*ఒకప్పుడు సెలబ్రిటీ పెళ్లిళ్లను మాత్రమే కామెంట్ చేసేవారు, కాలం మారింది ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ గా సామాన్యుల పెళ్లిళ్లను troll చేస్తున్నారు*
*అసలు వీళ్ళ దృష్టిలో పెళ్ళికి కొలమానం ఏమిటో*
*అందం గా ఉన్నా అమ్మాయి కొంచం నల్లగా ఉన్న వారిని చేసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం అందుకే చేసుకొన్నది అంటారు*
*అందం గా ఉన్న అబ్బాయి నల్లగా ఉన్న అమ్మాయి ని చేసుకొంటే కట్నం కోసం చేసుకున్నాడు అంటారు*
*అసలు వాళ్ళ దృష్టిలో అందం అంటే ఏమిటో.*🤔
*వయసు తక్కువ అబ్బాయి వయసు ఎక్కువ అమ్మాయి ని చేసుకొంటే డబ్బుల కోసం*
*వయసు తక్కువ అమ్మాయి వయసు ఎక్కువ అబ్బాయి ని చేసుకున్న డబ్బులు కోసమే అంటారు*
*అసలు ఇలాంటి వారి సమస్యలు ఏమిటో అర్ధం కావు, వీళ్ళకి అల దొరకలేదానా లేక పెళ్లి కావడం లేదనే చిరాకు నా అర్ధం కాదు*
*ఇద్దరి మధ్య కల్యాణనికి చాలా అంశాలు ఉంటాయి అవి కలిసి ఉండే ఇద్దరు చూసుకుంటారు, ఇష్టం లేకుండా పెద్దల ఒత్తిడితో జరిగే వివాహల గురించి నేను ఏమి మాట్లాడను కానీ, ఇద్దరు ఇష్టపడి అందరిని ఒప్పించి చేసుకుంటున్నప్పుడు మీకు నొప్పులు ఎందుకు వస్తాయో అర్ధం కాదు*
*వివాహం అయ్యి ఉంటే మీ వివాహం అప్పుడు జరిగిన లావాదేవీలు గురుంచి మీ జీవిత భాగస్వామి అంద చందాలు చూసుకొని ఎదుటి వారి పరిణయం గురించి మాట్లాడండి*
*మీకు వివాహం కాకపోతే ఏ లావాదేవీలా వలన వివాహం కావడం లేడు లేదా ఏ అంద చందాలు మిమ్మల్ని ఆకర్షంచ లేక వివాహం కావడం లేదో చూసుకోండి*
*పెళ్లి చేసుకొని జీవితం పంచుకొనే ఇద్దరికీ ఒకరికొకరు నచ్చి వారు జీవితం అంత కలిసి ఉండగలం అన్న నమ్మకం ఉంటే చాలు*
*రోడ్డున పోయే ప్రతి ఒక్కరికి అవసరం లేదు, ఎదుటి వ్యక్తి జీవితాన్ని జడ్జిమెంట్ చేయగలిగినట్టు మన జీవితం కి కూడా చేయగలిగితే బావుంటుంది కదా...*😎
No comments:
Post a Comment