*180 - శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి / Sri Vidya – The Eternal Energy*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*19. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా*
చంపక పుష్పమనగా సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు వంటి అందమైన నాసికతో అమ్మవారు విరాజిల్లుతూ యున్నది అని భావము.
నాసా అంటే ముక్కు.నాసాదండం అంటే ముక్కు దూలం.
అప్పుడే వికసించిన సంపంగి పువ్వులా అమ్మవారి ముక్కు ప్రకాశిస్తోంది.
చంపకపుష్పంతో అమ్మ ముక్కును పొల్చడంలో వాగ్దేవతలు కవితా చమత్కారంతో పాటు మంత్రశాస్త్రాన్ని కూడా నిక్షిప్తం చేసారు.
భూమి గుణం గంధం.ముక్కు గంధాన్ని అనగా వాసనను పసిగట్టగలదు.ముక్కులు సరిగా పని చేస్తే సగానికి సగం రోగాలు నశిస్తాయి.
చంపక పుష్పాలతో పూజిస్తే అమ్మవారు ప్రసన్నురాలై భూమిని ప్రసాదిస్తుందని మంత్రశాస్త్రాలంటున్నాయి.
అది కూడా నవచంపక మగుటచే అనగా అప్పుడే వికసించిన సంపెంగ పువ్వని విశేషార్థము. అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు ఎట్లుండును? అను విషయముపైన భక్తుడు లోతుగ భావన చేయవలెను. అట్టి పువ్వు అత్యంత మృదువుగ నుండును. కాంతివంతముగ నుండును. అద్భుతమైన పరిమళములను వెదజల్లుతూ యుండును.
పరిమళము నామ్రాణించు ఇంద్రియము నాసిక. అమ్మ నాసిక పరిమళ స్వరూపమేయని తెలియవలెను. అంతియే కాదు, పరిమళ పూరితమగు సంపెంగ పువ్వును చూచినప్పుడు నిజమైన భక్తునకు అమ్మ నాసిక దర్శనమీయ వలెను.
అమ్మ నాసికను చూచుటకు వెట్టి ఆవేశమును పొందుటకన్నా- సంపెంగ పువ్వును చూసినపుడు అమ్మ నాసికను దర్శించుట సత్వగుణ భక్తి.
ఈ భావముచే ఋషి మనకు నాసికా దర్శనము చేయించు చున్నాడు. అట్టి భావన ప్రాతిపదికగా సంపెంగపువ్వు పరిమళమును ఆమ్రా ణించు భక్తునకు తాదాత్మ్య స్థితి అప్రయత్నముగ కలుగును.
సృష్టియందలి సుగంధమును ఆస్వాదించు స్వభావము గల జీవుని నాసికయందు కూడ అమ్మయే ప్రతిష్ఠితయై యున్నది అని కూడ భావన చేయవచ్చును.
అప్పుడే వికసించినటువంటి సంపెంగ పూవు వంటి నాసిక కలది. అప్పుడే
వికసించింది కాబట్టి సంపంగి పూవు పొడవుగా ఉంటుంది. దేవియొక్క నాసిక కూడా
పొడవుగా ఉంటుంది. ఇది సాముద్రిక లక్షణం. దాన్నే కోటేరు వేసిన ముక్కు అంటారు.
ఉత్తమజాతి వారికి ముక్కు ఈ విధంగా ఉంటుంది అనేది సాముద్రికం. సాముద్రికం
రెండు రకాలు:-
1. అంగ సాముద్రికం
2. హస్త సాముద్రికం.
హస్త సాముద్రికంలో చేతులు, వ్రేళ్ళు, గోళ్ళు, చేతిలోని రేఖలగురించి చెప్పబడుతుంది.
అంగ సాముద్రికంలో శరీరంలోని అవయవాలన్నింటి గురించి చెప్పబడుతుంది.
రామాయణంలోని సుందరకాండలో శ్రీరాముణ్ణి గురించి సీతాదేవితో చెప్పేటప్పుడు
హనుమంతుడు రాముని అంగాంగం వర్ణిస్తాడు. అది అంగ సాముద్రిక శాస్త్ర ప్రకారం ఉంటుంది.
పరమేశ్వరి ఆవిర్భావ కాలంలో ఆమె శరీరం దేవతలయొక్క దివ్యతేజస్సుతో
ఆవిర్భవించింది. అందులోను కుబేరుని తేజస్సుతో దేవి నాసాదండము రూపొందింది.
ఈ విషయం సప్తశతిలో వివరిస్తూ దేవాసుర సంగ్రామం జరుగుతున్నది. అందులో
దేవతలకు ఇంద్రుడు, అసురులకు మహిషుడు నాయకత్వం వహించారు. ఆ యుద్ధంలో
దేవతలు పరాజయం పాలయి త్రిమూర్తులను ఆశ్రయించారు. త్రిమూర్తులు కూడా ఏం
చెయ్యాలో పాలుపోక దేవతలతో సభ తీర్చారు. ఆ సభలో మహిషునివల్ల బాధింపబడిన
దేవతలగోడు విని త్రిమూర్తులు భృకుటి ముడివేశారు. ఆ సమయంలో బ్ర్రహ్మాది దేవతల
శరీరంనుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సంతా ఒక స్త్రీ మూర్తిగా రూపొందింది.
యదభూచ్చామృవం తేజ ప్రేనాజాయత తన్ముఖమ్ ॥
యామ్యేన చాభవజ కేశా బాహవో విష్ణుతేజసా ॥
సౌమ్యేన స్తనయోర్యుగ్మం మధ్యం చైంద్రేణ చాభవత్ ।
వారుణేన చ జజ్జోరూ నితమ్బస్తేజసా భువః ॥
బ్రహ్మణస్తేజసా పాదా తదజ్గుళ్యోల ర్మతేజసా ।
వసూనాం చ కరాజ్ఞుళ్ళః కౌబేరేణ చ నాసికా ॥
తస్యాస్తు దన్హాః సమ్భూతా ప్రాజాపత్యేన తేజసా ।
నయనత్రితయం జజ్లే తథా పావకతేజసా ॥
భ్రువౌ చ సన్ధ్యయోస్తేజః శ్రవణావనిలస్య చ ॥
అన్యేషాం చైవ దేవానాం సమృ్భవస్తేజసాం శివా ॥
తతః సమస్తదేవానాం తేజోరాశిసముద్భవామ్ ।
తాం విలోక్య ముదం ప్రాపురమరా మహిషార్టితాః ॥
శివుని తేజస్సుతో - దేవి ముఖము
యముని తేజస్సుతో - కేశపాశాలు
విష్ణువు తేజస్సుతో - బాహువులు
చంద్రుని తేజస్సుతో - స్తనయుగము
ఇంద్రుని తేజస్సుతో - నడుము
వరుణుని తేజస్సుతో - తొడలు, పిక్కలు
భూమి తేజస్సుతో - ఆసనం.
బ్రహ్మణ స్తే జసా పాదౌ తదంగుళ్యోల ర్మ తేజసా ।
వసూనాం చ కరాంగుళ్ళః కౌబేరేణ చ నాసికా ॥
బ్రహ్మతేజస్సుతో - పాదాలు
సూర్యుని తేజస్సుతో - కాలివ్రేళ్ళు
అష్టవసువుల తేజస్సుతో - చేతివేళ్ళు
కుబేరుని తేజస్సుతో - నాసిక
ప్రజాపతి తేజస్సుతో - దంతాలు
అగ్ని తేజస్సుతో - కనులు
రెండు సంధ్యలు - కనుబొమలు
వాయువు - చెవులు
ఇతర దేవతల తేజస్సుతో - శరీరము
ఏర్పడింది.
ఈ రకంగా ఆవిర్భవించిన దేవి నాసిక కుబేరుని తేజము అని చెప్పబడింది.
🕉️🌞🌍🌙🌟🚩
No comments:
Post a Comment