*ధ్యాన మార్గం*
సత్యానికీ, మానవాళికీ, నీ దేశానికీ విశ్వాసపాత్రుడవై ఉండు.
నీవు ప్రపంచాన్ని కదలించి వేయగలవు.
🌴🌴🌴
నాదృష్టిలో ఎవరైనా తనను తాను అల్పుడనని, హీనుడనని తలచడమే మహా పాతకం, అజ్ఞానం. ప్రతి ఒక్కరిలోనూ అనంత జ్ఞానము పూర్ణముగానే ఉంది. -
🌱🌱🌱
అమృతపుత్రులు'... ఎంత మధురమైన ఆశాజనకమైన పేరు!
సోదరులారా! మిమ్మల్ని ఈ మధురమైన అమృతపుత్రులు పేరుతో పిలువనివ్వండి. మీరు భగవంతుని పుత్రులు, దివ్యానందానికి వారసులు, పవిత్రులు, పరిపూర్ణులు. భువిపై నడయాడే దేవతలు. మీరు పాపులా! ఒక మనిషిని అలా పిలవడమే పాపం; కళంకరహిత మనిషి నిజస్వభావానికి కళంకం ఆపాదించడమే.
🎋🎋🎋
ఒక వ్యక్తితో “నువ్వు అధముడవు, దుష్టుడవు” అని పదే పదే చెప్పడం వలన క్రమంగా ఆ వ్యక్తి తాను నిజంగాఅలాంటివాడే అని నమ్ముతాడు. ఇంకొకరిని 'పాపి' అని అనడమే మీరు చేసే పెద్ద తప్పు. ప్రతి ఒక్కరూ సమ్మోహితులై ఉన్నారు. దాని నుండి బయటపడాలంటే తమ నిజస్వరూపం గురించి తెలుసుకొనిముక్తులుకావడమే. -Swami Vivekananda.
No comments:
Post a Comment