Thursday, November 21, 2024

*****యోగి వేమన

 🌷🙏 యోగి వేమన 🙏🌷

ఈయన అసలు పేరు "" *బెదమ కోమటి* *చిన వేమారెడ్డి* ""....
ఈయన అన్న పేరు ""బెదమ కోమటి పెద వేమారెడ్డి"".....

అప్పటి 'కడప, కర్నూలు & అనంతపురం' కలిపి ఒకే రాజ్యంగా ఉండేవి....
దానికి సామంత రాజు బెదమకోమటి పెదవేమారెడ్డి గారు.
అతని మంత్రి "తురగారాముడు"...
తురగారాముడు ఎలాగైనా అన్న-దమ్ములిద్దరినీ చంపి
తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు...
ఇప్పుడు మనం *చినవేమారెడ్డి* ని *_వేమన_* అని పిలిచుకుంటున్నాము....
ఇతడు మహా ధైర్యవంతుడు...
పేరుకే  అన్నగారు రాజు...
కానీ మొత్తం రాజ్యం వేమన్న ధైర్యసాహసాలు - కనుసన్నులలో ఉంటుంది....
అతని ధైర్యానికి ఉదాహరణ...
ఒక మదపుటెద్దు ఊరిమీద పడి అందరినీ కుమ్ముతూ
హడలెత్తిస్తూ ఉంటుంది...
అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ వుంటారు...
ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం ఏ పహిల్వాన్ చేత కూడా కాదు....
అటుగా వస్తున్న వేమనమీదికి వెళుతుంది....
అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాని కళ్ళలోకి చూసి  ""ఏయ్"'  అని గద్ధిస్తాడు...
ఆ శబ్దం ఆ ఎద్దు చెవులనుంచి దూరి ఊరి మొత్తం ప్రతిధ్వనిస్తుంది.....
దాని కళ్ళకు వేమన మహా సింహంలాగా కనిపిస్తాడు.... హడలెత్తి తోకముడుచుకొని పారిపోతుంది....
దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు ముందు
వేమన్నను మట్టుబెడితే గానీ తన పని సులువు కాదని,,,
వేమన ఉన్నంత వరకూ తానేమీ చేయలేనని తెలుసుకుంటాడు...
తన దృష్టిని వేమన మీద ఉంచుతాడు....
వేమనకు భోగగత్తెల (వేశ్యల) సాంగత్య కాంక్ష ఎక్కువ....
ఎక్కడైనా కొత్తగా భోగసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే
ఈయనే  ముందు వెళ్ళేవాడు....
వేమనకు " *విశ్వద* " అనే ఒక *ప్రేయసి* కూడా ఉంటుంది...
వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం....
ఎన్నోసార్లు తన రాజ్యం గురించి,,,,తాను నిర్వర్థించాల్సిన ధర్మం గురించి అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటుంది....
కానీ వేమన అవేమీ పట్టించుకునేవాడు కాదు....!!
మీరు *శరీర* *అందం* వెనుక పరిగెడుతున్నారు....
కానీ అది *శాశ్వతమ్* *కాదు* ....
అందం వెనుక అందవికారం కూడా దాగి ఉంటుంది...
యవ్వనంలో కనపడినట్లు ఈ శరీరం *ముసలితనంలో*
తన *ప్రాభవం* *కోల్పోతుంది* ...
"ఏదైతే ఇప్పుడుండి ఇక మీదట ఉండదో దాని కొరకు
మీరు పరిగెడుతున్నారు....
మీరు కాస్త ఆగి యోచించాలని హెచ్చరిస్తుంది"....
కానీ వేమన పట్టించుకునే వాడు కాదు....
తురగారాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది...కానీ ఫలితం ఉండదు....
అప్పుడే దసరా తిరునాళ్ళు మొదలవుతాయి....
వెంపల్లి సంబరాలకు ముస్తాబవుతుంది....
ఆ తిరునాళ్ళలో మహా అందెగత్తె ""మాంచాల నాగులు""  భోగమాటను ప్రారంభిస్తుంది....
ఆమె గురించి ఆ నోటా,,,ఈ నోటా,,,వేమనకు చేరుతుంది...
వేమన ఒకసారి వెంపల్లెకు వెళ్లి చూస్తాడు.....
ఆమె అందానికి దాసుడై పోతాడు....
ఇక తన మకాం పూర్తీగా వెంపల్లె నాగుల యింటికి మారుస్తాడు....
ఓ ప్రేయసీ కంటే ఎక్కువగా అభిమానిస్తాడు.
నెలలు గడుస్తాయి.....
నెలల కొద్దీ ఇంటికి రాకపోయే సరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది....
వేమన నాగుల అనే వేశ్య ఇంట్లో పరిమితమయ్యాడని తెలుసుకుంటారు..
డబ్బులన్నీ ఇలా ఆమెకు ధారపొయ్యడం మంచిది కాదని,
రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మం కాదని..
రాజ్యం పరిపాలన దెబ్బతింటుందని *వదిన వారిస్తుంది* ....
" *విశ్వద* " కు వేమన్న భవిష్యత్తు కళ్లముందర కనిపిస్తుంది..
అతని భవిష్యత్తు అంధకారమై పోతుందని గ్రహించి...
సత్యం చెప్పే తీరాలని నిర్ణయించి వేమన్నను పిలిచి..
తొందరలోనే మీరు మరణించబోతున్నారు...
శరీరానికి నెలలు కాదు... రోజులు మాత్రమే ఉన్నాయి...
ఈ శరీరం దేనికోసం తీసుకున్నావో దానిని ఇక మీరు నిర్వర్తించ లేరు...
ఇప్పటికైనా మేల్కొనండి....
జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి...
ఆ మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి అంటుంది...
వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు...
వేమన ""నాగుల"" కి పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన
తురగారాముడు వెళ్లి నాగులను లోబర్చుకుంటాడు....
కొంతమంది సైన్యాన్ని కూడా లోబర్చుకుని ఉంటాడు...
సైన్యంతో నాగుల దగ్గరకు వెళ్లి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం చేయవలసిందిగా చెబుతాడు....
దానికి గానూ ఆమెకు డబ్బు,,,
జాగీరు ఎరగా చూపుతాడు....
చెయ్యకపోతే తానే వేమన్నను చంపి ఆ అభియోగం నీ మీదికి తీసుకొస్తానని బెదిరిస్తాడు....
చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది....
ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగలాలసలో వున్నప్పుడు తాగమని ఇస్తుంది....
వేమన తన ప్రేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు....
అంతే పూర్తీగా దాదాపు శరీరాన్ని వదిలేసినంత కోమాలోకి వెళ్ళిపోతాడు..
నాగులు తురగారామునికి పని పూర్తీ అయిందని కబురు బెడుతుంది...
తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులలో వేయించేస్తాడు.
ఆ అడవులలో *_అభిరామ_*  అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా చేసే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు....
ఒక రోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన్న శవాన్ని చూస్తాడు....

అతని నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతన్ని తీసుకెళ్లి తన వైద్యంతో బ్రతికిస్తాడు....
మెలకువ వచ్చిన తర్వాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు....
మౌనంగా కూర్చునేవాడు...
ఏ వివరాలూ ఎంత అడిగినా చెప్పేవాడు కాదు...
మహామౌనంగా ఉండేవాడు...
తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువ చూపేవాడు....
*విశ్వద* చెప్పిన *సత్యం*   *_నాగులు* , *తురగారాముడు_* చేసిన *మోసం* కళ్ళముందు కదిలేవి....
తానే యామరపాటుగా ఉన్నానని తెలుసుకునే వాడు..
ఆకులు అలములకోసం అప్పుడదప్పుడూ అడవులకెళ్లి తెచ్చేవాడు....
*అభిరాముడు* ..తన గురువుగారైన *విశ్వకర్మ యోగి* ని
కలిసి జ్ఞానాన్ని తెలిసుకుంటూ ఉండేవాడు....
ఒకరోజు విశ్వకర్మయోగి తాను శరీరం వదిలేస్తున్నానని,
తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు వాహకత్వం ఇస్తానని
రేపు రావలసిందిగా చెబుతాడు...
అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు...
మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరుతాడు...
దారిమధ్యలో ఒక పులి కనబడడంతో పరుగులు పెడతాడు....
దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు......
అభిరాముడు ఎంతకూ ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండడంతో వేమన బయలుదేరుతాడు....
వేమన సరాసరి *విశ్వకర్మయోగి* ఉన్న గుహలోకి వెళతాడు.....
విశ్వకర్మయోగి చెందవలసిన వాడు,
రావలసిన వాడు రానే వచ్చాడు
అని *వేమన్నను* పిలిచి *ధ్యాన,,,జ్ఞానవిద్యను* నేర్పించి,
మూడో కన్నును ఉద్దేపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు....
ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది....
అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు....
తాను పొందవలసిన దాన్ని పొందలేక పోయానని బోనాకిష్టమై...
వేమన దానికి అభిరామా....దుఃఖిించకు, భాధపడకు

నా ప్రేయసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ
నేను పెడచెవిన పెట్టాను....
ఈ రోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది...
విస్వద...అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే
వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను
అని చెబుతాడు...
*విస్వద అభిరామా ఇద్దరూ కలిసి* *వినరా వేమా...*
*అని నాకు* *భోధిస్తున్నట్టుగా,,,చెబుతున్నట్టుగా*
*ప్రపంచానికి చెబుతాను అని* *చెబుతాడు* ...
*అందుకే* ..
*విశ్వదాభిరామా  వినరా వేమా*

No comments:

Post a Comment