Thursday, February 19, 2026

*****మీరు ఒక హీరోనో, పొలిటీషియన్ నో దేవుడిలా కొలుస్తున్నారు కదా? ఆ ప్రేమకి రీజన్ ఏంటి అని అడిగితే... మీరు చెప్పే ఆన్సర్స్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబడదు.

మీరు ఒక హీరోనో, పొలిటీషియన్ నో దేవుడిలా కొలుస్తున్నారు కదా? ఆ ప్రేమకి రీజన్ ఏంటి అని అడిగితే... మీరు చెప్పే ఆన్సర్స్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబడదు. 

​నమ్మకం లేదా? 

చాలామంది ఏమంటారంటే... ఆయన మాకు ఆనందాన్ని ఇస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు... అందుకే ఆయనంటే మాకు ప్రాణం" అంటారు. 

​పోనీ, అది నిజమే అనుకుందాం! 

మీ లాజిక్ ప్రకారం... మీకు సేవ చేసేవాళ్లు, మీకు ఆనందాన్ని ఇచ్చేవాళ్లు మీకు దేవుళ్ళతో సమానం కదా? 

​మరి... 

మీకు అన్నం పెట్టే రైతు కోసం ఎప్పుడైనా కటౌట్ కట్టారా? 

మిమ్మల్ని బార్డర్ లో కాపాడే సైనికుడి కోసం ఎప్పుడైనా ట్విట్టర్ లో గొడవ పడ్డారా? 

పోనీ అవన్నీ వదిలేయండి... మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల ఫోటోకి ఎప్పుడైనా పాలాభిషేకం చేసారా? 

​లేదే! వాళ్ళు కదా మీకు నిజమైన ఆనందాన్ని, జీవితాన్ని ఇచ్చింది? 

మరి వాళ్లని వదిలేసి... టికెట్ కొనుక్కుంటే తప్ప మొహం చూపించని వాడికి ఎందుకు దాసోహం అవుతున్నారు? 

​అంటే... మీ లాజిక్ నెంబర్ 1 - FAKE. 

ఇది కృతజ్ఞత కాదు... ఇది Just మోజు 

సరే, ఇంకొందరు మేధావులు ఏమంటారంటే... ఆయన జీరో నుంచి హీరో అయ్యాడు. ఎంతో కష్టపడ్డాడు. ఆయన ఇన్స్పిరేషన్. అందుకే ఆరాధిస్తున్నాం. 

​పోనీ, అది కూడా సరే అనుకుందాం! 

కష్టపడేవాడు మీకు ఇన్స్పిరేషన్ అయితే, గ్రేట్ అయితే... 

​మీ ఇంటి పక్కన భవన నిర్మాణ కార్మికుడు ఉంటాడు. 50 డిగ్రీల ఎండలో, నెత్తి మీద ఇటుకలు మోస్తాడు. ఆయన కష్టం ముందు మీ హీరో కష్టం ఎంత? 

ఏసీ కారవాన్ లో కూర్చుని, మేకప్ వేసుకుని చేసేది కష్టమా? రక్త మాంసాలు కరిగేలా పని చేసేవాడిది కష్టమా? 

​మీ లాజిక్ ప్రకారం... ఆ కూలి పని చేసేవాడికి మీరు ఫ్యాన్ అవ్వాలి కదా? వాడి కోసం విజిల్స్ వెయ్యాలి కదా? 

చేస్తున్నారా? లేదు. వాడిని కనీసం మనిషిలా కూడా చూడరు. 

​అంటే... మీకు కావాల్సింది కష్టం కాదు... మీకు కావాల్సింది గ్లామర్. 

చెమట వాసన మీకు పడదు... సెంటు వాసనకే మీరు పడిపోతారు. 

​అంటే... మీ లాజిక్ నెంబర్ 2 - కూడా FAKE. 

ఇది గౌరవం కాదు... ఇది Just ఆకర్షణ. 

చాలామంది ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్తారు... మా హీరో గొప్ప దాత. ఎన్నో కోట్లు విరాళం ఇచ్చాడు. ట్రస్టులు నడుపుతున్నాడు. అందుకే ఆయన్ని ప్రేమిస్తున్నాం.

​పోనీ, అది నిజమే అనుకుందాం! 

మీకు "దానం" చేసే గుణం అంటే అంత ఇష్టం కదా? 

మరి అదే గుణం మీలో ఎందుకు లేదు? 

​మీ హీరో ఒక కోటి రూపాయలు చెక్ ఇస్తే... పేపర్లో ఫోటోలు వస్తాయి. 

కానీ, మీరు ఆయన సినిమా రిలీజ్ రోజున... వేల లీటర్ల పాలు తీసుకెళ్లి, ఒక ప్లాస్టిక్ ఫ్లెక్స్ మీద పోస్తున్నారే... 

ఆ పాల కోసం ఏడుస్తున్న పసిపిల్లలు రోడ్డు మీద లేరా? 

​మీకు నిజంగా దానం మీద ప్రేమే ఉంటే... ఆ పాలు ఆ బిడ్డకి ఇవ్వాలి కదా? కటౌట్ కి ఎందుకు పోస్తున్నారు? 

ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా... అట్ట ముక్కకి అభిషేకం చేస్తున్నారే... 

దీన్ని దానం అనరు... వృధా అంటారు. 

​అంటే... మీ లాజిక్ ప్రకారం... మీకు దానం చేసేవాడు ఇష్టం కాదు. 

దానం పేరుతో షో చేసేవాడు మాత్రమే ఇష్టం. 

ఇది సేవా భావం కాదు... ఇది బానిస భావం. 

మా హీరో ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. రికార్డులు తిరగరాస్తున్నాడు. మా వాడి రేంజ్ వేరు.

​పోనీ, అదీ నిజమే అనుకుందాం! 

ఆయన రికార్డులు కొడితే... ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. 

మరి మీకేంటి లాభం? 

​ఒకవేళ ఆయన రేపు పొద్దున్న ఇండస్ట్రీని శాసించడం మానేస్తే... మీ ఇంట్లో గ్యాస్ బండ ధర తగ్గుతుందా? 

ఆయన సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తే... మీ పిల్లల స్కూల్ ఫీజు తగ్గుతుందా? 

​ఆయన గెలుపు... మీ గెలుపు ఎలా అవుతుంది మిత్రమా? 

ఒక క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే... కనీసం దేశానికి పేరు వస్తుంది. 

కానీ ఒక హీరో గెలిస్తే... కేవలం ఆయన కుటుంబానికి మాత్రమే ఆస్తి వస్తుంది. 

​మీరు చప్పట్లు కొట్టేది ఆయన విజయం కోసం కాదు. 

మీ ఓటమిని మర్చిపోవడం కోసం. 

​అంటే... మీ లాజిక్ ప్రకారం... మీ దగ్గర సొంత సక్సెస్ లేదు కాబట్టి... 

పక్కింటి వాడి సక్సెస్ ని చూసి సంబరపడే "దిక్కులేనితనం" ఇది. https://m.youtube.com/watch?v=4TnEBul8Yws




Reference link :

No comments:

Post a Comment