Thursday, November 28, 2024

 *_జీవితమంటేనే అనుభవాల పుట్ట. పడుతూ లేస్తూ చాలా నేర్చుకుంటాం..._*

*_మచ్చుకి కొన్ని... మన చుట్టూ మన వాళ్లే ఉన్నారని పొరబడడం... మనతో మాట్లాడే అందరూ మన మంచి కోరే వారే అని సంబరపడడం ప్రేమగా మాటలు చెబుతుంటే మురిసిపోవడం..._*

*_క్షణక్షణం విచారిస్తుంటే ధైర్యం చెప్పటం అప్పుడు మనకంటే అదృష్టవంతులు ఇంకెవరిని మనసుతో మాటిమాటికీ గర్వంగా చెప్పడం... కానీ,_*

*_మనకు తెలియనిది, తెలుసుకోలేనిది ఏంటంటే మనతో ఆవరసం ఉన్నంత వరకే ఇవన్నీ ఉంటాయి అనీ._*

*_అది తెలియక కలల గూడు కట్టుకుంటాం. మనతో అవసరం తీరాక జరిగే చిన్న చిన్న మార్పులకు మన మనసు పడే వేదన నరకం. చూసి చూడనట్టు చూపులు మనదే తప్పంటూ ప్రచారాలు._*

*_పలకరించడానికి సైతం పనికిరాని మనం పాపాత్ము లైపోవడం... అందుకే... ఈ కలికాలంలో కలిసి ఉండి మోసపోవడం కంటే అలాంటి వారిని దూరం పెట్టదడమే శ్రేయస్కరం._*

*_మనకు మనమే ఉన్నామంటూ ఒంటరిగా ఉంటూ పొగరుబోతుగా మిగిలిపోవడమే ఆనందం... కాబట్టి అలాంటివారితో తస్మాత్ జాగ్రత్త.☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🌸🙇‍♂️🌸 🌹🌹🌹

No comments:

Post a Comment