నారద భక్తి సూత్రములు
39 వ సూత్రము
"మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ"
మహా పురుషుల సాంగత్యం దుర్లభం,అగమ్యం,అమోఘం.మహాత్ముల సందర్శనం అతిదుర్లం. అది ఎప్పుడు ఎలా అబ్బుతుందో ఉహిచలేము. అటువంటు వారి సందర్శనం అద్భుత ఫలితాలను ప్రసాదిస్తుంది.
అట్టి మహాత్ములు భగవతారాధనలో,ఆత్మరతి లో,తన్మయత్వంలో,సమాధిలో,జపతపాదులలో నిరంతరం నిమగ్నమై ఉంటారు.వారు సహజం గా జన సందోహంలోనికి రారు. ఎప్పుడైనా వచినట్లయితే అది పృద్వి చేసుకున్న పుణ్యం,మనకు మొక్షా ప్రదాయకం. ఎన్నో జన్మల పుణ్యం వల్ల వారి సందర్శనం లభిస్తుంది.
వారి అనుగ్రహణ భౌతికం గానే కాక వస్తు,విషయ,స్ఫురణ,గ్రంథ రూపంలోకూడా లభిస్తుంది.
ఒక సద్గురువు చరిత్ర పారాయణం చేయుట అంటే ఆ సద్గురువు తో భౌతికం గాను, అభౌతికం గాను సాహచర్యం చేస్తునట్లే, వారి చరిత్ర పారాయణం వారితో ప్రయాణం.
40 వ సూత్రము
"లభ్యతేపి తత్కృప యైవ"
భగవత్ కృపా ప్రసాదం చేతనే మహాత్ముల సందర్శనం,సాంగత్యం,సంసేవనం ప్రాప్తిస్తాయి.
ఎన్నో జన్మల పుణ్యఫలం వలన కానీ హరిభక్తి, హరికృప కలగవు, అలాంటిది అతి సులువుగా మహా గురుమూర్తుల సందర్శన భాగ్యం వల్ల కలుగుతాయి.
భగవద్విలాసం,సాధుసహవాసం పరస్పర ఆశ్రితాలు, సాధుసహవాసం లేకుండా భవత్కృపాలేశం ప్రాప్తిన్చదు,భవత్కృపాలేశం లేకుండా సాధుజన సందర్శనమే కాదు.
ఆచార్య సేవకల్గినప్పుడు శిష్యులకు,భక్తులకు దేవబ్రాహ్మణ తీర్దాది పూజలు అవసరం లేదు. ఆచార్య సౌభాగ్యం లభించనప్పుడు దేవబ్రాహ్మణ తీర్దాది పూజలు వల్ల ఫలితం లేదు.
మంగళం చేకూర్చాల్సి వచ్చినప్పుడు మాధవుడు మహాత్ములను భక్తుల దగ్గరకు పంపుతాడు లేదా తానే సద్గురువై భక్తులను ఉద్ధరిస్తాడు.
No comments:
Post a Comment