Friday, February 20, 2026

 _*తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం:166*_

🕉️🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️

_*496. ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి ఎవరి కుమార్తెలు ?*_

మాండవి, శ్రుతకీర్తి జనకుని సోదరుడగు కుశధ్వజుని పుత్రికలనడంలో ఎలాంటి సంశయమూలేదు. ఊర్మిళ గూడ కుశధ్వజుని పుత్రికయే యని
పూర్వ గాధాలహరి పేర్కొంటున్నది. కంబరామాయణము గూడ ఊర్మిళను కుశధ్వజుని కూతురునియే నిర్దేశిస్తున్నది.

కంబ రామాయణం (బాలకాండం 139వ పుట) శ్రీ పూతలపట్టువారి అనువాదము. దీనినిబట్టి సీతారాముల పెండ్లి తరువాత జరిగిన ముగ్గురు సోద రుల వివాహములో ఊర్మిళ మున్నగు ముగ్గురు కుశధ్వజుని కుమార్తెలనీ వారిని లక్ష్మణాదులు చేపట్టారని తెలుస్తున్నది. కంబకవి ఏ రామాయణము నాధార ముగా గొని ఇలా వ్రాశాడో తెలియదు. ఇట్టి విషయాలలో మనకు ప్రమాణం వాల్మీకి రామాయణమే.

_*భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ ఏషరాజా కుశధ్వజః అస్యధర్మాత్మనో రాజన్ రూపేణాప్రతిమం భువి సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం పరయామహే భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః*_ కుశధ్వజుని ఇరువురు పుత్రికలను భరత శత్రుఘ్నుల కిమ్మని విశ్వా మిత్రుడు జనకుని కోరినాడు. జనకుడందు కంగీకరించాడు.

వసిష్ఠుడు జనకునితో _*రామలక్ష్మణయో రర్దే త్వత్సుతే వరయే నృప సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే ధాతుమర్హసి.*_

అని చెప్పాడు. నీ పుత్రికల లిరువురినీ రామలక్ష్మణులకిమ్మని తాత్ప ర్యం. “ఊర్మిళాజనకస్య ఔరపసుత్రీ"అని గోవిందరాజు వ్యాఖ్య, ఊర్మిళ జనకుని సొంతకూతురు అని దాని అర్ధం. ఇందువల్ల వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా గ్రహించి ఊర్మిళ జనకుని కూతురే అని గ్రహించాలి.

_*497. మానవునికి ఎన్ని జన్మలు వుంటాయి?*_

"జీవులెనుబడి నాల్గు లక్షల చావు పుట్టుకలిక్కిడ" అని చెప్పినట్లు 84 లక్షల జీవరాసులున్నాయంటారు. అందులో మానవ జన్మ చివరిది. దుర్లభమైన మానవ జన్మకు వచ్చిన తరువాత మళ్ళీ జన్మలు ఉంటాయా? అనేది ప్రశ్న. ఇందుకు ఆ జన్మలో మానవుని ప్రవర్తనను, లేదా స్థితిగతులను బట్టి ఆపై జన్మలు వుండవచ్చు లేదా లేకపోవచ్చు అని జవాబు చెప్పవలసి వస్తుంది. ఆత్మ జ్ఞానం కలిగేవరకూ మోక్షంరాదు. మోక్షం వచ్చేవరకూ జన్మలు తప్పవు. ఉత్తమ మైన సంస్కారం కలవారికి ఉత్తమజన్మలు, నీచసంస్కారం కలవారికి నీచజన్మలు సంభవిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల జ్ఞానంకల్గిమోక్షం సిద్ధించే టంతవరకూ ఎన్ని జన్మలైనా 1. కలుగవచ్చు. ఆ జన్మలు ఇన్ని అని చెప్పడం సాధ్యంకాదు. అంతేగాక ఆ 4 రానున్నజన్మలు మానవజన్మలుగానే ఉంటాయి. అనిగూడా చెప్పలేము. ఓ జడ భరతుడు మొదలైనవారి చరిత్రలు మానవులు తిరిగి పశుపక్ష్యాదులుగా - గూడ పుట్టవచ్చుఅని నిరూపిస్తున్నాయి.

_*498. పంచభూతలింగాలు ఏవి ? ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రాశస్త్యం*_

పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. 
1. పృథ్వీలింగం-కంచి 
2. జలలింగం జంబుకేశ్వరం 
3. తేజోలింగం -తిరువణ్ణామలై
4. వాయులింగం-శ్రీకాళహస్తి 
5. ఆకాశ లింగం - చిదంబరం. ఇందులో కంచి, జంబుకేశ్వరం, తిరువఙ్ఞామలై, చిదంబరం అనే క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. శ్రీకాళహస్తి తిరుపతికి సమీపంలో ఉన్నది.

కంచిలోని ఏకామ్రేశ్వరుడు పృధ్వీలింగరూపమై ఉన్నాడు. ఇక్కడి ఏకఫల మైన మామిడిచెట్టు కారణంగా ఈ దేవుడు ఏకామ్రేశ్వరుడయ్యాడు. కంచి ఏడు ముక్తిదాయక క్షేత్రాలలో ఒకటి. రామేశ్వరంలోని సైకతలింగంకూడా పృధ్వీలింగమే. జంబుకేశ్వరంలోని జలలింగం జలమయమై వుంటుంది. శివునకు జలం చాలాఇష్టం. ఆ దేవుడు అభిషేకప్రియుడు ఈక్షేత్రం తమిళ నాడులోని తిరుచినాపల్లివద్ద ఉన్నది. దక్షహింసవల్ల కల్గినపాపాన్ని తొల గించుకోవడానికి శివుడు జంబుకేశ్వరంలో తపస్సు చేశాడని పురాణగాధ. 

తమిళనాడులోని అరుణాచలం తేజోలింగనిలయం. అరుణాచలం చుట్టూ చేసే ప్రదక్షిణం మహాపుణ్య ప్రదమంటారు. శ్రీరమణమహర్షి ఈ క్షేత్రంలో తపోనిష్టుడై వుండి జ్ఞానమార్గోపదేశంతో ప్రసిద్ధి పొందాడు. = శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసమంటారు. ఇక్కడ వాయులింగ ప్రతిష్ఠితమైనది. సాలెపురుగు, పాము, ఏనుగు అనే తిర్యగ్జంతువులు ఇక్కడి శివలింగాన్ని. సేవించి ముక్తి పొందాయని శివపురాణం చెబుతున్నది. అందువల్లనే శ్రీకాళహస్తిగా ఈక్షేత్రం ప్రశస్తి కెక్కింది. ఆకాశలింగం చిదరంబరంలో ఉన్నది. ఇక్కడ ఏవిధమైన లింగాకారమూ కనిపించక నిరాకారమైన అంత రాళమే కానవస్తుంది. ఇది రూప రహితలింగం. అందువల్లనే ఆకాశ లింగంగా ప్రసిద్ధిగాంచింది. ఆకాశంలాగా శివుడు లేక ఆత్మసర్వవ్యాపి అని దీనివల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రం నిర్వికల్ప సమాధికి దోహదకారి. ఇలా పంచభూతాలకు ప్రతీకలైన ఈ లింగాలు పాంచభౌతికమైన జగమంతా దైవస్వరూపమే అనిచాటుతున్నాయి.

_*꧁ॐ┈┉━❀꧁ॐ꧂❀━┅┈ॐ꧂*_
_*సర్వేజనా సుఖినోభవంతు-శుభమస్తు.*_

          🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

No comments:

Post a Comment