🌹 *ఇంత మంది దేవుళ్ళు ఉన్నారా? వుంటే ఎవరు గొప్ప? ఎవరికీ ఎంత శక్తి వున్నది. ఎవరిని కొలిస్తే మనకు ముక్తి లభిస్తుంది*.🌹
మనము రాముణ్ణి కానీ, నారాయుణ్ణి కాని లేక ఏ లక్ష్మి నో గానీ పూజిస్తున్నాము అనుకోండి.
మీరు రాముణ్ణి రాముడిగానే చూస్తూ కొలిచినారనుకోండి, అయిన రాముడిగానే మీకు వరాలు ఇస్తాడు.అంత వరకే అయిన మీకు సహాయము చేస్తాడు.
అదే రాముణ్ణి మీరు పర బ్రహ్మ స్వరూపముగా కొలిచినారనుకోండి, భావన చేసారనుకోండి అప్పుడు అది వేరు. అది మోక్షమునకు దారి తీయును.
మనము ప్రతి దేవతను అలా పర బ్రహ్మ స్వరూపముగా కొలిచినప్పుడే ఇది వీలు అగును.
లక్ష్మిని లక్ష్మిగా కొలిస్తే దొరికేది ఒకటి, అదే లక్ష్మిని పర దేవతగా, మహా త్రిపుర సుందరిగా కొలిస్తే దొరికేది ఒకటి, అంటే అన్నీ ఆమె నుంచే మనకు దొరుకుతాయి. అంటే ఆ లక్ష్మి నుంచే మనకు విద్య, ధనము, శక్తి, ఆరోగ్యము అన్నీ దొరుకుతాయి. మరలా మనము ఒక్కో దానికి ఒక్కో దేవతను వెతుక్కొనే పరిస్థితి అక్కర లేదు.
మనము అలా చూడటము నేర్చుకోవాలి. నీవు చూచే స్వరూపము లోనే, కొలిచే దేవుడిలోనే ఆ పర బ్రహ్మ స్వరూపాన్ని చూడటము నేర్చుకో. అదే తత్వ దర్శనమ్.
సత్యాన్ని గ్రహించు, అవతల నీకు వీలైన పద్ధతి లో, ఇష్ట మైన పద్దతిలో నీ జీవనం కొనసాగించ వచ్చు.
ఆభరణములలో వున్నది బంగారమే అని తెలుసు కోవడమే అది. మనము (స్త్రీలు) నగలనే చూస్తాము, దాని యొక్క రూపును, shape, model, varaity ఇవి చూస్తాము., కానీ మార్వాడీ వాడు, ఒక కంసాలి దాని లోని బంగారమును మాత్రమే చూస్తాడు. అలా మనము అన్ని రూపాలలోని ఆ పర బ్రహ్మమునే చూడాలి.
No comments:
Post a Comment