బలవంతులైన మహిళలు టాక్సిక్ భర్తలను ఎందుకు భరిస్తారు? | Greeshma’s Guidance
Author Name:greeshma_guidance
Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LkqorJd4CSg
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఒక ధైర్యవంతురాలైన తెలివైన మరియు స్వతంత్రంగా ఉండే మహిళను చూసి ఆశ్చర్యపోయారా అంత ఎడ్యుకేటెడ్ కదా మరి ఆ టార్చర్ ఇచ్చే భర్తను ఇంకా ఎలా భరిస్తోంది అని బయట ప్రపంచంలో ఆమె ఒక లీడర్ లా ఉండవచ్చు. 10 మందికి సలహాలుఇచ్చే పొజిషన్ లో ఉండవచ్చు. చదువుకున్నది సంపాదిస్తున్నది ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది.
(00:29) కానీ తన ఇంట్లో తన మ్యారేజ్ విషయంలో మాత్రం ఆమె మౌనంగా ఉంటుంది. అంతా భరిస్తూ ఉంటుంది. కదా ఎందుకు ఆమె బలహీనురాలా లేక మనకు తెలియని ఏదైనా లోతైన సైక్లాజికల్ రీజన్ ఉందా? ఈరోజు మనం మహిళలను జడ్జ్ చేయబోవడం లేదు. వారిని అర్థం చేసుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు స్ట్రెంత్ మరియు సైలెన్స్ ఒకే వ్యక్తిలో కలిసి ఉంటాయి. ఆమె మనోభావాలు పాయింట్స్ వారీగా విశ్లేషిద్దాం.
(01:04) నెంబర్ వన్ చాలామంది అనుకుంటారు టాక్సిక్ రిలేషన్ అంటే మొదటి రోజు నుండే కొట్టడము తిట్టడము ఉంటాయని కానీ అది నిజం కాదు ఫ్రెండ్స్ నిజానికి టాక్సిక్ మ్యారేజెస్ చాలా అందంగా మొదలవుతాయి. దీనిని లవ్ పాంబింగ్ అంటారు. ఫర్ ఎగజాంపుల్ పెళ్లైన కొత్తలో ఆయన మీకోసం ఆఫీస్ మానేసి రావచ్చు. నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అని చెప్పొచ్చు.
(01:31) రోజు గిఫ్ట్లు ఇవ్వడం అతిగా పొగడడం చేయొచ్చు. అప్పుడు అది మీకు ఎంతో ప్రేమలా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా ఆ ప్రేమే ఐసోలేషన్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆ ఫ్రెండ్ ఎందుకు నేను ఉన్నాను కదా మీ అమ్మ వాళ్ళతో అంతసేపు మాట్లాడాలా నీ జాబ్ ఎందుకు ఆ ఆఫీసర్ తో ఫోన్లో అంతసేపు మాటలుఏంటి నేను సంపాదించేది సరిపోదా ఇలా మిమ్మల్ని అందరి నుండి అన్నింటి నుండి వేరు చేస్తారు.
(01:58) మీరు గ్రహించేసరికి మీరు ఒక ఎమోషనల్ జైల్ లో బందీ అయిపోతారు. నెంబర్ టూ ఒకవేళ ఒక వ్యక్తి 24 గంటలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే మీరు ఎప్పుడో బయటకి వచ్చేస్తారు. కానీ టాక్సిక్ వ్యక్తులు ఇంటర్మిటెంట్ రీఇన్ఫోర్స్మెంట్ అనే పద్ధతిని వాడుతారు. [సంగీతం] ఎగ్జాంపుల్ వారమంతా మిమ్మల్ని చిన్నచూపు చూసి వీకెండ్ లో సడన్ గా సర్ప్రైజ్ డిన్నర్ కి తీసుకెళ్తారు.
(02:29) ఐ లవ్ యు నా కోపాన్ని భరించు అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇది సరిగ్గా జూదం లాంటిది. ఎప్పుడో ఒకసారి వచ్చే ఆ మంచి రోజు కోసం ఆ మహిళ వేచి చూస్తూ ఉంటుంది. ఆమె భరిస్తోంది ఆ నరకాన్ని కాదు రేపు రాబోయే ఆ చిన్న సుఖాన్ని నెంబర్ త్రీ మన సమాజంలో ఆడపిల్లలకు చిన్నప్పటి నుండి ఏం నేర్పిస్తారు? సర్దుకుపోవాలి ఓపిక పట్టాలి ఫర్ ఎగజాంపుల్ భర్త తప్పు చేసినా అత్తమామలు లేదా బయట వాళ్ళు ఏం చెప్తారు మగాళ్ళ అన్నాక కొంచెం కోపం ఉంటుందిలేమా నువ్వే సర్దుకుపోవాలి అంతే కదా ఈ మాటలు విని విని ఆ మహిళ ఏమనుకుంటుందంటే బహుశా నాలోనే ఏదో లోపం ఉందేమో నేనే ఇంకా
(03:17) కష్టపడి ఈ సంబంధాన్ని కాపాడుకోవాలేమో అని తనను తాను నిందించుకుంటుంది. ఇది బలహీనత కాదు ఇది కొన్ని తరాలుగా మన మెదడులోనికి ఎక్కించబడిన ఒక సోషల్ కండిషనింగ్ నెంబర్ ఫోర్ టాక్సిక్ రిలేషన్స్ లో అతి భయంకరమైనది గేస్ లైటింగ్ అంటే మీ తప్పు లేకపోయినా మీదే తప్పు అని మీరు నమ్మేలా చేయడం. ఎగ్జాంపుల్ ఆయన ఇంకొకరితో చాటింగ్ చేస్తూ దొరికిపోయాడు అనుకోండి మీరు అడిగితే ఆయన ఏమంటారంటే నీకు పిచ్చి పట్టింది నువ్వు అనుమానపు ప్రాణివి అందుకే ఇలా మాట్లాడుతున్నావు.
(03:59) చివరికి పరిస్థితి ఎలా అయిపోతుందంటే మీరు ఆయనకి సారీ చెప్పే పరిస్థితికి తీసుకొస్తారు. దీనివల్ల మీ సెల్ఫ్ ఎస్టీమ పూర్తిగా దెబ్బ తింటుంది. నెంబర్ ఫైవ్ ఒక బలమైన స్త్రీ తన భర్తను విడిచి ఎందుకు ఉండలేకపోతుంది అంటే ఆమె మెదడులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆమెను ప్రేమించే మంచి భర్త ఆమెను హింసించే టాక్సిక్ భర్త. ఈ ఇద్దరిలో ఎవరిని నమ్మాలో ఆమెకు అర్థం కాదు దీనినే కాగ్నిటివ్ డిజైనర్స్ అంటారు.
(04:31) పాత తీపి జ్ఞాపకాలను తలుచుకుంటూ ప్రస్తుత చేదు నిజాలను ఆమె మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. [సంగీతం] నెంబర్ సిక్స్ బాధాకరమైన బంధంలో ఉండడం కష్టమే కానీ ఆ బంధాన్ని వదిలి బయటకి రావడం మరింత భయానకంగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అయినప్పటికీ సమాజం ఏమనుకుంటుంది పిల్లలకు తండ్రి లేకపోతే ఎలా ఒంటరిగా నేను సెక్యూర్ గా ఉంటారా అనే భయాలు వారిని కట్టిపడేస్తాయి.
(05:05) ఇక్కడ ఆమె ఆ నరకాన్ని ఇష్టపడటం లేదు కానీ బయట ఉండే ఆ అనిస్థితి కంటే ఈ అలవాటైన నరకం నయం అని రాజీ పడిపోతుంది. కంఫర్ట్ ఇన్ పెయిన్ అంటారు. ఇక నెంబర్ సెవెన్ ట్రామా బాండింగ్ అంటే మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తినే మీరు ఆశ్రయించడం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మిమ్మల్ని గట్టిగా తిట్టినప్పుడు మీ మనసు విరిగిపోతుంది. కానీ మళ్ళీ ఆయనే వచ్చి దగ్గరకు తీసుకున్నప్పుడు మీ మెదడులో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది.
(05:37) దీనివల్ల మీకు ఒక వింతైన అడిక్షన్ ఏర్పడుతుంది. బయట వారికి ఇది పిచ్చిలా అనిపించొచ్చు. కానీ మానసికంగా అది ఒక కులుసుల మిమ్మల్ని కట్టేస్తుంది. మీరు ఇప్పటివరకు ఆ బంధంలో ఉన్నారంటే మీరు ఓడిపోయినట్లు కాదు మీరు ప్రేమను నమ్మారు కుటుంబాన్ని కాపాడాలి అని చూశారు కానీ ఎదుటి వ్యక్తి మారనప్పుడు ఆ పోరాటం మిమ్మల్ని మీరు చంపుకోవడమే అవుతుంది.
(06:04) సెల్ఫ్ అవేర్నెస్ అనేది పిరిదులకి మొదటి మెట్టు ఫ్రెండ్స్ నేను ఉంటున్నది ప్రేమ కోసం కాదు భయం వల్ల అని మీరు గుర్తించిన రోజునే మీరు సగం విజయం సాధించినట్లు మీరు ఆ బంధంలో ఉన్నా లేదా బయటకు రావాలి అనుకున్నా ముందుగా ఈ పనులు చేయండి. స్టాప్ ఇంటర్నలైజింగ్ ఇన్సల్ట్స్ ఆయన మిమ్మల్ని చేతకాని దానివి అంటే అది ఆయన అజ్ఞానం మీ వాస్తవం కాదు.
(06:36) ఎమోషనల్ ఇండిపెండెన్స్ మీ సంతోషం కోసం ఆయన పైన ఆధారపడటం తగ్గించండి. మీకు నచ్చిన పనులు మీరు చేయండి. బౌండరీస్ నాతో ఇలా మాట్లాడటం నాకు నచ్చదు అని ఖచ్చితంగా చెప్పండి. గొడవపడకండి క్లారిటీ ఇవ్వండి. ఫైనాన్షయల్ సెక్యూరిటీ మీకంటూ కొంత సంపాదన లేదా పొదుపు ఉండేలా చూసుకోండి. ఫ్రెండ్స్ చివరిగా నేను చెప్పేది ఒకటే. బలవంతులైన మహిళలు టాక్సిక్ మ్యారేజ్ లో ఉండడానికి కారణం బలహీనత కాదు.
(07:02) అది అతిగా ప్రేమించడం మరియు అతిగా ఆశించడం. కానీ గుర్తుంచుకోండి మీ ఓపిక మీ ప్రశాంతతను బలి తీసుకోకూడదు. మీ ప్రేమ మీ ఉనికిని నాశనం చేయకూడదు. మీరు భరించడానికి అంత ధైర్యం చూపగలిగితే మీకోసం మీరు నిలబడటానికి కూడా అంతే ధైర్యం చూపగలరు. మీ జీవితం ఎవరికో ఒకరికి బలివ్వడానికి కాదు ఫ్రెండ్స్ గౌరవంగా బ్రతకడానికి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
(07:33) ఐ వర్తి అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని డీప్ సైకలాజికల్ ఇన్సర్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది క్రిస్మస్ గైడెన్స్ ఇక్కడ నేను మహిళలను జడ్జ్ చేయను వారిని బలపరుస్తానంతే బీ స్ట్రాంగ్ బి హ్యాపీ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడెన్స్.
No comments:
Post a Comment