Friday, February 20, 2026

 👉 *ఆచరణీయ ధర్మశాస్త్రమనునది, వేదములో నుండి సులభముగ అర్ధం కావాలని పెద్దలు, ధర్మసింధు, నిర్ణయసింధు, అను పేర్లతోను ; మనుస్మృతి, పరాశరస్మృతి మొదలగు పేర్లతోను వ్రాశారు.* 

వాటిలో కూడ ... ఋషులు చెప్పిన వాటినే వ్రాశారు. ఈ స్మృతులు, సింధువులు మొదలగునవి ధర్మనిబంధన గ్రంథములు. మానవుని ఆరోగ్యమును దృష్టిలో ఉంచుకొని ఈ శాస్త్రములు - వ్రాయబడినవి. (రోగములే పాపములు) *ధర్మశాస్త్రము అంటేనే గొప్ప "ఆరోగ్యశాస్త్రము” అనాలి.*

 *పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణబాధతే!* అని చెప్పుచునే వున్నాము. మానవుడు ఆరోగ్యముగ వున్నపుడే సదాచారాలు చేయగల్గుతాడు. రోగములు రాకుండా నిరోధించునవే ఆచారములు, మంత్రతంత్రములు. వీటి ప్రభావముతో మానవుని మనస్సు శుచియై నిగ్రహమును కలిగిస్తూ వున్నది.

పూర్వము *“ధర్మప్రజా సంపత్త్యర్ధం స్త్రియముద్వహేత్||"* అనే భావముతో వివాహము చేసుకొనెడివారు. పిల్లలు ఆరోగ్యవంతులుగాను ధర్మాచరణులుగాను వుండేలాగున పుట్టేవారు. ధర్మము వలన దేశము సుభిక్షముగా వుండేది. *ప్రకృతములో మనము ధర్మలోపము చేయుట వలన మన పిల్లలే మనకు అడ్డం తిరుగుతున్నారు.* మన సాంప్రదాయమునకు విరుద్ధముగ తయారైనారు. ఈ విధముగా జరగడంలో ప్రయోగలోపమే ప్రధాన కారణము.

🙏🙏🙏.        

No comments:

Post a Comment