*ధర్మం.....*
*ఏమైనా ప్రకృతి ఉపద్రవాలు, వేదనలు కలిగితే 'ధర్మానికి దెబ్బ తగలడం వల్లనే ఇలా జరిగింది' అంటారు. ఇది మూఢ నమ్మకం ఆ... భూమి కింద మార్పులు జరిగితే భూకంపం వస్తుంది. సముద్రంలో అల్ప పీడనాదులు కలిగితే తుఫానులొస్తాయి. అంతేకానీ, ధర్మము వల్ల ఉపద్రవాలు కలిగాయనడం సమంజసమా...*
*ఒంట్లో బాక్టీరియావో, వైరస్సో చేరితే అనారోగ్యం వస్తుంది. నిజమే.. కానీ ఆ ప్రమాదకర పదార్థం చేరడానికి కలుషిత పదార్థాల వాడకం వంటి మరేదో కారణం ఉంటుంది కదా.. కనబడే కారణాలకు మూలమైన కనబడని కారణాలు చాలా ఉంటాయి.*
*పై పై కారణాలను భౌతిక విజ్ఞానం చెబితే, ప్రభావవంతమైన సూక్ష్మ కారణాలను సూక్ష్మ విజ్ఞానం చెబుతుంది. కొమ్మలేనిదే పళ్లు లేవు.. అనేది ఒక కారణం. కానీ మూలం లేనిదే కొమ్మలేదు అనేది ముఖ్య కారణం. ధర్మానికి, ప్రకృతికీ అవినాభావ సంబంధముంది. ప్రకృతి జడపదార్థం కాదు. అది చైతన్యవంతం.*
*ప్రకృతి శక్తులు మానవ ప్రవర్తనల్ని పరిశీలిస్తుంటాయి. ధర్మానికి విఘాతం ఏర్పడితే పంచ భూతాలు క్షోభిస్తాయి. ఇది విశ్వనియమం. కేవలం తాత్కాలిక భౌతిక సుఖాలను దృష్టిలో పెట్టుకొని శాశ్వత ధర్మాన్ని దెబ్బతీస్తే ప్రకృతి శక్తులు విజృంభించక తప్పవు. సత్యం, శుచి, శుద్ధత, ధర్మమైన సంపాదన, అహింస, ఇంద్రియ నిగ్రహం... ఇవి ప్రధాన ధర్మసూత్రాలు. వీటిని విడనాడినప్పుడు దుష్ఫలితాలను అనుభవించక తప్పదు...*
*🪷|| కృష్ణం వందే జగద్గురుమ్ ||🪷*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁
No comments:
Post a Comment