Friday, November 29, 2024

 *హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ ప్రముఖ వ్యాపార వేత్త, వారు హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు.*

*ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు.*

*వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడే...*

*ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని*

*తగినమార్పులు చేయించుకోమని వారికి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు.*

*సత్యనారాయణ గారు వాస్తును పరిశీలించే శాస్త్రి గారిని తీసుకొని కారు లో ఇద్దరూ బయలుదేరారు.*

*కొంతప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో సత్యనారాయణ గారు కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి, వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన శాస్త్రి గారు చిరునవ్వుతో ...*

*మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు.*

*దానికి సత్యనారాయణ గారు నవ్వుతూ అయ్యా! వారికి ఎదో అత్యవసరపని అయిఉండొచ్చు, అందుకే తొందరలో వెళ్తున్నారు.అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారిఇవ్వడం మన ధర్మం కదండీ! అన్నారు.*

*అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది.*

*అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో సత్యనారాయణ గారు కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు.*

*ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన సత్యనారాయణ గారు అతడిని తప్పించి తన కారును మరింత నెమ్మదిగా పోనిస్తున్నారు.*

*అది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది.*

*ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు*

*ఈసారి ఆశ్చర్యపోవడం శాస్ట్గ్రీ గారి వంతైంది. ఆయన సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడను మీరెలా ఊహించారు అని ప్రశ్నించారు.*

*సత్యనారాయణ గారు నవ్వుతూ...*

*పిల్లలెప్పుడూ అంతేకదండి!*

*ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా? అన్నారు.*

*కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది.*

*కారులోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఒక్కసారిగా ఎగిరాయి,*

*అది చూసిన సత్యనారాయణ గారు శాస్త్రి గారిని ఆపి, సర్ మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే ఆగి వెళదాం...*

*అక్కడ వెనక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడిపళ్ళు కొస్తున్నట్లు ఉంది, మనం కనుక హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు.*

*ఎందుకండీ అనవసరంగా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది అన్నారు.*

*శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు.*

*ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు !*

*ఈసారి ఆశ్చర్యపోవడం సత్యనారాయణ గారి వంతైంది...*

*ఎం?ఎందుకండి?*

*ఏ ప్రదేశం అయినా, మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు.*

*ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో, ఆఫలితం లబ్దిపొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది.*

*అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్నిసమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మరిపోతాడు.*

*నిజానికి సాధువు,సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!*

No comments:

Post a Comment