🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
చక్రార్ధ నిరూపణ/ షట్చక్ర నిరూపణ - 5
విశుద్ధ చక్రం
📚🖊️ భట్టాచార్య
విశుద్ధ చక్ర ఉనికి :
ఈ విశుద్ధ చక్రం కంఠానికి చెందిన, స్వరపేటిక ప్రాంతంలో ఉంటుంది.
ఇది మన శరీరమందలి చోటును అంటే ఆకాశ తత్వాన్ని నియంత్రణ చేస్తుంది.
ఈ చక్రాధిష్ఠాన దేవత పేరు ‘‘వజ్రేశ్వరి ’’. ఈ దేవత ఒకే ఒక ముఖంతో పాటల వర్ణం (తెలుపు, ఎరుపుల మిశ్రమం) లో ఉంటుంది. మన శరీరమందలి సప్త ధాతువులలోని ‘త్వక్’ అనగా చర్మ ధాతువునకు అధిదేవతగా ఉన్నది.
లలితా సహస్రం - విశుద్ధ చక్రం :
లలితా సహస్రంలో విశుద్ధ చక్ర వర్ణన ఇలా ఉంది...
శ్లో విశుద్ధి చక్ర నిలయా రక్త వర్ణా త్రిలోచనా ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా
శ్లో || పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ
అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ ||
ఇక్కడి వ్యాహృతి :
" ఓం జనః ".
శ్రీ చక్రార్చనలో ఈ చక్రాన్ని " సర్వార్థ సాధక చక్రావరణ " అని చెప్తారు.
విశుద్ధ చక్ర వర్ణన :
ఈ విశుద్ధ చక్రంలో ఒక త్రికోణం ఉంది. అందు వృత్తాకార మండలము కలదు. దీనిరంగు తెలుపు. ఇది ఆకాశ తత్వం కలది. ఇందులో కర్మేంద్రియమైన వాక్కు. శబ్దతన్మాత్ర కలవు. అంటే వినిపించేటట్లు చేసే తత్వం. దీనిపైన వర్తుల ఆకారంలో చంద్రమండలము నందు ఆకాశబీజమైన ‘హం’ ఉన్నది. ఈ బీజం తెల్లని రంగులో ఉండి పాశం ధరించిన ఏనుగుపైన కూర్చుని ఉంది. ఈ బీజం (హం) ఒడిలో వృషభ వాహనముపై అధిష్ఠించిన సదాశివుడున్నాడు. ఈయన అర్ధనారీశ్వర రూపం కలిగి ఉన్నాడు. పురుషరూపం తెల్లగాను, స్త్రీ రూపం బంగారు వర్ణంగాను ఉన్నారు.
ఈయన ఐదుతలలు, పది చేతులతో, శూల, టంక, వజ్ర, ఖడ్గ, అగ్ని, నాగేంద్ర, అంకుశ, పాశ, ఆయుధములు, అభయ ముద్ర ధరించి ఉన్నాడు.
ఈ సదాశివుడు శరీరమంతా భస్మం ధరించి, పులి చర్మం కట్టుకుని మెడలో నాగాభరణాలు ధరించి ఉన్నాడు. ఆయన తలపై నున్న చంద్రరేఖలో నుండి అమృత బిందువులు ఊరి ఫాలభాగముపై జారుతున్నాయి. చక్రకర్ణికలోని చంద్ర మండలములో అస్తి ఆసనంపై ఈ చక్రాధిష్టాత్రియైన ‘‘శాకిని’’ అధిష్ఠించి ఉంది.
విశుద్ధ చక్ర అధిష్ఠాన దేవత :
వజ్రేశ్వరి ( ఈ దేవత ఒకే ఒక ముఖంతో పాటల వర్ణంతో ఉంటుంది )
ధాతువు : సప్త ధాతువులలో చర్మ ధాతువుకు ఈ వజ్రేశ్వరి అధిదేవత.
విశుద్ధ చక్రంలో ఒక త్రికోణం ఉంటుంది. అందులో వృత్తాకార మండలం ఉంటుంది. దీని రంగు తెలుపు. ఇది ఆకాశ తత్వం కలది. ఇందులో కర్మేంద్రియమైన వాక్కు, శబ్ద తన్మాత్ర కలవు.
విశుద్ధ చక్ర సాధన :
విశుద్ధ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనము, విభేదనములకి సంబంధించి...ఆయా సాధకుల సాధనను అనుసరించి...సాధనా స్థితులు వస్తాయి.
ఈ చక్ర ఉద్దీపనకై ‘‘హం’’ అనే బీజ మంత్రం నిరంతరం ఉచ్ఛారణ చెయ్యాలి. అలాగే ఈ చక్రము యొక్క దళముల యందు గల బీజాక్షరాలు కూడా నిరంతర ఉచ్ఛారణ వలన , ఈ చక్రం జాగృతమవుతుంది. ఈచక్రం యొక్క శక్తికి అవరోధం కలిగించే విషయములు ఇతరులను తిట్టుట, అరచుట, అసూయ చెందుట, మొదలగు గుణములు. ఒకసారి శ్వాసపీల్చి వదిలితే, ఈ చక్రము నందలి నాడులు వేయిసార్లు స్పందిస్తాయి. మధురంగా పాడగలగడం, మృధువైన స్వరంతో మాట్లాడగలగటం, మొదలైన విభూతులు, విశుద్ధ చక్రం సక్రమంగా పనిచేయడం వల్లనే లభిస్తాయి. విశుద్ధి అంటే శుభ్రం చేయడం.
విశుద్ధ చక్ర జాగృతి, సిద్ధి పొందిన యోగి స్వర సిద్ధి పొందుతాడు. అపరిమితమైన ఊహాశక్తిని సృజనాత్మక శక్తిని పొందుతాడు.
ఈ విశుద్ధ చక్ర శుద్ధి అవుతున్న క్షణాన...కొంత మంది ఉన్నత స్థాయి సాధకులకు, " హం " అనే మధ్య బీజాక్షరము గల 16 దళాల కమలము గోచరించింది.
విశుద్ధ చక్రం - మంత్రానికి స్పందన :
ఈ విశుద్ధ చక్రం మంత్రోచ్ఛారణలకు స్పందిస్తుంది.
" హ్రీమ్ " మంత్రోచ్ఛారణతో ఈ చక్రాన్ని ఉద్దీపింపజేసుకోవచ్చును.
ఈ చక్రము నందు 1000 నాడులు కలవు. ఒక సారి శ్వాస పీల్చి వదిలితే ఈ వేయి నాడులు స్పందిస్తాయి.
విశుద్ధ చక్రం - కూర్మ నాడి :
విశుద్ధ చక్రంలో "కూర్మ నాడి " ఉంటుంది. ఈ కూర్మనాడిని చైతన్యవంతం చేయగలిగితే ఆకలి దప్పికలు తగ్గిపోతాయి. ఖేచరి ముద్రలోని ఆంతర్యం ఇదే.
ఈ చక్రం జాగృతమైతే వచ్చే అనుభూతులు :
విశుద్ధ చక్ర సిద్ధి అయినవాడు, ఆకాశ ధారణ ముద్రలో సిద్ధి పొందినచో, ఆకాశ గమన సిద్ధి పొందగలడు.
విశుద్ధ చక్రం జాగృతమయ్యేటప్పుడు త్రికాలజ్ఞానం పెరుగుతుంది.
భూత, భవిష్యత్తు వర్తమానాలను చెప్పగల శక్తి వస్తుంది.
యోగ సాధనలో నిరాహారంగా ఉన్ననూ, జీవించి ఉండే శక్తి వస్తుంది. ఇతరుల ఆలోచనలను గ్రహించగలరు.
విశుద్ధ చక్రంలో కుండలినీ వికాసం కలిగితే, ఇతరుల మనో భావాలు తెలుసుకునే సిద్ధి వస్తుంది. త్రికాల జ్ఞానము అనగా " భూత - భవిష్యత్ - వర్తమాన కాలాల జ్ఞానం " కలుగుతుంది.
మానవ శరీరంలో గల షట్చక్రాలు నేరుగా ఒకదానితో మరొకటి
అనుసంధానమై ఉంటాయి. ఈ చక్రాలన్నీ ఒక దానికొకటి పరి పూరకాలు.
విశుద్ధ చక్రం - స్వాధిష్ఠాన చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఒక చక్రం బలహీన పడితే, తత్సంబంధ చక్రం కూడా బలహీన పడుతుంది.
వీటిని ఎండోక్రైన్ వ్యవస్థ (endocrine system) నిర్వహిస్తుంది. ఈ ఎండోక్రైన్ వ్యవస్థ - చక్ర వ్యవస్థ పరస్పర పరి పూరకాలు.
సప్త చక్రాలు (సహస్రారం తో కలిపి) కాంతి మండల ప్రాంతం మరియు మెరిడియన్ వ్యవస్థల (meridian system) మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా విభిన్న శక్తి స్థాయిల్ని ( energy levels ) ఏర్పరుస్తుంది. ఈ శక్తి భౌతికంగా శరీరంలోనికి ప్రవహించడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది.
విశుద్ధ చక్ర వర్ణన : విశుద్ధ చక్రానికి 16 దళాలు గల వాగ్దేవి శబ్దాలయిన అచ్చులు ఉంటాయి.
అవి " అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, ఋం, ౠం, లుం, లూం, ఎం, ఐం, ఓం, ఔం, అం, అః "
ఈ విశుద్ధ చక్రపు బీజ మంత్రం " హం ".
లౌకిక సంబంధాల నుండి విడివడి అలౌకిక విషయాలతో అనుసంధానమయ్యే చక్రమే " విశుద్ధ చక్రం ".
ఈ విశుద్ధ చక్ర దళాలలో ప్రతి దానికి బిందువుంటుంది.
ఈ విశుద్ధ చక్రం సదాశివునికి స్థానమైనది.
ఈ చక్ర తత్వం : ఆకాశ తత్వం
ఈ చక్రం మన శరీరమందలి చోటును ( space ) అనగా ఆకాశతత్వాన్ని నియంత్రిస్తుంది.
విశుద్ధ చక్రం బాగు లేకపోతే : విశుద్ధ చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే థైరాయిడ్ సమస్యలు వస్తాయి, ఎక్కువగా లేదా తక్కువగా చురుగ్గా ఉండటం, ఆతురత ( బహళ చక్ర సమస్య, అయితే ఇది ప్రధానం గొంతు చక్రానికి సంబంధించినది), ఆస్తమా, ఊపిరితిత్తుల్లో నిమ్ము, వినికిడి, ధనుర్వాతం వంటి సమస్యలు ఏర్పడతాయి... ఇవి ఆజ్ఞా చక్రానికి సంబంధించిన సమస్యలకు కూడా అనుసంధానం అవుతాయి.
ఈ చక్రం సమంగా పనిచేయకపోతే, జీర్ణ వ్యవస్థ లోపాలు, నోటిపుండ్లు, గొంతులో పుండు, గొంతులో కాయలు ఏర్పడతాయి. ఈ చక్రంలో అడ్డంకులు ఉంటే, ఆత్మ స్థైర్యం లోపిస్తుంది. వెన్నెముక సమస్యలు కూడా వస్తాయి. వాటి నుండి బయట పడడానికి సింహ గర్జన, సింహాసనం సాధన చేయాలి. ఈ సాధన వల్ల గొంతులో కఫం పేరుకుపోవడం వలన ఏర్పడ్డ సమస్యలు తొలగిపోతాయి.
విశుద్ధ చక్రం బలపడాలంటే సర్వాంగాసనము, విపరీత కరణి ముద్ర, మత్స్యాసనము, ఉజ్జయీ ప్రాణాయామముతో పాటు ఆకాశముద్ర లేదా ఉదాన ముద్ర ఆరు మాసాలు వేస్తే ఈ చక్రం బలపడుతుంది.
విశుద్ధ చక్రము - థైరాయిడ్ గ్రంథి :
ఇది “థైరాయిడ్” గ్రంథికి సంబంధించి యున్నది.
ఆకాశ తత్వం ఈ చక్ర లక్షణం.
ఇది వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియం తో అను సంథానమై ఉన్నది.
ఈ విశుద్ధ చక్రం పంచ వాయువు లలో ఒకటైన "ఉదాన వాయువు" తో అనుసంథానమై యున్నది…
ఇక్కడి అధిష్ఠాన దేవత “సదాశివుడు”. ఇక్కడి శక్తి “శాకిని…
ఈ చక్రం నేరుగా మెదడుతో అను సంథానమై యుంటుంది…
"తమసోమా జ్యోతిర్గమయ"
విశుద్ధ చక్రము - సిద్ధులు : ఆయా చక్రాలు జాగృత పరిచినప్పుడు, కొన్ని రకాల శక్తులు మరియూ సిద్ధులు వస్తాయి. విశుద్ధ చక్రం జాగృతం అయినప్పుడు " Telepathic Communication " అనుభవం వస్తుంది. ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క స్థానాన్ని జాగృత పరుస్తున్నప్పుడు, ఒక్కోరకమైన అనుభవాలు కలుగుతాయి. ఈ అనుభవాలతో భయాందోళనలు చెందకుండా ముందుకు సాగిపోవాలి.
విశుద్ధి లేదా విశుద్ధ, అంటే ప్రధానమైన అర్ధం వడపోత (filtration). మీ విశుద్ధ చక్రం ఉత్తేజితం (క్రియాశీలం) అయితే, అన్నిటినీ వడపోస్తుంది.
విశుద్ధ చక్రం ఉత్తేజితం అవటమంటే, ఒక విధంగా మీకు రహస్య (మార్మిక) శక్తి పొందే ప్రయోజకత్వం కలుగుతుంది.
విశుద్ధి రహస్య శక్తులకు కేంద్రం.
మన పురాణాల్లో......పరమశివుడి కంఠం "నీలం" రంగులో ఉండడం, విశుద్ధ చక్రం యొక్క ప్రతీకాత్మక వర్ణన.
విశుద్ధ చక్రానికి థైరాయిడ్ గ్రంథికి గల సంబంధము - వైజ్ఞానిక విశ్లేషణ:
ఇది చాలా పెద్ద గ్రంధి. Larynx కి దగ్గరగా wind pipes కి పైన కంఠము వద్ద ఉన్నది. ఇది sex gland గా తరచూ వర్ణిస్తారు. దీనిని మూడవ ovary గా వర్ణిస్తారు. అనేక ovation cases లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతేకాక కి tissues మధ్య భేదాలను గుర్తించగలదు. దీనికి anti toxic power ఉన్నది. విష ప్రభావం నుంచి రక్షణ ఇస్తుంది. మరియు విష నిరోధక శక్తిని పెంచుతుంది. విషం అనగా విషయ వాసనల వైపుకి మనలను ఆకర్షించే స్పందనలు.
ఈ చక్రానికి సంబంధించిన గ్రంథి " థైరాయిడ్ ". థైరాయిడ్ గ్రంథి , విశుద్ధ చక్రము పరస్పరం పరిపూరకంగా ఉంటాయి.
విశుద్ధ చక్రం సరిగ్గా పనిచేయించగలిగితే, థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుంది.
థైరాయిడ్ గ్రంథి యొక్క అతిముఖ్య క్రియాకలాపం ఏమిటంటే శక్తి యొక్క మెటబాలిజమ్ నియంత్రిస్తుంది. అందువల్ల దీనిని శక్తి రూపాంతరీకరణ యొక్క లూబ్రికేటర్ (efficient lubricator) గా పేర్కొంటారు. శరీరము లో ఉన్న శక్తి యొక్క అత్యంత శక్తివంతమైన ఉత్ప్రేరకము. ఇది జీవించే విధానం యొక్క వేగాన్ని నియంత్రణ చేస్తుంది.
ఈనాటి వేగవంతమైన జీవితం ....కారణమేమిటంటే - విశుద్ధ చక్రము యొక్క క్రియాశీలతే కారణము. ఇది endocrine system యొక్క ఆధార శిల.
విశుద్ధ చక్ర సిద్ధి అయిన సాధకుడు, కొన్ని సార్లు తాను జ్ఞానిననే మాయలో పడతాడు. ఈ మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
విశుద్ధ చక్రం యందు ఏకాగ్రంగా ధారణ చేసి, ధ్యానం చేస్తే, సాధకునిలో ఆకాశం లాంటి నిర్మలత్వం, స్వచ్ఛత వస్తాయి.
ఆనందమయ స్థితి ( BLISS ) వస్తుంది.
విశుద్ధ చక్రం సమతా స్థితిలో ఉండాలంటే " వాక్సుద్ధి " అవసరం. వాక్సుద్ధి ఉంటే " వాక్సిద్ధి " వస్తుంది.
No comments:
Post a Comment