🙏🕉️
శ్రీ కృష్ణుడి జీవితమంతా సంక్షోభం, పోరాటం, సవాళ్ల కథ. ఆయన పుట్టడమే చావుల మధ్యలో.. జైలులో పుట్టారు. అక్కడ నుంచి రక్షణ పొంది.. గోకులం చేరిన తరువాత పసి వయసులోనే రాక్షసుల నుంచి తనను తాను రక్షించుకునే పోరాటం చేయాల్సి వచ్చింది. జరాసంధ భయంతో, ఆయన తన కుటుంబంతో సహా మధురను వదిలి ద్వారకలో స్థిరపడాల్సి వచ్చింది. మహాభారత యుద్ధంలో ఆయన ఎంతో కోల్పోయారు. ఇందులో కృష్ణుని ఏకైక సోదరి సుభద్ర కుమారుడు అభిమన్యుడు దారుణంమైన చావుకు బలి అయ్యాడు. గాంధారి తన సంపూర్ణ వినాశనం కోసం కృష్ణుడిని శపించింది. కృష్ణుడి కళ్ల ముందు అతని కుటుంబమంతా తమలో తాము పోరాడి చనిపోయారు. శ్రీ కృష్ణుడి జీవితం పుట్టుక నుంచి చివరి వరకు, చాలా అసహ్యకరమైన, బాధాకరమైన ఎన్నో సంఘటనల నేపధ్యంలో గడిచింది. ఇంత జరిగినా, కృష్ణుడి కళ్ల నుంచి కన్నీళ్లు రాలేదు. ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. దీనినే మనమూ అనుసరించవచ్చు. మనలో కృష్ణుడిని దేవునిగా చాలా మంది ఆరాధిస్తారు. దేవుడిపై నమ్మకం లేనివారికి కూడా ఒక కథగా మనం చెప్పుకున్నా.. కృష్ణుని చిరునవ్వు మనందరికీ ఆదర్శప్రాయమే. కష్టంలో కూడా నవ్వుతూ దానిని దాటే ప్రయత్నం చేసేవారికి విజయం కచ్చితంగా దొరుకుతుంది. అదే శ్రీ కృష్ణుడు బోధిస్తాడు …” జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, దానిని చిరునవ్వుతో ఎదుర్కోవాలి.”🙏🕉️
No comments:
Post a Comment