నారద భక్తి సూత్రములు
46 వ సూత్రము
"కస్తరతి కస్తరతి మాయామ్? యః సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమోభవతి"
ఎవడు దాటగలడు? ఈ మాయా సంసారం సాగరాన్ని ఎవడు దాటగలడు?.
జనసాంగత్యం త్యజించినవాడు,మహానుభావుల్ని సేవించినవాడు,రాగద్వేషాలు వదిలినవాడు ఈ మాయా సముద్రాన్ని దాటగల సమర్థుడు.
మాయను తరిమివేయటానికి నారదులవారు 12 నియమాలను సూచించారు.
1 నిస్సగత్వం,2 గురుపాద సేవనం,3 నిస్వార్ధ కామం,4 ఏకాంత ధ్యానం,5 బంధ నిర్మూలనం,6 త్రిగుణాతీత భవనము,7 నిజయోగక్షేమ విస్మృతి,8 కర్మఫలం త్యాగం,9 కర్మత్యాగం,10 నిర్ద్వంద్వం,11 వేదాధ్యన త్యాగం,12 అనంత ప్రేమొపాసన.
47 వ సూత్రము
"యో వివిక్త స్థానంసేవతే యో లోకబంధన మున్మూలయతి
నిస్త్రై గుణ్యయో భవతి,యోగ క్షేమం త్యజతి"
ఏకాంత భక్తిని సేవించేవాడు,సంసారం బంధనాలు త్రెంచుకొనేవాడు,సత్వ రజ స్తమో గుణాలకు అతీతుడైన వాడు,తన యోగ క్షేమాలను సైతం మరచి ప్రవర్తించేవాడు, మాయ నుండి శ్రీహరి చేరుకుంటాడు.
ఏకాంతం అంటే వివిక్త స్థానం,అనన్య భక్తి ని వివిక్త స్థానం లో ఉపాసించాలి. భక్తుడు సంగరహితుడై, గురు చరణసేవ చేస్తూ నిస్వార్థ భావంతో ఏకాంతాన్ని అపేక్షించి అనన్య భక్తిని సాధన చెయ్యాలి.
భక్తుడు ఆత్మవిచారధారను అలవాటు చేసుకోవాలి.అప్పుడే సంసారం బంధనాలు సడలిపోతాయి
స్వామి సర్వాఅంతర్యామి, దయామయుడు, సర్వరక్షకుడు,భక్తుల క్షేమం చూసుకోవటం భగవంతుని కర్తవ్యం, అనే ప్రగాఢ విశ్వాసం తో భగవత్ చింతన చెయ్యాలి భక్తుడు.
శాంతం చే క్రోధాన్ని,సాధుత్వం చే దుష్టత్వాన్ని,దానం చే లోభత్వాన్ని,సత్యం చే అసత్యాన్ని,మౌనం చే అశాంతి ని జయింపఁదగును.
No comments:
Post a Comment