Thursday, July 10, 2025

 *మహాభారతం నుండి చిన్న చిన్న సంఘటనలు సందర్భాలు మన పిల్లలు మానసికంగా దృఢంగా ఉండడం కోసం నేర్చుకోవాల్సిన పాఠాలు.*
                     
*గురు ద్రోణాచార్య కుచేలుడి స్నేహాలు నుండి నేర్చుకోవలసిన వేరువేరు పాఠాలు.* 

*మహాభారతంలో ద్రోణుడు, ద్రుపదుడు చిన్నప్పుడు నుంచి ఒకే గురుకులంలో కలిసి చదువుకున్న మంచి స్నేహితులు. విద్యాభ్యాసా అనంతరం వారి స్థితిగతులను బట్టి ద్రోణుడు ఆచార్యుడు గాను  (గురువుగాను) ద్రుపదుడు రాజు గాను స్థిరపడి ఎవరు వృత్తుల్లో వారికి కాలం వెళుతూ ఉంటుంది. కడు పేదరికం అనుభవిస్తున్న ద్రోణుడు భార్య సూచన మేరకు బిడ్డల ఆకలి దప్పుల కోసం, ఆశ్రమం కోసం కొన్ని ఆవులను సహాయం అందించడానికి  ద్రోణుడు రాజు ద్రుపదుని  సహాయం కోరగా, ద్రుపదుడు అతన్ని అవమానించాడు. నీ స్థాయి ఏంటి, స్థాయి ఏంటి అసలు మనం చదువుకోవడమేంటని ఘోరమైన మాటలతో రాజదర్పం ప్రదర్శిస్తూ  అవమానిస్తాడు.*

*అవమానంతో ద్రోణాచార్యుడు ఇంటికి చేరుతాడు దీంతో వారి మధ్య శత్రుత్వం మొదలైంది. మహాభారతంలో ఇది ఒక స్నేహితుల కథ.*

*శ్రీకృష్ణుడికి, కుచేలుడికి గురువు సాందీపని. వీరు ఉజ్జయినిలో ఉన్న సాందీపని ఆశ్రమంలో చదువు పూర్తి అయినది. కలిసి చదువుకున్నారు గురువు సాందీపని ఒక గొప్ప ముని, ఆయన శిష్యులకు వేదాలు, ఇతర శాస్త్రాలు బోధించేవారు.*

*విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఎవరు ప్రాంతాలకు వాళ్ళు చేరుకున్నారు శ్రీకృష్ణుడు ద్వారకా సామ్రాజ్యానికి  పట్టాభిషిక్తుడయ్యాడు.*

*కుచేలుడు అసలు పేరు సుదాముడు. అతను అతి నిరుపేద బ్రాహ్మణుడు, ధనార్జనపై ఆసక్తి లేకుండా, వినయంగా, భక్తితో జీవించేవాడు. ఇతనికి కుటుంబ పోషణ భారంగా మారడంతో భార్య సూచన మేరకు శ్రీకృష్ణుని సహాయము అడుగుదామని బయలుదేరుతాడు భార్యతో మాత్రం నేను ఎటువంటి సహాయము అడగనని చాలా ఏళ్ల తర్వాత నా బాల్యమిత్రుని చూసే సంతోషం ముందు సంపదశూన్యమని కుచేలుడు తన భార్యకు చెబుతాడు. తనకున్న వస్త్రాల్లో తక్కువ చిరుగులు ఉన్న పంచిని కట్టుకొని మరో చిల్లులు పడిన వస్త్రాలను సంచిలో పెట్టుకుని ఇంటిలో మిగిలిన కేవలం దోసడు  అటుకులను మూట కట్టుకొని కృష్ణుని నగరం వైపు ప్రయాణం సాగుతుంది.*

*ద్వాపర యుగంలో ద్వారక ద్వారపాలకుల వద్దే ఆర్థికపరమైన సమస్యలు, ధన సహాయాలు, భూమి సహాయం గోవుల సహాయం ఏది కావాలన్నా గుమ్మం దగ్గరే పరిష్కారం అయిపోయేవి. రాజదర్శనం కోసం నిరీక్షించక్కర్లేదు.* 

*కుచేలుడు పడుతూ లేస్తూ ద్వారక రాజప్రకారాన్ని చేరుకుంటాడు. ద్వార పాలకులు ఆ ఆ పేద బ్రాహ్మణుడును చూసి ఏ విధమైన సహాయం కావాలని అడుగుతారు.*

*బాల్య స్నేహితుడైన శ్రీ కృష్ణుడిని కలిసి వెళదామని వచ్చానని చెప్పిన తర్వాత ద్వారపాలకులు మదనపడి మొత్తం మీద సమాచారాన్ని  శ్రీకృష్ణుడికి మీ బాల్య స్నేహితుడు సుధాముడు వచ్చారని చేరవేస్తారు. వెంటనే శ్రీకృష్ణుడు మందిరం నుండి పరుగు పరుగున వచ్చి చిరిగిన వస్త్రాలతో, అత్యంత దీనాతి దీనంగా ఉన్న చేలుడను కృష్ణ పరమాత్మ ఓ నా బాల్యమిత్రుడా సుధామ అని పలకరిస్తూ గట్టిగా ఆలింగానం చేసుకొని తనతో మందిరానికి  తీసుకువెళ్లి ఆసనం మీద కూర్చోబెట్టి పాదాలు పళ్లెం లో పెట్టి కడిగాడు. నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు.  కృష్ణుడు పాదాలు కడుగుతుండగా చెలికత్తెల చేతిలో వింజమరలు తీసుకుని రుక్మిణి దేవి కుచేలుడికి విసర సాగింది.*

*కుచేలుడు కష్టాన్ని గాని బాధలు గాని శ్రీకృష్ణునితో చెప్పలేదు. మిత్రమా నా కోసం ఏమి తెచ్చావని ముక్కుపోయిన వస్త్రంలో ఉన్న అటుకులను తీసుకొని కృష్ణుడు ఎంతో ప్రేమగా తిన్నారు.* 

*కృష్ణునికి, అతి నిరుపేద బ్రాహ్మణుడైన కుచేలునికి  మధ్య ఉన్న స్నేహబంధం ఇలా ఉంది.*

*గురు ద్రోణాచార్యునికి, రాజు ధృపదునికి మధ్య స్నేహబంధం అలా ఉంది.*

*మహాభారతం నుండి నేర్చుకోవలసిన అంశం. కేవలం ఇద్దరి స్నేహితుల మధ్య మాత్రమే కాదు తల్లితండ్రులు, సోదరులు, గురువులు గ్రామం, మన దేశం అందరి తోటి సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి తాము ఉన్న స్థాయి చూడకుండా  మెట్టు దిగి గౌరవం ఇచ్చి గుర్తిస్తేనే ఇహంలోనూ  పరంలోనూ జన్మ చరితార్థమవుతోంది.*

 *┈┉┅━❀꧁జై శ్రీ కృష్ణ ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🦚🚩🦚 🙏🕉️🙏 🦚🚩🦚

No comments:

Post a Comment