మూలాలను తుడిచేయ్, వారే పతనమైపోతారు.
...............................................................
యే సంతి విద్యాతపసోపపన్నాః
తేషాం వినాశః ప్రథమం తు కార్యః ॥
లోకా హి సర్వే తపసా ధ్రియంతే
తస్మాత్ త్వరధ్వం తపసః క్షయాయ |
యే సంతి కేచిచ్చ వసుంధరాయాం
తపస్వినో ధర్మవిదశ్చ తజ్ జ్ఞాః ॥
తేషాం వధః క్రియతాం క్షిప్రమేవ
తేషు ప్రణష్టేషు జగత్ ప్రణష్టమ్ ।
ఏవం హి సర్వే గతబుద్ధిభావా
జగద్వినాశే పరమప్రహృష్టాః
......... సంస్కృత మహాభారతం.
ఒకదేశాన్ని నాశనం చేయాలంటే మొదట ఆ దేశానికి చెందిన సంస్కృతి సాంప్రదాయాలపై దెబ్బకొట్టండి, మూలాలపై దాడి జరిగితే ఆ దేశ సంస్కృతి తనంతట తానే కూలిపోతుంది.
......... హిందువులను మతం మార్చాలని ప్రయత్నిస్తున్న మతాలు.
అందుకే ఎడారి మతాలవారు మన నాగరికత అనే సనాతన మూలాలపైన దెబ్బకొడుతునారు. భారతదేశం విభిన్న సంస్కృతుల మేలుకలయిక. అంతేకాదు ఈ దేశంలో రకరకాల భాషలు మతాలు ఆచారాలు వ్యవహారాలు పద్ధతులు వున్నాయి. ఇతర మతాలవారు వారివారి సంస్కృతిని ఆచారవ్యవహరాలను తప్పకుండా పాటిస్తూ పాశ్చత్య నాగరికతల వలలో వారు చిక్కడం లేదు.కేవలం భారతీయ హిందువులు మాత్రమే పాశ్చాత్య వెర్రి నాగరికతలకులోనై స్వమతాన్ని సంస్కృతిని వారసత్వాలను చేజేతులా నాశనం చేసుకొంటూ అత:పాతళానికి చేరువై, బలహీనమైతున్నారు.
ఎవరినైనా బలహీనపరచాలంటే వారి సంస్కృతిపై దెబ్బకొట్టు వారే పతనమైపోతారని భారతములోని వృత్రాసురుని కథ తెలియచేస్తోంది.
త్వష్టప్రజాపతి తనకు ఇంద్రుని ఓడించగల కుమారుడు కలగాలని గొప్పయజ్ఞము చేస్తాడు.ఆ హోమగుండం నుండి భయంకరాకారుడైన రాక్షసుడు ఉద్భవించి బ్రహ్మండన్నంతా ఆక్రమించి ససైన్యంగా స్వర్గలోకాన్ని జయించి ఇంద్రుడిని ఓడించి పదవీభ్రష్టుడిని చేస్తాడు.
రాజకీయ నాయకుడైనా అధికారైనా పదవిపోతే అల్లల్లాడిపోతారు కదా!
ఇంద్రుడు పరుగుపరుగున వైకుంఠము చేరి పాహిమాం పాహిమాం స్వర్గలోకాన్ని దుర్మార్గుడైన వృత్రాసురుడి నుండి రక్షించండి కాపాడంటూ శ్రీహరిని శరణువేడాడు.
గత జన్మలో వృత్రాసురుడు చిత్రసేనుడనే రాజు, పైగా మంచి విష్ణుభక్తుడు కూడా, అయితేనేమి ఈ జన్మలో దుష్టుడైన రాక్షసుడు కదా ! విష్ణువేమి జాలి చూపలేదు,అందుకోసం దధీచి మహాముని వెన్నెముకతో చేసిన ఆయుధంతో వాడు చస్తాడని వెళ్ళి ఆ బుుషిని ప్రాధేయపడి వెన్నెముక తెచ్చుకో పో అంటూ శ్రీహరి సలహా ఇస్తాడు.
దధీచి ప్రాణత్యాగం చేసి వెన్నెముక ఇస్తాడా ! అంటూ శచీపతి అనుమానం వ్యక్తం చేస్తాడు. ప్రయత్నం చేయకనే అనుమానమేమిటయ్యా వెళ్ళు అంటూ విష్ణుమూర్తి అన్నాడు.
ఇంద్రుడు దధీచిని చేరి నీ వెన్నెముక కావాలని కోరుతాడు. నేను ప్రాణత్యాగం చేసి నా వెన్నెముక ఎందుకివ్వాలని ఆ బుుషి అడుగుతాడు. దుష్టరక్షణకు అవసరమని స్వర్గాధిపతి ప్రాధేయపడతాడు. అయితే ఓకే అంటూ దధీచి ప్రాణత్యాగం చేసుకొంటాడు. విశ్వకర్మ దధీచి వెన్నెముక నుండి ఓ గొప్ప ఆయుధం తయారు చేసి ఇంద్రుడికి ఇస్తాడు.అదే వజ్రాయుధం.
ప్రాచీనమానవుడు మొదట రాతితో ఆయుధాలను చేసుకొని జంతువులను వేటాడేవాడు. కాస్తా నాగరికత మరికొంచెం జ్ఞానం పెరిగిన తరువాత తాను వేటాడిన జంతువుల అస్తికల నుండి కూడా ఆయుధాలను తయారుచేసుకొన్నాడు.ఎముకలతో ఆయుధాలు చేయడం అనాదికాలంలోనే వుంది.
వజ్రాయుధంతో వృత్రాసురుని ఇంద్రుడు సంహరిస్తాడు.
వృత్రాసురుని సేనలు కకావికలమై సముద్రంలో దాక్కొంటాయి. ఆ సేనాధిపతులు వృత్రాసురుని ఓడించిన దేవతలపై ఎలాగైనా పగతీర్చుకోవాలని మంతనాలు చేస్తారు. ఇంద్రుడి బలం కేవలం వజ్రాయుధమే కాదు, గొప్ప బుుషుల తపోశక్తి వారి మంచితనం వారి ధర్మనిరతి వారి దైవభక్తి యజ్ఞ యాగాలు మొదలైనవి, వాటిపై మనం దెబ్బ కొడితే స్వర్గలోకం దారి తప్పి ధర్మాన్ని వదిలేసి బలహీనమైపోతారు అప్పుడు మనం దాడి చేస్తే సులభంగా ఓడిపోతారు.
ఇదే ఇప్పుడు హిందూసమాజానికి జరుగుతోంది.ఇకనైనా మేలుకోకపోతే జరిగేది సంస్కృతి వినామే.
ఒకరి సంస్కృతిని ఏ విధంగా దెబ్బతీయాలని సముద్రంలో దాగిన వృత్రాసురుడి సేనలు చేసిన మంతనాల గురించి భారతంలోని పై శ్లోకాలు తెలియచేస్తున్నాయి.
॥సేకరణ॥
.................... జిబి.విశ్వనాథ, 9441245857, అనంతపురం.
No comments:
Post a Comment