*_ఉన్నదే ఒక్క జీవితం... ఆ జీవితం చాలా చిన్నది. రేపు ఉంటామో లేదో తెలియని సందిగ్ధం. అందుకే బ్రతికున్నన్నాళ్ళు జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపేయండి._*
*_అసలు జీవితమే శాశ్వతం కానప్పుడు, నీ కున్న సమస్యలు శాశ్వతంగా ఉంటాయా.? కష్టాలు, కన్నీళ్లు, భావోద్వేగాలు, సమస్యలు, సుఖాలు, దుఖాలు , ఆనందాల సమన్వయమే కదా! జీవితమంటే..._*
*_సమస్యకు లొంగకు, కష్టాలను చూసి కన్నీళ్లు పెట్టుకోకు, అవమానాలను అనుభవించి ఆవేదన చెందకు. సమస్యల నుండి, కష్టాల నుండి, అవమానల నుండి గుణపాఠం నేర్చుకొని నీవు దృఢంగా, స్థితప్రజ్ఞత అలవర్చుకో..._*
*_అంతేకానీ ధీనుడిగా, హీనుడిగా, లాచారిగా, ఒకరికి బానిసగా బ్రతుకు వెళ్లదీయకు. కాలే కడుపుకు తిండి లేకుంటే ఆ పూట నీటిని తాగి సర్దుకో... అంతేగాని... నీ ఆత్మ గౌరవాన్ని ఒకరి కాళ్ళ వద్ద తాకట్టు పెట్టకు._*
*_మిత్రమా... నాదో చిన్న మాట!_*
*_ఓడిపోవడం వేరు, లొంగిపోవడం వేరు. చిరుత పులులు జింకలను వేటాడే దృశ్యాలను మనం తెరపై ఎన్నోసార్లు చూస్తుంటాం. పులి చాలా బలమైన జంతువు. అయినా దాని పంజాకు చిక్కరాదన్న పట్టుదలతో జింక శక్తికి మించిన వేగంతో పరుగెడుతుంది. అది ఓడిపోతుందేమో తప్ప లొంగిపోదు.!_*
*_అదేవిధంగా ఏ సమస్యకి లొంగకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. అసలు నీ మనసులో ఓడిపోతానేమో అనే ఆలోచన రాకుండా నిత్యం ప్రయత్నించు.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🦚🙇🦚 🌹🌹🌹
No comments:
Post a Comment