*నూరు సంవత్సరాలు బ్రతకాల్సిన మనుష్యులు చిన్నతనం లోనే చావు నందుతూ ఉంటారెందుకని?*
*ఆచారం వల్ల ఆయువు పెరుగుతుంది. అనాచారం వల్ల అయువు తరిగిపోతుంది. ఆచారవంతులకు శ్రీ, కీర్తిలు పెరుగుతూ ఉంటవి. ఈ ఆచారం నియమం అనే వాటికి ప్రత్యేకమైన శాస్త్రమేదీ లేదు. వర్ణాశ్రమాచారాలు చెప్తూనే ఇవీ ఇమిడ్చి చెప్పారు. ఈ ఆచారాలను వాటి నుంచి గ్రహించి అనునరించాలి.*
గురుధిక్కారం, దుశ్శీలత, పిట్టలను చంపటం, గోళ్ళు కొరకటం, సంధ్యా కాలంలో సూర్యుని చూడటం చేయరాదు.
క్రోధం, హింస, అబద్దం చెప్పడం వదిలేయాలి.
ఉదయం ఉపాసన, దేవపూజనం చేయాలి.
పరదార మన పనికిరాదు. చేయరాని పనులు చేస్తుండటాన ఆయువు తరుగుతుంటుంది. చేయవలసిన పనులు చేయటం వల్ల ఆయువు పెరుగుతూ ఉంటుంది.
దేవాలయాల వద్దనూ, వీధిలోనూ, గోకోష్ఠాల వద్దనూ ఉమ్మివేయటం, మూత్ర పురీషాలను వదలటం కూడదు.
తూర్పు ముఖంగా భోజనం చేయాలి. నిలుచొని చేయరాదు.
మూత్ర విసర్జనం కూడ నిలుచుని చేయరాదు. మూత్ర పురీష విసర్జన కాలంలో మౌనంగా ఉండాలి.
ముసలివారు వస్తుంటే ఎంత కష్టంలో ఉన్నా- ఎదురు వెళ్ళి నమస్కరించాలి.
రెండు చేతులతో తలగోక్కోరాదు.
నెత్తి నూనె వంటికి రాచుకోరాదు.
దోవలో వెళ్తూ విప్రులకు, గోవులకు, క్షత్రియులకు, వృద్ధులకు, దుర్బలులకు, భారగర్భిణులకు దోవనిస్తూ నడవాలిగాని అడ్డగించరాదు.
పౌర్ణమి, చతుర్దశి, సప్తమి అష్టమిలలోనూ, తన జన్మ తిధియందున్నూ సంగమం చేయరాదు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గర్భిణీ స్త్రీలతో రమించకూడదు.
కొండీలు చెప్పకూడదు.
సంధ్యాకాలంలో నిద్రించకూడదు.
ఉత్తరానికి పడమరకూ తలబెట్టి పడుకొని నిద్రించరాదు.
కట్టి విడిచిన గుడ్డ కట్టరాదు.
తినే సమయంలో ఆపదార్థాలయందే దృష్టి- మనసు నుంచి తినాలి.
రాత్రికాలంలో పెరుగును తీపితో చేర్చి తినరాదు.
పంక్తిలో కొందరకు ఒక రకంగా పెట్టి ఇతరులకు మరో విధంగా భోజనం పెట్టరాదు.
దేవతర్పణం వేళ్ళ కొనల గుండాను, ఋషితర్పణానికి చిటికిన వేలి మొదళ్ళ గుండానూ పితృతర్పణానికి బొటన వేలినుంచీన్నీ నీటిని వదలాలి.
కుడి చేతితోనే ధర్మకార్యాలు చేయాలి.
కఠినంగా మాట్లాడటం క్రోధం కలిగి ఉండటం వల్ల ఆయుష్షు తరుగుతుంది.
వర్ణాశ్రమాచార విధులనేది మనకుగల నియమావళి. వాటి ననుసరించి అచారాలుంటవి. వాటిని అనుసరించాలి. వర్ణాశ్రమ ధర్మాలను పాటించుమనడం అవి అయుర్వృద్ధికరమైన వైనందునె.
ఆచారం ధర్మానికి మూలం. అన్ని ఆచారాల కంటె గొప్పది సకల భూతదయ కలిగి ఉండటం.
ఇవి జ్ఞాపకముంచుకొని ఆచరించి ఆయుర్వృద్ధి చేసికొనాలి.
~ మహాభారతం.
No comments:
Post a Comment