Saturday, August 26, 2023

నిగూఢ రహస్యాలు (ఓషో) దేవాలయాల గురించి వెలుగు చూడని రహస్యాలు Chapter - 1

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺  *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 1* 🌹
🌹 *దేవాలయాల గురించి వెలుగు చూడని రహస్యాలు* 🌹
🌸 *Part --1*🌸

🌼 దేవాలయాల గోపురాలు ఆకాశాన్ని నమూనాగా తీసుకుని కట్టినవే. దీనికి ఒక సిద్ధాంతం వుంది. ఆకాశం క్రింద కూర్చుని *'ఓమ్'* అని పునశ్చరణ చేస్తే, నేను ఉచ్చరించింది వినిపించకుండా పోతుంది, ఎందుకంటే వ్యక్తిగతమైన నా ఉచ్ఛరణ యొక్క బలం విస్తృతమైన ఆకాశంలో విలీనమవుతుంది. నా మంత్రోచ్చారణ యొక్క ప్రతిధ్వని నాకు వినిపించదు - నా ప్రార్థనలన్నీ విశాలమైన ఆకాశంలో కలసిపోతాయి. 

🌿 మన ప్రార్ధనల ప్రతిధ్వనులు మళ్ళీ మనను చేరుకునేలా దేవాలయాల గోపురాలు నిర్మించబడ్డాయి. గోపురం ఒక చిన్న అర్థవృత్తాకారంలో అమర్చిన ఆకాశపు నమూనా. దానిది నాలుగు వైపుల నుండి భూమిని తాకే ఆకాశం యొక్క ఆకృతే. ఆ కప్పు క్రింద జరిపే ప్రార్థనలు లేదా లయబద్ధమైన మంత్రోచ్ఛారణ, అనంతమైన ఆకాశంలో ప్రతిధ్వనించకుండా పోవు. ఎందుకంటే వాటిని పైకప్పు ప్రార్థిచేవానివైపు మళ్ళిస్తుంది. పైకప్పు ఎంత గుండ్రంగా వుంటే, అంత తేలికగా ధ్వని వెనక్కి ప్రయాణిస్తుంది. ప్రతిధ్వని అదే నిష్పత్తిలో పెరుగుతుంది. కాలగమనంలో రాయికి కూడా అద్భుతంగా ప్రతిధ్వనిని పెంచే గుణం వుందని కనిపెట్టారు. 

🍁 అజంతా గుహలలో ఒక బౌద్ధ ప్రార్థనాలయం వుంది. భారత దేశంలోని సంగీత వాయిద్య పరికరం అయిన తబలాలా, అక్కడి రాళ్ళు ఎంతో తీవ్రంగా ప్రతి ధ్వనిస్తాయి. తబలాని ఎంత బలంగా కొడతామో, అంత బలంగా ఈ రాళ్ళని కొడితే, అవి అంతే పరిణామంలో శబ్దాన్ని ఇస్తాయి. పై కప్పుల నిర్మాణంలో వాడే మామూలు రాయికి సూక్ష్మమైన శబ్దాలను ప్రతిధ్వనించే శక్తి లేదు, అందుకే ఈ ప్రత్యేకమైన రాయిని వాడారు. దీని వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ఎవరైనా *'ఓమ్'* ని లయబద్ధంగా, తీవ్రంగా ఉచ్ఛరిస్తే, దేవాలయం పైకప్పు ఆ శబ్దాన్ని ప్రతిధ్వనింపచేయడమే కాకుండా , ప్రతిధ్వనిని వలయంగా అమరుస్తుంది. దేవాలయం పైకప్పు యొక్క స్థూల రూపపు ఆకృతి, ప్రతిధ్వనించే శబ్దాన్ని వలయాకారంగా రూపొందించడానికి సాయం చేస్తుంది. ఆ శబ్దవలయం ఒక పరమానందకరమైన అనుభవం. విశాలమైన ఆకాశం క్రింద *'ఓమ్'* ని లయబద్దంగా ఉచ్చరించినా శబ్దవలయం ఏర్పడదు, ఆ పరమానందాన్ని నువ్వు ఎప్పటికీ అనుభవించలేవు. 

☘️ గోపురం ఆకారంలో వున్న దేవాలయాలు, మంత్రోచ్చారణ ద్వారా శబ్ద వలయాలను సృష్టించడానికి ఉపయోగపడ్డాయి. అక్కడ ఒంటరిగా, పరిపూర్ణ ప్రశాంతతతో, మౌనంలో కూర్చుని లయబద్ధంగా మంత్రోచ్ఛారణ చేస్తే, వలయం ఏర్పడగానే ఆలోచనలు ఆగిపోతాయి. ఒక ప్రక్కవలయం ఏర్పడుతుంది, మరొక ప్రక్క ఆలోచనలు ఆగిపోతాయి. నేను తరచుగా చెప్పినట్లు స్త్రీ, పురుష సంభోగంలో కూడా శక్తివలయం ఏర్పడుతుంది. ఆ వలయం ఏర్పడినప్పుడు ఆ క్షణమే, అతీత చైతన్యానికి దారి చూపిస్తుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర Osho,Patriji ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺  *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 1* 🌹
🌹 *దేవాలయాల గురించి వెలుగు చూడని రహస్యాలు* 🌹
🌸 *Part --2*🌸

☘️ పద్మాసన లేదా సిద్ధాసన భంగిమలో కూర్చుని వున్న బుద్ధుడు, మహా వీరుడు విగ్రహాలను చూడండి. ఆ వలయాలు తయారుకావడానికి వీలైన వేరే పద్ధతులని అవి తెలియజేస్తున్నాయి. రెండు పాదాలు దగ్గర పెట్టి, కాళ్ళ పై చేతులు పెట్టి కూర్చున్నప్పుడు శరీరం అంతా ఒక వలయంగా పనిచేస్తుంది. అప్పుడు శరీరపు విద్యుత్తు బయటికి పోలేదు. ఒక ప్రవాహ మార్గం (సర్క్యూట్) సృష్టించబడుతుంది.  ఈ సర్క్యూట్ తయారవగానే ఆలోచనారహిత స్థితి వస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ భాషలో చెప్పాలంటే, మనస్సులో రొద చేసే ఆలోచనల గుంపు ఉండటానికి కారణం, మనం అంతరంగ విద్యుత్ సర్క్యూట్ ని ఏర్పాటు చేసుకోకపోవడం వల్లనే. ఆ సర్క్యూట్ ని నిర్మించిన వెంటనే లోపల వున్న శక్తి క్రమబద్ధం అయి, నిశ్శబ్దం ఏర్పడుతుంది. కాబట్టి, దేవాలయం కప్పు సాయంతో శక్తివలయాన్ని తయారు చేయడం ఒక గొప్ప ప్రక్రియ.

🌳 దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద పెద్ద గంటలు లేదా జేగంటలు వుండడం చూస్తాం. వాటి ప్రయోజనం కూడా అదే. *'ఓమ్'* ని నువ్వు ఎంత ప్రశాంతంగా, లయబద్దంగా ఉచ్చరించినా నీ మనస్సు మరెక్కడో ఉండవచ్చు. ఆ గంట శబ్దం తక్షణమే నీ మనస్సుని ప్రతిధ్వని వల్ల ఏర్పడిన శబ్దవలయం వైపుకి తీసుకువస్తుంది. ఒక సరస్సులోకి రాయి విసిరితే అల తరువాత అల ఎలా సృష్టించబడుతుందో అలాగే. నీలోని ప్రతి అణువు ఆ ప్రకంపనాన్ని స్వీకరించి, మరింత తీవ్రంగా ఆ ధ్వనిని బలపరచి తిరిగి ఇస్తుంది.

🌿 ధ్వని సూక్ష్మమైన విద్యుత్తు అని మనం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం కూడా దీనిని అంగీకరించింది. నిజానికి, ప్రతీదీ విద్యుత్తు యొక్క రూపమే. కానీ భారత దేశంలోని ఋషులు ఒక అడుగు ముందుకు వేసి, విద్యుత్తు శబ్దం యొక్క రూపం అని, పునాది ధ్వనియే అని, విద్యుత్తు కాదు అని అన్నారు.
శాస్త్రవేత్త విద్యుత్తు ప్రాధమికం అంటే, ఋషి ధ్వని యొక్క సాంద్రతే విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది అంటాడు.

🍁 శబ్ద రూపాంతర పరిణామ అనుభవాన్ని పొందడానికే గోపురం ఆకారంలో దేవాలయాలను కట్టారు. దేవాలయాలకు ఎక్కువ తలుపులు, కిటికీలు ఉండకూడదు. ఒకే తలుపు, అందువా చాలా చిన్నది ఉండ వచ్చు. దేవాలయంలో సృష్టించబడిన శబ్దవలయం తగ్గకుండా భద్రపరచాలి అన్నది దాని వెనుక వున్న ఉద్దేశ్యం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర Patriji,Osho ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺  *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 1* 🌹
🌹 *దేవాలయాల గురించి వెలుగు చూడని రహస్యాలు* 🌹
🌸 *Part --3*🌸

🍀 *'ఓమ్'* మంత్రాన్ని ఉచ్చరించటం వలన వచ్చిన శబ్దానికి ఒక విశిష్టమైన పరిశుద్ధపరిచే గుణం వుందని క్రమేణా గుర్తించారు. కొన్ని పరిశుద్ధపరిచే శబ్దాలు వున్నాయి, మరికొన్ని కలుషితపరిచే శబ్దాలు వున్నాయి. కొన్ని శబ్దాలు రోగాలని ఆటంకపరిస్తే , మరికొన్ని వాటిని ఆహ్వానిస్తాయి .

🌳 కొన్ని శబ్దాలు పాలిచ్చే తల్లులలో పాలను వృద్ధి చేస్తాయని నిరూపించారు. పుష్పించడానికి 6 నెలలు తీసుకునే మొక్కలను కొన్ని శబ్బాల ద్వారా 2 నెలలకే పుష్పింప చేయవచ్చు; పాలు పితికేటప్పుడు మృదువైన సంగీతాన్ని వినిపిస్తే ఆవులు పాలు ఎక్కువ యిస్తాయి. పళ్ళు, కూరగాయలు, పాలు శబ్దంతో ప్రభావితం అయితే, మనం ప్రభావితం కామా?

🌿 ఓమ్' అనే మంత్రంలో అర్థం గురించిన ప్రశ్నే లేదు. దాని ధ్వని ఆధారిత ప్రభావం ఒక ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక ధ్యాని *'ఓమ్ మణి పద్మే హమ్'* అన్న మంత్రాన్ని పదే పదే పునశ్చరణ చేస్తే, ఆ శబ్దం వివిధ చక్రాల పై పని చేసి, వాటిని చైతన్యవంతం చేస్తుంది. అర్థం గురించిన ప్రశ్నే లేదు - దానికి శబ్దాల ప్రాముఖ్యతతోనే సంబంధం ఉంది. ఓమ్ మంత్రానికి అర్థం లేదు కానీ ఉపయోగం ఉంది; దేవాలయానికి అర్థం లేదు కానీ ఉపయోగం ఉంది.

☘️ భాషాధ్వనుల ఉచ్చరణ నీకు పూర్తిగా తెలిస్తే తప్ప, నువ్వు మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ ఉంటావే తప్ప అది నీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు.

🍁 ఒక చీకటి రాత్రి, దేవాలయం ప్రక్క నుంచి నువ్వు వెళుతున్నావని అనుకో; నీలో అకస్మాత్తుగా ఏదో మార్పు నువ్వు గమనిస్తావు... ఏదో చెడ్డ పని చేయాలని నువ్వు అనుకుంటున్నావు, అకస్మాత్తుగా నీ ఆలోచనలు మారతాయి. ఎవరినో చంపాలని అనుకుంటున్నావు, నువ్వు అకస్మాత్తుగా కనికరంతో నిండిపోతావు. దేవాలయం, దానిలోని ప్రతి ఇటుక, రాయి, ద్వారాలు, వాకిలి ద్వారాలు అన్నీ  శక్తితో నింపబడితేనే ఇది సంభవిస్తుంది. అప్పుడు దేవాలయం అంతా సజీవ ప్రకంపనాలతో నిండి ఉంటుంది. గంట శబ్దం రోజంతా దేవాలయాన్ని శక్తితో నింపుతుంది. *'ఓమ్'* శబ్దం కూడా దేవాలయాన్ని ప్రకంపనాలతో నింపుతుంది. దేవాలయంలో ఇలాంటివి ఇంకెన్నో ఉపయోగించారు; వాటికి అంతర్గతంగా సంబంధాలు ఉంటాయి. అది నేతితో నింపిన ప్రమిద కావచ్చు, ధూప సమర్పణ కావచ్చు, గంధపు ముద్ద, పువ్వులు లేదా వేరే పరిమళం - అన్నీ పరస్పర సంబంధం ఉన్నవే.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌼 *"నిగూఢ రహస్యాలు"* పుస్తకాలు మరియు *ఇతర Osho, Patriji ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺  *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 1* 🌹
🌹 *దేవాలయాల గురించి వెలుగు చూడని రహస్యాలు* 🌹
🌸 *Part --4*🌸

🌼 మసీదులో ధూపం వేయడానికి *'లోభన్'* అనే పరిమళ గుగ్గిలాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. దేవాలయంలో ధూపం, సాంబ్రాణి పరిమళాలను ఉపయోగిస్తారు. వీటన్నిటికీ శబ్దంతో సంబంధం ఉంది. *'అల్లా'* అనే శబ్దానికి, లోభన్ పరిమళానికి అంతర్గత సామరస్యం ఉంది. పరమ పదం కోసం చేసిన అంతర్గత శోధనలో; ఈ అనుసంధానాలు లేదా బంధాలు వెల్లడి అయ్యాయి. ఆలోచనల ద్వారా వాటిని కనుక్కోలేదు. ప్రతి మంత్రం ఒక పరిమళాన్ని సృష్టిస్తుంది.

🍀 ఎప్పుడైనా అంతర్ నేత్ర అనుభవం తీవ్రమైనప్పుడు, చందనపు సువాసన వస్తుంది; కాబట్టి చందన పరిమళం, ఆ అనుభవానికి సంకేతం అయింద, అందుకే చందనాన్ని నుదుటికి పూస్తాం. ఆజ్ఞా చక్రం ఈ పరిమళాన్ని వెదజల్లినప్పుడు, ఒక మంచు ముక్కని మూడవ కంటి పై పెట్టుకున్నట్లు ఒక రకమైన చల్లదనం అనుభవిస్తావు.

🍁చన్నీటితో స్నానం చేస్తే యాంత్రికత, ఆలోచనల కలయిక తెగుతుంది. గంట కొట్టకుండా ఎవ్వరినీ దేవాలయంలోకి ప్రవేశించనీయరు. జీర్ణ వస్త్రాలతో, మురికి బట్టలతో దేవాలయంలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు; దేవాలయానికి వెళ్ళేటప్పుడు నిజానికి పట్టు వస్త్రాలు ధరించాలి, ఎందుకంటే శరీరంలో విద్యుత్తు ఉత్పత్తి కావడానికి, దాన్ని కాపాడడానికి పట్టు సహాయ పడుతుంది. అందుకే పట్టు వస్త్రాలు నువ్వు ఎన్నిసార్లు ధరించినా కొత్తగానే ఉంటాయి.

🌿 మహా వీరుడి చుట్టూ కొంత పరిధిలో - అతడు ఎక్కడ ఉన్నా - హింస జరిగే అవకాశమే ఉండదని అంటారు. అది అతడి శక్తి క్షేత్రం. ఏదో ఒక చెడ్డ ఘటన జరిగిందంటే అర్థం ఆ క్షేత్రం పవిత్రత కోల్పోయిందని.

🌳 దేవాలయం చుట్టూ ప్రకంపనాలతో నిండిన శక్తి క్షేత్రం ఉంటుంది . అది ఆ గ్రామం మొత్తాన్ని ఉపయోగకరంగా ప్రభావితం చేస్తుంది. ఇది కల్పన కాదు; ఫలితాలు నిజంగా సాధించబడ్డాయి. వేలాది సంవత్సరాలుగా భారత దేశంలోని గ్రామాల ప్రత్యేకత అయిన నిరాడంబరత, అమాయకత్వం, స్వచ్ఛత ఎక్కువగా అక్కడ ఉన్న శక్తి క్షేత్రాలైన దేవాలయాల వలనే తప్ప, గ్రామాల వలన కాదు. ఎంత పేద గ్రామం అయినా, దానిలో దేవాలయం తప్పనిసరి అవసరం. దేవాలయం లేకపోతే పొందిక లేనట్లు ఉంటుంది, అంతా గందరగోళమే. భారత దేశంలోని రసవాదం అంతా దేవాలయంలోనే ఉంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌼 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣


No comments:

Post a Comment