తప్పక చదవండి🌺🌺🌺
తెలివైన మోసం !
జనవరి నుంచి మే నెల దాక , కార్పొరేట్ సంస్థలకు బయట విద్యార్థుల పై అమిత ప్రేమ కనిపిస్తుంది . కరోనా కాలం లో తమ సొంత టీచర్ లను జాబ్ నుంచి తీసేసి , వారు కాయగూరలు మొదలైనవి అమ్ముకొనేలా చేసి , సగం
మంది టీచర్ లను మాత్రం డ్యూటీ లో ఉంచి, వారికి కూడా సగం జీతాలు ఇచ్చి... పంతుళ్ళ పొట్టలు కొట్టిన కార్పొరేట్ సంస్థలు.... కోట్లాది రూపాయిల స్కాలర్షిప్ టెస్ట్ లు నిర్వహిస్తాయెందుకు ?
"రండి ! ఫ్రీ స్కాలర్షిప్ రాయండి . అది కూడా ఓ ఆదివారం . కోట్లాది రూపాయిలు గెలుచుకొనే అవకాశం!" అని ఫుల్ పేజీ ప్రకటనల తో ఊదర కొట్టేస్తాయెందుకు ?
మెరిట్ విద్యార్థుల పై అంత ప్రేమ ఉంటే తమ సంస్థలో ఇది వరకే చదువుతున్న విద్యార్థులకు ఇవ్వొచ్చు కదా ?
చదవండి !
ఆయన ఒక ఉద్యోగి . తన కొడుకు ఒక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు . చక్కగా మాట్లాడగలడు . మంచి మార్కులు వస్తున్నాయి . స్కూల్ చక్కటి విద్యనందిస్తోంది అని భావిస్తున్నాడు . పత్రికలో వచ్చిన ప్రకటన చూసాడు . "అబ్బే .. ఇందులో ఏదో మోసం వుంది" అనుకొన్నాడు . కార్పొరేట్ సంస్థలపై తనకు పెద్దగా నమ్మకం లేదు.
కానీ ఒక ఆదివారం తన కొడుకును తీసుకొని వెళ్లి టెస్ట్ రాయిస్తే తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా ? టెస్ట్ కోసం ఫీజు కూడా లేదు . ఒక టెస్ట్ రాసిన ప్రాక్టీస్ వస్తుంది . అన్నిటికి మించి తన కుమారుడి స్టాండర్డ్ ఏంటో అర్థం అవుతుంది అనుకొన్నాడు . టెస్ట్ కు అప్లై చేసాడు . టెస్ట్ రాసే రోజు వచ్చింది .
టెస్ట్ రాసి అబ్బాయి బయటకు వచ్చాడు ." ఏరా! ఎలా రాసావు ?" అడిగాడు తండ్రి . ఏమో డాడీ! . అన్ని కస్టమైన ప్రశ్నలు వచ్చాయి . నాకు తెలిసింది రాసాను " చెప్పాడు బాబు ." సరేలే" అన్నాడు అన్నాడు తండ్రి . ఆ విషయాన్ని అంతటితో మరచి పోయాడు .
వారం దాటక ముందే అబ్బాయి రాసిన టెస్ట్ రిజల్ట్ చేతికి వచ్చింది . అందులో తన కుమారుడు నూటికి నలబై మార్కులు సాధించాడు . తన కాళ్ళ కింద భూమి గిర్రున తిరిగినట్టు అయ్యింది . " ఇదేంటి ? వీడికి, వీడి స్కూల్ లో ఎప్పుడు నూటికి 99 , లేదా కనీసం 95 వచ్చేది . సర్ మీ అబ్బాయి చక్కగా చదువుతాడు అంటూ టీచర్స్ కితాబు ఇస్తారు . ఇక్కడేమో నూటికి మరీ దారుణంగా నలబై వచ్చింది ??" ఆందోళన పడసాగాడు .
అప్పుడే ఆ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది . " సర్ .. చూసారా .. మీ అబ్బాయి మార్కులు ? ఏదో సదా సీదా స్కూల్ లో చదివిస్తే అలాగే ఉంటుంది సర్. అక్కడ బుక్ లో ఉన్నదే చెబుతారు . ఐఐటీ ఎంట్రన్సు అలాగుండదు . చాలా లోతైన ప్రశ్నలు అడుగుతారు . మా స్కూల్ లో ఐఐటీ స్థాయి లో చెబుతాము . మీ అబ్బాయి అక్కడే చదివితే పరిస్థితి ఇలాగే ఉంటుంది . రోజురోజుకు దిగజారిపోతోంది . ఐఐటీ స్థాయి పాఠాలు కావాలంటే, రేసులో మీ అబ్బాయి వెనకబడి పోకుండా ఉండాలంటే మా స్కూల్ లో చేర్పించండి . మీకు కన్సెషన్ కూడా ఇస్తున్నాము . మా సంవత్సరం ఫీజు రెండు లక్షలు . మీ అబ్బాయి నలభై శాతం మార్కులు సాధించాడు కాబట్టి నలబై శాతం fees డిస్కౌంట్ ఇస్తున్నాము . అంటే కేవలం లక్ష ఇరవై వేలు కడితే చాలు . ఎనభై వేలు అదా . ఈ ఆఫర్ ఈ రోజు రేపు మాత్రమే . చెప్పండి సీట్ confirm చేసెయ్యమంటారా ?"
తండ్రి ఆలోచనలో పడ్డాడు ." పిల్లల చదువుకంటే మించింది ఏమి వుంది ? ఏదో స్కూల్ బాగుంది కదా అని చేర్పిస్తే ఇక్కడ మా వాడు వెనుకబడిపోతున్నాడు . ఆమ్మో .. ఇది కీలక సమయం . తప్పటడుగు వేస్తె వాడి జీవితం పాడైపోతుంది"
" సర్ .. నేను వస్తున్నాను .. మా వాడికి సీట్ కావాలి . దయచేసి డిస్కౌంట్ కొంచం పెంచండి " అంటూ తనకు కాల్ వచ్చిన నెంబర్ వ్యక్తికి తిరిగి కాల్ చేసాడు .
బాబు తో తండ్రి స్కూల్ కు వెళ్ళాడు." డాడీ .. మా స్కూల్ బాగుంది . నేను అక్కడే చదువుకుంటాను . ఇక్కడ వద్దు "అని అబ్బాయి ఏడుస్తున్నాడు . తండ్రి దాన్ని పట్టించుకోలేదు .
"సర్ చూసారు కదా . మా వాడు అక్కడే చదుతాడంట " చెప్పాడు తండ్రి .
"మీ ఇష్టం సర్.. అయినా పిల్లలకు ఏమి తెలుసు సర్ . . సర్ .. మీ కోసం ఇంకో పది వేలు తగ్గిస్తున్నాము . అంటే మీకు తొంబై వేలు ఆదా. పైగా స్టార్ బ్యాచ్ లో సీట్ ఇస్తున్నా. ఈ బ్యాచ్ లో చదివిన వారందరూ ఐఐటీ లో సీట్ కొట్టి ఇప్పుడు అమెరికా లో స్థిరపడ్డారు . కాంగ్రజులేషన్స్ . కానీ ఈ ఆఫర్ ఈ రోజే సర్... నేను కస్టపడి మా డీన్ ను ఒప్పించాను . నూటికి నలబై మార్కులు కూడా రాలేదు . వాడికి సీట్ ఇవ్వడమే వేస్ట్ . పైగా ఫీజు డిస్కౌంట్ కూడానా ?" అన్నారు డీన్ . నేను కస్టపడి ఒప్పించాను సర్ అన్నాడు .
"సరే .. సర్.. ఠంక్ యు వెరీ మచ్ . ఇదుగో ఫీజు "
🌱🌱🌱🌱🌱🌱
అటు పై స్కూల్ ఆఫీస్ లో .. డీన్ ఛాంబర్ లో
" సర్ .. నలబై మార్కులు స్కోర్ చేసి మనం పెట్టిన టెస్ట్ లో స్టేట్ ఫస్ట్ రాంక్ సాధించాడు కదా అబ్బాయి . ఫాదర్ వచ్చి ఇందాకే ఫీజు పే చేసి వెళ్ళాడు "
"ఓహ్ గ్రేట్ జాబ్ సర్.. వాడు చురుకయిన కుర్రాడు . మనం ఎక్కడెక్కడో డిగ్రీ స్థాయి ప్రశ్నలు తెచ్చి ఐదో తరగతి కి స్కాలర్షిప్ టెస్ట్ పెడితే , వాడు నలబై స్కోర్ చేసాడంటే నిజం గా గ్రేట్ . ఇదే టెస్ట్ మన మన విద్యార్థులకు పెడితే కనీసం రెండు మార్కు లు కూడా రావు . మన బాస్ ప్లానింగ్ అదిరిపోలా ? ముందుగా పేరెంట్ కాంఫిడెన్స్ ను దెబ్బ కొట్టాలి . తమ పిల్లలు చదువుతున్న పాఠశాల దేనికీ పనికి రాదని మార్కుల ద్వారా వారికి చూపాలి .ఇదీ ప్లాన్ . ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి . ఆ స్కూల్ లో నిజంగా మంచి స్టాండర్డ్ ఉందయ్యో. మెరికలాంటి కుర్రాళ్లు వున్నారు . "
"అవును సర్ ! మొన్న మన బ్రాంచ్ కి చెందిన నలుగురు టీచర్ లు అక్కడ teachers ఇంటర్వూస్ కు వెళితే ఒకడు కూడా సెలెక్ట్ కాలేదు . అంటే వారిది ఎంత స్టాండర్డ్ అని అర్థం చేసుకోండి "
"నలుగురు వెళ్ళారా ? ఎందుకు ?"
" అడ్మిషన్ ప్రెషర్ సర్.. అడ్మిషన్స్ తెస్తేనే మనకు జీతం . ఇదేమి బతుకు సర్ ! నా పై నాకే అసహ్యం వేస్తుంది . ఇప్పుడు చూడండి . ఆ అబ్బాయి, వేలమంది రాసిన మన స్కాలర్షిప్ టెస్ట్ లో నలబై మార్కు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలిచాడు . అదీ వాడి స్థాయి . వాడు చదువుతున్న స్కూల్ స్థాయి . కానీ నేనేమి చేశాను ? నా పొట్టకూటికోసం అబద్దం చెప్పాను. ఫాదర్ ను బ్రెయిన్ వాష్ చేశాను . మీ అబ్బాయి తక్కువ మార్కులు స్కోర్ చేసాడు అన్నాను . అసలు ఆ టెస్ట్ రాస్తే మన స్కూల్ లోని టీచర్ లకు కూడా ముప్పై మార్కులు రావు . ఖర్మ సర్ .. నేను మంచి రెసిడెన్షియల్ స్కూల్ లో చదివి వచ్చాను . ఇక్కడ మన ఇంగ్లీష్ టీచర్ " మ్యా డం " ( Myaa Ddum ) అంటూ ఉంటే నాకు డొకొస్తుంది సర్.. ఇంగ్లీష్ టీచర్ ఒక వాక్యం సరిగా ఇంగ్లీష్ లో మాట్లాడలేరు . ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్ లను తిప్పి అడిగితే ఒక కాన్సెప్ట్ క్వశ్చన్ ను వివరించలేరు . మనం ... ఐఐటీ అని చెప్పి బతుకుతున్నాము . పాపం సర్.. పిల్లల భవిష్యత్తును దెబ్బ తీస్తున్నాము . ఇన్ని అబద్దాలు చెప్పి ఫీజు లక్ష అయితే దాన్ని రెండు లక్షలు అని చెప్పి, ముందుగా నలబై శాతం డిస్కౌంట్ అని, అడ్మిషన్ కంఫర్మ్ చేసేటప్పుడు మరో పది వేలు డికౌంట్ ఇచ్చి లక్ష పది వేలు వసూలు చేసి లక్ష స్కూల్ కు కడితే నాకు మిగిలింది పదివేలు . అయిదు మందిని మోసం చేస్తే యాబై వేలు . ఇలా ఎందుకు చేస్తున్నాము అనిపిస్తుంది ? ఖర్మ సర్ .. నాకు కూడా అవకాశం వస్తే నేను కూడా ఒక మంచి స్కూల్ లో టీచర్ గా చేరిపోతాను సర్ "
ఇదే అంతులేని అంతం లేని కథ ! వేలమంది పిల్లల బాల్యం బలైపోతున్న నిజ జీవిత వ్యధ !
No comments:
Post a Comment