Tuesday, November 26, 2024

 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*మితిమీరితే అమృతం కూడా విషమవుతుంది. దానివల్ల కలిగే దుఃఖాలెన్నో కనుక "అతి అనే దోషం" సాధకులు తమవల్ల కలగకుండా చూసుకోవాలి.*

వివరణ : *శ్రీ మురుగనార్  చెప్పింది : జాగరణలు, ఉపవాసాలు ఆధ్యాత్మిక జీవితంలో సహాయకారులైనప్పటికీ, అతిగా అనుసరిస్తే అవి ప్రతిబంధకాలవుతాయి. భగవద్గీతలో ఈ భావాన్ని అంటే అతిగా ఆచరించే వాడు యోగసిద్ధి పొందడని శ్రీ కృష్ణ భగవానులు ఉపదేశించారు. శ్రీరమణ మహర్షులు కూడా ఉపవాసంలో మిత సాత్త్విక ఆహారమే సాధనకు సహాయ పడుతుందని చెప్పటం కద్దు.*

సాధనలో ఏ దివ్యనాదాలు నీవు విన్నా,
ఏ దివ్య దర్శనాలు నీవు చూచినా,
వాటిని వినేవాడూ చూచేవాడు ఒకడుండాలి అతడే
నీలో ఉన్న 'నేను'.  'నేనెవరిని?' అని విచారణ 
ద్వారా ఆ 'నేను' ను  అన్వేషిస్తే, విషయాలూ విషయి
ఒక్కటై పోతాయి..ఆపైన ఇక అన్వేషణ లేదు..
అంతవరకూ ఆలోచనలు పుట్టుతూనే ఉంటాయి..
విషయాలు గోచరిస్తూ మాయమవుతూనే ఉంటాయి
ఏమి జరిగింది, ఏమి జరగబోతుంది అనే ప్రశ్నలు
నీకు తప్పవు...విషయి తెలియబడితే విషయాలు
విషయిలో లీనమైపోతాయి!

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.493)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment