Monday, April 1, 2024

స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము జగత్తు భావన మాత్రమే - 2

 త్రిపురా రహస్యము - 39

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 

జగత్తు భావన మాత్రమే - 2  

మాయ అనేది మానవులను ఆవరించి ఉన్నది. ఈ అజ్ఞానం కూడా ఆ శక్తి అంశమే అయినందువల్ల ఆత్మజ్ఞానం అనేది మాయా మూలక మవుతున్నది. ఆత్మతత్త్వం తెలియనంతకాలము జనులు శోకిస్తూనే ఉంటారు. తెలిసిన తరువాత ఇంక శోకించరు. 

నిద్రలో ఉన్నవాడు, తాను నిద్రిస్తున్నానని తెలసుకోలేక దొంగలు తన' సర్వస్వాన్ని హరించారని కలగని బాధపడతాడు. తీరా అది కల అని తెలిసిన తరువాత అతడికి బాధ ఉండదు. గారడీ వాడు ఒక పెద్ద పామును సృష్టిస్తాడు. దాన్ని చూసి అది నిజమైన పాము అనుకుని అందరూ భయపడతారు. ఇది గారడీవాని మాయ అని తెలియగానే ఇంక భయం ఉండదు. పైగా భయపడే వాళ్ళని చూసి నవ్వుతాడు. అలాగే ఆత్మజ్ఞాన సంపన్నులు మాయను అతిక్రమించి పోగలుగుతారు. వారెప్పుడూ దుఃఖించరు.

కాబట్టి ఓ రాజా! నువు ఇప్పుడు ఆత్మతత్తాన్ని గురించి తెలుసుకో. ఈ మాయ నుంచి తరించు” అన్నాడు.

“మునిబాలకా ! నువు చెప్పిన ఉదాహరణలు నాకు తృప్తినివ్వలేదు. ఎందుచేతనంటే కలలో చూసేదిగాని, గారడీవాడు చూపించేదిగాని నిజమైనదికాదు. కేవలము ఉన్నట్లుగా భ్రాంతిని కలుగచేస్తుంది. జాగ్రదవస్థలో కనిపించే పదార్దాలు సత్యమైనవి. వాటిని మనం వాడుకోవచ్చు. అవి కలలో మాదిరిగా గాక, ఇతర కాలాలలో కూడా స్థిరంగా ఉంటాయి. 'అవిలేవు' అనే జ్ఞాన రూపమైన బాధ వాడికి ఉండదు. కాబట్టి ఈ జగత్తు కలలాటిది కాదుకదా ? జగత్తు స్వప్న సమానం కాదు” అన్నాడు రాజు.  

మునిబాలకుడు : రాజా ! జాగ్రత్తగా విను, కలలో కనిపించే చెట్టు కూడా నీదనిచ్చి . తాపాన్ని హరిస్తుంది. పండ్లు, పూలు ఇచ్చి తృప్తినిస్తుంది. అందువల్ల స్వప్నంలోని పదార్థాలు కూడా ఉపయోగపడేవిగా, అబాధితులుగా ఉన్నాయి కదా ! అవి కూడా స్థిరంగానే ఉంటున్నాయి. 

రాజు : స్వప్నంలో కనిపించేవి అన్నీ కూడా జాగ్రదావస్టలో భాసించటం లేదు. అంటే మునికి బాధ కలుగుతోంది కదా. జాగ్రదత్రపంచం ఆవిధంగా పూర్తిగా 
భాసించకపోవటం ఎప్పుడూ లేదే,  

మునిబాలకుడు :; సుషుప్తిలో జాగ్రత్ర్రపంచం ఏమాత్రం భాసించదు. బాధ అంటే భాసించకపోవటం అని కాదు. ఈనాడున్న జా(గ్రత్ర్రపంచమే రేపు కూడా ఉంటుంది. 
అందుకనే అది నిన్నటి వస్తువే అనుకుంటున్నాము. స్వవ్నంలో ఉన్న పదార్థాలు ఆవిధంగా జాగ్రత్తలో అనువృత్తంగా లేవు గదా అనేది సందేహం. 'అనువృత్తం”' అంటే ఎడతెగకుండా ఒకే వరుసగా ఉండటం. అది నిజం కాదు. ఎందుకంటే స్వప్నవృత్తం కూడా మరునాడు అనువ్యక్తం అవుతూనే ఉన్నది. అయితే ఇది నిన్నటిది అని మర్నాడు అనుకుంటాం. అలాగే నిన్నటి స్వప్నమే ఇది అని అనుపించదు కదా ! ఇది ఎక్కడా అనుభవంలో లేదు. అని మళ్ళీ అనుమానం. 

జాగ్రదావస్థలో మాత్రం ఇది నిన్నటిదే అని ఎక్కడ అనిపిస్తున్నది ? క్రియ వంటి క్షణికమైన భావాలు ప్రతిక్షణము నశిస్తూ ఉంటాయి, అందువల్ల అవి భాసించటము అనేది జరగదు. ఎప్పుడూ క్రొత్త వస్తువులే భాసిస్తాయి. 

రాజు: క్షణికమైనవి నశిస్తాయి. వాటికి అనువృత్తి లేదు. అన్నారు బాగున్నది. మరి స్టిరములైన పర్వతాలు, నముద్రాలవంటివి గతంలో ఉన్నవే, ఉత్తరకాలంలో కుడా అనువ్యక్తమవుతున్నాయి కాదా ? 

మునిబాలకుడు : కలలో కూడా పెద్ద పెద్ద కలలు వస్తాయి. ఆ కలలో కొన్నేళ్ళు గడిచిపోతుంది. చాలాకాలం క్రిందట ఉన్న వుత్రులు, మిత్రులే అప్పుడు కూడా 
ఉన్నారనిపిస్తుంది. ఇది సహజం. ఇది అనుభవమే.  

రాజు: అయితే కలలో కనిపించిన పుత్రులు, మిత్రులు నిజం కాదు. కాబట్టి అవి అనువ్యక్త మవుతున్నాయనటం కూడా నిజం కాదు కదా ! 

ముని బాలకుడు ; అలా అయితే జగత్తులో స్టిరంగా ఉన్నట్లు భాసించేది కూడా అసత్యమే రాజా! అంధపరంపరగా వచ్చే విశ్వాసాన్ని వదలి పెట్టి సూక్ష్మ దృష్టితో పరిశీలించు. 

ఈ శరీరము, వృక్షాలు, నదులు, పర్వతాలు అన్నీ క్షణభంగురాలే. క్షణక్షణం వాటి రూపం మారుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ అనువృత్తి అసత్యం కాదని చెప్పటానికి లేదు. ఈ శరీరంలోనే కాని పర్వతాలు మొదలైన వాటిలో మార్పు రాదు అనటం నిజం కాదు. సెలయేళ్ళు ప్రవహించటంవల్ల రాళ్ళు అరిగిపోతాయి, బ్రద్దలవుతాయి. సెలయేళ్ళు లేనిచోట్ల ఎలుకలు, చెదలు త్రవ్వటం వల్ల రాళ్ళు క్రుంగుతాయి. ఒక్కొక్కసారి పర్వతాలు పెరుగుతాయి. అలాగే భూమిలోకి దిగిపోతాయి. ఈ రకంగా పర్వతాలు, నదులు ఒకటేమిటి ? అన్నీ తమ పూర్వరూపాన్ని కోల్పోతాయి. 

ఇది అంతా విన్న రాజుకు మళ్ళీ అనుమానం వచ్చింది. కార్యరూపంలో కాకపోతే కారణ రూపంలో అనువృత్తి ఉంటుంది కదా ! అన్నాడు. 

దానికి ముని బాలకుడు రాజా! భౌతికమైన కార్యాలన్నీ పంచభూతాల రూపంలో ఉన్నాయి. జాగత్రపంచంలో లాగానే స్వప్న ప్రపంచంలో కూడా పృధివి మొదలైన వాటిని చూస్తూనే ఉంటాము. అక్కడ స్వప్న పురుషుడు వాటిని అనుభవిస్తూనే ఉన్నాడు.🙏

🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇

J N RAO 🙏🙏🙏...

No comments:

Post a Comment