Sunday, August 20, 2023

గొప్ప వారి పక్కన* *మర్యాదలు🌹* *✨చిన్న కథ

 *🍁గొప్ప వారి పక్కన* 
 *మర్యాదలు🌹* 
 *✨చిన్న కథ* ✨
🌻🪻🌹🪷🦜🐋

 *ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు.* 
 *అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు.* 

 *ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు.* 

 *దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి, నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు.* 

 *అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది. అందరూ తనని చూసి, తనకే నమస్కారం* *చేస్తున్నారనుకుంది.* 
 *అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది.* 

 *'ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా,* *గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా! అని ఆశ్చర్యపోయింది.* 

 ' *ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు'అనుకుంది.* 

 *కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి.* *అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది.* 
 *గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు.* 
 *గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు.* 

 *'ఊరి వాళ్ళంతా నాకు గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా! మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి, ' అనుకుని అక్కడి నుండి కదలలేదు.* 

 *శిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు.* 

 *" ఆ! పోతే పోయాడు"* *అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు.* 

 *అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై కర్రతో కొట్టాడు. దానితో గాడిదకి జ్ఞానోదయం అయింది.* 

 " *అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది, అనుకుని యజమాని దగ్గరకు పరుగెత్తింది.* 

 *నీతి :* 
 *గొప్పవారి పక్కన ఉన్నప్పుడు దక్కే మర్యాదలు శాశ్వతమని విర్రవీగడం అవివేకం.* 

 🦚🌹🌻🐋🦜🌈

No comments:

Post a Comment