*178 - శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి / Sri Vidya – The Eternal Energy*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*16. ముఖచంద్ర కలంకాభా మృగనాభి విశేషకా!!*
దేవి ముఖము చంద్రబింబమువలె ఉన్నది.
క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణామధ్యే పరిణతశరశ్చంద్రవదనా!!
అన్నారు శంకరభగవత్సాదులు తమ సౌందర్య లహరిలో. పరిణిత శరశ్చంద్రవదనా.
శరత్కాలములో ఉన్నటువంటి పరిణితి చెందిన అనగా శరత్కాల
పూర్ణిమనాటి చంద్రబింబమువలె పరమేశ్వరి ముఖమున్నది. అయితే ఆ వింబములో
చిన్న మచ్చ కనిపిస్తోంది. ఏమిటది.
కస్తూరీ తిలకం లలాట ఫలకే!!
మృగనాభి విశేషము. కస్తూరి మృగము యొక్క బొడ్డు దగ్గర నుంచి వచ్చిన పదార్ధము.
అదే కస్తూరి. దేవి నుదుటన కస్తూరి తిలకము ధరించి ఉన్నది. అది చూడటానికి
చంద్రునిలో మచ్చలాగా కనిపిస్తోంది. చంద్రబింబంలో కళంకము అనేది సహజమైనది.
చంద్రుడు మనస్సుకు అధిదేవత. మానవుడి మనసు కళంకం కావటం సహజం.
అందుచేతనే లోకంలోని మానవుల మనసు లాగానే చంద్రబింబం కూడా కళంకమైనది
అని చెప్పబడింది. ఆ కళం కానికి గుర్తుగానే దేవి నుదటన కస్తూరి తిలకమున్నది.
అందుకే....
సకుంకుమవిలేపనా మలళికచుంబికస్తూరికాం ।
అని చెప్పటం జరుగుతుంది.
చంద్రుడు షోడశ కళాయుకుడు. పరమేశ్వరి ముఖము చంద్రునితో పోల్చబడింది.
అంటే అది పదహారు అక్షరాలు గల షోడశాక్షరీ మహామంత్రము అని గుర్తించాలి.
శంకరభగవత్సాదులు తమ సౌందర్య లహరిలోని 44వ శ్లోకంలో....
తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్యలహరీ
పరీవాహస్రోత స్స రణి రివ సీమన్తసరణిః
వహస్తీ సింధూరం ప్రబల కబరీభార తిమిర
ద్విషాం బృందై ర్చందీకృత మివ నవీనార్మకిరణమ్ ॥
ఓ తల్లీ ! నీ వదనము సౌందర్య ప్రవాహము ప్రవహించు మార్గము లాగా ఉన్న నీ
సీమంతరేఖ మిక్కిలి బలముగల కేశపాశముల సముదాయములచే బందిగొన్న బాల
భానుని కిరణమువలె సింధూరపుబొట్టును ధరించినదై మాకు క్షేమము కలుగ చేయుగాక.
🕉️🌞🌍🌙🌟🚩
*17. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా!!*
చిల్లికా అంటే కనుబొమ. పరమేశ్వరి ముఖము మన్మథుని మంగళగృహము యొక్క
బహిర్హ్వారతోరణము. పరమేశ్వరి వదనము అనే మన్మధుని గృహానికి కనుబొమలు తోరణాలు.
ముఖమనే మన్మథగృహనికి కట్టబడిన మంగళ తోరణములవలె నున్న కనుబొమలు
గలది. దేవి ఆవిర్భవించినప్పుడు ప్రాతఃస్సంధ్య, సాయం సంధ్యల వల్ల ఆమె కనుబొమలు
ఏర్పడినాయి.
ఇక్కడ పంచప్రణవాలు చెప్పబడ్డాయి. అవి..
ఐం గా వదనము
క్షీం గా స్మర
సౌః గా మాంగల్య
శ్రీం - గృహము
హ్రీం = తోరణము.
షోడశి మహామంత్రంలో పంచప్రణవాలు అనులోమ విలోమంగా చెప్పబడ్డాయి.
పరమేశ్వరి ముఖము ఎంత అందమైనదో వర్ణిస్తూ దుర్వాసుడు శ్రీదేవీ మహిమ్మః స్తుతిలోని
48వ శ్లోకంలో...
ఉద్యత్త్పూర్ణకలానిధిశ్రివదనమ్ భక్తప్రసన్నం సదా
సంపుల్లాంబుజపత్రకాంతి సుషమాధిక్కారదక్షేక్షణమ్ ॥
సానందం కృతమందహాస మసకృ త్ర్రాదుర్భవ త్కౌతుకమ్
కుందాకారసుదంతపంక్తిశశిభా పూర్ణం స్మరా మ్యంబికే 1॥
అప్పుడే ఉదయించిన సూర్యునివలె భక్తులకు ప్రసన్నమై, తామర పూవుల కన్న మిన్న
అయిన నేత్రములతో, చక్కని పలువరుసతో మనోహరముగా నీ ముఖము ప్రకాశిస్తున్నది.
సౌందర్య లహరిలోని 47వ శ్లోకంలో శంకరభగత్పాదులవారు దేవి కనుబొమలను
వర్ణిస్తూ...
బృవౌ భుగ్నే కించి ద్భువనభయభంగ వ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిరాభ్యాం ధృతగుణమ్
ధను ర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్టే ముప్టొచ స్థగయతి నిగూఢాంతర ముమే ! ॥
తల్లీ ! లోకాలకు కలిగే ఉపద్రవాలను తొలగించటంలో ఆసక్తిగల ఓ మాతా !
కొంచెము వంగిన నీ కనుబొమలు తుమ్మెదల వంటి కాంతిగల కనులచేత కట్టబడిన
అల్లె త్రాడుగల మన్మథుని యొక్క ధనుస్సుగా తలుస్తాను.
పైన చెప్పిన నామంలో మన్మథుని గృహానికి కట్టిన తోరణాలలాగా దేవి
కనుబొమలున్నాయి అంటే, సౌందర్య లహరిలో వాటిని మన్మథుని ధనుస్సుతో పోల్చారు.
🕉🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment