Tuesday, January 6, 2026

 *చాలా కాలం క్రిందట ఒక గురువు ఆశ్రమంలో విద్య నభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు.* *ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకోవడంలో చురుగ్గా ఉండే వారు.* 

👉కానీ ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్ళను అనుసరించ లేకపోతున్నాడు. వాళ్ళతో సమానంగా రాణించలేక అసహాయుడౌతున్నాడు. గురువు గారు ఇదంతా గమనిస్తున్నారు.

ఒకరోజు ఆయన ఆ శిష్యుణ్ణి పిలిచి హస్త సాముద్రికాన్ని పరిశీలించ దలచి చేయి చాపమన్నాడు. 

👉కొద్ది సేపు పరిశీలించిన మీదట శిష్యునితో “శిష్యా! నీ జాతక రీత్యా నీకు విద్యా యోగం లేదు. అంత వెతికినా నీ అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించడం లేదు కదా!” అన్నాడు. అప్పటికే నిస్పృహలో ఉన్న ఆ శిష్యుడు ఇంకా క్రుంగిపోయాడు. 

“నాయనా! నీవిక మీ ఇంటికి వెళ్ళి నీకు తగిన వృత్తిని అవలంభించడం ఉత్తమం” అన్నాడు గురువు.

బరువెక్కిన హృదయంతో ఇంటి బాట పట్టాడు శిష్యుడు. 

🌿దారిలో మది నిండా ఆలోచనలే. కలత చెందిన మనసులో ములుకుల్లా బాధించే ఆలోచనలు తప్ప ఏముంటాయి? 

కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది. చుట్టూ చూశాడు. ఒక గ్రామం సమీపంలో చేద బావి కనిపించింది. గ్రామస్తులు అందులోనుంచి ఒక రాతి గిలక సాయంతో నీటిని తోడుకుంటున్నారు.

ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకుని పక్కనే ఉన్న చెట్టు నీడన సేద తీర్చుకుందామని కూర్చున్నాడు. బావి వైపే చూస్తున్నాడు. 

👉తాడుతో ఒరిపిడి చెందడం వలన రాతి గిలక అరిగిపోయి ఉంది. శిష్యుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది.

🌿చేదగా చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయే అరిగిపోయింది. 👉అలాంటిది సాధనతో నేను విద్యనార్జించలేనా? 

👉👉నా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను. అని దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు.

తిరిగి వచ్చిన శిష్యుణ్ణి చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు. గురువు గారికి మళ్ళీ తన అరచేయి చూపించి “గురువు గారూ! మీరన్న విద్యా రేఖ ఇక్కడ ఎక్కడ ఉంటుందీ నాకు చూపించండి” అన్నాడు. తన వేలితో గుర్తులు చూపించాడు. 

👉ఇప్పుడే బయటకు వస్తానంటూ బయటకు వెళ్లాడా శిష్యుడు. దగ్గర్లో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకుని గురువు గుర్తును చూపించిన చోట గీత లాగా కోసుకున్నాడు. తిరిగి గురువు దగ్గరికి వచ్చాడు.

🌿” గురువు గారూ! నాక్కూడా విద్యా రేఖ ఉంది. నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. దయచేసి మిగతవాళ్ళతో పాటూ నాకు విద్యను బోధించండి” అని ప్రాధేయపడ్డాడు. గురువుగారికి నోట మాట రాలేదు.

👉శిష్యుడికి విద్య పట్ల గల ఆసక్తి చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది.

👉 అతని పట్టుదలకు ముగ్దుడయ్యాడు. అతనికి కూడా విద్యనేర్పడం ప్రారంభించాడు.

👉అనతి కాలంలోనే ఆ విద్యార్థి మిగతా వారందరినీ మించిపోయాడు. 

🌿🌿🌿పెద్దయ్యాక, ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు. చరిత్రలో మిగిలిపోయాడు. 👉*ఆయన పేరు పాణిని.*🍁.            

No comments:

Post a Comment