సిద్ధులు - అష్ట సిద్ధులు -
Psychokinesis / Telekinesis - పదార్ధంపై మనస్సు అధికారం :
📚✍️ భట్టాచార్య
Psychokinesis లేదా Telekinesis...అనేది చిత్రమైన, శక్తివంతమైన మానసిక శక్తి (psychic power). ఎవరినైనా, ఏ రూపంలోనైనా ప్రభావితం చేయగలిగే శక్తి ఈ "టెలి కైనసిస్". ఈ శక్తి ప్రదర్శనలో భౌతికేతర శక్తి తోడ్పడుతుంది.
Psychokinesis అనగా ఒకానొక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క భౌతిక శరీరంపై గాని, వ్యవస్థపై గాని ప్రభావం చూపించడం. అమెరికన్ పారాసైకాలజిష్టు అయిన JB Rhine ఈ "సైకో కైనసిస్ " లేదా "టెలికైనసిస్" ను చక్కగా నిర్వచిస్తారు. అతను ఈ పదాన్ని ఉదహరిస్తూ, భౌతికమైన వస్తువులపై, మానసిక శక్తుల అధికారంగా వర్ణిస్తాడు. అంటే శరీరంపై మనస్సు యొక్క అధికారమే కదా!
అలనాటి ఆర్య ఋషులు గాని, ఈనాటి మార్మికులు గానీ, హిత పరిస్థితుల్లో చేస్తున్నదేమిటి? శరీరం పైన, భౌతిక క్షేత్రాల పైన మనస్సు యొక్క అధికారాన్ని ప్రకటిస్తున్న వారే కదా!
భౌతిక తలాలపై, మనస్సు యొక్క అధికారాలను , Living with the great Himalayan masters, written by Swamy Rama, ఒక యోగి ఆత్మ కథ, స్వేచ్ఛకు రెక్కలు, పైలట్ బాబా అనుభవాలు, గురుదేవ్ నారాయణ దత్త్ శ్రీమాలి అనుభవాలు......ఇలా చాలా మంది యోగుల,సిద్ధుల,తాంత్రికుల అనుభవాలు స్పష్టీకరిస్తున్నాయి.
No comments:
Post a Comment