Wednesday, November 20, 2024

 *స్నేహితుల వనం...*

పరిచయాల కొమ్మకు పరిమళ వసంతం 
స్నేహం...

మనసులో భావాలకు 
హావభావాల ఆత్మీయ అన్నం స్నేహం...

కంటికింద నీటిచుక్కను తీసే 
మనసులో చేయూత స్నేహం...

దూరంలో మౌనంగా
దగ్గరలో   సందడిగా
ఆపదలో ధైర్యంగా
కలకాలం మంచికోరే మధురభావన వాన స్నేహం....

స్నేహపు వయసుకు కొలమానం కాలం
స్నేహపు మనసుకు బహుమానం సంతృప్తి సంతోషం...

స్నేహితులవనంలో 
విరిచిన వసంతం విలువ
ప్రాణపు తక్కెడ మాత్రమే తూచే సూచిక...

*అభిరామ్ 9704153642*

No comments:

Post a Comment