Tuesday, August 29, 2023

సంతోషాల ‘మంత్ర

 *🌹సంతోషాల ‘మంత్ర🌹’*
 
 ప్రతి ఒక్కరూ ఏదో సాధించినట్టే ఉత్సాహంగా కనిపిస్తారు. అనేక ప్రణాళికలు రచిస్తారు. వారం దాటిందంటే చాలు... తిరిగి రొటీన్‌ జీవితాల్లో పడిపోతారు. అయితే తొలిరోజు సంతోషాన్ని ఏడాదంతా కొనసాగించాలంటే ‘హ్యాపీనెస్‌’ ఇండెక్స్‌ ఫాలో కావాల్సిందే. ఒత్తిడి పెరుగుతున్న వేళ... మానవ సంబంధాలు కనుమరుగవుతున్న వేళ... నిపుణులు చెబుతున్న ఈ చిన్న చిన్న సూత్రాలు ఆనందమయ జీవితానికి మార్గాలు...

ప్రశంసించడం నేర్చుకోండి. కనీసం రోజుకి ఓ వ్యక్తినైనా మెచ్చుకోండి. ఇంట్లో కాఫీ, పాప హ్యాండ్‌ రైటింగ్‌, మీ కొలీగ్‌ షర్ట్‌, క్యాంటీన్‌లో దోశ... ఇలా ఏదైనా సరే మెచ్చుకుంటూ మాట్లాడండి. ఎదుటివ్యక్తి చూపుల్లో కనిపించే మెరుపు మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

లాటరీ గెలుచుకోవాలని, రాత్రికి రాత్రే పెద్ద స్టార్‌ అయిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ దాని వల్ల వచ్చే సంతోషం ఎక్కువ కాలం నిలవదు. అలాకాకుండా ఏదైనా మంచిపని చేయండి. ఆ ఆత్మసంతృప్తి ఎప్పటికీ మీతోనే ఉంటుంది. స్నేహితుడికి సహాయం చేయడం, పేద విద్యార్థులకు ఫీజు కట్టడం, నిరక్ష్యరాస్యులకు చదువు నేర్పించడం, వీధి కుక్కలకు అన్నం పెట్టడం... ఇలాంటివి ఏవైనా సరే.

హడావిడిగా కాకుండా అప్పుడప్పుడూ కాస్త తీరిగ్గా స్నానం చేయడం నేర్చుకోండి. పరిమళభరిత నూనెలు రాసుకుని, రంగుల దీపాలు అందంగా అలంకరించిన స్నానాల గదిలో గులాబీ రేకులతో నిండిన నీళ్లతో స్నానం చేసి చూడండి. కొత్తగా జన్మించిన ఫీలింగ్‌ వస్తుంది.

అమ్మానాన్నలకు, అత్తామామలకు లేదా చిన్నాన్న వంటి పెద్దలకు ఫోన్‌ చేసి మాట్లాడండి. వాళ్లలా ఈ భూమ్మీద మరెవ్వరూ మిమ్మల్ని ప్రేమించరు.

ఏదైనా కొత్త ప్రదేశానికి టూర్‌కి వెళ్లండి. ఒకరోజు విహారమైనా సరే. ఇంటర్నెట్‌లో ముందే అక్కడి ప్రదేశాలు తెలుసుకోవడం, హోటల్‌ గది బుక్‌చేసుకోవడం లాంటివి చేయకుండా వెళ్లండి. కచ్చితంగా అడ్వెంచరస్‌ ట్రిప్‌నకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది.

ఫ వాళ్ల గురించి, వీళ్ల గురించి చాడీలు చెబుతూ విషాన్ని కక్కడం కన్నా మంచి మాట్లాడుతూ పాజిటివిటీని పంచడం ఆఫీసుకే కాదు... మీ ఆరోగ్యానికీ మంచిది.

*🌹మనసారా నవ్వండి..☝️*

రోజూ ఓ అయిదు నిమిషాలు మీ ప్రియ మిత్రుడితో గడపండి. ఆఫీసు టెన్షన్‌, చికాకు హుష్‌కాకిలా మాయం అవడం ఖాయం.

మనసారా నవ్వండి. మీకు నవ్వడానికి రీజన్‌ దొరక్కపోయినా నవ్వడం అలవరచుకోండి. కొత్త ఉత్సాహం మిమ్మల్ని చిగురింపజేస్తుంది.

మీ ఇంటి పక్కన ఏదైనా చెట్టు ఉంటే కాసేపు కాస్త గట్టిగా హత్తుకోండి. పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ని ఆ పచ్చని చెట్టు మీకు బహుమతిగా ఇస్తుంది.

క్రమం తప్పకుండా కాసేపు వ్యాయామం చేయండి. బరువు తగ్గాలనే టార్గెట్‌తో కాదు. ఆనందం కోసమే వ్యాయామం చేయండి.

వారంలో ఓ రోజంతా సెల్‌ఫోన్‌ డేటా ఆఫ్‌ చేసి పెట్టండి. ఈమెయిల్స్‌, ఇన్‌స్టా, వాట్సప్‌లు అన్నీ బంద్‌ చేయాలన్నమాట. సామాజిక మాధ్యమాలను ఓ ఇరవై నాలుగు గంటలు డిటాక్స్‌ చేయడం మంచిదే.

క్యాలరీలు, షుగరు అన్న భయాల్ని కాసేపు పక్కనపెట్టి (పరిమితంగానే సుమా) మీకు ఇష్టమైన చాక్లెట్‌ను ఆస్వాదించండి. శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి.

కాసేపు చిన్నపిల్లలతో కాలక్షేపం చేయండి. మీ ఇంట్లో పిల్లలు లేకపోతే పక్కింటి పిల్లలతో ముచ్చటించండి.

పెంపుడు జంతువును పెంచుకోండి. ఆ మూగ నేస్తాల వల్ల ఇంటి వాతావరణమే మారిపోతుంది.

స్ఫూర్తినిచ్చే పుస్తకం చదవండి. చదివేంత సమయం లేకపోతే ఆన్‌లైన్‌లో వినండి.

బీరువా నిండా ఉపయోగించని దుస్తులు చాలా ఉంటాయి. అస్సలు ధరించని వాటిని శరణాలయాల్లో పంచేయండి. అయితే ఇతరులకు ఇచ్చే ముందు వాటిని శుభ్రంగా ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వడం మేలు.

వయసనేది నెంబర్‌ మాత్రమే. దాన్ని పక్కన పెట్టి, ఏదైనా కొత్త హాబీ అలవర్చుకోండి.

తోటపని పట్ల మక్కువ పెంచుకోండి. కొత్త మొక్కను తెచ్చుకోండి. ఆ మొక్క ఆలనా పాలనా చూస్తే ఆనందం రెట్టింపు అవుతుంది.

వంట నేర్చుకోండి. అదొక స్ట్రెస్‌ బస్టర్‌. అప్పుడప్పుడు మీకిష్టమైన వంటకాన్ని చేసి మిత్రులను ఆహ్వానించండి.

అడపాదడపా ఆప్తులకు ఉత్తరాలు రాసి, వాళ్లని ఆశ్చర్యపరుస్తూ ఆనందాన్ని పొందండి.

కంప్యూటర్లు, ల్యాప్‌టాపుల ముందు కూర్చోకుండా శరీరాన్ని ఓ అయిదు నిమిషాల పాటు స్ట్రెచ్‌ చేయడం వల్ల లాభాలు ఎన్నోవాలంటీర్‌ సేవల్లో చురుకుగా పాల్గొనండి. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది.

సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకుండా వెకేషన్‌ని ఎంజాయ్‌ చేయండి. పోస్ట్‌ పెట్టినప్పటి నుంచి లైకుల మీద శ్రద్ధతో హాలీడేని అస్సలు ఎంజాయ్‌ చేయలేం.

ఎప్పటికప్పుడు క్రెడిట్‌ కార్డు బిల్లులను పే చేస్తూ రివార్డులనే కాదు ద్రవ్య క్రమశిక్షణను అలవరచుకోండి.

చిన్ననాటి మిత్రులు, ఆప్తులతో ఏదో రకంగా టచ్‌లో ఉండండి. ఫోనులో మాట్లాడటానికి కుదరకపోయినా కనీసం మెసేజ్‌లను పంపడం మరచిపోకండి.

కొన్ని పనులు చేయాలంటే భయం ఉంటుంది. ఉదాహరణకు చీకటిలో నడవడం, కొండలెక్కడం, ఇంగ్లిష్‌లో మాట్లాడడం, బండి నడపడం... ఏదైనా సరే రోజూ కాస్త ప్రాక్టీస్‌ చేసి ధైర్యాన్ని పెంచుకోండి.

*🌹ఆలోచనలకు అక్షర రూపం...☝️*

సంగీతాన్ని ఆస్వాదించండి. విషాద గీతాల్ని కాదు హుషారు కలిగించే పాటల్ని వింటే జీవితం ఎంతో అందమైనదిగా కనిపిస్తుంది.

మనసులో మెదులుతోన్న ఆలోచనలు ఓ పేపరు మీద రాసుకుంటూ ఉండండి. వాటికి ఎప్పుడో ఒకరోజు చక్కటి రూపాన్ని ఇస్తారు.

చిన్న చిన్న టెడ్‌ టాక్‌లను ఆస్వాదించండి. వివిధ సక్సెస్‌ స్టోరీలను తెలుసుకోవడం జీవితానికి ప్రేరణ లాంటిది.

అప్పుడప్పుడు బ్యూటీపార్లక్‌కి వెళ్లి ఫేషియల్స్‌, మెనిక్యూర్‌, పెడిక్యూర్‌ లాంటివి చేయించుకుంటే... మీకు మీరే అందంగా కనిపించి కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ పెరుగుతాయి.

ప్రతి మూడు నెలలకు ఓసారి దూరప్రాంతాల పర్యటన జీవితంలో భాగం చేసుకోండి.

వాడ్రోబ్‌లో ఎన్నో దుస్తులు ఉంటాయి. అందులో మీకు బాగా నచ్చేవి కొన్నే. అప్పుడప్పుడూ వాటిని ధరిస్తూ మీకు మీరే కాంప్లిమెంట్స్‌ ఇచ్చుకోండి.

ప్రతి నెలా సంపాదనలోని కొంత మొత్తాన్ని సేవింగ్స్‌లో పెట్టండి. దాంతో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మాత్రమే కాదు.. ఆనందం కూడా పెరుగుతుంది.

*🌹డ్యాన్స్‌తో ఒత్తిడి దూరం.. ☝️*

వీలుచిక్కినప్పుడల్లా సూర్యోదయ, సూర్యాస్తమయాలను వీక్షించండి.

ఏదైనా సహాయం పొందినప్పుడు మనసారా కృతజ్ఞతలు తెలియజేయండి.

చిన్ననాటి పుస్తకాలను దుమ్ముదులిపి ఓసారి తనివితీరా చదవండి. ఆనాటి జ్ఞాపకాలు తాజాగా పలుకరిస్తాయి.

‘గ్రాటిట్యూడ్‌ డైరీ’ రాయడం మొదలుపెట్టండి. మీకు జరిగిన లేదా మీరు చేసిన మూడు మంచి పనుల గురించి రాయండి. క్రమంగా మీ హ్యాపీ మెమొరీస్‌ లిస్టు పెరిగిపోతుంది.

ఏ వయసులో ఉన్న వారికైనా జీవిత లక్ష్యాలు అవసరం. ఈ ఏడాది మీరు సాధించదలచుకున్న లక్ష్యాలను రాసుకోండి. అంతేకాదు వాటి సాధన కోసం రోజూ కృషిచేయండి.

దగ్గరలో ఉన్న కెఫేకు నడుచుకుంటూ వెళ్లి కాఫీ తాగండి.

నృత్యం చేయండి. దీని కోసం కొత్తగా కోర్సులో చేరి అరంగేట్రం చేయాల్సిన అవసరం లేదు. కాసేపు మీకు మీరే కొత్తగా కనిపించేందుకు. క్లాస్‌, మాస్‌ ఏదైనా సరే. పాట వింటూ తీన్మార్‌ స్టెప్పులు వేయండి. ఒత్తిడి పోతుంది.

*కొంత సమయం అయినా ధ్యానంలో గడపడం మంచిది.*

*వారంలో ఓ రోజైనా టీవీ చూడకుండా గడపండి.*

*మిమ్మల్ని ఇష్టపడని లేదా ద్వేషించే వారి గురించి ఆలోచించడం మానేయండి.*

సెల్‌ఫోనును ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండకుండా కాసేపు హ్యాండ్‌ఫ్రీగా ఉండండి. క్రమంగా ఈ సమయాన్ని కొన్ని గంటలకు తీసుకువస్తే మంచిది.

*_" ఆంధ్రజ్యోతి" సౌజన్యముతో.._*

*_-మీ... డా,, తుకారం జాదవ్.🙏_*
                    _ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్._
                          *_Cell : 7382583095._*

No comments:

Post a Comment