_*తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం:167*_
🕉️🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️
_*499. లలితా సహస్రనామ విశిష్టత ఏమిటి?*_
శ్రీ విష్ణుసహస్రనామాలను పారాయణం చేసినట్లే అనేకులు భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామాలను పారాయణం చేస్తున్నారు. ఈ సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. శ్రీ హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ నామాలను విశదీకరిస్తాడు. హయగ్రీవుడు జ్ఞానానందమయుడైన అవతార స్వరూపుడు. అగస్త్యుడు ఋషులలో శ్రేష్ఠుడు. వీరిరువురి సంవాదం కావడమే శ్రీలలితా సహస్రనామ ప్రాశస్త్యాన్ని వెల్లడిస్తున్నది.
శ్రీ విద్యారూపిణి, జగత్తును ధరించేది, సృష్టి స్థితిలయాలకు అధీశ్వరి అయిన మహాత్రిపురసుందరి యొక్క వైభవాన్ని ఈ స్తోత్రం కీర్తిస్తున్నది. ఇందులో ప్రతిపాదింపబడే దేవియొక్క మహిమ అనంతం కావడంవల్ల ఈ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం కల్గింది. వెనువెంటనే సిద్ధికల్గించే తంత్ర గ్రంధాలకు చెందిన నామసహస్రాలలో ఇది చాలాముఖ్యమైనది. ఈ స్తోత్ర పారాయణం ద్వారా భక్తులు పరమాత్మను దేవీ రూపంలో ఉపాసించిన వారవుతారు. ఇందలి వెయ్యి నామాలు వెయ్యి మంత్రాలుగా భావింపబడు తున్నాయి. వీటికి అతి విస్తృతమైన భాష్యాలు వెలువడ్డాయి. శ్రీ విద్యా రణ్యులు, శ్రీ శంకరులు, శ్రీ భాస్కరరాయాదులు వ్రాసిన భాష్యాలు సుప్ర సిద్ధాలు. అందులో ఇందలి నామాలప్రాశస్త్యం వివరింప బడివ్నుది. వశిన్యాది దేవతలు వ్యాసభగవానుని ద్వారా ఈ పవిత్ర నామావళిని పలికించారనే ప్రతీతి కద్దు. కుండలినీ యోగ రహస్యం, నిర్గుణోపాసన, సగుణోపాసన, శ్రీచక్రవర్ణన, చతుష్షష్టి యోగినీ విశేషాలు, లలితాంబికా తత్త్వం మున్నగు అనేక విశిష్ఠ విషయాలు ఈ సహస్రనామావళిలో కనిపిస్తాయి.
_*అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా*_
"అంతర్ముఖులైన వారిచే ఆరాధింపదగినది, బహిర్ముఖులకు మిక్కిలి దుర్లభ” అని ఇక్కడ దేవి కీర్తింపబడింది. ఈ మాటలు.
_*కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ ఆ వృత్తచక్షు రమృతత్వమిచ్చన్.*_
“ఒకానొక ధీరుడు అమృతత్వం కోరిచూపును అంతర్ముఖంచేసి ప్రత్య గాత్మను చూచాడు" అన్న కఠోపనిషత్తులోని మాటలతో సామ్యంకల్గి వున్నాయి. అందుచేత ఉపనిషత్తత్త్వం ఈ నామావళిలో ఉన్నదని గ్రహించ వచ్చు. లలితాదేవి ఈ నామాలను పఠిస్తే మిక్కిలి ప్రీతి చెందుతుంది.
_*మత్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయః*_
అని చెప్పిన దేవి మాటలనుబట్టి ఈ స్తోత్రం సమస్తాభీష్టాలను సిద్ధింప జేస్తుందని తెలియవస్తున్నది. అంచేత ఈనామాలు మిక్కిలి ముఖ్యమైనవని గ్రహించాలి.
_*500. వేదవ్యాసుడు ఎవరు ?*_
శ్రీమన్నారాయణుడు 'అపాంతరతముడు' అనే మానవపుత్రుణ్ణి సృష్టించాడు. వేదాలను విభజించమని అతణ్ణి నియోగించాడు. బ్రహ్మ అతణ్ణి చూచి నాయనా! రావోబు కాలములో వశిష్ఠుని మనుమడైన పరాశరుని పుత్రుడవై పుట్టుదవుగాక అని చెప్పాడు.
బ్రహ్మదేవుడు చెప్పినట్లే వశిష్ఠునికి మనుమడూ, శక్తికి పుత్రుడూ అయిన పరాశరునకు సత్యవతియందు పుట్టినవాడు వేదవ్యాసుడు. ఇతడు మాతృ గర్భము నుండి పుట్టినవెంటనే 'తల్లీ! నాతో నీకు పని కల్గినప్పుడు నన్ను స్మరించు. వెంటనే నేను వస్తాను'అని చెప్పి వెళ్ళిపోయాడు.
వేదవ్యాసుడు జన్మించిన పద్ధతి ఇది-పరాశరుడు ఒకసారి తీర్థయాత్రకై పోతూ యమునానదిని దాటవలసి వచ్చింది. అక్కడ పడవ నడుపుతూ వుండిన మత్స్యగంధిని చూచి అతడు కామ పరవశుడయ్యాడు. ఆమె తన కన్యాత్వం దూషిత మవుతుందని భయపడింది. పరాశరుడు ఆమె కన్యాత్వం దూషితం కాకుండా వుండేటట్లు వరమిచ్చాడు. యమునా నదీతీరంలో చీకటిని సృష్టించాడు. ఆమెను పరిగ్రహించాడు. అప్పుడు మత్స్యగంధికీ, పరాశరునికీ పుట్టినవాడే వేదవ్యాసుడు.
మత్స్యగంధికే సత్యవతి అనిపేరు. అందుకే వ్యాసుడు సాత్యవతేయుడయ్యాడు. ఈ వ్యాసుడు భారతాన్నీ, అష్టాదశ పురాణాలనూ, భాగవతాన్నీ, బ్రహ్మ సూత్రాలనూ రచించిన మహామహుడు. వ్యాసుడు ఒకడుకాడనీ, యుగ భేదాన్ని అనుసరించి పెక్కుమంది వ్యాసులు ఉన్నారనీ కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.
_*501. శ్రావణకుమారుని తల్లిదండ్రుల నామధేయములు ఏమి? అతని వృత్తాంతము ఏమిటి?*_
శ్రావణకుమారుని తల్లిపేరు కుండ. తండ్రిపేరు శ్రవణుడు. శ్రావణ కుమారుడు వృద్ధులూ, గ్రుడ్డివారూ అయిన తల్లిదండ్రులను మిక్కిలి భక్తిశ్రద్ధలతో సేవిస్తూ వుండినాడు. ఒకసారి తల్లిదండ్రులకు నీరు తేవడానికై అతడు ఒక నదికి వెళ్ళాడు. నీటిలో కుండను ముంచుతున్నప్పుడు బుడబుడమనే శబ్దం వచ్చింది. ఆ ప్రాంతానికి వేటకై వచ్చిన దశరథమహా రాజు ఆ శబ్దం విని ఎనుగు తొండంతో నీరు గ్రహించే శబ్దంగా భావించి తగిలింది. అతడు ఆర్తనాదం చేశాడు. అదివిని దశరధుడు తన తప్పు శబ్దవేధి బాణం ఆవైపు ప్రయాగించాడు. ఆ బాణం మునికుమారునికి గ్రహించి అతని చెంతకు వెళ్ళాడు. మునికుమారుడు తన తల్లిదండ్రుల స్థితి ఎరిగించి వారికి తన సంగతి తెలుప వలసినదిగా రాజును ప్రార్ధించి ప్రాణం వదిలాడు. దశరథుడు విషణ్ణుడై అంధులైన అతని తల్లితండ్రులకు జరిగిన వృత్తాంతం వివరించాడు. అప్పుడు శ్రవణముని "నావలె నీవును పుత్రశోకంతో మరణింతువు"అని శపించి శరీరపరిత్యాగం చేశాడు. దశరథుడు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినపుడు కౌసల్యతో ఈ సంగతి చెప్పినట్లు రామాయణంలో ఉన్నది.
_*꧁ॐ┈┉━❀꧁ॐ꧂❀━┅┈ॐ꧂*_
_*సర్వేజనా సుఖినోభవంతు-శుభమస్తు.*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
No comments:
Post a Comment