకాల్లో *'అమర'* అని పిలువబడుతున్నాను.
🔶 *“మీరు ఇప్పుడు కూడా పని చేస్తున్నారా”* అని నేను (కృష్ణానంద) *'అమర'* ను అడిగాను?
🔷 *"అవును"* అని బదులిచ్చారు.
🔶 *"మీతో పాటు ఎంత మంది పని చేస్తున్నారు?"*
🔷ప్రపంచ వ్యాప్తంగా 1,44,000 మంది వివిధ సంస్కృతులలో నివసిస్తున్నవారు పని చేస్తున్నారు.
🔶వారు ఎక్కడ నివశిస్తున్నారో మీకు తెలుసా?
🔷 తెలుసు, అయినా మేము మానవ తలంలో కలుసుకోము.
🔶 *"మీరు ఏ పని చేస్తున్నారు”?*
🔷ఏదో ఒకరోజు మీకే తెలుస్తుంది
🔶 *"నేను(కృష్ణానంద) కూడ ఈ కార్యంలో చేరవచ్చా”?*
🔷 *"మొదట ధ్యాన పద్ధతుల్లో ప్రావీణ్యం సంపాదించు"* అని అమర నవ్వుతూ అన్నారు.
🏵️ *"సూక్ష్మ శరీరయానం చేయాలంటే రోజంతా దీనికి సన్నద్ధం కావాలి. మనసును ఎటువంటి ఆందోళనకు గురికానివ్వరాదు. సూక్ష్మ యానానికి తీసుకెళ్ళేది మనసే అని గుర్తుంచుకోవాలి. మనస్సే ఒక వాహనం లాంటిది. ఎక్కువ ఆహారం కూడా తినరాదు. ఎందుకంటే అలా ఎక్కువగా తినడం సూక్ష్మ శరీరాన్ని భౌతిక శరీరం నుండి విడదీయడానికి అవరోధం అవుతుంది. ఉదయం నుండి చేరవలసిన గమ్యం గురించే ఆలోచిస్తుండాలి. అలా చేయడం గమ్యం చేరడానికి కావలసిన భావనా శక్తిని ఇస్తుంది. అయితే మరుసటి రోజు మీ సూక్ష్మ శరీరయానాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడమే అసలైన కష్టం. మీకు ఏ విషయం జ్ఞప్తికి రానప్పటికీ మీరు సూక్ష్మయానం చేసినట్లేనని గుర్తుంచుకోండి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌳 *కాంతి ద్వారాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సినవాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --3*🌷
🌹 ఒక రోజు మా గురువు అమర గారు నన్ను (కృష్ణానంద) పూజ గదిలోకి పిలిచి ఈ రాత్రి ఒక ప్రత్యేక స్థలానికి రమ్మని మనం ఆహ్వానించబడ్డాం. తయారుగా ఉండు అని చెప్పారు. అది సముద్ర గర్భంలోని ఒక స్థలం. సూక్ష్మ శరీరం అత్యంత సున్నితమైంది. అది పంచభూతాలతో ప్రభావితం కాబడదు. అది నీరు, నిప్పు, గాలి, ఘన పదార్థాలగుండా ప్రయాణించగలదు. మెరుపు వేగంతో సముద్రం క్రిందికి దిగాము. సుదూరంలో కొన్ని వేల దీపపు కాంతులతో వెలుగుతున్న సుందరమైన, సువిశాలమైన భవంతుల వైపు ప్రయాణిస్తుండగా, *'అమర'* ఇలా వివరించారు.
*"ఇది రావణ బ్రహ్మలంక ఎంతో నాగరికత కలిగిన అందమైన పట్టణం ఇది. శ్రీరామ చంద్రుడు ఈ పట్టణాన్ని నాశనం చేయదలచుకోలేదు. అందుకే తన దివ్య మూలాన్నీ అద్భుత శక్తులనూ ఆహ్వానించి ఈ పట్టణాన్ని సముద్ర గర్భంలో దాచి, దాని యొక్క జీవాన్ని రక్షించమని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం చెప్పారు. ఇప్పటికీ ఇక్కడ రావణ బ్రహ్మ వారసులే పాలిస్తున్నారు. విభీషుణుడు ఇక్కడ నివసిస్తున్నారు. ఎప్పుడైనా అవసరమనుకున్నప్పుడు జలాంతర్గామి లాంటి ఓడలో వారు పైకి వస్తారు.
🌿 ఆ తర్వాత మేము ఒక స్థలం చేరుకున్నాము. అక్కడ రాచఠీవి ఉట్టిపడుతున్న ఒక పొడవైన మనిషి ఎంతో ఆప్యాయంగా మరి వినమ్రంగా, భక్తి పూర్వకంగా *'అమర'* కు నమస్కరించారు. మేము ఒక పెద్ద హాల్లోకి చేరుకోగానే సింహాసనాల్లాంటి కుర్చీలలో కూర్చోబెట్టారు. అక్కడ అప్పటికే ఆసీనులై ఉన్న మార్కండేయ మహర్షిని గుర్తు పట్టాను. మా ధ్యానులైన మరికొందరిని గుర్తించాను. మేము కూర్చొని ఉండగా మిరుమిట్లు గొలిపే కాంతితో ఒక యువతి హాల్లోకి ప్రవేశించింది. ఆమెను ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెట్టారు. *"ఆమె పద్మావతి. ప్రస్తుతం శంబాలాలో ఉన్న కల్కి భగవానుణ్ని పెండ్లి చేసుకుంటుంది ”* అని *'అమర'* మెల్లగా చెప్పారు. ఆమెను చూడాలని అటువైపు తిరిగాను ఆమె నుండి వచ్చే కాంతి నన్ను చుట్టు ముట్టింది. ఒక క్షణంలో ఆ ప్రదేశమంతా కాంతిమయమైంది. నాకింకేమీ కనపడ లేదు, వినపడలేదు . బహుశా ఆ కాంతి నా చైతన్యాన్ని క్రమ్మివేయడం వలన నాకేమీ తెలియలేదు.
🕉️ కల్కిభగవాన్ 1924 లో జన్మించారు. గోబీ ఎడారిలో కాంతి స్వరూపులు నివసించే పట్టణమైన శంబాలాలో తన భౌతిక శరీరంతో నివశిస్తున్నారు. ఈ పట్టణంలో ఉండే వారు నిత్య యవ్వనులు. మహా ప్రళయం ద్వారా జరుగబోయే ఒక్క గొప్ప మార్పు కోసం ఋషులు కల్కి భగవానునికి తర్ఫీదు ఇస్తున్నారు. మనలను ఈ చీకటి యుగం నుండి బంగారు యుగంలోకి నడిపించగలిగే ఒకానొక వ్యక్తి ఈయనే. ఈయన కొరకు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. నిన్న ఆయన పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం అది లంకలో జరుపబడుతుంది. ఆయన సూక్ష్మ శరీరంతో ఇక్కడికి వస్తారు. ఋషులు మరి ఇతర కాంతి స్వరూపులు వేరే లోకాల నుండి ఇక్కడికి సూక్ష్మ రూపాల్లో వస్తారు.
🌼 *“పద్మావతి ఎవరు?”* అని అమరను అడిగినప్పుడు, *“అది చాలా పెద్ద కథ మరోసారి సవివరంగా చెప్తాను అన్నారు”.* ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పలేదు, చెప్పదలచుకోలేదు. ఎందుకంటే చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నా ధ్యాన సాధన గురించి *'అమర'* ను గురించి ఎవ్వరికీ చెప్పలేదు. మొట్ట మొదట నాకుగా నేను *'అమర'* ప్రపంచాన్ని పరిశోధించాలనుకున్నాను. ఆయనలో ఎన్నో గుప్త నిధులు, అదృశ్య లోకాలు ఉన్నాయని తెలుసుకున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌳 *కాంతి ద్వారాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సినవాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --4* 🌷
🏵️ *‘అమర'* ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. వారు ప్రత్యేక శక్తులైన మూడవ కన్ను, సూక్ష్మశరీర యానం, ఇతర తలాల్లోకి ప్రవేశించడం, బ్రహ్మాండంలోని అన్ని మూలలా ఉన్న కాంతి శరీరులతో ఇక్కడి నుండే మాట్లాడటం మరి ఇంకా ఎన్నో శక్తులను పొందారు. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి, భగవంతునితో ప్రత్యక్షంగా మాట్లాడగలిగే వారు.
🍀 *'అమర'* జ్యోతిష్కులు కారు. ఆయన ఒక్కొక్కసారి నవ్వి *"ఉన్నత శక్తులు ఇలా వ్యక్తిగత అవసరాల కొరకు కాదు, అవి గొప్ప గొప్ప సత్యాల గురించి తెలుసుకునేందుకు. మనం సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం చాలా సులభం"* అని అనేవారు.
🌸 1930 సంవత్సర ప్రాంతంలోనే 1947 సంవత్సరంలో భారత దేశానికి స్వాతంత్ర్యం వస్తుందనీ, 1948 వ సంవత్సరంలో గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపుతారని సూచించారు. అప్పుడు ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. నవ్వి ఆ సంఘటనలు జరిగేంత వరకు మరచిపోయారు. ఒక మహర్షికి వలె ఆయనకు అన్ని విషయాలు తెలుసు.
🍁 అయితే ఒకసారి ఒకతను తాను ధరఖాస్తు చేసుకొన్న ఉద్యోగం వస్తుందా అని అడిగితే *“ నాకు తెలియదు”* అని సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి ఇంటర్యూకు వెళ్ళి ఉద్యోగం కోసం వేచియుండడం అనే అనుభవం అతనికి కావాలి అని ఆ తరువాత మాకు వివరించారు. *"ప్రతి అనుభవం మనకు కొన్ని నేర్పిస్తుంది. మనం జీవిత పాఠాలు అనుభవం ద్వారానే నేర్చుకుంటాము. వేరొకరు నేర్చుకునే విధానంలో మనం కల్పించుకోరాదు"*. అయితే కొన్ని సందర్భాల్లో అలాంటి వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పడం కూడా చూశాను. అలాంటప్పుడు ఇలా వివరించే వారు. *“ఒక వ్యక్తి బలహీనంగా పతనావస్థలో ఉన్నపుడు మనం సహాయం చేయాలి. ఎప్పుడూ ఒకే నియమం అనుసరించరాదు అని".*
🕉️ అమర, సృష్టి గురించి ఈ విధంగా వివరించారు... ఒకదాని పై మరొక పిరమిడ్ తలక్రిందులుగా ఉన్నట్లు రెండు పిరమిడ్లను ఊహించుకోండి. మొదటి పిరమిడ్ యొక్క మూలం తలక్రిందులుగా ఉన్న పిరమిడ్ యొక్క మూలం పై ఉంటుంది. ఈ రెండు పిరమిడ్ల మధ్యనున్న ఖాళీ స్థలం బ్రహ్మాండమనే విశ్వం. అందులో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. అండాకారంలో ఉన్న స్థలం చాలా పెద్దది. దాని వ్యాసం 18 కోట్ల కాంతి సంవత్సరాలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌳 *కాంతి ద్వారాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సినవాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --5*🌷
⭐ *"ప్రతి నక్షత్ర మండలం కోటాను కోట్ల నక్షత్రాలు లేక సూర్యుళ్ళను కలిగి వుంటుంది. ఒకొక్క సూర్యుడు ఒక గ్రహ కూటమిని కలిగి ఉంటాడు. ఒకొక్క గ్రహ కూటమి జీవ రాశి కలిగిన భూమిని కలిగి వుంటుంది. మానవులు ఈ భూమి మీద నివశిస్తారు. మారుతున్న కాల చక్రాన్ని బట్టి కొంత మంది మరికొందరి కంటే ఎక్కువ వికాసం చెంది ఉన్నారు. ఎక్కువ వికాసం చెందిన మానవులు పరస్పర సంబంధాలు కలిగి ఉంటారు. వారు వేరే భూగ్రహాలకు ప్రయాణిస్తారు.
👽 మనం వికాసం చెందుతున్నాం. ఇతర లోక వాసులతో సంబంధాలు ఇంకా ఏర్పరచుకోవాల్సి ఉంది. అయితే ఇతర లోకవాసులు మనతో సంబంధాలు కలిగివుండటానికి మనమెంత వరకు, ఎదిగామో అని పరిశీలించటం కోసం తరచుగా ఈ భూమి మీదకు వస్తుంటారు. ఉన్నత సత్యాలనూ, చట్టాలను, క్రమాన్ని అర్థం చేసుకోవడానికి కేవలం శాస్త్ర మరి సాంకేతికాభివృద్ధి సరిపోదు. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఊర్ధ్వ లోక వాసులకు మన పరిమితులు మరి కష్టాలు కూడా తెలుసు. ఒక్కసారి ఈ ప్రళయ కాలం నుండి బయటపడితే, మనతో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి వారు చొరవ చూపిస్తారు.
🌍 "ఖగోళంలో ఉన్న కోటాను కోట్ల భూగోళాలను అక్కడ ఉన్న ప్రజల ఆధ్యాత్మిక ప్రగతి ననుసరించి 14 లోకాలుగా లేక తలాలుగా విభజించారు. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక, అనాధ్యాత్మిక, ఈ రెండింటి మిశ్రమాన్ననుసరించి ఈ లోకాలను లేక కోటాను కోట్ల భూగోళ సమూహాన్ని విభజించారు. మన భూమి భూలోకమనే తరగతిలోకి వస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మిక మరి అనాధ్యాత్మిక జీవనం ఉండేందుకు సమానమైన పరిస్థితులు ఉంటాయి.
🕉️ బ్రహ్మాండం పైన 4 దివ్య తలాలు ఉన్నాయి. సృజనాత్మక శక్తులు కలిగిన తలం పై మనస్సు సృష్టించబడుతుంది. మరొకటి వినాశకర శక్తులున్న తలం. ఈ రెండింటికి మధ్య పై రెండు శక్తులను సమం చేసి, జీవ రాశులను క్షేమంగా కొనసాగించే మరొక లోకం ఉంటుంది. ముగ్గురు దివ్య పురుషులు ఈ శక్తులను పాలిస్తుంటారు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ మూడు లోకాలకు పైన స్త్రీ శక్తులు కల్గిన ఒక తలం ఉంది. దీనికి అధిపతి *'దేవి'*. ఆపైన శుద్ధ చైతన్యం లేక రూపరహితమైన శక్తి, పరబ్రహ్మ, అల్లా, పవిత్ర పితామహుడు లేక భగవంతుడు అని పిలువబడే వారి లోకం ఉంది. ఇవి అన్నీ కూడా పరమాత్మున్ని వ్యాపకమే. మొదటిది దేవ లోకం, ఆపైన శివ లోకం, విష్ణు లోకం, బ్రహ్మ లోకం. బ్రహ్మ లోకం నుండి ఈ బ్రహ్మాండం అంతా టెలీస్కోప్ లా వ్యాపించి ఉంది.
🌸 *"మనం శుద్ధ చైతన్య లోక వాసులం. ఎన్నో ఏళ్ళ క్రితం మనం అక్కడ భగవంతుని వద్ద, కాలమానం లేని ప్రాంతంలో ఆత్మల్లాగ, కాంతి రేణువుల్లాగ అమితమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఒక రోజు పరమాత్మ"* నేను అనేక లోకాలు, నక్షత్ర మండలాలు, నక్షత్రాలు, భూగోళాలు సృష్టించాను. తరులు, గిరులు, మేఘాలు, మరి వివిధ రకాలైన జీవ శక్తులను సృష్టించాను. మానవులను సృష్టించాను. జీవన వైవిధ్యాన్ని చవి చూడాలంటే మీరు భూగోళం పైకి వెళ్ళవచ్చు అని చెప్పారు. చాలా మంది దిగి వచ్చేందుకు ఎంచుకున్నాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌳 *కాంతి ద్వారాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సినవాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --6* 🌷
🌷 మనలను ఈ భూమి మీద నడిపించి మళ్ళీ వెనక్కు తీసుకొని వెళ్ళేందుకు 7 గురు నాయకులను ఎంచుకున్నారు. వారికి భగవంతుడు ప్రత్యేక అధికారాలు మరి సూచనలు యిచ్చి ఈ భూతలంపై జీవన మార్గదర్శక సూత్రాలను వివరించారు. మితిమీరిన భౌతికవాంఛలకు లోనుకావద్దని హెచ్చరించారు. ఆ ఏడుగురు నాయకులను సప్తర్షులు అంటారు. వారే ఆధిపత్య *"సంఘం".*
🛸 "మనం వాస్తవానికి అంతరిక్ష ప్రయాణికులం. ఈ భూమి మీదకు సుమారు" 2 కోట్ల సంవత్సరాలకు పూర్వం వచ్చిన కొత్త వాళ్ళం. ఈ ప్రయాణంలో అనేక రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు కావలసిన కోశాలు అనబడే సూక్ష్మ శరీరాలను సంతరించుకున్నాం. మొదట బుద్ధి, తరువాత మనస్సు ఆపైన శరీరాన్ని పొందాం. మొట్టమొదట అభివృద్ధిలో భాగంగా మనము పిండ దశలో శరీరంలో ప్రవేశించాము. మనం ఈ తలంపై జీవించేందుకు జీవితానుభవాలను పొందేందుకు, కావలసిన ఆలోచనా విధానం, భావోద్రేక శక్తులు బుద్ధి, మనస్సులకు కలవు.
🌿 పుట్టిన తరువాత మానవులు ముసలివారై, కృశించి మరణించారు. అప్పుడు సప్తర్షులు మళ్ళీ జన్మ తీసుకోవడం ఇష్టం లేక వారి సూక్ష్మ శరీరాల్లో ఉండి పోయారు. అయితే మనం ఇంకాఇంకా అనుభవాలు పొందాలని మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం.
🌼" మితిమీరిన భౌతికవాంఛలకు లోనుకావద్దని మనల్ని హెచ్చరించారు. ఏ మనస్సు నుండి మనం అనుభవాలు పొందుతున్నామో దానికి పరిమితులు ఉన్నాయి. మనస్సు తను తీసుకోగలిగినంత మేరకు మాత్రమే అనుభవాలు పొందగలదు . ఆపైన వాటిని తిరస్కరిస్తుంది . తిరస్కరించబడిన అనుభవాలన్నీ మనసులో నిక్షిప్తం చేయబడి జన్మపరంపరలో తీరని కోరికలుగా దట్టమైన పొరలుగా ఏర్పడుతున్నాయి . ఇలా దట్టమైన పొరలు ఏర్పడుతుండటం వలన మనకున్న అతీంద్రియ శక్తులను కోల్పోయాము .
🌳 మొదట్లో సప్తర్షులను వారి సూక్ష్మ శరీరాలతో చూడగలిగేవాళ్ళం. వారితో మాట్లాడగలిగేవాళ్ళం . ఐదు జన్మల తరువాత మనం ఈ శక్తులు పోగొట్టుకున్నాం . వారితో సంబంధాలు తెగిపోయాయి . సప్తర్షులు మనకు మార్గదర్శకంగా ఉంటూ మనం తిరిగి మన మూలమైన పరమాత్మను చేరుకునే ఆవశ్యకతను గుర్తుచేస్తుంటారు . మనకు వారితో సంబంధం తెగిపోవడం వలన భౌతికవాంఛలకూ , ప్రలోభాలకు లోనుకాకుండా మనస్సును పరిశుభ్రంగా ఉంచుకున్న వారితో సంభాషిస్తూనే ఉన్నారు . కాలక్రమంలో వారు కొంతమంది స్వచ్చంద కార్యకర్తలను లేక వాహకాలను శాశ్వతంగా ఎంచుకున్నారు . అలాంటివారు ప్రపంచవ్యాప్తంగా 1,44,000 మంది ఉన్నారు . వీరు తనువులు చాలించినప్పుడు మరొక 1,44,000 మంది ఈ బాధ్యతలను తీసుకుంటారు ” .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌳 *కాంతి ద్వారాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సినవాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --7*🌷
🏵️ తీరని పొరలను తొలగించేందుకు సప్తర్షులు ఒక మార్గాన్ని కనుక్కోవాలని తపస్సు చేసి వాటిని తొలగించే మార్గాన్ని తెలుసుకున్నారు. అదే ధ్యానం! ధ్యానం ప్రస్తుత కాలంలో కనుగొన్న విధానం కాదు. అది 2 కోట్ల సంవత్సరాల క్రిందట కనుగొనబడింది. సప్తర్షులు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రయోగం చేస్తూ ఈ భూగోళం పై మారుతున్న కాలగమనంతో పాటు ఈ ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నారు. వారి ప్రతినిధుల ద్వారా బోధిస్తున్నారు. అనేక ఆత్మలు తమను పరిశుద్ధపరచుకొని తమ స్వస్థలానికి వెళ్ళిపోయాయి. అయితే మళ్ళీ చాలామంది జన్మ తీసుకుని భూమిపైన స్థిరపడ్డారు.
🍀 1,44,000 వేల కార్యకర్తలు కలిగిన రెండు సమూహాలనే కాక, సప్తర్షులు మరెంతమందినో ఋషులుగా తీర్చిదిద్దారు. ఋషి అంటే జ్ఞానని, శక్తిని సంపాదించుకుని కాంతి రూపంలో నిక్షిప్తం చేసుకోవడానికి కావలసిన అనంతమైన శక్తులు కలిగిన వ్యక్తి. ఋషి జ్ఞానమనే వెలుగునూ మరి శక్తిని ప్రసరించగలడు. అతడు ఆత్మానందంతో ప్రకాశిస్తాడు.
🌸 1,44,000 మంది వాహకులు సాధారణమైన ఋషులు. వారు ఎలాంటి ప్రచారపటాటోపాలు లేకుండా, వారు చేయదలచుకున్న పనికి భగ్నం కలుగకుండా ఉండేందుకు చాలా సాధారణమైన వ్యక్తులుగా జీవిస్తుంటారు. కేవలం సమాచారాన్ని చేరవేయడమే కాకుండా, మానవాళికి మార్గదర్శకత్వం వహించడం. కార్య నిర్వహణలో, శాస్త్ర సాంకేతికాభివృద్ధిలో, ఆధ్యాత్మిక ప్రగతిలో సహాయ సహకారాలు అందించేంత క్లిష్టతరంగా వారి బాధ్యత పెరిగింది. వారు నక్షత్ర మండలాల్లో క్రొత్త జ్ఞానాన్ని పొంది, కొత్త శక్తులను కూడగట్టుకుని, క్రొత్త విషయాలను నేర్చుకొని ఈ తలంపైకి తీసుకొని వచ్చేందుకు ఇతర నక్షత్ర మండలాల్లోని భూతలాల పైకి వెళ్ళి వస్తుంటారు. ఊర్వతలాల్లో వారు చేయవలసిన పని చాలా ఎక్కువగా ఉంటుంది.
🕉️ అనూహ్యమైన శక్తులు కలిగిన ఒక ప్రత్యేక ఋషి ఈ పనిని అంతటిని పర్యవేక్షిస్తుంటారు . 1,44,000 మంది ఋషులు అర్ధరాత్రుళ్ళు వారి సూక్ష్మ శరీరాలతో హిమాలయాలకు వెళ్ళి వారి పనిని ఆ ప్రత్యేక ఋషికి తెలియజేస్తుంటారు . ఆ యోగీశ్వరుని నుండి సూచనలు తీసుకొని వారు చేయవలసిన పనిని ముగించి, ఆయనకు వివరించి సూర్యోదయానికి వారివారి భౌతిక శరీరాలను చేరుకుంటారు.
🍁 "ఏదో ఒక రోజు మనమంతా తిరిగి వెళ్ళిపోవలసిన వారమే. మనం ఈ శరీరాలం కాదు అని గుర్తించాలి. ఇక్కడకు వచ్చిన ప్రయాణీకులం మాత్రమే. ఏదో ఒక రోజు మన స్వస్థలాలకు వెళ్ళవలసిన వారమే. ముందుగా మనం అజ్ఞానం నుండి బంధాల నుండి, క్షుద్ర కోరికల నుండి విడిపడాలి. అందుకోసమే మనం ధ్యానం చేయాలి. ధ్యానంలో పరాకాష్టకు చేరుకున్నప్పుడు మన దైవత్వాన్ని అనుభూతి చెందుతాం. తిరిగి భౌతిక స్పృహలోకి వచ్చినప్పుడు మన అన్యత్వాన్ని గుర్తిస్తాం. మనలోని మలినాలన్నింటినీ శుభ్రపరచుకొని, మన శరీరాన్ని వదలివేసినప్పుడూ, మళ్ళీ ఈతలం పైకి తిరిగి రాదలచుకోనప్పుడు ఋషులు ఊర్ధ్వ లోకాల్లోని మన ఇంటికి, భగవంతుని సాన్నిధ్యానికి చేరుస్తారు”.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌳 *కాంతి ద్వారాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సినవాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --8* 🌷
🏵️ “ఒక వ్యక్తి నిజంగా ఆధ్యాత్మికంగా ఎదగదలచుకున్నప్పుడు మనం ఎప్పుడూ సహాయం అందిస్తాము. దాన్ని గూర్చి మాట్లాడం. మనం సహాయం చేస్తామన్ని తెలిస్తే ప్రజలు వాళ్ళ సమస్యలన్నింటిని తీసుకుని సహాయం కోసం ఇక్కడికి వస్తారే తప్ప ఆధ్యాత్మిక ప్రగతి కోసం రారు” అని అమర అంటుండే వారు.
🍀🔸 *ప్రశ్న :--- " మీరు మా సమస్యలను తీర్చితే మా సాధన కొనసాగించడం సులభమౌతుంది కదా”?*
🔹 *మహర్షి అమర :---* "అలా జరుగదు. అట్లా కూడా ప్రయత్నించాము. ప్రజలు మరిన్ని సమస్యలతో తిరిగి వస్తారు. వాటికి అంతం లేదు. అందువల్లనే వారి కర్మలతోనూ మరి నేర్చుకునే పద్ధతులతోనూ కలుగ చేసుకోము. మనకు పాఠాలు నేర్పడం కోసమే సమస్యలు వస్తాయి".
🌸🔸 *ప్రశ్న:--- సమస్యలు వస్తాయి అన్నప్పుడు ధ్యానం యొక్క ఉపయోగం ఏమిటి?"*.
🔹 *మహర్షి అమర:---*'మన సమస్యలను తీర్చుకొనేందుకు ధ్యానం చేయం. ధ్యానం అత్యున్నత సత్యానికి చేరుస్తుంది. సత్యం వైపు ప్రయాణిస్తున్నపుడు సమస్యలు అన్నీ మాయమవుతాయి. ధ్యానం కర్మలన్నిటినీ దగ్ధం చేస్తుంది. ఏ కష్టమొచ్చినా ధ్యానాన్ని అంటి పెట్టుకొని ఉండండి. సంపూర్ణ స్వేచ్ఛ లేక ముక్తి అనే అంతిమ గమ్యాన్ని చేరుకుంటారు.
🌷🔸 *ప్రశ్న:--- -"ముక్తే నా గమ్యమా?”*
🔹 *మహర్షి అమర:---* "అదే ప్రతి ఒక్కరి గమ్యం. అయితే అందరికీ అది తెలియదు. సుదీర్ఘ అన్వేషణ, కృషి చేస్తే మనం అది తెలుసుకుంటాం. మనం మనల్ని వస్తువులతోనూ, ప్రజలతోనూ, ఆలోచనలతో బందీలను చేసుకున్నాం. మనం వీటి నుండి విడిపడి ఈ తలం నుండి పై తలాలకు వెళ్ళి అక్కడ తిరుగాడాలి. చివరగా మన మూలం అయిన భగవంతుణ్ణి చేరుకోవాలి. అదే ముక్తి అంటే.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --9* 🌷
🌳🔸 *ప్రశ్న :---" వెనక్కు వెళ్తే అక్కడ మన స్వాతంత్ర్యాన్ని సమర్పించుకుంటామా ? ”ఆత్మలు తిరిగి క్రిందకు వస్తాయా ? ”*
🔹 *మహర్షి అమర:---* " లేదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రిందికి రావటానికి స్వాతంత్య్రం ఉంటుంది " అవును , కొన్ని ఆత్మలు క్రిందకి వస్తాయి ” .
🌿 భౌతిక శరీరం నుండి విడిపడేందుకూ , తిరిగి శరీరంలో ప్రవేశించేందుకు ఋషులు సహాయపడడమేకాక సూక్ష్మయానానికి మార్గదర్శకత్వం వహిస్తూ పర్యవేక్షిస్తారు.
🏵️🔸 *ప్రశ్న:--- " ఆత్మహత్య చేసుకున్నవారికి తాము చనిపోయినట్లు ఎందుకు తెలియదు ? ”*
🌳 *మహర్షి అమర:---* చనిపోయిన వెంటనే తన మానసిక స్థితిని ఊహించడం చాలా కష్టం . ఆత్మహత్య చేసుకున్న ఆత్మ తన మరణాన్ని గుర్తించేందుకు కొంత సమయం పడుతుంది . తరువాత మరణంవల్ల ప్రజలతోనూ , ఆస్తులతోనూ , పరిసరాలతోనూ బంధం తెగిపోయిన విషయాన్ని ఒప్పుకునేందుకు మరికొంత సమయం పడుతుంది . ఆ తరువాత అయిష్టంగా అయినా ఆ స్థలాన్ని వదిలి వెళతారు .
🌼 సహజ మరణం విషయంలో చావుతోపాటు పై లోకం నుండి ఒక దూత వస్తారు . ఆ దూత మరణించిన వారికి తగిన జ్ఞానబోధ చేసేందుకు వారితో కొంతకాలం ఉంటారు . ఆ తరువాత వారికి తగిన విశ్రాంతి కొరకు అనువైన లోకానికి తీసికొని వెళతారు . విశ్రాంతి తరువాత వారి కర్మలను బేరీజు వేసి తరువాత జన్మ ఎక్కడ తీసుకోవాలో నిర్ణయిస్తారు . అది భూతలమే అయి ఉండవలసిన పనిలేదు . వారు జన్మ తీసుకోవలసిన స్థలమూ , కుటుంబమూ , జీవన ప్రమాణం మొదలైనవి నిర్ణయిస్తారు . మళ్ళీ ఆ తీసుకోవలసిన స్థలంలో తల్లి గర్భం వరకు మార్గదర్శిగా ఉంటారు .
🕉️🔸 *ప్రశ్న:--- “ ఆత్మహత్య చేసుకున్నవారి విషయంలో ఏమౌతుంది ?*
🔹 *మహర్షి అమర :---*" ప్రమాదాల్లో మరణించిన వారి కొరకు , ఆత్మహత్య చేసుకున్నవారి కొరకు దూతలు రారు. అలా చనిపోయినవారు "అక్కడే చాలాకాలం ఉండి , నెమ్మది నెమ్మదిగా తమ మరణాన్ని గురించి తెలుసుకుంటారు. వారి జీవిత కాలం ముగిసి దూతలు వచ్చేంత వరకు ఇక్కడే తిరుగుతూ ఉంటారు . వారు ఆ స్థలంలోనే ఉండవచ్చు లేక ఎక్కడైనా ఇష్టమైన రీతిలో తిరుగుతూ ఉండవచ్చు " . “ వారినే దయ్యాలు అని పిలుస్తారు.
🍁 🔸 *ప్రశ్న:--- "ఆ దెయ్యాలు హాని చేస్తారా ” ?*
🌳 *మహర్షి అమర:---* " హాని చేయవచ్చు . కానీ అందరూ హాని చేయరు . వారు బ్రతికిఉండగా ఎలాఉండేవారో మరణించిన తరువాత కూడా అలానే ఉంటారు . బ్రతికి ఉన్నప్పుడు హాని చేసే వారైతే , ఆ తరువాత కూడా అలానే ఉంటారు . దేవాలయాల్లోనూ , గుహల్లోనూ ధ్యానం చేస్తూ ఉండే ప్రేతాత్మలను నేను కలిశాను .
🌸 ఈ భూమి చైతన్యంలో మార్పులు జరుగుతున్నాయి . మెదడులోని క్రొత్తకణాలు జాగృతం చేస్తున్నారు . దానివలన మనుషులు ఉన్నత , క్రొత్త జ్ఞానాన్ని అర్ధం చేసుకుంటారు . అప్పుడు ఎవరైతే తయారుగా ఉంటారో వారు ఏదో ఒక రీతిలో క్రొత్తయుగపు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు . ప్రపంచం అంతటా ఋషుల యొక్క వాహకులు , కేంద్రాలు ఉన్నాయి అని గుర్తుంచుకోండి ” .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --10* 🌷
🌍🔸 *ప్రశ్న :--- “ దయచేసి క్రొత్త యుగం గురించి మరి కొంచెం వివరించండి "?.*
🔹 *మహర్షి అమర:---* " మన పురాతన గ్రంధాలు మరి మర్మయోగులు ఈ విషయాలు తెలియ చేస్తారు. మనకు సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాల గురించి తెలుసు. ఈ భూమి యింత వరకు 28 పరివృత్తాలు పూర్తి చేసింది. 28 వ పరివృత్తం 1974 సం,, లో పూర్తి అయింది. 29 వ పరివృత్తం, 14-3-1974 తేదీ నుండి ప్రారంభమైంది. మనం సత్య యుగంలో ఉన్నాం. మనుషులు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్నీ, స్వచ్ఛతనూ, పరిపక్వతనూ సంతరించుకొని దేవుళ్ళలా జీవించే ఆ సత్య యుగం స్వర్ణ యుగంగా పిలవబడుతుంది ”.
🌿 *"కానీ మన చుట్టూ ఉన్న జీవితమంతా భ్రష్టుపట్టింది“*. అవును అది నిజం. ఏ మార్పు కూడా ఆకస్మికంగా రాదని మీరు అర్థం చేసుకోవాలి. సూర్యోదయాన్ని గమనించండి. మొదట అరుణోదయం, ఆ తరువాతే సూర్యోదయం అవుతుంది. ఎప్పుడూ సంధి కాలం అనేది ఉంటుంది. కలియుగం నుండి సత్య యుగంలోకి మారే సంధియుగం 1974 వ సంవత్సరం నుండి 432 సంవత్సరాలు. మనము ప్రారంభంలోనే ఉన్నాము. అయితే ఇప్పుడు కూడ సూక్ష్మంగా పరిశీలిస్తే మనం మార్పులు గమనించగలుగుతాము. చైతన్యపు జాగృతి చెంది, క్రొత్త ఎరుకలో మానవులు ఉన్నారు. ప్రజలు అంతర్ముఖలు అవుతున్నారు. యోగా, ముఖ్యంగా ధ్యానం వైపుకు మరలుతున్నారు. ఈ శతాబ్దపు చివరకు పెను మార్పులు జరుగుతాయి.
🏵️🔸 *ప్రశ్న:--- “యుద్ధం జరుగుతుందా?”*
🍀 *మహర్షి అమర :---* "అవును, అయితే దానిని ఖచ్చితంగా ఊహించలేము. ఇది ఒక పెను యుద్ధం దివ్య శక్తులకూ క్షుద్ర శక్తులకూ జరిగే యుద్ధం. ఇది సూక్ష్మ తలంలో జరుగుతుంది. ఆ తరువాత ఈ భూతలం పై కూడా జరుగుతుంది ".
🌸🔸 *ప్రశ్న :---"ఋషులు ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేరు? ”*
🕉️ *మహర్షి అమర:---* వారు ప్రయత్నిస్తున్నారు. అయితే దైవికచట్టాలను వారు ఉల్లంఘించరాదు . ప్రజల్లో అత్యధికులు కలియుగపు అలవాట్లు వదిలివేసి , కాంతిమార్గాలను అనుసరిస్తే వారి జీవితాలను సక్రమంగా చేసుకుంటే యుద్ధాన్ని నివారించవచ్చు . అయితే అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించడంలేదు . అందుకే ఋషులు యుద్ధాన్ని జరగనిస్తారు .
🌳🔸 *ప్రశ్న :--- మహిమలు కలిగిన స్వామీజీలుగా అద్భుతాలు చేయడం, విభూదిని మరికొన్ని చిన్న వస్తువులను వెండి విగ్రహాలను, పండ్లను సృష్టించడం సమాజంలో చూస్తుంటాం. అనేకమంది వారి వెంటనే వారి చుట్టూ ఒక చిన్న గుంపులా చేరి శక్తులనూ, మహిమలనూ పొగుడ్తూ భజనలు చేయడం మొదలు పెడతారు. శూన్యం నుండి వస్తువులను ఎలా సృష్టిస్తారో తెలుసుకోవాలనుకున్నాను.
🔹 *మహర్షి అమర:---* " అది సృష్టించడం కాదు. వేరొక చోటు నుండి రవాణా చేయడం. వారు మొదట వస్తువులను సేకరించి ఒక చోట ఉంచుకుంటారు. సహాయ పడేందుకు సూక్ష్మ శరీరంలో ఉన్న ఒక ఆత్మ ఉంటుంది. ఎప్పుడైనా వస్తువులను సృష్టించాలనుకున్నప్పుడు ఆ ఆత్మను మానసికంగా పిలుస్తారు. ఆ ఆత్మ ఎంత దూరం నుండైనా ఆ వస్తువును క్షణాల్లో తీసికుని వస్తుంది. మనం ఆత్మ చేతిలో ఉన్న వస్తువులను చూడలేము. అప్పుడు స్వామీజీ ఆ వస్తువును తీసుకుని శూన్యం నుండి సృష్టించినట్లు ప్రదర్శిస్తారు. "
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --11*🌷
🔸 *ప్రశ్న :--- “నిజంగా వస్తువులను సృష్టించడం సాధ్యమా?
🔹 *“అవును, సాధ్యమె”*
🔸 *ప్రశ్న :--- సాయిబాబా నిజంగా సృష్టిస్తారా లేక ----- ?”*
🔹 అమర ’ ఒక క్షణం మౌనంగా ఉండి ఇలా అన్నారు. "నాకు తెలియదు. ఆయనలాంటి గురువులను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది. వారిని అర్ధం చేసుకునేందుకు ఈ అద్భుతాలకు ఆవలి వైపు నుండి చూడాలి. ఆయన పనులన్నీ దివ్య ప్రణాళికకు సంపూర్ణత్వాన్ని ఇచ్చేవిగా అర్ధం చేసుకోవాలి” . "ఆయన పని ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షించడమే. ధ్యానం ద్వారా ఉన్నత సాధనకు ప్రజలు ధ్యాన సమూహాలతో చేరాలి. సాయిబాబా అటువంటి సమూహాల వైపు వారిని మళ్ళిస్తారు.
🕉️ *మహర్షి అమర:---* 1974 నుండి 1979 వరకు నా దగ్గరకు వచ్చిన వారు ఒక ప్రత్యేక వర్గానికి చెందిన వారు. 5000 సంవత్సరాలకు పూర్వం మీరందరూ కృపాచార్యుల వారి ఆశ్రమంలో విద్యార్థులు. కృపాచార్యుల వారు మరి ద్రోణాచార్యుల వారు మీ గురువులు. ఆ కాలంలో ఆజ్ఞా చక్ర మరి సహస్రార చక్ర మధ్యలో ఉన్న నిరంతరి అనే ప్రత్యేక చక్రాన్ని జాగృతం చేయడానికి ప్రయోగాలు జరిపే వారు. ఇది ఇప్పటికీ ఒక నిగూఢమైన చక్ర.
☸️ కృపాచారులు ఈ నిరంతరి చక్రాన్ని జాగృత పరిస్తే ఇది జీవ గడియారంలా పని చేస్తుంది. ఈ గడియారాన్ని ఉపయోగించి మన వయస్సును తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. లేదా ఉన్న వయసులోనే యుగాలు జీవించ వచ్చు. అకస్మాత్తుగా వారు ఆ ప్రయోగాలను నిలిపివేయవలసి వచ్చింది. *"దుర్యోధనుడు పుట్టినప్పుడు వారికున్న ప్రత్యేక శక్తులతో జరుగబోవు మహా భారత యుద్ధాన్ని ఆయన ముందుగానే చూశారు. ప్రయోగాలు ఆపి విద్యార్ధులను జరుగబోయే యుద్ధానికి తయారు చేయవలసినదిగా సప్తర్షులు వారికి సూచనలు ఇచ్చారు.
🍁 అప్పుడు మీకు యుద్ధ విద్యను నేర్పించారు. మీరందరూ యుద్ధం చేసి చనిపోయారు. మీరందరూ ఒక ప్రత్యేక భూతలం పై 5,000 సంవత్సరాలు విశ్రాంతి తీసుకునేందుకు అర్హులయ్యారు. విశ్వామిత్ర మహర్షి, కలి యుగం నుండి సత్య యుగంలోకి పరివర్తన చెందే సంధి యుగంలో పని చేసేందుకు స్వచ్ఛంద సేవకులను పిలవగా మీరందరు ముందుకు వచ్చారు. వారు మిమ్మల్ని ఒక ప్రత్యేక భూతలంపైకి తీసుకుని వెళ్ళి అక్కడ 5,000 సంవత్సరాలు మీకు శిక్షణ ఇచ్చారు. అందువల్లే ఈ సాధనలన్నీ సత్వర ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పుడు చేస్తున్నది కేవలం పునశ్చరణ మాత్రమే" !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --12*🌷
🍀 కృపాచార్యుల వారు చిరంజీవి. వారిని నేను(అమర) భౌతికంగా కలుసుకున్నాను. "నేను(అమర) హైస్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకరోజు ఒక ఋషి స్కూలుకు రెండు వారాలు సెలవు తీసుకొని కబ్బన్ పార్కుకు వెళ్ళి అక్కడ ఒక స్థలంలో నిరీక్షించమని చెప్పారు. అక్కడకు వెళ్ళిన కొన్ని నిముషాల్లోనే ఒక ఆంగ్లేయుడు కారులో వచ్చినా పేరు అడిగారు. నా పేరు చెప్పగానే, నన్ను విమానాశ్రయానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక ప్రత్యేక విమానం ఎదురు చూస్తోంది. ఆయన నన్ను అక్కడి నుండి కలకత్తాకు అటు నుండి హాంకాంగ్ కు తీసికెళ్ళారు.
🍁 హాంకాంగ్ లో ఒక చైనీయుని దగ్గరకు తీసికొని వెళ్ళి , వీరు నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళి మళ్ళీ వెనక్కు తీసుకుని వస్తారు. నేను నిన్ను మళ్ళీ ఇక్కడి నుండి వెనుకకు తీసుకుని వెళతాను అని చెప్పాడు. *“భోజన విరామం తరువాత ఆ చైనీయుడు నన్ను ఒక ఓడ రేవుకు తీసుకెళ్ళాడు. అక్కడి నుండి బోటులో మూడు గంటల పాటు ప్రయాణం చేసి ఒక ఒడ్డుకు చేరాము. నన్ను అక్కడ విడిచిపెడ్తూ"* ఇక్కడి నుండి ఇంకొక వ్యక్తి నిన్ను తీసుకువెళ్ళి తిరిగి ఇక్కడకు తీసుకువస్తారు. నేను ఇక్కడి నుండి మళ్ళీ వెనకకు తీసుకువెళతాను అని తేదీ, సమయం చెప్పాడు.
🌸 నాకోసం ఆ ఒడ్డులో ఎదురు చూస్తున్న వ్యక్తిని కలిసి ఒక కలలో నడిచి వెళ్ళినట్లు ఆయనను అనుసరించాను. రెండు రోజుల ప్రయాణం తరువాత పచ్చదనంతో అందమైన పక్షులతో నిండిన ఒక లోయ చేరుకున్నాం... అక్కడ కొంత దూరం నడిచి ఒక పెద్ద గుహ చేరుకున్నాం. ఆ గుహకు ఆవలి వైపున్న ద్వారం ద్వారా లోపలకు వెళ్ళాం. ఆ గుహ నుండి వెలుపలికి వచ్చినప్పుడు నమ్మశక్యం కానంత పెద్ద పెద్ద భవంతులూ, జనం ఉన్నారు. ఒక యువకుడు చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించాడు. అతనికి కూడా మేము వస్తున్నట్లు తెలుసు. *"మమ్మల్ని ఒక గదిలో విడిగా ఉంచారు. అక్కడ అన్నపానాదులు ముగించుకొని ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాము.
🌿 ఉదయం నన్ను ఒక హాల్లోకి తీసుకొని వెళ్ళారు. అక్కడ సుమారు 40 సంవత్సరాలు వయస్సు కలిగి, హూందాతనం ఉట్టిపడుతున్న ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆయన చిరునవ్వు నవ్వి నన్ను కూర్చోమని సైగ చేశారు. ఆయన సంస్కృతంలో మాట్లాడారు. అది నాకు అర్థం కాలేదు. అందువల్ల టెలిపతిలో మాట్లాడుకున్నాము. ఆయనే మహర్షి కృపాచార్యుల వారు.
🌳 *"నేను, సహాయకారి మరు రోజు ఉదయం తిరుగు ప్రయాణం అయ్యాము. కాలి నడకన మేము బయలుదేరిన ఒడ్డుకు నన్ను తీసుకుని వచ్చారు. అక్కడ పడవతో చైనీయుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. హాంకాంగ్ వచ్చేటప్పటికి ఆంగ్లేయుడు ఎదురు చూస్తున్నాడు. నేను రెండు వారాల తరువాత కబ్బన్ పార్క్ బయలుదేరిస స్థలానికి చేరాను. "* వివరించడం పూర్తి అయిన తరువాత అకస్మాత్తుగా అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ *'అమర'* ను ఇలా అడిగాను. *"కృపాచార్యుల వారికి ఎంత వయస్సు వుంటుంది" "కొన్ని వేల సంవత్సరాలు"* అని వారు బదులిచ్చారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --13* 🌷
🍀 "అనుభవాలు ధ్యాన సాధనకు కొలబద్దలు కాదు. మీకు అనుభవాలు రానప్పుడు, రాలేదని విచారించకండి. కొన్నిసార్లు మనస్సే అనుభవాలను సృష్టిస్తుందని గుర్తుంచుకోండి. అనుభవాల వెంట పరుగెత్తకండి. అలా చేస్తే సాధన నుండి మీరు ప్రక్కకు మళ్ళుతున్నట్లే."
🔸 *ప్రశ్న:--- సాధనలో వేటిని అంటి పెట్టుకొని ఉండాలి"?*
🔹 *మహర్షి అమర:---* నిశ్శబ్దాన్ని ఆశ్రయించాలి. నిశ్శబ్ధంలో ఆధ్యాత్మిక ప్రక్రియలు వివిధ స్థాయిల్లో వాటంతట అవే జరుగుతాయి. ధ్యానం చేయకుండా ఉన్నా ఎప్పుడూ, మీ ప్రగాఢ లోతుల్లోంచి పవిత్ర ప్రేమను బహిర్గత పరుస్తూ దివ్య లక్షణాలను అలవరచుకొని మిమ్ములను మీరు సంస్కరించుకొనే ప్రయత్నం చేయాలి.
🔸 *ప్రశ్న:--- "ధ్యానానికి మీరు అంత ప్రాధాన్యతను ఎందుకు ఇస్తారు?"*
🔹 *మహర్షి అమర:---* ఎందుకంటే పరమాత్మను అనుభూతి చెందేందుకు మరి చేరుకునేందుకు ధ్యాన మొక్కటే అత్యుత్తమ సాధనా మార్గం. ఇది దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం అడగకండి. ధ్యానం పరమాత్మకు చేరువ చేస్తుంది. పరమాత్మను అనుభూతి చెందడం ద్వారా మనం విజ్ఞానం, అంత శ్శక్తిని పొందగలం. పరమాత్మ సాక్షాత్కారం తరువాత మునుపటిలా ఉండలేం. జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకుంటాం. సరియైన విషయాలను మాత్రమే ఎంపిక చేసుకుంటాం. అందువలన జీవితంలో ఎలాంటి సంఘటననైనా, మరి ఎలాంటి సమస్యనైనా మన మనఃశాంతిని కోల్పోకుండా ఎదుర్కోగలం. మనం సంతోషంగాను మరి ప్రశాంతంగానూ ఉండగలం. అంతకంటే మనకేం కావాలి?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --14*🌷
🔸 *ప్రశ్న :---" ధ్యానమూ తపస్సు వేరువేరా ? ”*
🔹 *మహర్షి అమర:---* “ అవును , మనం మన క్షేమం కోసం ధ్యానం చేస్తాము . ఋషులు అందరి క్షేమం కోరి తపస్సు చేస్తారు ".
🌳 1974 వ స,,నికి ముందు సుమారు 5,000 మంది ముక్తి మార్గం వైపుకు నడిపించబడ్డారు . వారు తిరిగి ఈ భూమి మీదకు రారు . ఆ తరువాత వచ్చినవారు ఇక్కడ పనిచేసేందుకు రాబడ్డారు . మనం వచ్చే జన్మల్లో మళ్ళీమళ్ళీ కలుసుకుంటాము . ఈ పని సుమారు 400 సంవత్సరాలు సాగుతుంది .
🔸 *ప్రశ్న :--- “ మా ముక్తి మాటేమిటి ? ” అని ఒకరు అడిగారు .*
🔹 *మహర్షి అమర:---* ' అమర ' అతని వైపు సరదాగా చూసి యిలా సమాధానమిచ్చిరు . " అది మీ జేబులో ఉన్నట్లే భావించండి . అందుకు ఋషులు సహాయపడతారు . ఈ జన్మలోనే మీరు ఆ స్థితికి చేరుకుంటారు . కానీ మనం వెనక్కు వెళ్ళం . పరమాత్ముని కార్యక్రమం చేసేందుకు ఇక్కడే ఉంటాం . అయితే ఎలాంటి బలవంతమూ లేదు . దేన్ని ఎంపిక చేసుకునేందుకైనా మీరు సర్వస్వతంత్రులు .
🌸 ఒకరోజు సాయంకాలపు సమావేశంలో ' అమర ' శంబాలా గురించి తెలియ చేశారు“ ఒకొక్క యుగం సుమారు 51,000 సంవత్సరాలు ఉండే 4 యుగాల కాలచక్రం మహాయుగం అని పిలువబడుతుంది . 71 మహా యుగాలు కలిసి ఒక మన్వంతరం అవుతుంది . మన్వంతరం ముగింపులో సంపూర్ణ ప్రళయం వస్తుంది . సమస్త జీవరాశులు నాశనం చేయబడుతాయి . మరలా కొన్ని లక్షల సంవత్సరాల తరువాత అమీబాతో మొదలై ప్రాణులు అభివృద్ధి చెందుతాయి . భూమి ఏర్పడిన తరువాత సుమారు 200 కోట్ల సంవత్సరాలుగా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది . ఇంతవరకు 6 మన్వంతరాలు ముగిశాయి . అంటే 6 సార్లు ప్రాణికోటి నాశనం అయి తిరిగి జీవం పోసుకుంది ” .
🏵️ క్రిందటి మన్వంతరం అంతంలో భూమి మొత్తం జలమయం అయింది . ప్రళయం నుండి ఒకేఒక వ్యక్తి బ్రతికారు . ఆయనే ఈశ్వరునిచే చిరజీవత్వపు వరం పొందిన మార్కండేయ మహర్షి . ఆయన ఒక పర్వత శిఖరం పైన ఉన్న గుహలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. 10,000 సంవత్సరాలకు పైన తపస్సు చేసి జీవకోటి ప్రారంభం అయిందా అని తెలుసుకొనేందుకు వారు మేలుకున్నారు . అప్పుడు ఒక నీలిరంగు శిశువు నీళ్ళపై తేలుతున్న దృశ్యాన్ని చూశారు . ఆ శిశువు శ్రీ మహావిష్ణువని తెలుసుకుని వారిని స్తుతించారు .
🌳 ఎక్కడైతే ఆ దృశ్యం కనబడిందో అక్కడ భూమి త్వరలో ఉద్భవిస్తుందనీ , మళ్ళీ ప్రాణకోటి ఉద్భవిస్తుందని మార్కండేయ మహర్షుల వారికి తెలియచేయబడింది . ఆ ద్వీపము ఆవిర్భవించినపుడు ఋషులు దానికి ' నీలిబాలుడు ’ అనే అర్థం వచ్చేటట్లు ' శ్యామబాల ' అని పేరు పెట్టారు . ఈ ద్వీపాన్ని పవిత్ర స్థలంగా రక్షించటానికి వారు నిర్ణయించుకున్నారు . కాలక్రమంలో ప్రాణికోటి ఆవిర్భవించింది . ఖండాలూ , నాగరికతలూ వెల్లివిరిసాయి . నిర్మలులూ , దివ్యజ్ఞాన సంపన్నులు అయిన వారిని మాత్రమే ఋషులు ఇక్కడకు చేర్చారు . ఋషులు ఇక్కడ జన్మ తీసుకున్నారు . కాలం గడిచేకొద్దీ శ్యామబాల అన్న పదం ' శంబాలా'గా మారింది .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --15*🌷
🕉️ శంబాలా వయస్సు 28 మహా యుగాలు. ఇప్పుడు మనం 7వ "మన్వంతరంలో ఉన్నాము. కాల ప్రభావం కానీ, విలువలు లేని కలియుగ ప్రభావం కానీ, తక్కువ విలువలు ఉన్న యుగ ప్రభావం కానీ దీని పై పడకుండా ఋషులు ఈ స్థలాన్ని భద్రపరిచారు. ఈ సుదీర్ఘ, అవిరామ కాలంలో ఇక్కడ అత్యున్నత నాగరికత వెల్లివిరిసింది. అత్యుత్తమ విజ్ఞానం వికసించింది. వేల సంవత్సరాల క్రితం నుండే ఇక్కడి మానవులు అంతరిక్ష నౌకలను ఉపయోగించే వారు. చిరంజీవత్వం కోసం జీవించే వారు. వీరు మరణించరు, వృద్ధాప్యం అనుభవించరు. ఇక్కడి జీవిత అభివృద్ధి అనూహ్యం".
🌿 శంబాలా గోబీ ఎడారిలో ఎక్కడో వుంది. చాలా మందికి దీని ఉనికి గురించి తెలుసు కానీ ఋషులు మిగతా ప్రపంచం నుండి దీన్ని వేరు చేసి కప్పి వుంచటం వలన ఎవరూ చేరలేరు. అయితే అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయిలో వున్న వ్యక్తి ఋషుల అనుమతితో ఇక్కడకు చేరవచ్చు. ఆ వ్యక్తి శంబాలా చేరటానికి ఋషులు త్రోవ చూపుతారు. శంబాలాకు ప్రయాణం ఏకోన్ముఖమే. చాలా మంది అక్కడకు వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళలో సమకాలీన గురువులు కొంత మంది వున్నారు. వాళ్ళ పేర్లు వెల్లడి చేయటం అనవసర వివాదాలకు, సందిగ్గానికి దారి తీస్తుంది. కనుక నేను ఆ పేర్లు చెప్పటం లేదు.
🌷 శంబాలాను మైత్రేయ రాజు పరిపాలిస్తున్నారు. భూమిని రక్షించటం కోసం మైత్రేయ వస్తాడు అని కొంత మంది అనుకునేది ఈయన గురించి కాదు. ఈయన బుద్ధుడు కాదు. ఈయన సూర్య లోకం నుండి వచ్చిన ప్రత్యేక ఆత్మ. ఇక్కడి మనుష్యులు వాళ్ళు ఎంచుకున్న భిన్న వృత్తులలో నిమగ్నమై వుంటారు. ఆధ్యాత్మిక శాస్త్రంతో సహా భౌతిక శాస్త్రంలోని అన్ని విభాగాలలోనూ ఇక్కడ నిరంతరమూ పరిశోధనలు కొనసాగుతూ వుంటాయి. ఒక విశాలమైన భవంతి పై, మధ్యన కెంపు పొదిగిన పెద్ద సువర్ణ కమలం అమర్చబడి వుంటుంది. ఇక్కడ గొప్ప శక్తి నిక్షిప్తమై వుంటుంది. దీని నుండి వెలువడే తరంగాలు శంబాలా అంతటినీ దివ్యంగా వుంచుతుంటాయి. టిబెట్లో చాలాbమందికి తెలిసిన *'ఓం మణి పద్మేహం'* అనే మంత్రాన్ని ఉచ్ఛరిస్తే బయటి వాళ్ళు కూడా శక్తిని గ్రహించగలరు.
🍁శంబాలాలో ప్రోగు చేయబడిన జ్ఞానం అందరి కోసము. తాము సాధించినవన్నీ తమ కోసం మాత్రమేనని శంబాలీయులు అనుకోలేదు. కానీ బయట వున్న వారి ఆధ్యాత్మిక స్థాయి దిగజారి వుండటం వలన వారు దానిని బయట వారికి అందించలేదు. ఇప్పటికిప్పుడు మనం ఉన్నత జ్ఞానం స్వీకరించటానికి సరిపోము. మనం ఎరుక పొంది, అభివృద్ధి చెందటం కోసం శంబాలాలో వారు ఎదురు చూస్తున్నారు.
🍀 ఇప్పుడు మనం సత్య యుగంలోకి ప్రవేశిస్తున్నాం. మనకు శంబాలాను తెరిచే సమయం ఆసన్నమైంది. మనం సత్య యుగంలో పురోగమించే కొద్దీ, శంబాలా తెరువబడటమేగాక క్రమంగా శంబాలా బయటవున్న పరిస్థితులు కూడా శంబాలా వలె మారిపోతాయి. శంబాలా విస్తరిస్తుంది. దాదాపు 400 సంవత్సరాల తరువాత భూమండలం మొత్తం శంబాలా వలె వుంటుంది. సప్తర్షుల దగ్గర వున్న మనం దానికోసం పని చెయ్యాలి. ముందుగా శంబాలాను గ్రహించడానికి మనం వ్యక్తిగతంగా ఎదిగి, తరువాత దానిని వ్యాప్తి చేయాలి"
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part --16* 🌷
🌸 🔸 *ప్రశ్న:--- ఒక మనిషి వందలా, వేల సంవత్సరాలు ఒకే చోటా తప్పస్సులో కూర్చుని ఎలా వుండగలరు, యువకునిలా ఎలా కన్పిస్థారు ?"*
🔹 *మహర్షి అమర:---* మనం ఎరుక పొందని విషయాలు ఎన్నో వున్నాయి. మనం కొన్ని మెళకువలు సాధన చేసి తపస్సులో ప్రవేశిస్తే, మన శరీరాలు ఎన్ని సంవత్సరాల పాటైనా యధాతథంగా వుంటాయి. ఈ విధంగా వేలాది సంవత్సరాల పాటు తపస్సులో కూర్చోవచ్చు. నేను(అమర) అలాంటి తాపసులను ఎంతో మందిని చూశాను. *"కలియుగం ప్రారంభమైనపుడు భౌతిక శరీరంలో వున్న కొంత మంది ఋషులు కలియుగం అనుకునే దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలాన్ని ఈ విధంగా తపస్సులో వుండి దాటేస్తారు. వాళ్ళు తపస్సుకు కూర్చునే ముందే హిమాలయాలలో వున్న, ఋషువులకు తాము ఎంత కాలం తపస్సులో వుండబోతున్నారో చెప్పి ఆ తరువాత వాళ్ళను లేపమని అభ్యర్థిస్తారు. అది ఇప్పటి అలారం వంటిది అనుకోండి.
🏵️' ఈ భౌతిక లోకం సూక్ష్మ లోకపు కొనసాగింపు అని గుర్తించుకోండి. సంఘటనలు ముందుగా సూక్ష్మ లోకంలో సంభవించి క్రమంగా భౌతికీకరించబడతాయి. అవి ఎన్నికలయినా, ప్రపంచ యుద్ధాలైనా సరే. జననమో, పెళ్ళో, ప్రమాదమో, స్థాయి పెరుగుదలో ఏదైనా ఇప్పుడు మనం సూక్ష్మ లోకాల్లో ప్రవేశించి, భవిష్యత్ లోకి తొంగి చూస్తే మనం చాలా తెలుసుకోగలం. అయితే ఖచ్చితంగా చేరగల గమ్యమేదీ లేదు. ఏ భవిష్యత్ సంఘటననైనా ఆధ్యాత్మిక శక్తులు మార్చగలవు. ధ్యానం ద్వారా ప్రమాదాలు, ప్రపంచ యుద్ధాలూ వికటింప చేయవచ్చు. అందుకే మేం సూక్ష్మ తలాల్లో ఎంతో పని చేస్తూ వుంటాం. దాని వలన భౌతిక తలం పై సంక్షేమ చర్యలు సంభవిస్తాయి.
🌳 ఆంగ్లేయుల నుండి స్వాతంత్య్రం పొందడానికి ఋషులు ఎంత కష్టపడి సహాయం చేశారో ఎవరికీ తెలియదు. అది చాలా పెద్ద కథ. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత విశ్వామిత్ర మహర్షి ఈ దేశానికి ఒక బహుమతిని ఇద్దామనుకున్నారు. ఆయన అత్యున్నత తలానికి వెళ్ళి గొప్ప శక్తిని తెచ్చారు. దానిని ఒక శక్తివంతమైన వ్యక్తికి ఇద్దామనుకున్నారు. ఒక నాయకుడు ప్రజలందరి తరపునా దానిని స్వీకరించి, రక్షించాలి. అది మాత్రమే ఆ పని. ఆయన ఆ కాలంలో వున్న నాయకులను ఎందరినో సూక్ష్మ శరీరంతో కలిశారు. కానీ ఎవ్వరూ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. చాలా ఆశ్యర్యం అనిపించింది. ప్రతి ఒక్కరికీ ముందే నిర్ణయించుకున్న విషయాలు ఉన్నాయి.
🏵️ స్వర్గాన్ని తలపించే వేరే భూమి పై వున్న మహాభారత కథానాయకులకు క్రిందకు వచ్చి ఈ దేశం తరపున ఈ శక్తిని స్వీకరించమని నా(అమర) ద్వారా కబురు చేశారు. వాళ్ళు కూడా వెంటనే రావడానికి తిరస్కరించటం విచారకరం. ఋషి నిరాశకులోనై ఆ శక్తిని ఆకాశంలోకి విడిస్తే అది లక్షలాది బాంబులలాగా విస్పోటనం చెందింది. నేను (అమర) ఆ విస్పోటనానికి దగ్గరలో వున్నాను. నా సూక్ష్మ శరీరం ఆ ప్రభావానికి లోనైంది. నేను నా స్థూల శరీరంలోకి వచ్చిన తరువాత ఒళ్ళంతా మంటలు అన్పించింది. వైద్యులు ఏ సహాయం చెయ్యలేకపోయారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వచ్చి నాకు (అమర) స్వస్థత చేకూర్చారు.
⭐ ఆ తరువాత విశ్వామిత్ర మహర్షి ఈ నక్షత్ర మండలం వదలి వెళ్ళారు. బహుశా వేరే సుదూర నక్షత్ర మండలంలో తపస్సు చేసుకోవటానికి అయి వుంటుంది. ఇదంతా 1948 లో జరిగింది. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చారు"
🍀 ప్రస్తుతం సప్తర్షులలో విశ్వామిత్ర మహర్షి లేరు. ప్రతీ క్రొత్త మన్వంతరంలోనూ సప్తర్షులు మారుతూ వుంటారు. అయినప్పటికీ సప్తర్పులు ఎప్పుడూ ఆయన మార్గదర్శకత్వాన్ని అభ్యర్థించి, అనుసరించటమే కాక, ప్రత్యేకమైన పనులలో ఆయన సహాయం కోరతారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు ఇతర *ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 17* 🌷
🌳 మన కట్టడాలను కూల్చివేసి మనలను ఎంత ఎత్తు నుండి అయినా కిందకు లాగే శత్రువులు మన అహాలు మాత్రమే.
🌸 సంపూర్ణ మౌనం సర్వస్య శరణాగతి, అప్పుడు మాత్రమే నీవు నీ చైతన్యాన్ని విస్తృతపరుచుకోగలవు, ఏ అంచుకైనా విస్తరించగలవు. అదంతా నీమీదే ఆధారపడి ఉంది.
🕉️🔸 *ప్రశ్న:--- "ప్రతీ మహా యుగం అంతం సమయంలో ప్రళయం తరువాత ప్రతిదీ నశిస్తుందా? కళలూ, సాహిత్యం కూడా నశిస్తాయా? షేక్స్పియరూ, కాళిదాసూ సంగతి ఏమిటి?”*
🔹 *మహర్షి అమర:--- “చాలా వస్తువులు నశిస్తాయి".* కాలాంతరంలో అన్నీ కోల్పోతాం. మళ్ళీ అంతకంటే గొప్ప విషయాలు సంభవిస్తాయి. నూతన వేదాలు వస్తాయి. క్రొత్త ఖండాలూ, క్రొత్త పర్వతాలూ, క్రొత్త నదులూ ఆవిర్భవిస్తాయి. మనిషి ప్రకాశవంతమైన ఉన్నత స్థానాన్ని చేరతాడు. యుద్ధాలూ, వ్యాధులూ వుండవు. హింసకు తావు లేదు. గొప్ప నాగరికతలు వెల్లివిరుస్తాయి. అద్భుతమైన కళా విలాసమూ, సాహిత్య వికాసమూ సంభవిస్తాయి.
🌿 ఎప్పుడైనా ఒకే చోటు నుండి దేవతా విగ్రహాలను తరలించాల్సివస్తే ముందుగా వాటిలో నిక్షిప్తం చేయబడిఉన్న శక్తులను తరలించాల్సి ఉంటుంది. కాలం గడిచే కొద్దీ ఆ శక్తులు భూమి లోపల మునిగిపోతాయి. మనం ముందుగా వాటిని పైకి లేపి, తరువాత మార్చాలి. అది కొంత సమయం తీసుకునే ప్రక్రియ.
⭐ ఒకరోజు అమర తాను సూక్ష్మ తలాలలో చేసిన పనిని గురించి వివరించారు. వేరే నక్షత్ర మండలపు భూమిపైన వున్న ఒక ఋషి వద్దకు వెళ్ళి ఆయనను హిమాలయాలకు ఆహ్వానించి రమ్మని పంపారు. *'అమర'* అక్కడకు సూక్ష్మ శరీరంతో వెళ్ళారు. ఇతర నక్షత్ర మండలానికి వెళ్ళే ప్రతిసారీ ఆ నక్షత్రాలను, భూములను ఝామ్మంటూ దాటుకుంటూ వెళుతూ దూరం నుండీ మన నక్షత్ర మండలపు ఆకారాన్ని చూడటం ఎంతో ఆరాధనా పూర్వకంగా వుంటుంది.
🌳ఒక ప్రత్యేకమైన భూమిపైకి ఆయన ఎలా వెళతారు, దానిని ఏవిధంగా గుర్తిస్తారు అని మేము అడిగాం. అది తనకు కష్టమైన పనికాదని ఆయన అన్నారు. ఆయనకు మార్గదర్శకత్వం వహించే ఎన్నో ఉపకరణాలు ఆయనకు అమర్చబడతాయని తెలిపారు. ఋషుల మార్గదర్శకత్వంలో పని చేసే ప్రతి వానికీ ఋషులు ఎన్నో ఉపకరణాలు అమర్చుతారు. తనను సూటిగా గమ్యానికి చేర్చే ఒక ప్రత్యేక మెళకువను అమర సాధన చేశారు.
🏵️ *'అమర'* ఋషి వద్దకు వెళ్ళారు. అప్పుడు ఆయన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. *'అమర'* ఆయన కుటీరంలోకి ప్రవేశించటం చూస్తూనే ఆయన చిన్నగా నవ్వి కూర్చోమని సైగ చేశారు. ఆ భూమి మీద మానవులకు భౌతిక శరీరాలు వుండవు. వారు తమ సూక్ష్మ శరీరాలతో నివసిస్తారు. కనుక ఈ భూమిమీద జనన మరణాలు వుండవు”.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 18*🌷
🔸 *ప్రశ్న:--- "ఆ భూమి మన భూమిలాగానే వుంటుందా?*
🔹 *మహర్షి అమర:---* అవును, అయితే అక్కడ ప్రతిదీ సూక్ష్మ రూపంలో వుంటుంది కొండలు, పక్షులు అన్ని. నేను వింత భూములను దర్శించాను. అక్కడ స్వయం ప్రకాశత్వం వున్న ఒక భూమి వుంది. అది తన మూలం నుండే వెలుగులు విరజిమ్ముతోంది. సముద్రం అడుగు నుండి వెలుగులు ప్రసరిస్తుండగా దాన్లో ఉన్న చేపలు చూడటం ఎంతో అందంగా వుంటుంది”.
🍁 హిమాలయాలలో మార్కండేయ మహర్షి నుండి సందేశాన్ని *'అమర'* ఆ ఋషికి అందించారు. ఆ ఋషి ఆ సమయంలో తనకు తీరిక దొరకకపోవచ్చు అన్నారు. ఆయన *'అమర'* ను తన దగ్గరకు ఆ మరుసటి రోజు రమ్మని చెప్పాడు. *'అమర'* ఆ మరునాడు వెళ్ళి ఆ ఋషికి హిమాలయాలకు తోడుగా వెళ్ళారు. మార్కండేయ మహర్షి ఇటలీ నుండి ఒక ఉపకరణం తేవటంలో ఆయన సహాయాన్ని అభ్యర్థించారు. మళ్ళీ ఇటలీకి *'అమర'* ఆ ఋషికి తోడు వెళ్ళారు. ఒకప్పుడు జంటనగరాలైన సోడోం, గొమొర్రా వున్న చోట వాళ్ళు భూమి అడుగు భాగానికి చేరారు. ఆ ఋషి గంటకు పైగా వెతికి ఆ ఉపకరణం కనుగొన్నారు. ఆ ఋషి *"ధన్వంతరి"* , ఆయన గ్రీకులకు వైద్య దైవమైన ఎస్కలీపియస్ గా పరిచితుడు.
🌸 ఆయనకు ఆ ఉపకరణం గురించి తెలుసు. ప్రజలు పాప భూయిష్ట జీవితం కోసం దేవుని వాక్కులను లక్ష్య పెట్టనపుడు సోడోం, గొమొర్రాలను ఊడ్చి వేయటంలో అది ఉపయోగించబడింది. ఆ ఉపకరణం మార్కండేయ మహర్షికి అందచేయబడింది. ధన్వంతరి ఈ భూమిపై కొన్ని వారాలు వుండి తన భూమికి తిరిగి వెళ్ళారు. మార్కండేయ మహర్షి ఈ ఉపకరణాన్ని కల్కి భగవానుడి కోసం తయారు చేశారు.
🍀 కల్కి భగవానుడు 1924 లో, శంబాలాలో జన్మించారు. మిగిలి అవతారమూర్తుల వలెనే శంబాలాలో విద్యనభ్యసించి, శిక్షణ పొందారు. ఆయన శంబాలాలో 24 ఏళ్ళ వయస్సులో నిలిచి వుంటారు. ఎన్నేళ్ళున్నా అక్కడ మనుష్యులు అంతకంటే ఎక్కువ వయస్సు కనబడరు.
🕉️ మన ఋషులు అతనిని మన కోసం ప్రళయ కాలంలో వాడటానికై మరిన్ని ఎక్కువ శక్తులతోనూ, ఉపకరణాలతోనూ నింపారు. ప్రజలకు తీర్పులు చెప్పి శిక్షించేది ఆయనే. ఆయన తనపని ప్రారంభించటానికి సప్తర్షుల నుండి సంకేతాల కోసం ఎదురు చూస్తున్నారు. నూతన యుగంలో మానవ జాతికి అవసరమైన విషయాలను సప్తర్షులు నిరంతరమూ పర్యవేక్షిస్తూ, ఆయనకు నివేదిస్తూ వుంటారు. మానవ జాతి వీరు ఆశించిన స్థాయిలో ఎదగకపోతే కల్కి భూమి మీద ప్రతి మానవుడినీ సామూహిక సమాచార వ్యవస్థలైన టి.వి. రేడియో వంటి వాటి ద్వారా కలుసుకుని వాళ్ళను హెచ్చరిస్తాడు. ఒక్కసారి కాదు , ఆయన చర్య తీసుకోబోయే ముందు అనేక సార్లు హెచ్చరిస్తాడు. తరువాత ఆయన భూమి మీద ఉన్న అధర్మాన్నీ, దానిని పోషిస్తున్న వాళ్లందరినీ తుడిచి పెడతాడు.
🔸 *మేం ఆయనను కలవగలమా?*
🔹-----------------------------------------
🔸 *ఎప్పుడు?*
🔹 నేను మీకు చెప్పలేను. అయితే ముందు మీరు ఆయనను కలవటానికి సన్నద్ధులవ్వాలి
🔹 *"ఎలా? ”*
🔹 "ధ్యానాల ద్వారానూ, మీ జీవితాలను ఆధ్యాత్మికమయం చేసుకోవటం ద్వారానూ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 19*🌷
🌸🔸 *ప్రశ్న:--- గంటల కొద్దీ చేసే సుదీర్ఘ ధ్యానంలో అప్పుడప్పుడూ కొంత సంపూర్ణ నిశ్శబ్దం. ఆ నిశ్వబ్దంలో కూడా ఆలోచనలు, నాకు వాటి పట్ల ఎరుక వుండేది. నా చుట్టూ వున్న ప్రతి దాని పట్లా ఎరుక వుండేది. అయితే ప్రతిదీ వేరొక స్థాయిలో ఉన్నట్లు కనిపించేది. నేను ఒంటరిగా, దేనితోనూ సంబంధంలేనట్లు ఉండిపోయే వాడిని. దాని గురించి వివరించండి?*
🌳 *"మహర్షి అమర :---"* అది సమాధి ఆరంభం, సవికల్ప సమాధి. ఇక్కడ రెండు రకాల గుర్తింపుల ఎరుక కలుగుతుంది. నీది, నీ చుట్టూ వున్న ప్రపంచానిదీ. నీవు పురోగమించే కొద్దీ ఎరుక మార్పు చెందుతుంది. నీవు నీ దివ్యసారం పట్ల, నీ చుట్టూ వున్న దివ్యత్వం పట్ల ఎరుక పొందుతావు. ఆ పైన కేవలం ఎరుక స్థాయిని దాటి నీలోని దివ్యత్వాన్ని నిజంగా అనుభూతి చెంది దివ్యంగా మారటమే కాక నీ చుట్టూ ఉన్న దివ్యత్వాన్ని ప్రగాఢ స్థాయిలలో అనుభవిస్తావు, నీలోని చైతన్యం విస్తృతమవుతుంది. సమాధి యొక్క ఈ స్థితిని ద్వైతం అంటారు. ద్వైతం అంటే రెండు. అద్వైతం ఆ తరువాతి స్థితి. ఇక్కడ నీది, దైవానిది అన్నీ రెండింటి ఎరుకపోయి మొత్తం ఉనికి అంతా ఒక్కటిగా నిలచి వుంటుంది. ఇదే *'అహం బ్రహ్మస్మి'* స్థితి, నీవే దైవం. ఇది నిర్వికల్ప సమాధి స్థితి, ఇక్కడ నిజమైన యోగం సిద్ధిస్తుంది.
🔸 *ప్రశ్న:--- మనం సాధించిన వాటిని మరు జన్మకు తీసుకువెళతామా?*
🔹 *మహర్షి అమర:---* ”అవును. బాల మేధావుల సంగతి చూడు. వాళ్ళు తమ పూర్వ జన్మలోనే ఏదో సాధించి వుంటారు. వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకున్నపుడు ఎందుకు తీసుకున్నారో మనకు కారణం అర్థంకాకపోయినా, వాళ్ళ మెదడు కణాలు గత జన్మ సాధనల స్మృతులలో తెరచుకుని ఉండిపోతాయి. అందుకే, వాళ్ళు సంగీతంలో రాగాలను గుర్తించటమో, బొమ్మలు వెయ్యడమో అతి చిన్న వయస్సు నుండే చేస్తూ వుంటారు.
🔸 *ప్రశ్న:--- మెదడు కణాలు మూసుకుని పోయిన వారి సాధనల సంగతి ఏమిటి?*
🔹 *మహర్షి అమర:---* వారు త్వరగా వాస్తవీకరించలేక పోవచ్చు. అవి లోలోపల కోరికల లాగా మిగిలి వుంటాయి. మనం వాటిని ఎలానో గుర్తించి, సరియైన సమయంలో మన గత ఆసక్తులను ఈ జన్మలో కనుగొని, కొనసాగిస్తాం".
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 20*🌷
🔸 *ప్రశ్న:--- "మనలో జ్ఞాపకాలన్నీ ఎక్కడ నిలిచి వుంటాయి?*
🔹 *మహర్షి అమర:---* "మనస్సులో, మనస్సు పెద్ద సామాన్ల కొట్టం వంటిది. దానిలో జ్ఞాపకాలనూ, శక్తులనూ కర్మ నమోదులనూ నిలిపి వుంచే గదుల వంటి నిర్మాణాలు అనేకం వుంటాయి.
🔸 *ప్రశ్న:--- "కానీ మన ఎరుక ప్రస్తుత జ్ఞాపకాలకు మాత్రమే పరిమితమై వుంటుంది గదా?"* .
🔹 *మహర్షి అమర:---* "అదంతా మన మంచి కోసమే. గత జన్మ జ్ఞాపకాలు మధ్యలో అడ్డుపడి, కలిసిపోయి, ప్రస్తుత జన్మలో ఇబ్బందులు కలుగ చేస్తాయి. అందుకే అవి మూసివేయబడతాయి. అయితే మనో శక్తులు వున్న మనుష్యులు వాటిని గుర్తు తెచ్చుకోవచ్చు. వాళ్ళు భవిష్యత్తును కూడా చూడవచ్చు. నోస్ట్రడామస్ లాగా తరువాత ఋషులు మన గత జన్మలలో దేనినైనా తెలుసుకోగలరు. అలాగే వేల సంవత్సరాల మన భవిష్యత్ ను తెలుపగలరు.
🔸 *ప్రశ్న:--- "గత జన్మలు ఇప్పటికే సంభవించాయి. కనుక వాటిని చూడగలం. భవిష్యత్తు ఇంకా సంభవించ లేదు. దానిని ఎలా చూడగలం?*
🔹 *మహర్షి అమర:---* భవిష్యత్తు కూడా సంభవించింది. దానిని ఇప్పుడు వివరించటం కష్టం. కాలం నది వంటిది. కాలంలో ఈ బిందువు నుండి మనం భవిష్యత్తును చూడగలం".
🔸 *ప్రశ్న:--- భవిష్యత్తు ఇప్పటికే సంభవించివుంటే ఇప్పుడు కష్టపడటమూ, ప్రణాళిక వెయ్యటంలో అర్ధం ఏముంది?”*
🔹 *మహర్షి అమర:---* " ఈ కష్టంలో మన ఆధ్యాత్మిక పరిణామానికి దోహదం చేసే పాఠాలు ఇమిడి వుంటాయి. అందుకే భవిష్యత్ కప్పి వుంచబడుతుంది".
🔸 *ప్రశ్న:---"వర్తమానంలో మనం పాఠాలు నేర్చుకుంటాం. మరి భవిష్యత్ సంగతి ఏమిటి? మనం దాని ద్వారా వెళ్ళవచ్చా?".*
🔹 *మహర్షి అమర:---* " లేదు, అప్పుడు మన భవిష్యత్ మారుతుంది. అది ఒక దారి నుండి ఇంకొక దారికి మళ్ళటం. అందుకే ఆధ్యాత్మికంగా మారటం ఎంతో ముఖ్యం. మనం మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు, గమ్యాన్ని మార్చుకోవచ్చు".
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 21*🌷
🔸 *ప్రశ్న:--- మనం మొదటగా జంతువుల వలె జన్మించి, మానవుల వలె పరిణతి చెందటం సత్యమేనా?*
🔹 *మహర్షి అమర:---* " కాదు మనం పరబ్రహ్మ లోకం నుండి వచ్చాము. మనం ఎప్పుడూ మనుష్యుల వలెనే జన్మిస్తాం. మొక్కలు, వృక్షాలు, పక్షులు, జంతువుల శరీరాలలో వుండే, ఆత్మలన్నీ నిమ్న దివ్యతలంలో సృష్టించబడతాయి. మరణానంతరం, అవి వాటి తలానికి తిరిగి వెళతాయి. అదే వాటి ముక్తి. అవి మనం కట్టుబడినట్లుగా కర్మ సిద్ధాంతం వంటి ఆధ్యాత్మిక నియమాలకు లోబడవు. అవి వేరే నియమాలకు లోబడి వుంటాయి. 51వేల సంవత్సరాలలో అవి ఒక్కసారి మానవు రూపంలో జన్మ తీసుకుని, జీవితాన్ని అనుభూతి చెందడానికి అనుమతించబడతాయి. వాళ్ళు కూడా మనతోనే వుంటారు. నువు జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుసుకోగలవు. వాళ్ళని సూక్ష్మ శరీరంతో కలిసినా తేలికగా తెలుసుకోగలవు”.
🏵️ దైవం ఎప్పుడూ స్పందిస్తుంది. కానీ మనమే విశ్వాసంతో అర్థించం. ఆయన సహాయం చేసినపుడు దానిని మనం గుర్తించం.
🌿 త్వరలోనే ప్రళయ శక్తులు పని చేయటం ఆరంభమవుతుంది. సందిగ్ధమూ, సంక్షోభమూ ఏర్పడతాయి. బైబిల్లో చెప్పినట్లు ఎందరో దొంగ ప్రవక్తలూ, తప్పుదారి పట్టించే మార్గాలూ, దుర్మార్గులూ చురుకుగా మారతారు. మనుష్యులు బోలెడంత సంపదవున్నా విచార సముద్రాలలో మునుగుతారు . అప్పుడు ఈ సప్తర్షి స్థావరం నుండి కాంతి బయటకు వెళ్ళి ప్రజలను దైవం, సత్యం, పరిపూర్ణత, ప్రశాంతతల వైపు నిర్దేశిస్తుంది. అది అంత తేలికైన పనేమీ కాదు. ఎంతో బాధ్యతాయుతమైనది.
🌸 ఈ ఋషుల కార్యక్రమాన్ని గత చక్రంలో కూడా అంటే 51 వేల వత్సరాల క్రిందట కూడా మీరు ప్రారంభించారు. అందుకు గర్వించండి. ప్రతీ చక్రంలోనూ మనం ఈ పని చేస్తున్నాం". "ఈ పనిని ఎన్నడూ విడవ వద్దు. ఎటువంటి ఒత్తిడులు వచ్చినా సరే ఈ మార్గంలో అన్ని రకాల కష్టాలు వస్తాయి. అది సహజమే. ఎవరెస్టు శిఖరం ఎక్కటం తేలిక కాదు కదా. కనుక గొప్ప అడ్డంకులు ఎదురవుతాయని తెలుసుకోండి. మీ విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఋషులు సహాయం చేస్తారు. ఇప్పుడు, వాళ్ళు ఇంకా క్రిందకు రాలేదు. కొన్ని దశాబ్దాల తరువాత వాళ్ళు జన్మ తీసుకుని ఈ తలం మీద వారి పనిని కొనసాగిస్తారు. ప్రస్తుతం వారికి మనవంటి వాహకాలూ, మధ్యవర్తిత్వాలూ అవసరం"
🕉️ " మీ అహం మిమ్మల్ని అధిగమించటానికి ఎన్నడూ అనుమతించ వద్దు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అహానికి లోబడతాడో అప్పుడు ఋషులు అతనిని దూరంగా పంపివేస్తారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *39032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 22*🌷
🌸 మనం శ్రీ మహా విష్ణువు యొక్క పది అవతారాలను గురించి విన్నాం. కానీ ప్రతి చక్రం (51 వేల సంవత్సరాలు) అంతమవబోయే ముందు భూమి పైకి మరో అవతారం దిగి వస్తుంది అని మనకు తెలియదు”. *“మరి ఇది ఎక్కడా చెప్పలేదు. ఎవ్వరికీ దాని సంగతి ఏమీ తెలియదు”*. భూమిని పరిపాలించే ఒక బాలుని గురించి నోస్ట్రడామస్ చెప్పారు. మనం ఆ విషయాలు వ్రాయబడిన గ్రంధాలను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనకు లభిస్తున్న వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ అసలు వాటిలో ఒక భాగం మాత్రమే.
🔸 *"అవి ఎలా పోయాయి?"*
🔹 *"కాల క్రమంలో శిధిలమయ్యాయి. మానవుల నిర్లక్ష్యం. గడుస్తున్న కొద్దీ మనుష్యులు వాటిని అర్ధం చేసుకుని, ఆచరించే శక్తి కోల్పోయారు. తప్పుడు జ్ఞానమూ, ధన సంపాదన కోసం పెద్ద క్రతువులూ మొదలు పెట్టబడ్డాయి. అయితే మళ్ళీ మనం ఆ జ్ఞానాన్నంతటినీ, ఇంకా ఎక్కువ జ్ఞానాన్నీ తిరిగి తెచ్చుకుంటాం. మనం వీటన్నిటినీ ప్రోగు చేసినపుడు, క్రొత్త యుగంలోకి, నూతన చైతన్యంలోకి, నూతన కాల చక్రంలోకి మార్పు పొందినపుడు మనలో వున్న అల్పత్వాన్నంతటినీ తొలగించుకొని మన అసలు స్వరూపమైన ఆధ్యాత్మిక శిఖరాలుగా మనల్ని తయారు చేసుకుంటాం.
🔸 మహా అవతార లక్ష్యం ఏమిటి?
🔹 ఆయన ఆధ్యాత్మిక సమత్వాన్ని తిరిగి తెస్తారు. కల్కి భగవానుడు మార్పుకు స్ఫూర్తినిస్తారు, అది కష్టాలకు వినాశనానికి దారితీయ వచ్చు. అప్పుడు ఆ క్రమమంతా మహావతారపురుషుని ఆధ్వర్యంలోకి వస్తుంది. ఆయన తనతో పాటు అత్యున్నత తలం నుండి శక్తులను తీసుకువస్తారు. ఆయన ఈ శక్తులను విడుదల చేసి మనుష్యులు నూతన చైతన్యంలో ప్రవేశించటానికి సహాయపడతారు.
🌸1982 లో అమర అనారోగ్యానికి గురయ్యారు. మూత్ర పిండాలు, గుండె, తీవ్ర రక్తపోటు సమస్యలు ఎదుర్కొన్నారు. మంచాన పడ్డారు. మీరు శరీరవిరమణ చేయబోతున్నారా? అని అడిగాను. కానీ ఆయన మౌనంగా వుండిపోయారు. పైకి ఎత్తిన ఆయన ముఖంలో నీళ్ళు కారిపోతున్నాయి. ఆ సమయంలో నేను(కృష్ణానంద) నా ఉద్వేగాలను అర్థం చేసుకోలేక పోయాను. ఆయన నుండి కన్నీళ్ళను నేను ఊహించలేదని నాకు తరువాత అర్థమైంది. ఆయన కూడా మనిషేననీ, ఆయనకూ అనుభూతులూ, భావాలూ, నమ్మకాలూ వుంటాయని మేము మరచిపోయాం. మేము ఆయనని ఎప్పుడూ.. శక్తి శిఖరంగానూ, సాహస సముద్రంగానూ చూసే వాళ్ళం. కానీ ఆయన కూడా మనిషే. సుదీర్ఘ నిశ్శబ్దం తరువాత నావైపు చూడకుండా *'అమర'* ఇలా మాట్లాడారు. *“నా మరణం గురించి నాకు తెలియదు, అటువంటి విషయాలను ఋషులు నిర్ణయిస్తారు అని”.*
🕉️ బహుశా ప్రతి అవతారమూర్తి నవ్వి, హాస్యోక్తులాడి ఏడ్చి వుంటారు. దివ్య వ్యక్తుల మానవ భాగాన్ని పురాణాలు నమోదు చేసి వుండవు. ఒకసారి మానవ శరీరం ధరించిన తరువాత ప్రతి గొప్ప ఆత్మా కనీసం పై పైన అయినా మానవ ఉద్వేగానుభూతులు పొందే వుంటుంది.
🏵️ *'అమర'* సాధారణమైన గురువేమీ కాదు. ఋషులు చెప్పిన పనులు చెయ్యటానికీ ఇతరులకు సేవ చెయ్యటానికీ ఆయన చేసిన గొప్ప పనులు, ఉపయోగించిన అద్భుత శక్తుల గురించి నేను వ్రాయలేను. కానీ నేను ఒకే ఒక్కటి చెప్పగలను. 2 వ ప్రపంచ యుద్ధ సమయంలో *‘అమర'* ఒకేసారి 18 చోట్ల, 18 శరీరాలతో, రెడ్ క్రాస్ సొసైటీలో శరీరాలను మోసి, గాయపడిన వారికి సేవ చేయటం సంభవించింది. ఆయన దీని గురించి ఎన్నడూ మాట్లాడ లేదు. ఒకసారి మాటల సందర్భంలో వారి కుటుంబ సభ్యులు ఈ సంగతి తెలియ చేశారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 23*🌷
🍁 *కృష్ణానంద:--- "మీ జీవిత ప్రణాళిక ఏమిటి? దానిని సాధించారా”? అని అమరను అడిగాను*
🌳 *అమర:---* ఈ భూమి మీద ఋషుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాను. అది నా ప్రణాళిక. దాని కోసం నేను మీ అందరినీ కూడగట్టాలి. నేను దానిని చేశానని అనుకుంటున్నాను" .
🍁 *కృష్ణానంద:--- "మీరు మమ్మల్ని ఎలా కనుగొన్నారు?*
🍀 *అమర :---* "ప్రతిదీ సూక్ష్మ తలం నుండి నడుపబడుతుంది. ప్రతిదీ తెలిసిందే. నేను చేయవలసిందంతా ఒప్పుకోవటమే. నా ఆలోచనా శక్తిని ఉపయోగించి మీ అందరినీ ఇక్కడకు చేర్చటమే, ఆపైన, మీరందరూ ఇక్కడ వున్నారు".
🍁 *కృష్ణానంద:--- "మీ పిలుపును నిరోధించిన వారు ఎవరైనా ఉన్నారా?”*
🌳 *అమర:---* ఉన్నారు, కొందరు లక్ష్య పెట్ట లేదు. మీరు ఋషుల కోసం పని చేస్తామని మాట ఇచ్చారు. మీరు ఆ పిలుపును లక్ష్య పెట్టి వుండకపోవచ్చు. అన్ని స్థాయిలలోనూ స్వేచ్ఛ వుంటుంది. ఏదీ విధించబడదు".
🍁 *కృష్ణానంద:--- “వాళ్ళకు ఏం జరుగుతుంది. శిక్ష పొందుతారా?"*
🌿 *అమర:---* వాళ్ళు అవకాశాన్ని కోల్పోయారు. ఋషులు ఎవ్వరినీ శిక్షించరు. ఆధ్యాత్మిక నియమాలను ఉల్లంఘించిన మనుష్యులు కర్మను ఆకర్షించి, ఇబ్బందులకు గురి అవుతారు.
🍁 *కృష్ణానంద:--- "ఇప్పుడు మనమందరమూ ఇక్కడ కలుసుకున్నాము, ఖచ్చితంగా మనం చేయవలసింది ఏమిటి?”*
🌳 *అమర:---* ముందుగా మీరు అభివృద్ధి చెంది, ఋషుల లాగా వెలుగొందాలి. నేను 144 మంది ధ్యానులు తయారవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు భూమి మీద 1,44,000 మార్గాలు ఉన్నాయి. అలా కానట్లయితే 7 గురు వెలుగొందాలని అనుకుంటున్నాను. అదీ కానట్లయితే కనీసం ఒక్కరు. ఒక వేళ ఒక్కళ్ళు కూడా ఋషులు ఆశించిన స్థాయికి చేరకపోతే, నేను నా పనిని సంతృప్తికరంగానే చేశాను అన్న భావంతో నా శరీరం వదులుతాను. ఋషులు మళ్ళీ పిలుస్తారు. వేరే వాళ్ళు రావచ్చు. వాళ్ళు కాకపోతే ఇంకొకరు"..
🍁 *కృష్ణానంద:--- "తరువాత మీరు భూమి మీదకు తిరిగి వస్తారా?"*
🍀 *అమర:---* "వస్తాను. 2042 లో తిరిగి వస్తాను. మీరు కూడా మళ్ళీ వస్తారు. మనం ప్రణాళికలో 5 జన్మల పాటు పని చెయ్యాలి".
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟j🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 24*🌷
🏵️ ఒక రోజు *'అమర'* మాకు ఒక సందేశం పంపారు. *“జూన్ 10, 1982న అణు యుద్ధం జరుగబోతోంది. అది ఉదయం 10 గంటలకు మొదలై 12 నిమిషాలలో ముగుస్తుంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు మరణిస్తారు”* అని నేను వెంటనే ఆయన వద్దకు వెళ్ళి సూచనల కోసం అడిగాను. *"మీ సాధారణ పనులలో నిమగ్నమవ్వండి. సాధన కొనసాగించండి. వీలయితే మరింత ఎక్కువ ధ్యానం చెయ్యండి. పిచ్చి పట్టించుకోవద్దు. దీని గురించి ఎవరితోనూ మాట్లాడవద్దు. దైవం మీద భారం వేసి ఎదురు చూడండి”*.
🌸 యుద్ధం జరుగలేదు. మేము నిరుత్సాహానికి గురయ్యామని జ్ఞాపకం తెచ్చుకోవటం నవ్వులాటగా ఉంది. యుద్ధం సంభవించలేదంటే ఏదో కారణం వుండి వుంటుంది. నేను మళ్ళీ *'అమర'* వద్దకు పరుగెత్తాను.
🌿 ఋషులు దానిని వెనుకకు జరిపారు. వాళ్ళు దీనికోసం వేలాది సంవత్సరాల తమ తపో శక్తిని ధారపోశారు. అంత జన నష్టం జరగటం వారికి ఇష్టం లేదు”.
🍁 *కృష్ణానంద:---"ఇటువంటి విషయాలను ఎవరు నిర్ణయిస్తారు."*
🍀 *అమర:---* "దేవుడు"
🍁 *కృష్ణానంద:--- "మీరు దేవుణ్ణి చూశారా?”*
🌳 *అమర:---* "ఈ విధమైన ప్రశ్నలకు జవాలు చెప్పటం కష్టం. నేను శ్రీ మహా విష్ణువు, పరమ శివుడు వంటి దివ్య వ్యక్తులను కలిశాను. నిరాకార పరబ్రహ్మను అనుభూతి చెందాను. అయితే నేను ఆయన మూలంలోకి వెళ్ళలేదు. నేను అక్కడకు వెళ్ళి తిరిగి రావటానికి పట్టే కాలంలో భూమి మీద లక్షల సంవత్సరాలు గడుస్తాయి"
🍁 *కృష్ణానంద:--- “మీరు దేవుణ్ణి అనుభూతి చెందారు, దానిని వివరిస్తారా?”*
🌿 *అమర:---* "అది కష్టం. మాటలకు అందనిది. లక్షలాది నక్షత్ర మండలాలు విస్ఫోటనం చెందటమూ, లక్షలాది నక్షత్ర మండలాలు ఉద్భవించటమూ, లెక్కించలేనన్ని ఆత్మలు లోనికి ప్రవేశించటమూ, బయటకు వెళ్ళటమూ ఊహించు. వేలకొలది రంగు దీపాలను ఊహించు. వీటన్నిటినీ గొప్ప ప్రశాంతతా, ప్రేమ ఆవరించటం ఊహించు. ఇవన్నీ ఏక కాలంలో సంభవించటాన్ని ఊహించు. నువ్వు వీటన్నిటినీ ఒకేసారి అనుభూతి చెందగలిగితే దైవం లోని చిన్ని భాగాన్ని అనుభూతి చెందినట్లు".
🌷 నేను (కృష్ణానంద) నా శక్తి మేరకు నా ఊహా పరిధిని విస్తరించాను. ఆ తరువాత ఆయనను అనుభూతి చెందాలంటే, ఆలోచనలు, ఊహలు అన్నీ అధిగమించాలని గుర్తించాను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 25*🌷
🍁 *కృష్ణానంద:--- “యుద్ధం ఎప్పుడు జరుగుతుంది?”*
🌳 *అమర:---* "నాకు తెలియదు. సప్తర్షులు హిమాలయాలలో ఒక యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళుగానీ సఫలత పొందితే యుద్ధం రద్దు చేయబడవచ్చు. అయితే వాళ్ళు చాలా సంవత్సరాల నుండి యజ్ఞాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వారు యుద్ధాన్ని వెనుకకు జరపటం మాత్రమే చేయగలిగారు. చూడూ మానవ జాతి కూడా మేలుకుని, ఆధ్యాత్మిక విలువలను అనుసరించాలి. అప్పుడు మాత్రమే యుద్ధ విముఖత సంభవిస్తుంది.
🏵️ అమర ' పరిస్థితి మెరుగుపడలేదు. రాత్రుళ్ళు విశ్వామిత్ర మహర్షి ఆయనను దర్శించి, చికిత్స మొదలు పెట్టారు. కొద్ది రోజుల తరువాత ఆయన ఆరోగ్యం మెరుగు పడింది. కానీ, మళ్ళీ దిగజారింది. దాని గురించి అమర మాకు వివరించారు.
🌳 విశ్వామిత్ర మహర్షి సందిగ్ధానికి గురయ్యారు. అప్పుడు ఒక రాత్రి ఆయన నిశితంగా పరిశీలించి నా పొట్టలో ఒక చిన్న నల్లటి పదార్థాన్ని చూశారు. నా ఆరోగ్య పరిస్థితి తిరిగి వెనుకకు మళ్ళటానికి అదే కారణంగా భావించారు. ఆయన దానిని తొలగించగానే అది ఒక వ్యక్తి రూపం ధరించింది. ఆ వ్యక్తి ఋషిని క్షమాపణ కోరి అతను ఒక చీకటి శక్తి క్రింద పని చేస్తున్నాననీ, అది పంపగా తాను వచ్చానన్నీ చెప్పాడు. అతను నా శరీరంలో దాగివుండి, దానికి నష్టం కలిగించి, చివరగా నాశనం చేయమని సూచింపబడ్డాడు. అతను కేవలం తన యజమాని సూచనలను అనుసరించాడు, అంతే. విశ్వామిత్ర మహర్షి అతనిని వెళ్ళిపొమ్మన్నారు. అతను నేను నా విధి నిర్వర్తిస్తున్నాను అని చెప్పాడు. విశ్వామిత్ర మహర్షి తన చికిత్స కొనసాగించారు".
🌿 నాటకీయంగా *'అమర '* ఆరోగ్యం మెరుగుపడింది. అయితే అది కొద్ది కాలం మాత్రమే. ఈసారి కారణం కర్మలు. *'అమర'* తన వద్దకు వచ్చిన వారిలో చాలా మంది కర్మలను తీసుకున్నారు. ఆయన వాటిని అనుభవించాలి. ఆయన కర్మలను దగ్ధం చేయగలరని మాకు తెలుసు. అయితే వాటిని అనుభవించాలని ఆయన ఎంచుకున్నారు. అటువంటి విషయాలకు శక్తిని వృధా చేయకూడదని అన్నారు. ఆయన బాధ అనుభవించడానికి సిద్ధపడ్డారు. కర్మలు తీరిపోతే ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆయన దానికోసం ఎదురు చూశారు. అయితే ఈ మధ్యలో ఆయన చాలా నొప్పిని అనుభవించవలసి వస్తుంది. ఏం చేయాలో మాకు తోచలేదు.
🕉️ ఒక వారం తరువాత నేను *'అమర'* ను కలిశాను. ఆయన మొఖం పై పెద్ద నవ్వు కనిపించింది. ఆయన ఏదో చెప్పటం కోసం నా కోసం ఎదురు చూస్తున్నారు. రెండు రోజుల క్రితం, సాయంత్రం పూట నేను(అమర) భరించలేని నొప్పితో పడుకుని వున్నాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. అప్పుడు నాకు వేణు నాదం వినిపించింది. అది కిటికీలో నుండి వచ్చింది. అది ఏ రేడియోలో నుండయినా వస్తోందేమోనని నేను అనుకున్నాను. కానీ, ఆ శబ్దం మరింత దగ్గరైంది. హఠాత్తుగా నా మంచం ప్రక్కన కృష్ణ భగవానుడు కనిపించాడు. నా కోసం ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను లేద్దామనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. కృష్ణుడు నా మంచం మీద కూర్చున్నాడు. తరువాత ఆయన చేతితో నా శరీరం అంతా తల నుండి పాదాల వరకూ నిమిరి *"నేను కర్మలన్నీ దగ్ధం చేశాను. నీ నొప్పులన్నీ తొలగించాను. నీవు బాధపడవలసిన పని లేదు అన్నాడు. క్షణంలో నా నొప్పులన్నీ మాయమయ్యాయి. నేను లేదాను. కృష్ణుడు నన్ను హత్తుకుని, తరువాత అదృశ్యమయ్యాడు.
🌳 విడిపోయే ముందు *'అమర' "ఇప్పుడు నా కర్మలన్నీ తొలగిపోయాయి. నేను ఇంకా 17 సంవత్సరాలు జీవిస్తాను"* అన్నారు. *'అమర'* ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది. నాకేమీ అర్థం కాలేదు. 1982 లో ఆగష్టు 25 వ తేదీ ఉదయం ఆయనను చూడటానికి వెళ్ళాను. "ఆయన చాలా బలహీనంగా వున్నారు. కనీసం మాట్లాడలేక పోతున్నారు. *‘అమర’* నన్ను చూసి హఠాత్తుగా లేచి కూర్చున్నారు. ఆయనలో నొప్పి, బలహీనతల జాడలేమీ లేవు. *'అమర'* 45 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ఆ 45 నిమిషాలలో ఏం మాట్లాడారో ఎప్పుడూ ఎవరికీ చెప్పలేను. అవే ఆయన చివరి మాటలని అప్పుడు నాకు తెలియదు. మధ్యాహ్నం నేను తిరిగి వచ్చే సరికే ఆయన శరీరం వదిలి పెట్టారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 26* 🌷
🏵️ గొప్ప వ్యక్తుల నిడలో నివసించడం కూడా కుంచించుకుపోయిన మన ఆరాను వ్యాకోచింప చేస్తుంది.
🌳 మనం ఎక్కడ వున్నా ఏం చేస్తున్నా సమస్యలు వుంటూనే వుంటాయి. వాటితో వ్యవహరించడం వలన మనం ఎదుగుతాం, నేర్చుకుంటాం, పరిణతి పొందుతాం.
🌿 నీకు పంట బాగా పండాలంటే పొలంలోకి వెళ్ళి ధ్యానం చెయ్యి. నీ ధ్యానం ద్వారా ఉత్పన్నమయ్యే ప్రకంపనలు మంచి ఫలితాలు తెస్తాయి.
🍁 ఆగష్టు 1984 లో, కృష్ణాష్టమి తరువాత కొన్ని రోజులకు, నేను(కృష్ణానంద) ఎన్నటికీ మరచిపోలేని సుదీర్ఘ సూక్ష్మ శరీరయాన అనుభూతిని పొందాను. కృష్ణ భగవానుడు నా ముందు ప్రత్యక్షమై తనను అనుసరించమని చెప్పాడు. ఆయన పసుపు పచ్చటి పంచె కట్టుకున్నాడు. మెడ నిండా ధగధగా మెరుస్తున్న రాళ్ళ ఆభరణాలు, వివిధ వర్ణాల రాళ్ళు, పెద్ద వజ్రాలు పొదిగిన కిరీటం ధరించాడు. ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఏ కాన్వాసూ ఎప్పుడూ చిత్రించలేనంత మనోహరంగా వున్నాడు.
🍀 రెండు వైపులా చెట్లు వున్న అపరిచితమైన రోడ్డులో ఇద్దరమూ నడిచాం. కొంతసేపటి తరువాత గడ్డి మీద కూర్చున్నాము. ఆయన నాకు ఎంతో సేపు ఎన్నో విషయాలు వివరించాడు. నాకు మెలకువ వచ్చిన తరువాత వాటిలో ఏదీ గుర్తు లేదు. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంది. ఈ ప్రదేశంలోనే వుండు, దీనిని వదిలి వెళ్ళకు" అని, నాకు అర్థం కాలేదు. నేను ఆయన చెప్పేది విన్నాను. ఆయన సుపరిచితుడైననట్లుగా ఆయనతో మాట్లాడటమూ, కలిసి నడవటమూ నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. చాలా సన్నిహిత మిత్రులలాగా మేం మాట్లాడుకుంటూ నడిచాము.
🌸 తరువాత కృష్ణుడు నన్ను ఒక తెలియని చోటుకు తీసుకు వెళ్ళాడు. ఆ ప్రదేశం అంతా చెట్లతో నిండి వుంది. అక్కడ రాతి మెట్లు వున్న పెద్ద చెరువు వుంది. చాలా చక్కటి శరీర నిర్మాణం వున్న ఒక వ్యక్తి ఆ చెరువు ప్రక్కన కూర్చుని వున్నాడు. ఆయన తపస్సు చేస్తున్నాడు. కృష్ణుడు అతనిని చూపిస్తూ" ఇతను అర్జునుడు. విశ్వామిత్ర మహర్షి తాను దైవం నుండి తెచ్చిన శక్తిని ఆకాశంలోకి విసిరినపుడు, ఆ విస్ఫోటనం దగ్గర అర్జునుడు వున్నాడు. ఆ శక్తి తరంగాలు అతనిని గాయపరిచాయి. అతను మంతపుట్టే ఆ నొప్పిని భరించలేక పోయాడు. నేను ఇక్కడ కూర్చుని తపస్సు చేయమని చెప్పాను. అతను నామాట ఎప్పుడూ వింటాడు. నీ తరువాతి జన్మలో అతనిని కలుస్తావు" అని చెప్పాడు. నేను అర్జునుని వైపు మళ్ళీ చూసి అతని సొగసునూ, ప్రశాంతతనూ ఆరాధించాను.
🕉️ కృష్ణుడు నన్ను ఇంకొక ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అది పెద్ద భవంతి. మేము ఆ భవంతిలో ప్రవేశించాం. కృష్ణుడు ఒక తలుపు దగ్గరకు వెళ్ళి తట్టాడు. లోపలి నుండి ఒక స్త్రీ స్వరం ఎవరదీ? అంటూ ప్రశ్నించింది. కృష్ణుడు తన పేరు చెప్పాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. ఒక యువతి బహుశా స్నానం చేస్తూ, వుండి వుంటుంది. బట్టలు ధరించాలి అన్న ఆలోచనైనా లేకుండా వచ్చి కృష్ణుని ఆలింగనం చేసుకుంది. ఆయన నా వైపు చూసి నవ్వాడు. కృష్ణుడు నన్ను మరికొన్ని ప్రదేశాలకు తీసుకువెళ్ళి చాలా విషయాలు వివరించాడు. కానీ నాకు ఏదీ గుర్తులేదు.
🌸 ఇంకో తలం ఉనికిలో వాళ్ళు చాలా వరకు ఇక్కడి జీవితాన్ని ప్రభావితం చేసి, నిర్దేశకత్వం వహించి సహాయం చేస్తుంటారు. మరణానంతర జీవితం వుంది. మన విషయాలు ఈ జన్మతో ముగిసిపోవు. మనని మనం సవరించుకోకపోతే మన ఆలోచనలను, ఉద్వేగాలను సరిగా మళ్ళించుకోకపోతే, మనకు మనం మారకపోతే, వచ్చే జన్మలోనే కాదు ఎన్ని జన్మల తరువాతైనా కష్టాలూ, నష్టాలూ భరించక తప్పదు. మన తర్కానికి అందనిదీ, అవతలదీ ఎంతో వుంది.
🌳 నా (కృష్ణానంద) స్నేహితులలో ఒకరు ధ్యాన తరగతులలో చేరారు. మొదటి దశ తరువాత ఆయన సమాధి యోగ తీసుకుందామనుకున్నాడు. ధ్యానులు మత్తు పదార్థాలనూ, మాంసాహారాన్నీ విడనాడాలా? అని అడిగాడు. ఏనాడూ మేం ఆహారం పైనా, 'అలవాట్లపైనా ఏ నిషేధమూ విధంచలేదు. కాకపోతే మన చైతన్య విస్తరణలో, మనం సమాధి యోగ సాధన చేస్తున్నపుడు ఇవి ఆటంక పరుస్తాయని హెచ్చరించే వాళ్ళం. దాన్నే నవ్వుతూ, *"అయితే సమాధి కాకపోతే మత్తు అనేవాళ్ళం".*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 27*🌷
🍀 *'తపోనగర'*, చిక్కుగొబ్బి గ్రామానికి దగ్గరగా వున్న చిన్న పట్టణం. అది బెంగుళూరుకు 20km దూరంలో వుంది. ఈ ప్రాంతానికి ఋషులు *‘తపోనగర'* అని పేరు పెట్టారు. ఇక్కడి ప్రాధమిక చర్య తపస్సు, ధ్యానం. అది తపస్సు కోసం ఎంచుకోబడిన స్థలం. ఇంతకు ముందు యుగ చక్రంలో తపోనగర బెంగుళూరులో భాగంగా వుండేదని *'అమర'* మాతో చెప్పారు. తమ మనస్సులను నిర్మలం చేసుకోవడానికి ప్రజలు బెంగుళూరు నుండి ఇక్కడకు వచ్చే వారు. గత చక్రంలో కూడా మానవుల మనస్సులను శుభ్రపరచడానికి బ్రహ్మ లోకం నుండి ఋషులతో ప్రత్యేక శక్తులు తెచ్చి ఇక్కడ నిల్వచేసారు. నూతన కాలానికి అవసరమైన ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞాన వ్యాప్తి కోసం అప్పుడు కూడా సప్తర్షులు ఇక్కడ కేంద్రం స్థాపించారు.
🌸 భవిష్యత్తులో భూమి నెమ్మదిగా 2 డిగ్రీలు వంగుతుందని *'అమర’* మాతో చెప్పారు. ఇది ఉత్తరపు మంచు శిఖరాన్ని కరిగిస్తుంది. హిమాలయాలు సముద్రం క్రింద మునిగి పోతాయి. ఆ సముద్రం ఉత్తర భారతాన్నంతా కప్పి వేస్తుంది. అప్పుడు గంగ, యమున, సరస్వతీ నదులలో అనుసంధించబడి వుండే దివ్యసారం అంతా దక్షిణానికి, తపోనగరకు మార్చబడుతుంది. తపోనగర భవిష్యత్ త్రివేణీ సంగమం అవుతుంది.
🌳 భవిష్యత్తులో ఒక ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం వస్తుంది. ఋషులు జన్మ తీసుకుని ఇక్కడ కూడతారు. 21 శతాబ్దపు మొదటి భాగంలో కృపాచార్యుడు తన గురుకులాన్ని ఇక్కడకు మార్చుతారు. కల్కి భగవానుడు తన పని ముగించి, హిమాలయాలలో ఋషులు ఇప్పటికే ఎంపిక చేసి, సిద్ధపరచిన ప్రాంతంలో స్థిరపడబోయే ముందు భౌతికంగా తపోనగరాన్ని సందర్శిస్తారు.
🌿 ఇప్పుడు ఇక్కడ(తపోనగరం) మేము చాలా బలమైన ఆధ్యాత్మిక క్షేత్రం నిర్మించాము. 1993 నుండి పని చేస్తూ, పెద్ద గ్లోబు లాగా కన్పించే దీనిని నిర్మించాం. వాళ్ళు ఇక్కడ ప్రతిష్టించడానికి ఒక దేవతా విగ్రహం తెచ్చి దానికి మానసీ దేవి అని పేరు పెట్టారు. భిన్న తలాల నుండీ ఋషులు శక్తులను కూడగట్టడమేకాక ఇతర లోకాల నుండి ప్రత్యేక ఋషులు కూడా క్రమం తప్పకుండా వచ్చేవారు. మరొక శంబాలా స్థాపించే పరిస్థితులు నిర్మించటం కోసం శంబాలా నుండి ఇక్కడకు శక్తులు తీసుకురాబడ్డాయి.
🌏 సూక్ష్మ తలాల్లోన్ని ఇతర భూములలో హోమాలూ, యజ్ఞాలు చేసిన ప్రత్యేక ఋషులను తీసుకువచ్చి ఈ తపోనగర ఆధ్యాత్మిక క్షేత్రాన్ని బలోపేతం చేశారు. సంవత్సరాలు గడిచేకొద్దీ ప్రపంచంలోని మిగతా భాగాల నుండి సూక్ష్మ శరీర సందర్శకులు ఈ ప్రాంతానికి తరచుగా వస్తూ వుండేవారు. ఋషులు దివ్య శక్తులను భూమి మీదకు ఎప్పుడు తీసుకువచ్చినా వాళ్ళు ముందు ఇక్కడకు వచ్చి, ఈ ప్రాంతాన్నీ, మేం చేస్తున్న పనినీ ఆశీర్వదించి తరువాత తమ సాధారణ సమావేశాల కోసం హిమాలయాలకు వెళ్ళేవారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 28*🌷
🏵️ 1999, నవంబరు 24న, మరొక నక్షత్ర మండలం నుండి విశ్వామిత్ర మహర్షి నాతో(కృష్ణానంద) అనుసంధానం లోకి వచ్చి క్రిస్మస్ రోజు మమ్మల్ని సందర్శిస్తానని వాగ్దానం చేశారు. ఆ మహర్షి వచ్చేసరికి ఆయనను ఆహ్వానించటానికి *'అమర’* ఎదురు చూస్తూ వున్నారు. *'అమర'* అంత ఆనందంగా వుండటం అంతకు ముందెన్నడూ చూడలేదు. విశ్వామిత్ర మహర్షి కూడా చాలా ఆనందంగా వున్నారు. తపోనగరను నిర్మించటానికి విశ్వంలోని అన్ని వైపుల నుండీ సహాయం తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. తరువాత కొన్ని రోజులకు ఒక ప్రత్యేక యజ్ఞం నిర్వహించటానికి సత్యలోకం నుండి 18 మంది ఋషులను తీసుకువచ్చారు. అన్ని గ్రహణ దినాల్లోనూ ప్రత్యేక హోమాలూ, యజ్ఞాలూ నిర్వహించడానికి ప్రత్యేకమైన ఋషులను తీసుకువచ్చేవారు.
🍁1994, జనవరి 23 న నేను ధ్యానం చేస్తుండగా నేను ఋషిని అన్న కొత్త విషయం వెల్లడి చేయబడింది. 1994, ఫిబ్రవరి 22న నా ధ్యాన మందిరంలోకి *'అమర'*, సప్తర్షులు సూక్ష్మం శరీరాలతో వచ్చారు. వాళ్ళతో పాటు మరో ఇద్దరు సందర్శకులు వున్నారు. వాళ్ళిద్దరూ చాలా ఏళ్ళ క్రితం శరీర విరమణ చేసిన నా తల్లిదండ్రులు. అంతేకాదు, వారితో ఒక దివ్య పురుషుడు శ్రీకృష్ణుడు కూడా వున్నారు.
🌳 నాకు(కృష్ణానంద) ఒక దర్శనం కలిగించారు. సత్య లోకంలో పూర్తిగా రాళ్ళతో కప్పబడిన గుహలో నేను తపస్సు చేస్తున్నాను. నేను ఇప్పటికీ అక్కడ వున్నాననీ, కేవలం నాలో ఒక భాగం మాత్రమే ఇక్కడ వుందనీ చెప్పారు. నా పేరు అలక, ఇంకా ఎన్నో దృశ్యాలు చూపారు.
☘️ శరీరం మరణించగానే, శరీరానికి వున్న బంధాలన్నీ మరణిస్తాయి. మనం అది గుర్తించం. ఆత్మ వేరే దారిలోకి, వేరే శిక్షణ లోకి ప్రవేశిస్తుంది.
🌸 1993, డిసెంబరు 25న మేము క్రీస్తును ఆరాధించాము. అక్కడ వందలాది ఋషులు సూక్ష్మ లోక సందర్శకులు క్రీస్తు ప్రత్యక్షమైన క్షణం వందలకొద్దీ సూర్యుళ్ళు కలిసి వస్తున్నట్లు అనిపించింది. పెద్ద బంగారపు క్రాస్ లాగా ధ్యాన మందిరంలోకి దిగి వచ్చిన క్రీస్తు అక్కడ మానవ రూపం ధరించారు, ప్రేమ పూర్వకంగా మేం కూడగట్టిన శక్తి రూపంలో మా ఆరాధనను ఆయన అంగీకరించారు, మా ప్రేమను స్వీకరించారు. తండ్రిలా వెలుగు ప్రసరించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ సమూహాలను ఉద్దేశించి ప్రసంగించారు. మా పని గురించి ప్రత్యేక సూచనలు ఇచ్చారు.
🌼 ఆ సమయంలో వేరే వ్యక్తి క్రీస్తుతో అనుసంధించబడటానికి ప్రయత్నిస్తున్నారు. అది కాంతిని పరిరక్షించే దేవత. ఆ దేవత 1982 లో ఊర్ధ్వ లోకాల నుండి క్రిందకు తీసుకురాబడి మనోవతి అనే స్థలం అడుగున నిక్షిప్తం చేయబడింది. ఇక్కడ ఋషుల కార్యక్రమంలో ఆవిడ సహాయం చేద్దామనుకుంటోంది. క్రీస్తు ఆమెకు సూచనలు ఇచ్చారు.
⭐ ఆ సాయంత్రం నా గదిలో నేను(కృష్ణానంద) ఒంటరిగా కూర్చుని వుండగా వేరే నక్షత్ర మండలం నుండీ *'అమర'* అనుసంధానంలోకి వచ్చారు. అక్కడ ఆండ్రోమిడా నక్షత్ర మండలంలో తన పని పూర్తి కానందున ఉదయం క్రీస్తు వచ్చినపుడు ఆయన రాలేకపోయానని చెప్పారు. మనోవతీ దేవి మాతో అనుసంధానంలోకి రావటం ఆయనకు తెలుసు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 29* 🌷
🌿 1994 ఫిబ్రవరి, 1 *'అమర'* జన్మదినం. ఆరోజు మా విద్యార్థులందరూ కలిసి ప్రత్యేకంగా ధ్యానం చేసారు. తపోనగరలో ప్రత్యేక సందర్భాలన్నిటినీ ప్రత్యేక ధ్యానాలతో జరుపుకుంటాము. కల్కి భగవానుడు మా ప్రత్యేక అతిధి. ఋషులు ఆయనను ప్రత్యేక శక్తులతో ఆరాధించి ఆయనకు కొన్ని ప్రత్యేక ఉపకరణాలను బహుకరించారు. ఆ సమయంలో నా శరీరంలో కూడా సూక్ష్మ ఉపకరణం ఒకటి అమర్చబడింది. ప్రళయ శక్తులను విడుదల చేయటంలో కల్కి భగవానునితో కలిసి పని చెయ్యటం కోసం ప్రతి రాత్రీ ఆయన వద్దకు వెళ్ళమని ఆదేశించారు. ఆ పని కొనసాగేకొద్దీ, ఈ మూడు సంవత్సరాలలోనూ నాకు మరిన్ని ఉపకరణాలు అమర్చబడ్డాయి.
🍁 ఈ ఉపకరణాలు నా సూక్ష్మ శరీరంలోకాక అంతకంటే సూక్ష్మమైన కారణ శరీరంలో అమర్చబడ్డాయి. నా సూక్ష్మ శరీరం కానీ దానికి అమర్చబడిన ఉపకరణాలుగానీ ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం వుంది. కానీ కారణ శరీర స్థాయిలో ఋషులు తప్ప వేరెవరూ వాటిని తాకలేరు.
🍀 ఋషులతో పాటు సూక్ష్మ లోకాలలో నేను (కృష్ణానంద) ఎన్నో పనులు చేశాను మరునాడు నేను నిద్ర లేచినపుడు నేను చాలా సార్లు వివరాలు గుర్తువుంచుకునే వాడిని. అయితే చాలా సార్లు అవి గుర్తు చేసుకోవడానికి అనుమతించబడవు. ఆ జ్ఞాపకాలు ఋషులతో చేరిపి వేయబడతాయి. నా భౌతిక జీవితంలో పనికి అవసరమైనవి మాత్రమే పైకి తేబడతాయి. ఒకవేళ ఆ జ్ఞాపకాలు నా చైతన్య మానసంలో వున్నా వాటిని గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేను, ఎక్కడా నమోదు చెయ్యలేను.
🏵️ 1994 మార్చిలో తపోనగర నుండి ఇతర పరిమాణాలకు అనేక మార్గాలు లేదా సొరంగాలు నిర్మించటానికి తపోలోకం నుండి ఋషుల సమూహం ఒకటి వచ్చి ఇక్కడ చాలా రోజులు వుంది. 1994 మార్చిలో, ఋషులు గంగతో అనే మనో సామర్ధ్యాలున్న స్త్రీ తో కుండలినీ ప్రయోగాలు చేశారు. ఆమెను ఒక మంత్రం జపించమని కుండలిని ఉత్తేజమవడానికి అనుమతించారు. దాని పెరుగుదలను ఋషులు నియంత్రించి, నన్ను పరిణామాలు నమోదు చేయమని. కోరారు. ఈ ప్రయోగాలు ఇరవై రోజుల పాటు కొనసాగాయి, ప్రతి రోజూ కుండలిని మరింత పెరిగేది. గంగ అసౌకర్యాన్నీ, నొప్పినీ అనుభవించింది. ఒకోసారి ఆమె తనలో శక్తులు సమకూడటాన్నీ, ఆశీర్వాదాన్నీ అనుభూతి చెందింది. ఋషులు ఆ శక్తిని తీసి వాటిని భూమి అడుగున నిక్షిప్తం చేశారు. వాళ్ళు నొప్పిని కూడా తొలగించారు.
🕉️ ఆ వ్యాప్తిని ఆమె శరీరం భరించలేకపోవటం వలన ఆ ప్రయోగం నిలిపివేయబడింది. చాలా విలువైన కుండలినీ శక్తి గురించి భవిష్యత్ యోగులకు సహాయపడే ఎంతో సమాచారాన్ని ఋషులు అందించారు. ఆ తరువాత నేను ఆ ప్రయోగాన్ని కొనసాగించి కుండలిని గురించి వ్రాయవలసివచ్చింది.
🌸 సెప్టెంబరు 9, 1994 న సూక్ష్మ తలంలో సప్తర్షులు, ఇంకా అనేక మంది ఋషులు సమక్షంలో పెద్ద ఉత్సవం జరిగింది. ఉత్సవ అంతంలో నన్ను అగ్ని జ్వాలల మధ్యలో నుంచుని ప్రమాణం చెయ్యమన్నారు. నేను అందరి సంక్షేమం కోసమూ ఋషులతో కలసి పని చేస్తానని. నాకు ఇపుడు వున్న శక్తులను కానీ, భవిష్యత్ లో పొందబోయే శక్తులను గానీ వ్యక్తిగతంగా ఉపయోగించననీ, ప్రమాణం చేశాను. అప్పుడు ఋషి పరంపరలోని తరువాతి స్థాయికి నన్ను చేర్చామని తెలిపారు.
🌳 అప్పటి నుండి ధ్యానులను, కాంతి సేవకులనూ కొన్ని సార్లు శంబాలాకు తీసుకువెళ్ళి సూక్ష్మ తల కార్యక్రమాల్లో శిక్షణను ఇచ్చే వాడిని. దివ్య తలాల నుండి తీసుకువచ్చిన శక్తులను భూమి మీద పంచే కార్యక్రమం స్వంతంగా చేపట్టే వాడిని. ఎన్నో పనులు స్వతంత్రంగా చేశాను. 1994, నవంబరు 30న నా సూక్ష్మ తెర పై కృష్ణ భగవానుడు ప్రత్యక్షమై *"నీవు ఇంకో 3 సంవత్సరాలు మాత్రమే జీవిస్తావు”* అని చెప్పాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 30* 🌷
🌹సమాధి యోగలో ఉన్న ఒక విద్యార్థిని ధ్యానంలో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. కొంత కాలం పాటు అంగుళం అభివృద్ధి కూడా సాధించలేదు. ఋషులు ఆమె సమస్యను పరిశీలించి, ఆమె తన గత జన్మలలో ఒక దానిలో ఆమె గురువు తన పట్ల అసంతృప్తి పొందారని కనుగొన్నారు. గురువు ఆమెని శపించలేదు. కానీ ఈ జన్మలో ఒక దశ తరువాత ఆమె ఆధ్మాత్మిక పురోగతిని ప్రభావితం చేయటానికి ఆయన అసంతృప్తి చాలు. ఆగురువు వేరే లోకంలో తపస్సు చేసుకోవడం ఋషులు కనుగొన్నారు. ప్రగాఢ లోతుల్లో వారు ఆయనతో అనుసంధానం ఏర్పరచుకుని ఆమె సమస్య గురించి చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. తన అసంతృప్తి నిరోధాన్ని కలిగించిందని ఆయనకు తెలియదు. వెంటనే ఆయన సమాధి స్థితి నుండి బయటకు వచ్చి, తన తపశ్శక్తితో ఆమె నిరోధాన్ని తొలగించి, ఆమెను ఆశీర్వదించాడు. ఆ తరువాత ఆమె తేలికగా ధ్యానం చేసి, త్వరితంగా అభివృద్ధి చెందింది.
🍀 ఒక విద్యార్ధి తరచూ తీవ్రమైన తల నొప్పి అని చెప్పేవాడు. అన్ని రకాల మందులూ నిరుపయోగమయ్యాయి. ఋషులు పరిశీలించి సూక్ష్మ శరీరంతో ఉన్న పాము అతనికి తలనొప్పి తెప్పిస్తోందని కనుగొన్నారు. అతను తన గత జన్మలో ఆ పాము ఏమీ చెయ్యకుండానే దానిని చాలా ఘోరంగా చంపాడు. ఋషులు ఆ పాముతో మాట్లాడినపుడు అది అతనిని బాధించకుండా వుండటానికి ఇష్టపడ లేదు. ఋషులు దానిని తవ లోకానికి తీసుకువెళ్ళి, ముక్తిని ప్రసాదిస్తామని వాగ్దానం చేశారు. అప్పుడు ఆ పాము అతనిని వదలి వెళ్ళటానికి అంగీకరించింది. ఆ తరువాత అతనికి తలనొప్పి రాలేదు.
🌳 ఒక వ్యక్తి విచారకర పరిస్థితులలో మరణించవలసిన సమయానికంటే ముందే మరణించి హత్యలు చేసే దెయ్యంగా మారాడు. కుటుంబంలో ఎన్నో మరణాలకు కారణమయ్యాడు. ఆ ఇంట్లో వారికి అతను కుటుంబం మొత్తాన్నీ తుడిచి పెడతానని చెప్తూ భయపెడుతున్నట్లు కలలు వచ్చేవి. వాళ్ళు సహజంగానే భయపడ్డారు. ఆ కుటుంబ సభ్యులలో ఒకరు నా(కృష్ణానంద) విద్యార్థి. ఋషులు ఆ దెయ్యంతో మాట్లాడి ఎవరికీ హాని చెయ్యవద్దని కోరారు. అతను వారి మాట వినడానికి తిరస్కరించాడు. అక్కడ నుండి సరియైన చోటుకు అతని ప్రయాణంలో తోడ్పడతామని చెప్పిన మాట వినలేదు. చివరగా ఋషులు ఇక మీదట చంపటాన్ని అనుమతించమని, శిక్షిస్తామనీ అతనిని హెచ్చరించారు. అతను తప్పనిసరిగా ఆ చోటు వదిలి పెట్టాడు కానీ ఋషులతో కలవలేదు. అతను చీకటి సముహంతో చేరి, చంపటానికి మళ్ళీ వస్తానని చెప్పాడు. ఆ తరువాత మరణాలూ లేవూ, కలలూ లేవు . కొన్ని నెలల తరువాత ఒక కలలో ఆ హంతక దెయ్యం ప్రత్యక్షమై తను ఇప్పుడు సప్తర్షులతో ఉన్నాననీ ఆనందంగా ఉన్నానని చెప్పింది .
🕉️ అనుభవాలు రావటం మంచిదే, కానీ అవే అంతిమం కాదు. అవి లక్ష్యమూ కాదు. అవే కొలమానాలూ కాదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 31*🌷
🏵️ 1997, ఆగష్టు 27న భీష్ముడు మా తపోనగరాన్ని సందర్శించారు. ఋషుల కార్యం కొనసాగిస్తున్నందుకు ఆయన మా పట్ల ఎంతో ఆనందం వ్యక్తపరిచారు. సరియైన సమయంలో మళ్ళీ వస్తానని చెప్పి, మమ్మల్ని ఆశీర్వదించి ఆయన వెళ్లిపోయారు.
🌿 మానవ శరీరంలో ఉన్న ఒక నాగ దేవత 20 సంవత్సరాలకు పైగా ఋషుల కార్యంలో చాలా సన్నిహితంగా పాలుపంచుకుంటూ వుండేది. తన ప్రత్యేక శక్తులతో చీకటి వ్యక్తుల దాడుల నుండి ఋషులను రక్షించేది. ఆమె తపోనగరను కాపలా కాస్తోంది. ఒకసారి నేను(కృష్ణానంద) ఒక పనిలో వున్నపుడు చీకటి వ్యక్తులు నన్ను పట్టుకున్న సందర్భంలో అవిడ ఉగ్ర రూపంతో వేగంగా రావటం చూసి వాళ్ళు నన్ను వదిలి పరుగెత్తిపోయారు.
🌼 ఋషులు ఆమెకు ఎల్లవేళలా తన జీవితంలోని అతి చిన్న విషయాలలో కూడా సహాయం చేసే వారని నేను తెలుసుకున్నాను. ఆవిడ ఎన్నో ప్రమాదాలకు గురయినా, ప్రతిసారీ వాళ్ళు ఆమెను మృత్యువు నుండి రక్షించేవారు.
🌸 1997 ఆరంభంలో నేను(కృష్ణానంద) హృదయ భాగంలో తరచుగా తీవ్రమైన నొప్పికి గురి అయ్యేవాడిని. 1997 మేలో ఏంజియోగ్రాఫ్ తీస్తే, ముఖ్య ధమనిలో పెద్ద అడ్డంకి కనబడింది. మందులూ, ఆహార నియమాలు ఏర్పడ్డాయి. ఆగష్టు 1997 లో ఋషులు నేను నవంబరు 12, 1997 వరకు మాత్రమే జీవిస్తానని ఖచ్చితంగా చెప్పారు. నేను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా, భవిష్యత్ కార్యక్రమాల గురించి సూచనలు వ్రాసి, ఆ రోజు కోసం సిద్ధపడిపోయాను. కానీ అక్టోబరు 1997 లో ఋషులు నా జీవితాన్ని పొడిగించామని నాతో చెప్పారు. అయితే ఎన్ని రోజులు లేదా సంవత్సరాలు పొడిగించారో మాత్రం చెప్పలేదు. నేను వారిని అడగలేదు.
☘️ డిసెంబరు 27, 1997 న నాకు రెండు దర్శనాలు కన్పించాయి. ఒకటేమో 'నల్లటి క్రాసు, రెండవదేమో నా శవం ఉన్న శస్త్రచికిత్స బల్ల. 3 సంవత్సరాలు క్రితం నేను మూడేళ్ళు మాత్రమే జీవిస్తానని శ్రీ కృష్ణుడు ఇచ్చిన సందేశం గుర్తు తెచ్చుకున్నాను. నన్ను నేను సిద్ధం చేసుకుని, మరణం కోసం ఎదురు చూశాను. శరీరం వదిలే సమయం ఆసన్నమైందని గుర్తించాను. శస్త్ర చికిత్సా నిపుణుడు ఏంజియోగ్రాఫ్ చిత్రం చూద్దామనుకున్నాడు. ఆయన ఆ చిత్రం చూసినపుడు ఏ అడ్డంకీ కనపడ లేదు. నాకు హృదయ సంబంధమైన సమస్య ఏదీ లేదని ఆయన ప్రకటించాడు.
🌷 ఆ దర్శనాల గురించి కానీ, అడ్డంకి అదృశ్యమవటం గురించి కానీ ఋషులు ఏమీ వివరించ లేదు. నేను ఆ విషయం గురించి వారిని అడిగితే వారు నవ్వి ఊరుకున్నారు. మరణానికి చేరువ అవటం నన్ను హెచ్చరించి, మరణం పట్ల మానవ అనుభూతులు తెలిపి నేను గడిపిన ప్రతి క్షణమూ ఎంత విలువైనదో తెలియచేసింది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🔺 *కాంతి ద్వారాలు (Doorways to light) ----> గురూజీ కృష్ణానంద(మహర్షి అమర, సప్త ఋషులు)* 🔺
🌷 *Part -- 32* 🌷
🕉️ 1997 డిసెంబరు 25న విశ్వామిత్ర మహర్షి అనుసంధానంలోకి వచ్చి *"నేను నూతన యుగం కోసం నూతన ధ్యాన పద్ధతులు ఇస్తున్నాను వ్రాసుకో "* అని చెప్పారు. అరగంటకు పైగా నేను వాటిని వ్రాసుకున్నాను. *"1998 లో నువు చాలా కష్టపడి పని చేయవలసి వుంటుంది. ప్రతి ఒక్కరికీ అది చాలా కష్టమైన సంవత్సరం”* అని చెప్పారు ఆయన. నేను చాలా సేపు ధ్యానం చేశాను. ఆ గదిలో ఒంటరిగా కూర్చుని త్వరలో క్రొత్త యుగం ఉదయిస్తుందని గుర్తించాను. ఋషులు దానికోసం కృషి చేస్తున్నారు. అసత్యపు వలలో చిక్కుకుని సమయం వృధా చేయకుండా మన హృదయం తెరచుకుని ఎదగాలి.
🕉️ ఈ జీవితానికి ముందూ జీవితం వుంది. దీనికి తరువాతా వుంది. భౌతికం శరీరంతో పాటు మనం మరణించం. మనం మన సూక్ష్మ శరీరాలతో జీవిస్తాం.
👽 ఇంకా అనేక ఇతర తలాలు ఉన్నాయి. పరిమాణాలు ఉన్నాయి. అక్కడా *"మనకు వలెనే మనుష్యులు జీవిస్తున్నారు. విజ్ఞాన శాస్త్రపు కల్పిత పుస్తకాలలో వున్న ఆకు పచ్చటి మనుష్యులు కాదు. అన్ని విజ్ఞాన శాస్త్రాలలోనూ వాళ్ళు మరింత పురోగతి చెందిన వారు మరింత నాగరికులు, మరింత మేధావులూ. అంతే కాదు వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు, దయార్ద్ర హృదయులు, ప్రేమ మూర్తులు. వాళ్ళు ఈ జన్మలోనూ, తదుపరి జన్మలలోనూ మనకు ఎంతో సహాయం చేస్తారు.
🏵️ ఋషులు కేవలం పురాణ పాత్రలు కాదు. వాళ్ళు వున్నారు. కొంతమంది ఇక్కడ ఈ భూమి మీదే వుంటే, చాలామంది ఊర్ధ్వ లోకాల్లో వున్నారు. విశ్వ మేధా శక్తితో పని చేసే గొప్ప కాంతి జీవుల వ్యవస్థలో వాళ్ళు భాగాలు. ఎవరైనా సూక్ష్మ శరీరంతో వారితో అనుసంధింపబడి నిర్దేశకత్వమూ, సహాయమూ పొందవచ్చు.
🧘ధ్యానం మన ఎరుకను విస్తరించుకోవటంలో మొదటి మెట్టు. మిగిలిన మార్గాలన్ని ఉన్నత మార్గమైన ధ్యానానికి సిద్ధపరుస్తాయి. ధ్యానాలన్నీ సమాధి అనుభవానికి దారి తీస్తాయి. ఈ స్థాయి నుండీ ధ్యాన మార్గాలన్నీ ఒకే మార్గం సమాధి మార్గంలో కలిసి పోతాయి. మనం సమాధిలో మన ఎరుకను దాని విశ్వ పరిధి వరకూ విస్తరిస్తాం. దైవాన్ని అనుభూతి చెందుతాం. ఈ అనుభవం మనకు, పరమ జ్ఞానాన్నిస్తుంది. అది మనకు అత్యున్నత శాంతిని తెస్తుంది. అది మనకు వివేకాన్నీ సత్యపు వెలుగులో జీవించగల అపరిమిత శక్తినీ తెస్తుంది. మనలోని ప్రతికూలతలన్నీ తొలిగి అనుకూలతలకు దారినిస్తాయి. జీవితం మధుర, మనోహరానుభూతిగా మారుతుంది.
🌸 ఋషులు, నిర్దేశకులు, అధిపతులు, ప్రతి ఒక్కరికీ వెలుగు వైపు మార్గదర్శకత్వం వహిస్తారు. వారే మన కాంతి ద్వారాలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *కాంతి ద్వారాలు పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
🌹 🙏 THE END 🙏🌹
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
No comments:
Post a Comment