Friday, February 20, 2026

 *ప్రక్షిప్తం అంటే?*
1. ఆ గ్రంథ ఉద్దేశ్యమునకు విరుద్ధ విషయం అందులో ఉంటే అది ప్రక్షిప్తం అవుతుంది. ఉదా:- మనుస్మృతి ఉద్దేశానికి విరుద్ధంగా ఉన్న విషయాలు అందులో చేర్చ బడ్డాయి కాబట్టి ఆ విరుద్ధ విషయాలను ప్రక్షిప్తాలు అంటారు. ఇలా ఏ గ్రంథం లో నైనా జరుగవచ్చు అంటే అందులో పరస్పర విరుద్ధ విషయాలు ఉంటాయి. 
2. ⁠ఏ గ్రంథం లో నైన ఎక్కడైనా వేద విరుద్ధ విషయాలు ఉంటే వాటిని కూడా ప్రక్షిప్తాలు అనవచ్చు. 
3. ⁠వేద సంహిత మారదు కానీ వేద మంత్రాలకు భాష్యాలు మరాయి, మారుతున్నాయి. దీనికి కారణం వ్యాకరణ శాస్త్రం, దర్శన శాస్త్రాల అవగాహన లేకపోవడం వల్ల భాష్యాలు సరిగా చేయలేకపోతున్నారు. శాస్త్రార్థం చేయాలంటే మనకైనా ఈ శాస్త్రాలు అర్థం కావాలి. పురాణాలు చదివితే శాస్త్రార్థం చేయలేము, బంగారాన్ని నిరూపించాలంటే బంగారం అంటే ఏమిటో తెలుసుకోవాలి కాని మిగతా లోహాల గురించి సమయం వ్యర్థం చేయవలసిన అవసరం లేదు. పురాణాలు మిగతా లోహాల వంటివి.
ఆనంద్ కుమార్ శర్మ.                                 

No comments:

Post a Comment