Sunday, February 22, 2026

Anxiety Is Not a Mental Illness — It’s a Business | The Anxiety Economy Explained

Anxiety Is Not a Mental Illness — It’s a Business | The Anxiety Economy Explained

Author Name:Think Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JZKX1O0t6ec



Transcript:
(00:04) ఈ కాలంలో మనం అనుభవిస్తున్న యంజైటీ వ్యక్తిగత వైఫల్యమా లేదా సోషియో ఎకనామిక్ సిస్టం సృష్టించిన ఒక వ్యాధినా ఈ వ్యవస్థ చాలా తెలివిగా పనిచేస్తుంది. మొదట సమస్యను సృష్టించి ఆ సమస్య నీ లోపలే ఉందని నమ్మించి తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి ప్రొడక్ట్స్ అమ్ముతుంది. ఈ ఆందోళన ఆర్థిక వ్యవస్థలో అమ్మబడే వస్తువులు ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి.
(00:30) ఫిడ్జెట్ స్పిన్నర్స్, గ్రావిటీ బ్లాంకెట్స్, సిబిడి ఆయిల్స్, సాల్ట్ లాంప్స్, వైట్ నాయిస్ మిషన్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, కామింగ్ డిఫ్యూజర్స్ అండ్ మెడిటేషన్ యప్స్ ఇవన్నీ నీకు ఒకే హామీని ఇస్తాయి. నీ యంజైటీ తగ్గుతుందని కానీ ఈ హామీ ఒక మోసపూరితమైన మానసిక ఒప్పందం. ఎందుకంటే ఇవేమి యంజైటీ పుట్టే రూట్ కాజ్ ని తాకవు. ఇవి ఒక భరించలేని మైగ్రేన్ కి వేడి వేడి కాఫీ తాగడం లాంటిది.
(01:00) డబల్యహె్ఓ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యంజైటీ అండ్ డిప్రెషన్ కేసులు ఏ విధంగా పెరిగాయో వినండి. 1990 లో ఈ ప్రాబ్లం తో బాధపడేవారు అప్రాక్సిమేట్లీ 416 మిలియన్స్ 2013 నాటికి అది 615 మిలియన్ కు చేరుకుంది. ఇక 2017 లో 740 మిలియన్స్ 2025 లో అయితే అది ఒక బిలియన్ దాటింది. బట్ అదే టైంలో వెల్నెస్ ఇండస్ట్రీ అనే మార్కెట్ ఎలా పెరిగిందో కూడా వినండి.
(01:31) 2013 నుంచి ఈ మార్కెట్ రెట్టింపు అయింది. 2024 నాటికి దాని విలువ 6.8 ట్రిలియన్ డాలర్స్ అంటే ఇది మొత్తం ప్రపంచ ఆరోగ్య ఖర్చులకి సగానికి పైనన్న మాట ఇక్కడ మీలో ఒక ప్రశ్న పుట్టాలి ప్రజలు ఇంత మానసికంగా క్షీణిస్తుంటే ఈ మార్కెట్ ఎందుకు ఇంత లాభపడుతుంది? దీనికి నేను సింపుల్ ఆన్సర్ చెప్పలేను దాని మూలాల్లోకి వెళ్లి తీరాల్సిందే.
(01:57) అసలు యంజైటీ అంటే ఏంటి? ఫ్యూచర్ లో కంట్రోల్ కోల్పోయానన్న ఫీలింగ్ అంటే పవర్లెస్నెస్ హెల్ప్లెస్నెస్ ఇది కేవలం భయం కాదు ఎందుకంటే ఫియర్ కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అడవిలో ఉన్నప్పుడు టైగర్ రోడ్డు మీద ఉన్నప్పుడు వెహికల్ యుద్ధంలో ఉన్నప్పుడు శత్రువు బట్ యంజైటీకి స్పష్టమైన ఆబ్జెక్ట్ ఉండదు అది ఎలా ఉంటుందంటే ఏదో తప్పు జరుగుతుంది.
(02:21) కానీ ఏది అనేది స్పష్టంగా తెలియదు. అంటే అన్సర్టైనిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ అండ్ లాక్ ఆఫ్ కంట్రోల్ ఇవన్నీ కలిసినప్పుడు యంజైటీ పుడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే భయం అనేది ప్రెజెంట్ డేంజర్ బట్ యంజైటీ అనేది ఫ్యూచర్ డేంజర్ ఇమాజినేషన్ సో ఇప్పుడు అసలు మనిషిలో ఈ యంజైటీ ఎప్పుడు పుట్టింది సింపుల్ మనిషి ఆలోచించడం నేర్చుకున్న రోజు పుట్టింది.
(02:46) ఇక్కడ జంతువులు భయపడతాయి బట్ మనిషి మాత్రమే ఆలోచిస్తూ భయపడతాడు. ఎందుకంటే హ్యూమన్ ఎవల్యూషన్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. పాస్ట్ గుర్తుంచుకోవడం అండ్ ఫ్యూచర్ ని ఊహించుకోవడం ఇది సర్వైవల్ కి ఒక గొప్ప శక్తిని ఇచ్చింది. కానీ అదే శక్తి ఒక శాపంగా మారింది. ఇక ఆ క్షణం నుంచి మనిషి బుర్రలో రేపు ఏమవుతుంది నా స్థానం ఏంటి అసలు నేను బ్రతుకుతానా లేదా అనే ప్రశ్నలు పుట్టాయి.
(03:15) సో ఇక్కడ యంజైటీ ని కాన్షియస్నెస్ సైడ్ ఎఫెక్ట్ అనొచ్చు. బట్ ఇది డిఫెక్ట్ కాదు ఇది ఇంటెలిజెన్స్ యొక్క టాక్స్ అంటే మన కాషాయ కాంత వేసే జీఎస్టి అనొచ్చు. సో యంజైటీ కేవలం మనుషుల్లోనే ఉంటుందా జంతువులు, పక్షుల్లు పురుగుల్లో ఉండదా వాటికి ఫియర్ ఉంది స్ట్రెస్ ఉంది బట్ యంజైటీ లేదు. పూర్తిగా లేదు అని కూడా అనలేం కానీ మనిషి స్థాయిలో లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
(03:40) ఎందుకంటే అవి ఫ్యూచర్ గురించి అబ్స్ట్రాక్ట్ గా ఆలోచించవు. రేపు నా జీవితం విలువైనదా అని అల్బెట్ క్యాములో అడగలేవు. అలాగే సోషల్ కంపారిజన్ చేయవు ఐడెంటిటీ క్రైసిస్ ఉండదు. ఒక జింకకి పులి కనిపిస్తే వెంటనే పరిగెడుతుంది. ప్రమాదం పోయాక ప్రశాంతంగా మేతమేస్తుంది. కానీ ఇంకో పులి రావచ్చేమో అని రాత్రంతా నిద్రపోకుండా వెర్రి చూపులు చూడదు.
(04:06) బట్ మనిషి అలా కాదు ప్రమాదం పోయాక కూడా ఆ ప్రమాదం యొక్క మెమరీని తన ఇమాజినేషన్ తో భయాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాడు. అదే యంజైటీ సో ఇప్పుడు యంజైటీ వస్తే మన బాడీలో ఏమవుతుంది ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడే మార్కెటింగ్ ఆట మొదలవుతుంది. నీకు యంజైటీ వస్తే వెంటనే నీ బ్రెయిన్ లో అమిక్డ యాక్టివేట్ అవుతుంది. ఇది చూడడానికి బాదం పప్పులా ఉంటుంది.
(04:31) ఇది లింబిక్ సిస్టం లో భాగం అంటే మన ఎమోషన్స్ మన మెమరీస్ అండ్ మన మనుగడ బిహేవియర్ ని కంట్రోల్ చేసే మెదడు వ్యవస్థ. దీన్ని మెదడు యొక్క అలార్మ్ సిస్టం లేదా ఫియర్ సెంటర్ అంటారు. మీరు ఒక ప్రమాదాన్ని చూసినప్పుడు అంటే పామునో లేదా పెద్ద అరుపునో ప్రమాదకరమైన వ్యక్తిని చూసినప్పుడు మీ అమిక్డల మిల్లీ సెకండ్స్ లో స్పందిస్తుంది.
(04:55) మీరు థింక్ చేసే లోపే మీ బాడీ రియాక్ట్ అవుతుంది. ఇదే దానికిన్న గొప్ప శక్తి అమిడేలా ప్రమాదాన్ని గుర్తించినప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ రెస్పాన్స్ వస్తాయి. ఫైట్ ఫ్లైట్ ఫ్రీజ్ ఫైట్ అంటే పోరాడు ప్రమాదం రాగానే దాన్ని అటాక్ చెయ అంటుంది. విపరీతమైన కోపం వస్తుంది. శరీరం బలంగా అనిపిస్తుంది. ఫైట్ చేయలేని పక్షంలో ఫ్లైట్ అంటుంది. ప్రమాదం నుండి దూరంగా వెళ్ళిపో అంటుంది.
(05:21) అండ్ భయంతో పరిగెత్తాలనిపిస్తుంది. ఇక లాస్ట్ వన్ ఫ్రీజ్ స్తంభించిపోవడం. సడన్ గా టైగర్ నీ ముందు ఉన్నప్పుడు స్నేక్ ని ట్రౌజర్ లో దూరి హుక్ స్టెప్ వేస్తున్నప్పుడు స్తంభించుకుపోతావ్. ఇదే త్రీ టైప్స్ ఆఫ్ రెస్పాన్స్ సో కమింగ్ టు ద పాయింట్ యంజైటీ టైంలో అమిడలో యాక్టివేట్ అవుతుంది. దాంతో వెంటనే కార్టిజాల్ అడ్రినల్ లైన్ పెరిగిపోతాయి హార్ట్ రేట్ పెరుగుతుంది డైజెషన్ తగ్గుతుంది మజల్స్ టెన్స్ అవుతాయి.
(05:52) ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టం కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ సిస్టం ఒక టెంపరరీ ప్రమాదానికి తయారయింది. కానీ మనం దాన్ని పర్మనెంట్ గా యాక్టివేట్ చేసి బ్రతుకుతున్నాం. దాని ఫలితమే ఇన్సామనియా ఐబిఎస్ పానిక్ అటాక్స్ డిప్రెషన్ అలసట మానసిక గందరగోళం సో ఇక్కడే ఇండస్ట్రీ ఎంటర్ అయ్యి యంజైటీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అయింది. 16 సెంచురీ తర్వాత మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మనిషి జీవితం చాలా భయంకరంగా తయారయింది.
(06:23) ఇప్పుడు ప్రమాదం పులి రూపంలో లేదు అది కనిపించదు కూడా ఇప్పుడు ప్రమాదం రేపు ఉద్యోగం ఉంటుందా నేను ఈ సొసైటీలో బ్రతుకుతానా అసలు నా వాల్యూ ఏంటి అనే ప్రశ్నల రూపంలోకి మారింది. ఇది భయం కాదు ఇది హైపోతేటికల్ ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇదే యంజైటీ ఇక్కడ ఒక ముఖ్యమైన సైకాలజీ ట్రూత్ ఉంది. మన బ్రెయిన్ ప్రమాదాన్ని గుర్తించడానికి తయారైింది.
(06:48) బట్ అన్సర్టైనిటీని అన్ప్రెడిక్టబిలిటీని భరించడానికి తయారవ్వలేదు. ఎందుకంటే మన బ్రెయిన్ లోని అమిక్డడాల ప్రమాదం నిజమా కాదా అనే తేడా చూడదు అది కేవలం ఏదో తప్పు జరగవచ్చు అన్న సిగ్నల్ అందుకుంటే చాలు బాడీ మొత్తం ఎమర్జెన్సీ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 20త సెంచురీ మిడిల్ లో ప్రపంచం ఒక మలుపు తిరుగుతుంది. సెకండ్ వరల్డ్ వారి తర్వాత మెయిన్ గా 1950స్ 1970స్ ల వరకు యంజైటీని ఎక్కువగా ఒక మెడికల్ అండ్ సోషల్ ఇష్యూ గా ట్రీట్ చేశారు.
(07:23) పనివత్తిడి పేదరికం యుద్ధంలో గాయాలు కుటుంబ విభజన ఇవన్నీ యంజైటీకి కారణాలుగా మాట్లాడేవారు. సైకియాట్రీలో కూడా యంజైటీని ఒక రెస్పాన్స్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ 1980స్ లో ప్రపంచం మరో డైరెక్షన్ లో తిరిగింది. అది కేవలం ఎకనామిక్ చేంజ్ కాదు మెంటల్ చేంజ్ ఆ టైంలో నియో లిబరలిజం అనే భావజాలం బలబడింది. దీని బేసిక్ ఐడియా చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ అది చాలా ప్రమాదకరమైంది.
(07:51) ఈ నియోలిబరలిజం వ్యక్తి పూర్తిగా తన జీవితానికి తానే బాధ్యుడని చెప్పింది. ఇక్కడి నుంచి యంజైటీకి అర్థం మారడం మొదలయింది. అంటే ఈ యంజైటీ అనేది ఈ సిస్టం నిన్ను పీడిస్తుంది అనే నిజం నుంచి అది నువ్వు సరైన విధంగా నీ జీవితాన్ని మేనేజ్ చేయడం లేదు అనే తీర్పుగా మారింది. ఇది వినడానికి చూడడానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు.
(08:17) కానీ ఇది ఒక ఘోరమైన మానసిక మలుపు. ఎందుకంటే ఇక్కడ యంజైటీని వ్యవస్థ నుంచి విడదీసి వ్యక్తి లోపలికి నెట్టేశారు. సో ఈ మార్పు జరిగిన తర్వాత మార్కెట్ లోకి ఒక కొత్త అవకాశం దొరికింది. ఇప్పటివరకు యంజైటీ అంటే ఒక సమస్య. సో సమస్య అంటే దాన్ని తగ్గించాలి లేదా సిస్టం ని మార్చాలి. కానీ ఇప్పుడు యంజైటీ అంటే వ్యక్తిగత లోపం. ఇక లోపం అంటే దానికి సొల్యూషన్ అమ్మొచ్చు.
(08:44) సో అక్కడి నుంచి యంజైటీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా మారింది. మార్కెట్ లో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. ముందుగా అసౌకేర్యాన్ని గుర్తించాలి. తర్వాత అసౌకేర్యానికి ఒక పేరు పెట్టాలి. తర్వాత ఆ పేరుకి ఒక సొల్యూషన్ అమ్మాలి. 90స్ చివర్లో 2000 కాలంలో ఇదే జరిగింది. స్ట్రెస్, బర్న్ అవుట్, యంజైటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ మార్కెట్ పదాలుగా మారాయి.
(09:07) నీ దరిద్రానికి కారణం నీ వర్కింగ్ అవర్స్ కాదు జీతాలు కాదు భద్రత లేని సమాజం కాదు నిన్ను పనిలో పీల్చి పిప్పి చేసే దోపిడి వ్యవస్థలు కాదు నీ దరిద్రానికి కారణం నువ్వే అంది. నువ్వు సరైన హ్యాబిట్స్ పాటించట్లేదు నువ్వు సరైన మైండ్సెట్ డెవలప్ చేయలేదు నువ్వు సరైన రొటీన్ బిల్డ్ చేయలేదు. ఇలా యంజైటీని ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ గా మార్చారు.
(09:30) దాంతో ఇక్కడి నుంచి యంజైటీకి ఒక కొత్త లక్షణం వచ్చింది. ఆ లక్షణమే అది నిరంతరం ఉండడం. సో ఇప్పుడు ప్రమాదం తొలగిపోదు. ఎందుకంటే జాబ్ సేఫ్టీ ఎప్పుడూ ఉండదు. కంపారిజన్ ఎప్పుడూ ఆగదు అండ్ సోషల్ మీడియా ఎప్పుడు నిన్ను మించిన వాడిని చూపిస్తుంది. పైగా ఫ్యూచర్ ఎప్పుడు దరిద్రంగానే కనిపిస్తుంది. దాంతో ఇక్కడే యంజైటీ క్రానిక్ అయింది.
(09:54) క్రానిక్ యంజైటీ అంటే ఏంటి అది ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టం ని రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల పాటు ఆన్లో ఉంచడం. బయాలజీలో ఇదొక ఘోరమైన విషయం. ఎందుకంటే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టం టెంపరరీ ప్రమాదాల కోసం తయారయింది. బట్ దాన్ని ఇయర్స్ పాటు ఆన్లో ఉంచితే శరీరం నెమ్మదిగా చచ్చిపోతుంది. తిన్నది అరక్కపోవడం నిద్ర లేకపోవడం ఇమ్యూన్ సిస్టం వీక్ అవ్వడం శరీరం స్లోగా ఖరాబ్ అవ్వడం ఎగజాక్ట్ గా ఇక్కడే వెల్నెస్ ఇండస్ట్రీ ఎంటర్ అయింది.
(10:26) ఇది ఒక తెలివైనా కానీ ఒక క్రూరమైన వ్యాపారం. ఇది నీ యంజైటీని పూర్తిగా తొలగించదు. రిమూవ్ చేస్తే నువ్వు డైలీ కస్టమర్ కావు. సో అందుకే ఇది నీ యంజైటీని మేనేజబుల్ గా ఉంచుతుంది. తట్టుకునేంత తగ్గిస్తుంది కానీ మూలాన్ని తాకదు. మెడిటేషన్ యాప్స్ కామింగ్ ప్రొడక్ట్స్, సెల్ఫ్ కేర్ రొటీన్స్ ఇవన్నీ ఒక విధంగా పెయిన్ కిల్లర్స్ బట్ సర్జరీ కాదు.
(10:49) సో ఇప్పుడు మొదట్లో నేను అడిగిన ప్రశ్న దగ్గరికి మళ్ళీ వద్దాం. ప్రజలు ఇంత మానసికంగా క్షీణిస్తున్న వారి రోగం తగ్గకపోయినా ఈ మార్కెట్ ఎందుకు ఇంత ప్రాఫిట్ పొందుతుంది ఎందుకంటే యంజైటీకి నిజమైన కారణాలు అంటే 80% రీజన్స్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ సోషల్ డివిజన్ మీనింగ్లెస్ వర్క్ అండ్ కుల్లిపైన నీ రక్తం తాగే ఈ సిస్టం ఇవన్నీ వ్యక్తి కంట్రోల్ లో ఉండవు వాడు ఒక్కడిగా ఏం చేయలేడు కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసి వెల్నెస్ పేరుతో రొటీన్ ఫా ఫాలో అవ్వడం నీ చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది.
(11:25) ఆ ఇల్లుజన్ ఆఫ్ కంట్రోల్ చాలా శక్తివంతమైనది. ఫిలాసఫీ యాంగిల్ లో చెప్పాలంటే నువ్వు ఈ కుల్లిపోయిన వ్యవస్థని ప్రశ్నించలేనప్పుడు నిన్ను నువ్వే నిందించుకుంటావు.

No comments:

Post a Comment