. *అతి సర్వత్ర వర్జయేత్*
. **************************
ఇది సనాతనం నుంచి వస్తున్న సామెత.
ఇదే మన జీవనానికి సదా అనుకూలత.
అతి మనను చితి చేరువ చేసేది.
అతి మనకు నిరుపయోగమెపుడైనా.
అతి మనకు మంచైనా చెడైనా పనికి రాదు.
అతి ఏ జీవన రంగముననైనా ప్రమాదమే.
మితమే మనకు సర్వత్రా హితకరం.
అతిగా చేయకు. అతిగా ప్రవర్తించకు.
వినయమైనా విర్రవీగడమైనా మితమే మేలు.
స్నేహమైనా శత్రుత్వమైనా మితమే అనుకూలం.
ఆహార సేవనమైనా మద్యపాన సేవనమైనా
మితమునకు మించిన అది అపాయము.
ఏదీ మించకూడదు నీ బ్రతుకు బాటలో.
మించితే అది విషతుల్యమవుతుంది.
అమితమే మన పాలిట దురితము.
మిత పరిమితి వలనే మతి స్థిమితము.
******************
రచన:---రుద్ర మాణిక్యం (✍️కవి రత్న).
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా).
*************************************
No comments:
Post a Comment