Saturday, February 21, 2026

కోపం ఒక మనిషిని ఎక్కడివరకు తీసుకెళ్తుంది? | Anger control & psychology


కోపం ఒక మనిషిని ఎక్కడివరకు తీసుకెళ్తుంది? | Anger control & psychology | Telugu | Ram C Vision

Author Name:Ram C Vision

Youtube Channel Url:https://www.youtube.com/@RamCVision-d2f

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SmS78U8HIDM



Transcript:
(00:00) మనిషి జీవితంలో కోపం అనేది సర్వసాధారణం కానీ కోపం అనేది చిన్న విషయం ఏమి కాదు కోపం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుంది అంటే ఒక మనిషిని హత్య చేయడానికి కూడా వెనకాడేలా చేయదు. ఇప్పుడు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. మీకు ఇష్టమైన వారి మంచి కోరుతూ వారి భద్రతను కోరుతూ మీరు ఎంతో ఆలోచించి వారికి ఇలా కాదు అలా అని చెప్పి చెప్పి ఒక స్టేజ్లో విసికిపోయి మీరు ఆగ్రహానికి కోపానికి గురైతే ఆ కోపాన్ని కారణంగా తీసుకొని వారు తిరిగి మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు.
(00:43) ఆ టైంలో మీరు పడిన బాధ అంతా ఇంతా కాదు. ఎందుకంటే మీకు క్లియర్ గా తెలుసు మీ కోపం వెనక మంచి ఉద్దేశం ఉందని మీకు ఇష్టమైన వారి భద్రతకు సంబంధించిన ఆలోచన ఉందని కానీ అది వారు అర్థం చేసుకోలేదన్న బాధ ఇంకొక సందర్భం ఉంటుంది మీరు ఎంత నెమ్మదిగా ఎంత ప్రశాంతంగా మీకు ఇష్టమైన వారి కోసం ఆలోచిస్తూ వారి భద్రత కోసం ఎన్ని మంచి మాటలు ఎంత మంచి సలహాలు ఇస్తున్నా మీరు మాట్లాడ డం పాపం వారే తిరిగి మీ మీద అటాక్ చేస్తూ ఉంటారు.
(01:22) తీవ్రమైన ఆగ్రహం కోపం మిమ్మల్ని అస్సలు మాట్లాడనివ్వరు. మీ మాటని పెడచెవన పెట్టేస్తారు. ఆ టైంలో కూడా మీరు పడిన బాధ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా మీకు తెలుసు మీరు వారి మంచి కోసమే ఆలోచించి వారి భద్రత కోసమే ఏదైనా చెప్తున్నారు అని కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా మీ మీదే కోప్పడేసరికి బాధ అనేది కలుగుతుంది. అసలు ఇంకో కొన్ని సందర్భాలలో మీకు సంబంధమే ఉండదు ఎక్కడో ఉన్న కోపాన్ని తీసుకొచ్చి మీ మీద చూపిస్తూ ఉంటారు.
(01:54) మీరు కూడా చాలా సందర్భాలలో సంబంధం లేని వారి మీద మీ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు ఆ కారణంగా నేను కోపపడ్డానే అని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది. కోపం అనేది మంచిదా చెడ్డదా కోపానికి ఏదైనా లాజిక్ ఉందా కోపం అనేది మనిషికి ఎక్కడ ట్రిగర్ అవుతుంది. కోపం మనిషికి వరమా శాపమా అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా విత్ లాజిక్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
(02:24) ఈ వీడియో చివరికి వచ్చేసరికి ఒక మనిషి కోపాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సహజంగా కోపం అనేది రెండు సందర్భాలలో వస్తుంది.
(02:50) ఒకటి నీకు ఫిజికల్ గా ఏదైనా త్రెట్ ఉన్నప్పుడు రెండు సైకలాజికల్ గా ఏదైనా త్రెట్ ఉన్నప్పుడు ఫిజికల్ త్రెట్ అంటే నీ సర్వైవల్ కి ఏదైనా భంగం కలిగినప్పుడు నీ శరీరం మీద ఏదైనా ఎటాక్ జరిగినా నీ వ్యాపారం నీ ఉద్యోగం అంటే జీవనాధారానికి సంబంధించిన వాటి మీద ఏదైనా ఎటాక్ జరిగినా నీ నివాస స్థలానికి సంబంధించిన దాని మీద ఏదైనా ఎటాక్ జరిగినా నీలో ఆటోమేటిక్ గా కోపం అనేది వస్తుంది.
(03:17) ఇక రెండోది సైకలాజికల్ త్రెట్ అంటే నీ మానసిక స్థితి మీద ఏదైనా దెబ్బ నీ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ తీసిన నీ ఆత్మ గౌరవం మీద దెబ్బ తిన్న నీ కుటుంబ గౌరవం మీద ఎవరైనా దెబ్బ కొట్టాలని చూసినా మొత్తానికి నీకు సంబంధించిన ఏదైనా ఐడెంటిటీ కి లాస్ జరుగుతుంది. ఐడెంటిటీ మీద దెబ్బ పడుతుంది అన్న సందర్భం వచ్చినా నీలో కోపం అనేది ఆటోమేటిక్ గా ట్రిగర్ అవుతుంది.
(03:44) సరే ఎలా ట్రిగర్ అవుతుంది ఒక బయాలజీ సింపుల్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బ్రెయిన్ లో సహజంగా రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి అమిక్డాల అనే కేంద్రం ఇది ఏంటంటే భావోద్వేగాల కేంద్రం అన్నమాట. రెండోది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం అంటే ఆలోచన ఏంటి ప్లానింగ్ ఏంటి చేయాల్సింది ఏంటి అనేది నిర్ణయం తీసుకోండి. అమిక్డాల పని వచ్చేసి నీ ఫిజికల్ త్రెట్ అయినా సరే నీ మానసికంగా ఏదైనా త్రెట్ ఉన్నా సరే దాని నుంచి నిన్ను కాపాడుకోవడం కోసం ప్రమాదాన్ని పసిగట్టి దానికోసం నువ్వు ఏం చేయాలి ఇక్కడి నుంచి నువ్వు పారిపోవాలా లేదా నువ్వు పోరాడాలా అనేదానికి నిన్ను రెడీ చేస్తుందన్నమాట
(04:26) దీన్నే ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్ అంటారు. అంటే నీ వల్ల అయితే పోరాడు లేదా పారిపో అని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఏం చేస్తుంది సందర్భం సిచువేషన్ ఏదైనా సరే ఆలోచన ఏంటి ప్లానింగ్ ఏంటి నువ్వు చేయాల్సింది ఏంటి వచ్చే ప్రతిఫలం ఏంటి ఇలాంటివన్నీ ఎస్టిమేట్ వేసి నువ్వు ఏం చేయాలో నిర్ణయిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి.
(04:55) మనిషి ఓవర్గా కోపానికి గురయ్యే సందర్భం ఏందంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కన్నా అమెక్డాలా అనేది త్వరగా ట్రిగ్గర్ అయ్యి త్వరగా యక్టివేట్ అయ్యి ఓవర్రైడ్ అవుతుందన్నమాట. దీన్నే అమిక్డాల హైజాక్ అంటారు. అంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఆలోచన కేంద్రం ఏదైతే ఉందో దీన్ని సేఫ్టీ కేంద్రం భావోద్వేగాల కేంద్రం అనేది ఓవర్రైడ్ చేస్తుందన్నమాట. అలాంటి సందర్భంలో ఆలోచన అనేది డౌన్ అవుతుంది కోపము భయం అనేది ఎక్కువైతాయి.
(05:26) ఇప్పుడు మనకు ఒక విషయం క్లియర్ గా అర్థంవుతుంది. కోపం అనేది మంచిదా చెడ్డదా వరమా శాపమా అంటే కోపం 100% మంచిదే అది ఫిజికల్ గా అయినా సైకలాజికల్ గా అయినా సరే మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి ఒక భావోద్వేగం ఒక అద్భుతమైన సిగ్నల్ ఇది 100% మంచిదే. మరి ఇది శాపంగా ప్రమాదంగా ఎప్పుడు మారుతుంది ఎప్పుడంటే ఈ సిగ్నల్ సరైన సమయంలో సరైన అవసరాన్ని బట్టి సరైన సందర్భంలో సిగ్నల్ ఆన్ అవ్వకుండా అనవసరమైన పరిస్థితులలో తప్పుగా అలారం ఇచ్చినప్పుడు తప్పుగా మన కోపాన్ని ట్రిగర్ చేసినప్పుడు అది ప్రమాదంగా మారుతుంది. సహజంగా మన
(06:13) జీవితాలలో మనం ఎలాంటి సందర్భంలో కోప్పడుతూ ఉంటాం. మన మీద ఎలాంటి సందర్భాలలో ఎవరైనా కోప్పడుతూ ఉంటారు? ఒకసారి ఆలోచించండి. నీ ఫిజికల్ త్రెట్ అనేది నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం నీ జీవనాధారం మీద ఎవరైనా దెబ్బ కొట్టడము ఇలాంటివన్నీ ఫిజికల్ త్రెట్స్. ఇవి ఎక్కువసేపు ఏమి ఉండవు. ఆ కాసేపే ఆ కొద్దిసేపే ఆ సమస్య క్లియర్ అయితేనే మళ్ళీ దాని గురించి మర్చిపోతాం.
(06:39) ఎవరో బయట వాళ్ళు వచ్చి మన మీద అటాక్ చేస్తే మనం ఎంత కోపానికి వెళ్ళినా సరే ఇది క్లియర్ ఇది పక్కన పెట్టేద్దాం. రెండోది ఐడెంటిటీకి సంబంధించి మన మానసిక స్థితికి సంబంధించి కోపం అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మనము ఎక్కువగా బాధపడుతూ ఉంటాము మనకు సంబంధించిన వాళ్ళని తీవ్రంగా బాధ పెడుతూ ఉంటాము.
(07:06) అంటే పిల్లలు భార్య మన కుటుంబం మొత్తం మన ఐడెంటిటీగా భావిస్తాం. వీళ్ళందరూ బాగుంటే మన ఐడెంటిటీ సురక్షితంగా ఉన్నట్లే బాగున్నట్లే సైకలాజికల్ గా మనకు ఎలాంటి త్రెట్ లేదు అని మనం భావిస్తాం. పిల్లలు చెప్పిన మాట వినాలి బాగా చదువుకోవాలి వాళ్ళు పైకి రావాలి భవిష్యత్తులో బాగుండాలి. ఇవన్నీ ప్రాపర్ గా జరిగితే మనం సేఫ్ మన ఐడెంటిటీ సేఫ్ మనక ఎలాంటి చెడ్డ పేరు లేదు.
(07:34) భార్య చెప్పిన మాట వినాలి సాంప్రదాయ బద్ధకంగా నడుచుకోవాలి నలుగురిలో గౌరవంగా మనల్ని తల ఎత్తుకునేలా చేయాలి మనల్ని మన కుటుంబాన్ని కేర్ తీసుకోవాలి. ఇది మన గౌరవాన్ని నిలబెడుతుంది అన్నమాట. ఇక్కడ కూడా మన ఐడెంటిటీ సేఫ్ లా మనం భావిస్తాం. భార్య అయినా అంతే భర్త తనకుి రెస్పెక్ట్ ఇవ్వాలి భార్యకు రక్షణ కల్పించాలి భార్యకు విలువ ఇవ్వాలి నలుగురిలో భార్యని భార్యలా గుర్తించాలి.
(08:02) ఇలా చేస్తే ఆయమ ఐడెంటిటీ ఆయమ ఆత్మగౌరవం దెబ్బ తినకుండా సురక్షితంగా ఉన్నట్టు భావిస్తుంది. మన అమ్మ నాన్న ఎవరైనా అంతే ఇలా కాకుండా ఏదైనా రివర్స్ అయిందా పిల్లలు సరిగ్గా చదువుకోపోయినా చెప్పిన మాట వినకపోయినా భార్య చెప్పిన మాట వినకపోయినా నలుగురిలో చెడ్డ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసిన అమ్మ నాన్న అయినా సరే ఎవరైనా సరే వీళ్ళు అనుకున్న విధంగా కాకుండా ఇంకోలా వెళ్తుంటే వీళ్ళ బ్రెయిన్ సింపుల్ గా నా ఐడెంటిటీకి ఏదో లాస్ జరుగుతుంది ఏదో తప్పు జరుగుతోంది ఇది ప్రమాదం దీన్ని కాపాడుకోవాలి అనేసి నీలో కోపాన్ని ప్రేరేపిస్తుంది.
(08:43) ఈ కోపం ఏమి వెంటనే రాదు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగానే ప్రయత్నం చేస్తుంది. ఓ స్టేజ్ కి తీవ్రంగా అది భయపడిపోతూ ఉంటుంది నేను ఎంత చెప్తున్నా వీళ్ళు వినట్లేదే అర్థం చేసుకోవట్లేదే ఇదే చేస్తున్నారే నా ఐడెంటిటీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది సీరియస్ అవుతుందని ఒకసారిగా కోపాన్ని ప్రదర్శించేలా చేస్తుంది అన్నమాట ఆ టైంలో మనం వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాం.
(09:06) కొంతమంది అర్థం చేసుకుంటే సైలెంట్ గా ఉంటారు ఇంకొంతమంది ఉంటారు. నువ్వు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోరు నీ కోపాన్ని కారణంగా తీసుకొని నిన్ను బ్లేమ్ చేస్తారు. అంటే నీదే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. నీకు క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది నువ్వు వాళ్ళ మంచి కోసమే చెప్తున్నావ అని నువ్వు అనుకుంటావ్ కాదు నువ్వు వారి మంచి కోసం చెప్తున్నావ అని నువ్వు అనుకుంటున్నావ్.
(09:27) నిజానికి వాస్తవంగా లోపల ఏం జరుగుతుందంటే నీ సబ్కాన్షియస్ మైండ్ క్లియర్ గా తెలుసు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వాళ్ళ ఐడెంటిటీ నీ ఐడెంటిటీ రెండు ముడిపడి ఉన్నాయి ఏ ఒకటి దెబ్బ తిన్న ఇంకోటి దెబ్బ తిన్నట్లే అని భావిస్తుంది కాబట్టి వారు నష్టపోతే వారు బాధపడితే అది ఇండైరెక్ట్ గా నిన్ను బాధ పెడుతుంది నీకు నష్టాన్ని కలిగిస్తుంది అని ఎక్కడో అది సబ్కాన్షియస్ మైండ్ లో రన్ అవుతుంది.
(09:54) బంధం అంటే అదే కదా అది రన్ అవ్వకపోతే బంధానికి మీనింగ్ లేదు. ఆ కనెక్షన్ ఉంటుంది ఉంటుంది కాబట్టి నీకు ఇక్కడ కోపం వస్తుంది. ఇది కోపపడే వాళ్ళు గుర్తించాలి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది నేను పిల్లల కోసం భార్య కోసమ కుటుంబం కోసమే కాదు నా ఆత్మగౌరవం దెబ్బ తింటుందేమో అన్న ఒక భయం ఉండాది ఆ భయం కారణంగానే నాకు కోపం వస్తుందని వీళ్ళు ఆలోచించాలి అవతలి వారి కూడా ఒక మనిషి మన మీద ఇంతలా ఆగ్రహంగా కోపంగా ఉంటున్నాడు అంటే దీని వెనక ఉన్న కారణం ఏంటో అవతల వాళ్ళు కూడా ఆలోచించాలి ఏ నువ్వు సరిగ్గా చదువుకోకపోతే బయటోళ్ళు ఎవరు నిన్ను అనడం లేదే నీ మీద
(10:33) కోప్పడం లేదే నువ్వు సరిగ్గా పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటే నీ సమయాన్ని హృదా చేస్తుంటే బయటోళ్ళు ఎవరు నీ మీద కోప్పడటం లేదే మీ ఇంట్లో వాళ్లే ఎందుకు కోప్పడుతున్నారు అంటే దీని వెనక ఏదో కారణం ఉందని ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇంకొన్ని సందర్భాల్లో ఇంకొంతమంది ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా ఓపిక్గా అవతల వారి మంచి కోరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే ఏ విషయమైనా వీళ్ళు నోరు తెరిస్తే చాలు అవతల వాళ్ళు కోప్పడిపోతూ ఉంటారు.
(11:03) నీదే తప్పు నీదే తప్పు నీకు చెప్పడం చేత కాదు నువ్వు సరిగ్గా ఆలోచించలేవు అంటే మూర్ఖత్వం అన్నమాట నువ్వు ఎంత నెమ్మదిగా అన్నా చెప్పు అర్థం చేసుకోరు నీ మీద కోప్పడిపోతూ ఉంటారు అంటే వీళ్ళు ఒక రకంగా ఫిక్స్ అయిపోయి ఉంటారేమో నువ్వు ఏం మాట్లాడినా తప్పే అన్నట్లు ఇది మూర్ఖత్వమో అమాయకత్వమో అవుతుంది కానీ అది అవసరమైన కోపం అయితే కాదు ఇంకోటి ఎక్కడో ఎవరి మీదనో ఉన్న కోపం తీసుకొచ్చి ఇంకొకరి మీద ప్రదర్శించడం వీరికి సంబంధమే ఉండదు ఆ కోపానికి అయినా సరే సరే వీరి మీద తెచ్చి ప్రదర్శిస్తూ ఉంటారు.
(11:36) ఉదాహరణకి ఆఫీసులో ఏదైనా బాస్ ఏదైనా అంటే అక్కడ ఏమి చేయలేడు. ఇంటికవచ్చి పిల్లల మీదనో భార్య మీదనో అరుస్తూ ఉంటాడు. లేదంటే ఫ్రెండ్స్ మీదనో ఇంకోరి మీదనో చిరాకు పడుతూ ఉంటారు సంబంధం లేని వ్యక్తుల మీద దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే ఇక్కడ ఐడి ఉంటుంది అంటే ప్రాథమిక కోరిక. ఈగో అనేది ఒకటి ఉంటుంది అంటే వాస్తవంగా ఉన్న పరిస్థితి ఆ సందర్భంలో ఏదైతే వాస్తవంగా పరిస్థితి ఉందో అది అలాగే సామాజిక నియంత్రణ ఉంటుంది.
(12:08) ఈ మూడిటి మధ్య జరిగే ఘర్షణ ఈ ఘర్షణ కారణంగానే ఎక్కడో ఉన్న కోపాన్ని ఇంకెక్కడో ప్రదర్శిస్తారు. అంటే ఇక్కడ ఐడియా ఏంటే ఏంది ప్రాథమిక కోరిక బాస్ నిన్ను ఏదన్నా అంటే నువ్వు కూడా తిరిగి అరిసేయ్ వాన్నని కూడా తిరిగి అంత మాట అనేసేయ్ అనే ఆలోచన అన్నమాట ఇలా కాకుండా సమాజంలో ఒక నియంత్రణ అనేది ఉంటుంది కదా సామాజికంగా మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి అనే పరిస్థితి ఉంటుంది కదా అది ఏం చెప్తుందంటే వద్దు కూల్ అవ్వు నీ బాస్ మీద నువ్వు అరవద్దు నీ ఉద్యోగం పోతుంది నీ మనుగడక మంచిది కాదు అని చెప్పేసి చెప్తుంది.
(12:44) సో బాస్ మీద అరవాలన్న కోరిక ఉండాది కోపం ఉండాది సామాజిక నియంత్రణేమో వద్దు కంట్రోల్ చేసుకో ఇది నీకు మంచిది కాదు అని చెప్తుంది. మరి లోపల ఆల్రెడీ ట్రిగర్ అయిన కోపం ఏమైపోవాలి ఇక్కడే ఈగో ఒక ప్లాన్ చేస్తుంది. దీన్ని బయట పెట్టడానికి ఏం చేయాలి ఈజీ మార్గంలో ఏం చేయాలని ఒక ప్లాన్ చేస్తుంది. అప్పటికే నువ్వు కోపంగా చిరాగ్గా ఉంటావు కాబట్టి నిన్ను ఎవడైనా గెలకడం పాపం అది ఇంట్లో వాడైనా బయటోవాడైనా వాడి మీద చిరాకు పడిపోతావ్ అన్నమాట.
(13:13) ఆ విధంగా ఆ కోపాన్ని బయటికి పంపించేస్తావ్ ఆ వేడిని ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తావ్. దీన్నే డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే ఎక్కడో ఉన్న కోపాన్ని ఇంకెక్కడో డంప్ చేయడం అన్నమాట. అయితే కోపం అనేది నేరుగా డైరెక్ట్ గా వస్తుందా కాదు ఒక సంఘటన ఉండాలి ఆ సంఘటన జరగాలి అది నీకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నీకు రిలేటెడ్ అయి ఉండాలి.
(13:35) అది ఫిజికల్ త్రెట్ లేదంటే నీ సర్వైవల్ నీ మనుగడ మీద ఏదైనా దెబ్బ తీసేలా ఉన్నా నీ మానసిక స్థితి నీ సైకలాజికల్ త్రెట్ ఏదైనా ఉందా నీ ఐడెంటిటీ మీద ఏదైనా ప్రభావం చూపుతుందా అనే విధంగా ఆ సంఘటన అనేది ఉండాలి వీటన్నిటి మీద నీకు ఆశ ఉండాలి లేదు ఇది నాకు దూరం అవ్వకూడదు అనే ఆశ ఇది నాకు కావాలనే ఆశ ఇది నాతోనే ఉండాలని ఆశ నాకు ఇంత గౌరవం ఉండాలనే ఆశ నాకు ఇంత పేరు ఉండాలనే ఆశ నా వారు ఇలా ఉండాలనే ఆశ దీని వెనక ఒక ఆశ అనేది ఉంటుంది.
(14:13) ఒక కోరిక అనేది ఉంటుంది. ఇలా కాకుండా వీటికి భంగం కలిగేలా ఏది జరిగినా నువ్వు అనుకున్నది అనుకున్న విధంగా కాకుండా వేరే విధంగా జరుగుతుంది అన్నా సరే దాన్ని నీ బ్రెయిన్ ముఖ్యంగా భావించి అయితే ప్లాన్ చేస్తుంది దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అలా కాకుండా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ప్లాన్ చేసే విధంగా కాకుండా ప్రమాదాన్ని గుర్తించే అమిక్డాల్ అనే భాగం త్వరగా రియాక్ట్ అయినా ఇది ఎక్కువగా డేంజర్ ఇది ప్రమాదం ఉంది.
(14:42) మన నుంచి ఏదో కోల్పోతున్నామని భావించిన వెంటనే సైరన్ని మోవించి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ని ఓవర్రైట్ చేసి అమిగడాల హైజార్క్ చేసి మీలోని భావోద్వేగాలలో ఒకటైన కోపాన్ని ట్రిగర్ చేస్తుంది. ఎందుకు దాని ఉద్దేశం ఒకటే మొత్తానికి ఏదో ప్రమాదం ఉంది నాకు సంబంధించింది దాన్ని కాపాడుకోవాలి దానికోసం నేను ఏం చేయాలి అంతే ఇది నిజంగా నీకు సంబంధించి ప్రమాదమే అయితే నిజమైన ప్రమాదమే అయితే నీ నుంచి ఏదన్నా కోల్పోతున్నావు దూరమవుతుంది అనేది నిజమే అయితే వాస్తవమే అయితే ఈ కోపం మంచిదే.
(15:22) అకారణంగా అనవసరంగా సందర్భం లేకుండా చిన్న విషయానికి నువ్వు ఓవర్ గా రియాక్ట్ అయ్యి ఎక్కువగా కోపం తెచ్చుకొని నీకు సంబంధించిన వాళ్ళ మీదనో లేదంటే ఇతరుల మీదనో నువ్వు ఆగ్రహంతో ఊగిపోతే ఇది తప్పుడు అలారం అవుతుంది ఈ అలారం వల్ల లేని పోని సమస్యను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అసలు ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా ఇతరులలోని కోపాన్ని అర్థం చేసుకోవాలి అనే దానికంటే ముందు ఈ కోపం ఒక మనిషిని చంపేసేంత స్థాయికి ఎందుకు వెళ్తుందో చూద్దాం.
(15:56) సహజంగా ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అయినా అమిగడాల్ అయినా సరే నార్మల్ గా దేని పని అది చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. కొంచెం అటు ఇటు బాలెన్స్ అయినప్పుడే కొంతమందిలో ఫ్రీఫ్రంటల్ కార్టెక్స్ చురుగ్గా ఉన్నప్పుడు కోపానికి పోకుండా ఆలోచన అనేది చేస్తారు. అదే సిచువేషన్ సేమ్ సిచువేషన్ వేరే వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళల్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కాకుండా అమిక్డాల్ అనేది కొంచెం ఎక్కువ వర్క్ అయినప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచనను పక్కన పెట్టి కోపానికి గురవుతూ ఉంటారు.
(16:26) సేమ్ సిచువేషన్ అయినా కూడా వారిలో ఎందుకు అలా వీరిలో ఎందుకు ఇలా అంటే దానికి గతం తాలూకు అలాంటి విషయాల పట్ల ఎక్స్పీరియన్సెస్ ని బట్టి వాళ్ళు ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు కింద మీద పడుతూ అంతవరకు వచ్చిఉంటారు. గత తాలూకు ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా బ్రెయిన్ అనేది ప్రస్తుతాన్ని క్యాలిక్యులేట్ చేసి నిర్ణయం తీసుకుంటుంది.
(16:48) ఇది సహజంగా ప్రతి ఒక్కరిలో డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఒకే సిచువేషన్ే రకరకాల మనుషులు రకరకాలుగా థింక్ చేస్తారన్నమాట. అది పక్కన పెట్టేద్దాం. ఇలా ఇంచుమించు కాకుండా కొన్ని సందర్భాలలో ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది పూర్తిగా డౌన్ అయిపోతుంది. వీరిలో ఆలోచన సామర్థ్యం అనేది తగ్గిపోతుంది ఉండదు అసలు తగ్గిపోతూ తగ్గిపోతూ లెవెల్స్ పడిపోతూ పడిపోతూ వస్తుంది.
(17:11) ఈ అమిగడాల అనేది ఓవర్ హైజాక్ చేయవస్తుంది అంటే ఓవర్రైట్ చేసేసి ఇది పెరిగిపోతూ పోతుంది. ప్రమాదం ప్రమాదం వచ్చేసింది వచ్చేసింది డేంజర్ డేంజర్ వీళ్ళ అవసరం లేదు వీళ్ళని ఏదో ఒకటి చేసేయాలి నన్ను ఏదనా చేయసారు లేదుంటే అన్నంత స్థాయిలో నన్ను ఏదో కాపాడేసేసుకోవాలి అనేసి తీవ్రమైన కోపము ఆగ్రహానికి లోనై ఆవేశంలో ఆ మనిషిని కొట్టడము లేదంటే చంపేయడం ఆ కోపంలో తెలియదు ఏం చేస్తారో వీళ్ళు ఆలోచన అనేది పూర్తిగా డౌన్ అయిపోతుంది.
(17:39) నిజానికి ఒక వ్యక్తిని చంపాల్సిన అవసరం లేని సిచువేషన్ అది కానీ వీళ్ళ బ్రెయిన్ ని ఇలా థింక్ చేస్తుంది. లేదు ఇది అవతలన ఏదో చేసేయాలని సిచువేషన్ లేదంటే నేను ఉండను నేను అవుట్ అయిపోతాను. ఇది చెప్పుకుంటూ పోతే ఇది మూర్ఖత్వమో అమాయకత్వమో పిచ్చితనమో ఎరితనమో మెంటల్ గా వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ అయింటే యాడికే వెళ్ళిపోతుంది కానీ మొత్తానికి అయితే ఇదే జరుగుతుంది ప్రాసెస్ ఆలోచన అనేది తగ్గిపోతుంది.
(18:02) కోపము ఆవేశం అనేది పెరిగిపోతూ పోతుంది. సరే ఇప్పుడు మనము మనకు నిజంగా కోపం వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి? నా కోపం అనేది నిజమేనా నిజానికి ఈ టైంలో నాకు కోపం రావాల్సిన అవసరం ఉందా నేను ఎవరి మీదైతే కోప్పడుతున్నానో వారి మీద ప్రస్తుతం నేను కోప్పడి వాదించి ప్రస్తుతం గెలవడం ముఖ్యమా లేక వారితో నాకున్న బంధం అనేది ముఖ్యమా ఆలోచించుకోవాలి.
(18:31) వారితో బంధమే ముఖ్యమైనప్పుడు నేను చెప్పేది వారికి ఎందుకు అర్థం కావడం లేదు. వారికి అర్థమయ్యేలా ఏ విధంగా చెప్పాలి నేను నెమ్మదిగా చెప్పితే వారికి అర్థం కానిది నేను కోపం తెచ్చుకుంటే వారికి అర్థంఅవుతుందా మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను కోప్పడం వల్ల ఈ సందర్భం ఏదైనా మారుతుందా ఈ క్వశ్చన్లు మనం వేసుకుంటే ఆ సిచువేషన్ ఏదైనా సరే మనకు భయం పోయి ఆలోచన అనేది మొదలవుతుంది.
(19:03) ఎందుకు ఈ క్వశ్చన్లు నీకు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? నీలోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ప్లానింగ్ సిస్టం ఏదైతే ఉందో అది వర్క్ అవుతుంది. ఈ ప్లానింగ్ సిస్టం వర్క్ అయినప్పుడు నీ అమిడాలా కి ప్రమాదం అనిపించదు. కాబట్టి ఇక్కడ కోపం కంట్రోల్ అవుతుంది. నువ్వు ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా నీలో కోపం ఆటోమేటిక్ గా తగ్గుతుంది.
(19:31) ఆ సందర్భంలో కోపం ట్రిగర్ అవ్వదు. ముందు ఆలోచన మొదలై తర్వాత అవసరమైతే కోపం అనేది ట్రిగర్ అవుతుంది. సరే ఇప్పుడు ఇంకో సందర్భం మనం నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే మనం మంచిగా మాట్లాడుతూ ఉంటే మన ఎదుటి వారి కోసమే మాట్లాడుతూ ఉన్నా అవతల వారు మన మీద కోప్పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అసలు వారెవరు నా మీద వాళ్ళకి కోప్పడాల్సిన అవసరం ఏముంది వారు ఏం చెప్పాలనుకుంటున్నారు వారు నన్ను అనుకుంటే పట్టించుకోకుండా ఆ విషయం వదిలేయొచ్చు అయినా సరే కోప్పడుతున్నారు.
(20:11) నాకేదో చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచో చెడో వారు మంచి అనుకున్నారో చెడు అనుకున్నారో వాళ్ళైతే ఒకటిని నమ్మారు నాకు ఇది మంచి జరుగుతుందని ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు వారు కోపంలో ఆవేశంలో ఉన్నారు నేను ఏదైనా మాట్లాడినా వారికి అర్థం కాదు. కాబట్టి ప్రశాంతంగా వారు కోప్పడుతూ మాట్లాడినా సరే అదిఏంటో ఫస్ట్ మనం విందాం. తర్వాత ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
(20:40) అంతేగాని వారి కోపానికి ప్రతిస్పందన నా కోపం అవ్వకూడదు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇలా అయినా సరే నీ ప్రశాంతత నీకు దూరం అవ్వకుండా ఉంటుంది. నీ ఆలోచన అనేది క్లియర్ గా ఉంటుంది. ఇంకొకటి ఎక్కడో ఉన్న కోపం ఇంకొకరి దగ్గర ప్రదర్శిస్తున్నా ఇలాగే ఆలోచించి వీరి మీద నేను ఎందుకు అరుస్తున్నాను నా కోపం వీరికి సంబంధించిందేనా ఇక్కడ నేను మాట్లాడడంలో అర్థం ఉందా? అదేవిధంగా ఎవరైనా ఎక్కడో ఉన్న కోపాన్ని నీ మీద ప్రదర్శిస్తుంటే వారు ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కోపంలో ఉన్నారు దాని వెనకుఉన్న కారణం ఏంటి అది
(21:22) నాకు సంబంధించిందనా అసలు కోపంలో ఉన్న వ్యక్తితో నేను ఇప్పుడు రియాక్ట్ అయి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇలా ఆలోచన చేస్తే మీకు ప్రశాంతత అనేది దూరం అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలలో దేనికి నువ్వు సంబంధించిన వాడివైనా సరే నువ్వు ఇదే విధంగానే నువ్వు క్వశ్చన్ చేసుకుంటే నీలో ఉన్న కోపం ఏంటి ఎందుకు వస్తుంది అనేది నీకు అర్థంఅవుతుంది ఎదుటి వారిలో ఉన్న కోపం ఏంటి దాని వెనక ఉన్న కారణం ఏంటి అనేది నీకు అర్థంఅవుతుంది.
(21:53) నువ్వు వాళ్ళ కోపం పట్ల ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది అర్థంఅవుతుంది. నీ కోపం పట్ల వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో కూడా నీకు అర్థంవుతుంది. మొత్తానికి నీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. కోపం అనే దాని మీద కోపం ఒక మనిషిని ఏ విధంగా నడిపిస్తుంది అనే దాని మీద సో ఇది గాయస్ ఈ వీడియో కోపం అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎందుకు అవసరము ఎలాంటి సందర్భాలలో కోపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీకు క్లియర్ గానే అర్థమయింది అనుకుంటున్నాను.
(22:24) ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైఫ్ లో ఎక్కువగా ఎలాంటి సందర్భాలలో మీరు కోప్పడుతూ ఉంటారు అనేది కింద కామెంట్ లో చెప్పండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో మంచి ఇన్ఫర్మేటిక్ వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment