Sunday, November 24, 2024


🙏🕉️

 *గోమాత మహత్యం గురించి శివుడు పార్వతిదేవికి చేప్పిన మాటలు*


🌿గోవును పూజించిన సర్వపాపములు నశించును… గోమాత నందు ఎంత మంది దేవతలు ఉన్నరో మీకు తెలుసా…?

🌸ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు. 

🌿” ఓ పార్వతీ! గోమాత నందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును. ఆ గోమాతనదు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు.

🌸 నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. 

🌿ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది.

🌸కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. 

🌿గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం  చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. 

🌸కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.

🌿” శ్రీ కృష్ణ పరమాత్మ” గోవును ఎంతో భక్తి తో శ్రద్ధ తో సేవకుడిగా చూసుకొనే వాడు. మహా జనులారా గోవును పూజించిన ముక్తిని  పొందెదరు... స్వస్తి...🙏

*🙏🕉️అ రు ణా చ ల ద ర్శ నం..!!🙏🕉️*



🌿ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు.

🌷వీటిలో మొదటిది

🌸 “దర్శనాత్ అభ్రశదసి”. 
చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించటం.

🌷ఇది కుదరకపోతే “జననాత్ కమలాలయే”. 

🌿కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా!

🌸అందువల్ల ” కాశ్యాంతు మరణాన్ ముక్తిహి కాశీ”. వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. 

🌿అందువల్ల “స్మరణాత్ అరుణాచలే” అన్నాడు. అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.

🌷అరుణాచల క్షేత్రం అంత గొప్పది.

🌸ఒక్కసారి " అరుణాచల శివ " అంటే 3 కోట్ల సార్లు 
" ఓం నమః శివాయ " 
అని స్మరించిన ఫలితం ఇస్తాడు అరుణాచలేశ్వరుడు .

🌿ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తే మన జీవితాన్ని తనే కర్తయై నడిపిస్తాడు 

🌸అరుణాచల శివ అని స్మరించండి , స్మరిస్తూనే ఉండండి ...

అరుణాచల శివ 
అరుణాచల శివ 
అరుణాచల శివ
అరుణాచల శివ ..
అరుణాచల శివ ...

మనందరికీ ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం 
కలగాలాని ఆశిస్తూ...🕉️🙏

No comments:

Post a Comment