Friday, November 29, 2024

 *సహనంతో సర్వం సాధ్యం!*
శిష్యునిగా రాణించాలంటే సహనం కీలకం. అందుకే "లక్షమంది గురువులు లభిస్తారు. కానీ శిష్యుడొక్కడైనా దొరకడం కష్టం." అని అంటారు. శిష్యుడవడం అంత సులభమైన పనికాదు. విశేషమైన సన్నాహం కావాలి. అనేక నియమాలను పాటించాలి. శిష్యుడు అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహాన్ని అలవరచుకోవాలి. ఇంకా అనేక ఆధ్యాత్మిక గుణగణాలలో సుప్రతిష్ఠుడు కావాలి.

బహిరింద్రియాలు మనకు కనబడు తుంటాయి. అంతరింద్రియాలు మనకు కనబడేవి కావు. మనం సదా ఈ ఇంద్రియాల పిలుపులను విని పెంచుకొంటూ, అవి ఆడించినట్లు ఆడుతుంటాం. ఈ ఇంద్రియా లకు సంబంధించిన వస్తువులు బాహ్య ప్రపంచంలో అంతటా ఉన్నాయి. దగ్గరలో ఏవైనా వస్తువు • లుంటే వాటిని చూడమని ఇంద్రి యాలు మనల్ని నిర్బంధిస్తాయి. చూడడం, చూడకపోవడం మనకు సుసాధ్యాలైన పనులు కావు. మనకు స్వతంత్రం లేదు. ఇక్కడో పెద్ద ముక్కు ఉంది. ఎక్కడ నుంచో మంచివాసన వస్తోంది. నేను ఆఘ్రాణించ వలసిందే.

మనస్సును ఆదేశించాలి. మనస్సు ఆ ఆజ్ఞను శిరసావహిస్తుంది. అప్పుడది దేన్నీ చూడదు. వినదు. ఏ రూపమైనా, శబ్దమైనా మనస్సును చలింప జేయలేదు. ఇంద్రియాల ఆధిపత్యం నుంచి మనస్సు విడివద్ద స్థితి అది. వాటి నుంచి మనస్సు వేరుపడింది. అది ఇక ఇంద్రియాలను గానీ, దేహాన్ని గానీ అంటిపెట్టుకోలేదు. అప్పుడు బాహ్యవస్తువులు మనస్సును ఆజ్ఞాపించలేవు. వాటిని అంటి పెట్టుకోవడానికి మనస్సు ఇప్పుడు నిరాకరిస్తుంది. మీరీ దశను పొందినప్పుడు శిష్యులవడానికి అర్హత పొందారని గ్రహించండి. ఇందుచేతనే "మీకు సత్యం తెలిసిన పక్షంలో ఇంద్రియ నిగ్రహం సాధ్యం. మీకు సంయమశక్తి ఉంటే ఈ ఇంద్రియాలను అదుపులో పెట్టి చూపండి" అని నేను అంటాను. మనస్సెప్పుడూ బహిర్ముఖమై పరుగెత్తుతుంది. నేను ధ్యానం చెయ్యడానికి ఉపక్రమించగానే లోకంలోని తుచ్ఛ విషయాలన్నీ మనస్సులోకి పరుగెత్తివస్తాయి. మనస్సు స్వాధీనం తప్పి, చంచలంగా ఉన్నంతదాకా ఆత్మజ్ఞానం అసాధ్యం.               *మనోనిగ్రహం కోసం సాధన*

మనమెలా అయ్యామో చూడండి! మనల్ని మనమే బంధించుకొన్నాం. నాకు కళ్ళున్నాయి. ఎదుటనున్నది ఎలాంటిదైనా సరే చూసి తీరవలసిందే. ఎవరైనా అప్రియంగా మాట్లాడినా నేను విని తీరవలసిందే. నా శ్రవణేంద్రియం నన్నా విధంగా నిర్బంధిస్తుంది. పొగడినా, తెగడినా- మానవుడు వినే తీరాలి.

ఈ ఇంద్రియాలన్నీ - బహిరింద్రియాలు, అంతర్ ఇంద్రియాలు శిష్యుడి అధీనం కావాలి. శ్రమపడి అభ్యాసం చేసి చేసి అతడా స్థితికి రావాలి. ఇంద్రియాల ప్రేరణలకు, ప్రకృతి ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనస్సును దృఢంగా అతడు వశం చేసుకోవాలి. "నువ్వు నా దానవు నిన్నాజ్ఞాపించ వలసింది నేను. నువ్వు దేన్నీ చూడొద్దు, వినవద్దు" అని

శిష్యుడికి సహనశక్తి అపారంగా వుండాలి. జీవితం సుఖంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మీతో మనస్సు సరసంగా వ్యవహరిస్తుంది. కానీ ఏదైనా ప్రతికూలమైన్పుడు మనస్సుకు స్వాస్థ్యం తప్పిపోతుంది. అది మంచిది కాదు. దుఃఖాలనూ, కష్టాలనూ సణుగుడు లేకుండా భరించు. నీకు అపకారం జరిగినట్లు భావించవద్దు. ప్రతిక్రియ అనే ఆలోచన లేకుండా భరించాలి. ఇది యథార్థమైన సహనం. ఇలాంటి సహనాన్ని అలవరుచుకుంటే సర్వం సాధించవచ్చు. II

(స్వామి వివేకానంద సాహిత్య సర్వస్వం 'లేవండి! మేల్కొనండి' నుంచి).                   

No comments:

Post a Comment