సర్వమంత్రప్రకాశాం చ మాతృకారూపిణీం భజే ॥
లో బాలా, మాతంగీ మొదలయిన ముఫ్పై రెండు రకాల దీక్షలున్నాయి.
వీటివల్ల జ్ఞానము విస్తరించటంచేతనే వీటిని విద్యాంకురాలు
మంత్రము : ఐం ఈం ఔః ॥
మూలాధారచక్రము నుండి ఊర్ధ్వముఖమైన శ్రీవిద్య అనే శుద్ధ విద్య యొక్క నాల్గు అవస్థలు ఇచ్చట వివరింపబడినవి. అనగా శ్రీవిద్య యొక్క శబ్ద బ్రహ్మరూపము.
బీజమువలె ఉబ్బుట, స్ఫుటము అగుట, ముకుళించి దళ ద్వయము అగుట, వికసించుట అనేవి నాల్గు దశలు అగును.వీటినే పరా,పశ్యన్తీ,మధ్యమా,వైఖరీ.. అనే వాగ్దశలు అగును.
అమ్మవారికి పైన 16 కింద 16 దంతాలు ఉన్నాయి. అవి మానవ దంతాల వంటివి కాదు. శుద్ధ విద్య తల్లికి దంతాలుగా ఉన్నాయి.
శుద్ధ విద్య అంటే స్వ,పర అనే భేదభావం లేనిది .భేద బుద్ధి లేకుంటే మానవుడు భగవత్ స్వరూపుడైన అవుతాడు.
విత్తనం భూమిలో నాని మొలకెత్తడానికి సిద్ధం గా ఉండేది మొదటిదశ.ఇదే వాక్కులో 'పరా' నామంతో పిలువబడుతుంది.
రెండవ దశ మొలకెత్తే దశ దీన్నే వాక్కులో 'పశ్యంతి'నామంగా పిలవవచ్చును.
రెండాకులు మొదటగా వచ్చి చెట్టు పెరిగే దాకా ఆహారం సరఫరా చేసే దశ మూడవ దశ. దీనిని వాక్కులో 'మధ్యమ' అంటారు.
ఈ ఆకులు రెండూ బాగా వికసించిన వేరుతో పాటు కలిసి ఉంటేనే చెట్టు మొలక లాంటిది. అమ్మ వారి దంతాలు ఈ మొలకలుగా ప్రకాశిస్తున్నాయి.
శుద్ధ విద్య అంటే శ్రీ షోడశాక్షరీ విద్యానాం హయగ్రీవుడు అగస్త్యమహాముని తో చెప్పాడు.అమ్మవారి దంతాలు షోడశాక్షరీ మంత్ర స్వరూపాలు.
ద్విజులు అంటే బ్రాహ్మణులు(విప్రులు)అని అర్థం.
రెండు దంత పంక్తులే ద్విదళము అగును. దంతముల క్రింది పదునారు, పైన పదునారు ఉండుట ప్రసిద్ధము. ఒక దంత పంక్తిని శివరూపముగాను, రెండువ వరుసను శక్తి రూపముగాను గ్రహింపదగును. శ్రీవిద్యలో ముఖ్యమైన వాగ్వికాస విలాసం గూర్చి లలితా సహస్రనామావళిలో ఉన్నది. ఈ నామాలు అనుష్టుప్ ఛందస్సుతో కూడినవి.
శ్లోకంలో ఒక పాదానికి ఎనిమిది అక్షరముల చొప్పున నాలుగు పాదము లుండును. మనకు దంతాలు పై వరుస, క్రింది వరుస అని ఉండును కదా. పై వరుసలో ఎనిమిది రకాల పళ్ళు గట్టిగా ఇరువైపులా ఉండును. ఆ విధముగనే క్రింది వరుసలో గూడ ఉండును. మొత్తం నాలుగు ఎనిమిదులు ముప్పదిరెండు అగును.
దీనిని బట్టి ఒక పలువరుస పదహారు బీజాక్షరములు లెక్కన రెండు వరుసలలో కలిపి ముప్పది రెండు అక్షరములు అగును. శ్రీదేవి దంతపంక్తి ద్వయం కలిస ప్రకాశించునని గ్రహించవలయును. వేదవిద్య, షోడశీ విద్యా వ్యాప్తికి ద్విజ పంక్తి ద్వయాన్ని శ్రీమాత తన దంత వరుస గల్గినదని అర్థము.
శుద్ధవిద్య లేక శ్రీ విద్య లేక షోడశీ విద్య. పరా, పశ్యంతి, మధ్యము. అది క్రమముగా వైఖరీ రూపమై ముఖము నుండి బహిర్గతమై గురువు నుండి శిష్యునకు విస్తరించును.
శబ్ద బ్రహ్మమునకు రూపము బీజము. అట్టి బీజములోని అభివృద్ధియే పరావాక్కు. దాని అంకురిత దశయే పశ్యంతి. విచ్చుకొనియు వ్యక్తముగాక యుండు ఆకుల జంట మధ్యమ. రెండు దళములు విడివడి, వికసించి, మధ్య నుండి వేరు మొలకగా నిలచుట వైఖరీ. దీనినే అంకుర మందురు. అట్టి అంకురమునకు, రెండు వరుసల దంత పంక్తులకు సామ్యము గలదు.
హల్లులు చేరని పదునారు అచ్చులు శుద్ధవిద్య. ఈ అచ్చులకు తాళువుల సంపర్కము లేదు. పదునారు అచ్చులునూ అంకురములు. ఆకుల జంట లేక పైతాళువు లేక క్రింది తాళువుల దంతములు శివశక్తులు. అట్టి ముప్పది రెండు అంకురములే ముప్పది రెండు దంతములుగ నున్నవని తెలియవలెను.
అక్షరములను చక్కగ ఉచ్చరించుట, స్పష్టముగ పలుక గలుగుట శుద్ధవిద్యకు ప్రాథమిక అర్హత. ఒత్తులు పలుకలేని వారు, ఇ, జు పలుకలేని వారు, శ, ష, స అక్షరాలను స్పష్టముగ పలుకలేనివారు ఆ జన్మమున శుద్ధ విద్య నందలేరు. ఇట్లు పలుకగల్గు సామర్ధ్యము గలవారినే శ్రీ విద్యకు గాని, వేద విద్యకుగాని గురువు లెన్నుకొందురు. అర్హత లేని వారియందు విద్య భాసించదు.
వారి వారి అర్హతలను బట్టి అర్హమైన విద్యల నందించువాడే సద్గురువు.
శుద్ధ విద్యాంకురము పొందినవారిని బ్రాహ్మణుడందురు. వారు విద్యాంకుర రూపులు. వారి పంక్తిద్వయముచే శుద్ధవిద్య ప్రపంచమున ప్రకాశించును. వారు దేవీ ముఖము నుండి బయల్పడిన వారే. అందుచే దేవీ దంతములతో సాటిలేని వారని భావము. ఈ అంశమునే బ్రాహ్మణాస్య ముఖమాసీత్' అని పురుషసూక్తము గానము చేయు చున్నది.
శుద్ధవిద్యకు ముప్పది రెండు దీక్షలు ప్రసిద్ధముగ నున్నవని తంత్రశాస్త్రము తెలుపుచున్నది. ఈ ముప్పది రెండు దీక్షలే ముప్పది రెండు దంతములు. దీక్షలు పొందిన వారందరూ కూడా ద్విజులని శాస్త్రము తెలుపుచున్నది. ఈ శుద్ధవిద్యా దీక్షయందలి ముప్పది రెండు దీక్షలునూ దీక్షిత అంతఃకరణలై నిర్వర్తించినవారు పురుషశ్రేష్ఠులు.
వారినే దేవీ ఉపాసకులు అనుట తగును.
ద్విజపంక్తి యనుటలో విశేషార్థమేమన, రెండవసారి జన్మించిన పంక్తులని అర్థము. బాలదంతములు (పాల పండ్లు) వూడి, మరల దంతములు వచ్చును గనుక ఈ దంతములు ద్విజ దంతములు.
అవిద్యా మలముతో కూడినటువంటి జ్ఞానము నశించి, శుద్ధవిద్యతో కూడిన జ్ఞానము ఉదయించుట కూడా ద్విజత్వముగ చెప్పబడును.వీరినే బ్రాహ్మణులని, మరల పుట్టినవారని తెలుపుదురు. మొదట, మలమూత్రాదులతో కూడిన శరీరము నందు పుట్టిన జీవుడు విద్యా సాధనము ద్వారా వెలుగు శరీరమున పుట్టుటను మరల పుట్టుట అందురు. వీరికి దేహాత్మ భావనము లేక కేవలము జీవాత్మ భావనయే యుండును. అట్టి వారి మనస్సున భేదభావనము లుండవు. భేద భావనలు లేకపోవుటయే శుద్ధ విద్యకు తార్కాణము. ఇట్టివారికే పరాశక్తి సుసాధ్యము. ఇతరులకు దుర్లభము.
పైన తెలిపిన విధముగా దంతములు గలవారి చిరునవ్వు ప్రకాశవంతముగ, ఆకర్షణీయముగ, సమ్మోహనముగ నుండును. ఆ మహిమ వారి దంతముల నుండి ఉద్భవించు ఉజ్వల ప్రకాశమే. అమ్మ దంతములు మరింత మహోజ్వలముగ ప్రకాశించి సమ్మోహితులను చేయగలవని భావము.
నేను, నీవు, అతడు అను భేదములేని విద్యయే శుద్ధ విద్య. శ్రీవిద్యకు అట్టి భేదము లేదు గనుక అది శుద్ధవిద్య యగుచున్నది. విద్య-శుద్ధ విద్యగాను, అశుద్ధ (అవిద్య) విద్యగాను సృష్టియం దుండును.
అవిద్య యను మలములకు విరోధియైన శుద్ధ విద్య, షోడశీ రూపమైన విధ్య. అనగా పదునారు బీజాక్షరములతో కూడిన విద్య. ఈ బీజాక్షరములు మెరికల వంటివి. వీటినే పదహారు దంతముల జంట వరుసగా, అమ్మవారి దంతములను వర్ణించుట ఋషి సమన్వయము. అట్టి దంతముల వరుస మిక్కిలి ప్రకాశవంతముగా నున్నది.
ఉజ్వలమైన పదహారు దంతముల వరుసను నీయొక్క శుద్ధ విద్యాంకురములుగ కలిగిన దేవి యని ఈ నామము స్తోత్రము చేయుచున్నది. పదహారు దంతములు పై వరుస యందు, పదహారు దంతములు క్రింది వరుస యందు హెచ్చుతగ్గులు లేక కలిగినవారే ఈ బీజాక్షరములనెడి విద్యాంకురములను చక్కగా ఉచ్చరించగలరు. ఇతరులకు సాధ్యపడదు.
🕉🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment