Vedantha panchadasi:
భీష్మాఽ స్మాదిత్యేవమాదావస్గఙ్గస్య పరాత్మనః ౹
శ్రుతం తద్యుక్తమప్యస్య క్లేశకర్మాద్యసఙ్గమాత్ ౹౹107౹౹
107. ఈశ్వరుని వలని భీతిచే ప్రకృతి ప్రవర్తించునని శ్రుతి చెప్పును.ఈశ్వరుడు అసంగుడైనను జగన్నియామకుడు.క్లేశకర్మాదులు ఈశ్వరుని స్పృజింపవు గనుక జగత్ర్పభుత్మము ఈశ్వరునికి తగియున్నది.తైత్తిరీయ ఉప.2.8.1 కఠ ఉప.2.3.3. నృసింహతాపనీయ ఉప.2.
జీవానా మప్యసంగత్వా త్ల్కేశాదిర్న హ్యథాపి చ ౹
వివేకాగ్రహతః క్లేశకర్మాది ప్రాగుదీరితమ్ ౹౹108౹౹
108. ఆ మాటకు,జీవులు కూడా అసంగులగుటచే క్లేశకర్మాదుల వారిని కూడా అంటవు.కాని తమ నిజ స్వరూపమును గూర్చిన అజ్ఞానము వలన ప్రకృతి వికారములైన బుద్ధ్యాదులతో తాదాత్మ్యమును భావించుకొని క్లేశాదులతో సంబంధపడును.
చూ.100 వ శ్లోకము.
వ్యాఖ్య: ఏ యుగంలోనైనా పరమాత్మ యొక్క రూపకల్పనతోనే సృష్టి జరుగుతుంది. హిరణ్యగర్భుడు యుగాలు మారినా పరమేశ్వరుని మాయామయ స్వరూపంగా తన శక్తిని కోల్పోడు.ఈశ్వరాదులు యధావిధిగా వారి కార్యప్రపంచ నిర్మాణాన్ని కొనసాగిస్తుంటారు.
పరబ్రహ్మకు మహాప్రళయంలోనూ అంతం ఉండదు.అలాగే శబ్దం నిత్యం అనాది అని అంగీకరించటం వల్ల వేదవాక్కు అవిచ్ఛిన్నంగా పరబ్రహ్మము నుండి సంప్రాప్తమవుతుంది.
సంసారంకూడా అనాది కాబట్టి జగత్ సృష్టి కల్పాంతంలోను,పునః పూర్వ రూపంతో ఆవిర్భవించి కొనసాగుతుంది.
సుషుప్తిలోంచి జాగ్రదవస్థకు వచ్చిన వ్యక్తి తన పూర్వప్రజ్ఞను కోల్పోకుండా ఎలా సామాన్యంగా కార్యకలాపాలు చేసుకుంటాడో అలాగే ప్రళయాంతంలో అనిత్యాలన్నీ నశించినా, ఆద్యాంతాలు లేని నిత్యమైనవి ఉంటాయి.
సుషుప్తిలో పురుషుడు ఆత్మ పరమాత్మతో ఐక్యంపొంది, హృదయంలో శ్రోత్రాది ఇంద్రియ వ్యవహారం
(చక్షుశ్శోత్రం మనోవాక్కులు)అంతా లీనమైపోయి వ్యక్తంకావు.తిరిగి మెలుకువ వచ్చిన వెంటనే మండుతున్న అగ్ని విస్ఫులింగాల్లా ఆత్మ నుండి సర్వత్ర తిరిగి వ్యాపించి,ఇంద్రియాలు వాటి యొక్క అధిస్ఠాన దేవతలు యథాప్రకారం వాటి కార్యకలాపాలు కొనసాగిస్తాయి.
ఇంద్రియములు గ్రహించె గుణము కలవి.కోరికలు లేకపోతే ఇంద్రియములు లకు పనే లేదు.కోరికల యొక్క ఇంద్రియముల యొక్క వ్యాపారాన్ని నడిపేదే మనస్సు. బుద్ధి వలనే భోక్తృత్వం;కర్మఫలం భోక్తను చేరుకోవటం జరుగుతుంది.
అందువల్ల మనస్సు కంటే బుద్ధి గొప్పది.ఆత్మ బుద్ధి కంటే మహత్తైనది.ఆత్మయే రథాన్ని అధిరోహించిన రథికుడు-ప్రభువు.
శరీరాదులందు రథాది రూపకల్పన చేసి శరీర,ఇంద్రయ,మనో బుద్ధులు, కోరికలు,భోగములు వీటన్నిటితో కూడి ఉన్న భోక్త సంసారగతిని పొంది భోగములను అనుభవించటానికి ఎంత అవకాశమున్నదో,అంతే అవకాశం భోగత్యాగంతో నివృత్తి మార్గంలో మోక్షసాధనకు సంసారబంధ విముక్తితో "పరమగతి"ని పొందటానికి ఉంది.
ప్రత్యగాత్మయే నువ్వు,నీ కర్మ ఫలసాక్షి నీ హృదయ స్థానంలో ఉన్న ప్రత్యగాత్మయే అని చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్ధేశ్యం.
No comments:
Post a Comment