*ఒక మగవాడు జీవితాంతం ఏమి చేసినా రుణం తీర్చుకోలేనిది మాత్రం ఇద్దరికి.*
*ఒకటి తనని నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లికి,*
*రెండు తన ప్రతిరూపమైన బిడ్డలని నవమాసాలు మోసి, కని, పెంచి, ఇచ్చే భార్యకి.*
*ఇద్దరు చేసింది ఓకే పని,*
*ఇద్దరు పడింది ఓకే కష్టం,*
*ఇద్దరు చూపించేది ఓకే ప్రేమ.*
*ఒకరు తను కళ్ళు తెరవగానే మొదటిగా చూసినవారు.*
*మరొకరు కళ్ళు మూసేటప్పుడు చివరిగా చూడాలి అనుకునేవారు.*
*ఎవరు ఎక్కువ కాదు,ఎవరు తక్కువ కాదు.*
*కాకపోతే*
*తల్లి అనే బంధం ఎవరెస్ట్ శిఖరం లాంటిది,*
*ప్రతి భార్య చేరుకోవాలి అనుకునే గమ్యం కూడా అదే ......*
*అయితే భార్య ప్రయాణం కొత్తలో భర్త యొక్క తల్లి స్థానం అందనంత ఎత్తులో ఉన్నట్టు ఉంటుంది.*
*కానీ*
*ఒకసారి భార్య కూడా తల్లి అయ్యి ఆ శిఖరం అధిరోహించాక*
*అప్పుడు*
*తల్లి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది,*
*ముందు తల్లికి కొడుకు అయ్యాకే,*
*తనకి భర్త కాగలిగాడు అనే నిజం భార్యకి అర్థమవుతుంది....*
*ఒక మగవాడి జీవితంలో తల్లి భార్య ఇద్దరు ముఖ్యమే.ఇద్దరిలో ఎవరు వారిది వారిలో ఏ స్థానం తగ్గిన మగవాడి జీవితం తలకిందులు అవ్వుతుంది....*❤️
No comments:
Post a Comment