*అఘోరలు........!!*
హిమాలయ పర్వతశ్రేణులు,
మంచు కొండల మధ్యన ఆశ్రమాలు,
విచిత్ర ఆకారాలు,
ఆశ్రమాల్లో సాధు సంతులు, నిస్సంగులు.
గడ్డ కట్టే చలిలో ఆవాసాలు.
దొరికితేనే తిండి,
దొరక్కపోతే గాలే భోజనం.
బట్టలూ అంతంత మాత్రమే.
దిగంబరులకైతే ఆ వస్రాల బాధా లేదు.
మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఆయుష్షు ఎంతో తెలుసా?
మినిమమ్ హండ్రెడ్ ఇయర్స్ అంటా.
ఇంకా ముందుకు వెళ్తే 150 ఏళ్ళు.
250 ఏళ్ల పాటు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారంటే నమ్ముతారా? తప్పదు నమ్మాల్సిందే మరి
చూస్తున్నాం కదా నిజాలను.
150 ఏళ్ళు వినడానికి వింతగానే ఉంది కదా?
ఇన్నేళ్ళు జీవించటం మానవ మాత్రుడికి సాధ్యమేనా? యెస్.. సాధ్యమే..
హిమాలయాల్లో మనకు కనిపించే సిద్ధపురుషులు చాలా మంది వందేళ్లకు పైగా వయసున్న వాళ్లే.
వారిలో ఒకరిద్దరు 250 సంవత్సరాలు కూడా జీవించిన వారున్నారు.
ప్రతికూల వాతావరణంలో నియమిత ఆహారం లేని చోట అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు.
మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం పట్టణాల్లో ఉండే జనం 50 -70 ఏళ్లకే ఎందుకు చనిపోతున్నారు..?
వాట్ ఈజ్ ది మిస్టరీ..??
ఒకరి వయసు 120 ఏళ్ళు
మరొకరు 150 ఏళ్ళు
ఇంకొకరికి ఏకంగా 250 ఏళ్ళు..
కలా? నిజమా? ఇంతకాలం జీవించిందెవరు?
పురాణాల్లో దేవతలు కారు.
మన కళ్ల ముందున్న సాధువులు.
హిమాలయాల్లోని సంతులు,
మంచు కొండల నడుమ ఉండే సిద్ధులు,
ప్రతికూల వాతావరణంలో జీవించే సన్యాసులు.
దేవ్హ్బ్రాబా ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి హిమాలయాలకు వెళ్ళారు అక్కడే ఉంటున్నారు.
ఈయన ఫోటోను ఇంటర్నెట్లో చూడవచ్చు కూడా.. ఈయన వయస్సు మాత్రం 250 సంవత్సరాలు.
ఈయన పుట్టింది 1772 మార్చిలో.
చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు.
ఈశ్వరుడి ఉపాసనలో జీవితం గడపుతున్నారు.
హిమాలయాల్లో చాలా క్లిష్టమైన ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది.
ఈయన అక్కడే ఉన్నా చాలా కాలం పాటు ఎవరికీ దర్శనమిచ్చేవారు కారు.
ఈయన పాదస్పర్శతో అన్ని కోరికలూ తీరుతాయని ప్రజల విశ్వాసం.
ఈయన ఇంతకాలం జీవించి ఉండటం విదేశీ మీడియాకూ మిస్టరీగా మారింది.
దీనిపై తెగ రీసర్చ్ చేసింది
పాపం ఆ జర్నలిస్టులు సైతం ఆయన పాదాల్ని శిరసుపై ఉంచుకుని వెళ్లిపోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు.
కోరుకున్నప్పుడు మరణించటం సాధ్యమేనా..??
మామూలు మనుషులకు సాధ్యం కానిది
సాధు సంతులకు ఎలా సాధ్యపడింది..??
వందేళ్లకు పైగా ఎలా జీవించి ఉండగలుగుతున్నారు..??
సైన్స్ కు సైతం అంతుపట్టని మృత్యురహస్యం
చావును జయించిన సాధువులు మన భారతదేశంలో ఉన్నారు.
వాళ్ళు ఉండే మంచుకొండల నడుమ మామూలు మనుషులు క్షణం కూడా ఉండలేరు.
అక్కడికి వెళ్లాలంటే కట్టుదిట్టంగా తయారవుతారు. ఒళ్లంతా ఉన్నితో కప్పుకుని కానీ కదలలేరు.
సన్యాసులు ఏళ్ల తరబడి ఎలా జీవనం గడుపుతున్నారు. అంతే కాదు వారి జీవన విధానం కూడా పూర్తి డిఫరెంట్గా ఉంటుంది.
అలాంటి ప్రతికూల వాతావరణంలో వాళ్ళు వందల సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు,
మనకు ఎందుకు సాధ్యం కావటం లేదు?
మనం ఎన్నేళ్ళు బతుకుతాం?
మహా అయితే 60-70 ఏళ్ళు.
అంతకన్నా ఆశ లేదు లెండి.
ఇప్పటికే ఎక్కువ కాలం బతికేశాం.
ఇంకేం బతుకుతాం చాల్లెద్దూ.
ఇవాళ ప్రతి ఒక్కరి నోటా సహజంగా వినిపించే మాటే ఇది. ఎక్కువకాలం బతకటం.
ఒకరిపై ఆధారపడటం దేనికి?
హాయిగా యాభై ఏళ్ళు బతికితే చాలనే వాళ్ల సంఖ్యే ఎక్కువ.
మరి ఎలాంటి కోరికలు లేని సాధువులు మాత్రం ఆయుష్షు మాత్రం ఎక్కువగా కోరుకుంటున్నారు
కోరుకుంటున్నట్లే ఉండగలుగుతున్నారు..
ఎందుకు? ఎలా..??
హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం.
హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం.
కైలాస్, మానస సరోవర్, గంగ, యమున, సరస్వతి, కేదార్నాథ్, హరిద్వార్, రుషికేష్, బద్రీనాథ్.. ఒకటా రెండా.. వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు అక్కడ ఉన్నాయి.
భక్తి శిఖరాలు హిమాలయాలు వెండి కొండల్లో వేలుపుల వెలుగులు.
ముక్కోటి దేవతల అనవాళ్ళు సాధుసంతుల పాలిటి కల్పతరువులు.
హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది సాధు సంతులే.. సిద్ధపురుషులే..
ఈశ్వరోపాసనలో తలమునకలై కనిపిస్తారు.
భక్తులు వస్తే ఆశీర్వదిస్తారు. విభూతి ఇస్తారు.
లోకాన్ని పట్టించుకోరు, తమనూ పట్టించుకోరు,
శరీరంపై మమకారం లేదు,
కోరికలు లేని జీవన విధానం.
ఉపాసనలోనే జీవితం.
అందులోనే ఆనందం అనుభవిస్తారు.
సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు,
మంచి చెడులు చెప్తారు..ఆశీర్వదిస్తారు.
కానీ ఈ పర్వత శ్రేణుల్లోనే ఎవరికీ పట్టని సాధుపురుషులు ఉన్నారు
వీళ్లకు లోకం పట్టదు,
లోకానికి వీళ్ళు పట్టరు.
వీళ్ళు ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు.
వీళ్ల దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు. హిమాలయల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే
సిద్ధ పురుషులు వీళ్లే.
ఓం నమః శివాయ..!
No comments:
Post a Comment