*వెంకటేశ్వర స్వామి ముడుపు అంటె ఏమిటి
అది ఎలా కడతారు*
పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇల వేలుపు, ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టే వాళ్ళు .
ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే... వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగ కుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుని కి ముడుపు కడతారు...
ముడుపు ఎలా కట్టాలి ...
వెంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టినా బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనసుపూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాటఇవ్వాలి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందా నామాలు చదువుకొని స్వామి కి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉండాలి..కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి...
ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి
వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది.🙏
ఏడుకొండలవాడ అందరిని చల్లగా చూడు తండ్రి🙏.
No comments:
Post a Comment