Monday, February 23, 2026

Billionaires Hated by Their Own Kids? Shocking Family Feuds of the Ultra-Rich

Billionaires Hated by Their Own Kids? Shocking Family Feuds of the Ultra-Rich

Author Name:MCR FACTS

Youtube Channel Url:https://www.youtube.com/@Mcrfacts1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_7ORF5XJyyk



Transcript:
(00:00) డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తుందే అంటారు మన పెద్దలు కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే కోటీశ్వరుల కథలు వింటే మాత్రం చేతిలో వేల కోట్లు ఉన్న మనశశాంతిని కన్నపిల్లల ప్రేమను మాత్రం ఎవరూ కొనలేరు అని అనిపించక మానదు. కాకులు దూరణి కారడవిలో అయినా బతకొచ్చు గానీ కన్నపిల్లల ద్వేషాన్ని మూటకట్టుకొని మాత్రం బతకలేం కదా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో న్యూస్ లో మనం బాగా వింటున్న విషయం ఏమిటంటే ప్రపంచంలోనే కుబేరుడు ఎలాన్ మస్క్ కూతురు తన పేరులో మస్క్ అనే పదాన్ని తీసేయించుకుంది.
(00:33) వారెన్ బఫెట్ మనవరాలు ఆయన ఆస్టిని ఆయన బిహేవియర్ ని పబ్లిక్ గానే విమర్శించింది. ఇక రూపర్ మోర్ డాగ్ పిల్లలయతే తండ్రి మీదే తిరగబడ్డారు. తల్లిదండ్రులని ఇంతలా ద్వేషించే బిలియనేర్ పిల్లల గురించి వారి వెనక ఉన్న అసలు కథల గురించి ఈరోజు మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. వీళ్ళ స్టోరీస్ వింటే పైన పటారం లోన లోటారం అనే సామెత కచ్చితంగా గుర్తొస్తుంది.
(00:54) వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో మీ ఫేవరెట్ బిజినెస్ మ్యాన్ ఎవరో రాయడం మర్చిపోకండి. ముందుగా మనందరికీ తెలిసిన టెక్నాలజీ కింగ్ రియల్ లైఫ్ ఐరన్ మన్ ఎలాన్ మస్క్ మావతోనే మొదలు పెడదాం. ఫిబ్రవరి 2026 నాటికి ఎలాన్ మస్క్ ఆస్తి సుమారు 844 బిలియన్ డాలర్లు ఈ నెంబర్ వింటేనే మన మెదడు బ్లాక్ అయిపోతుంది.
(01:20) tెస్la sస్పేస్ఎక్స్ఎఐ న్యూరాలింక్ బోరింగ్ కంపెనీట్wిitటter ఇలా ఆకాశం నుండి పాతాళం దాకా ఆయన సామ్రాజ్యం విస్తరించి ఉంది. అంటే మీ కాళ్ళ కింద ఉన్న రోడ్ల నుండి తలపైన ఉన్న నక్షత్రాల వరకు అంతా ఆయన కంట్రోల్ లోనే ఉంది. కానీ ఏం లాభం? ఇంత సంపద ఉన్నా రిపేర్ చేయలేని ఒక బంధం ఆయన జీవితంలో పెద్ద వెలితిగా మిగిలిపోయింది.
(01:43) మస్కు మొదటి భార్య కెనడియన్ రచయిత్రి జస్టిన్ విల్సన్ కి 2004 లో పుట్టిన కవలల్లో ఒకరు వివియన్ జెన్నా విల్సన్ 2020 లో తన 16వ ఏట వివియన్ తాను ట్రాన్స్జెండర్ మహిళను అని బయట పెట్టింది. రెండేళ్ల తర్వాత అంటే తన 18 వ ఏట లీగల్ గా తన పేరు మార్చుకుంది. మస్క్ అనే ఇంటి పేరును పూర్తిగా తొలగించేసి తన తల్లి ఇంటి పేరైన విల్సన్ ను పెట్టుకుంది.
(02:06) కోర్టులో ఆమె ఏం చెప్పిందంటే నా బయలాజికల్ ఫాదర్ తో నాకు ఏ రకమైన సంబంధం అంటే ఏ షేప్ లోనూ ఏ ఫామ్ లోనూ ఉండకూడదు అని తెగేసి చెప్పింది. నిజానికి ఈ గొడవ ఆమె పేరు మార్చుకోవడంతో మొదలవ్వలేదు. చిన్నప్పటి నుండే మస్క్ ఒక తండ్రిగా అస్సలు అందుబాటులో ఉండేవాడు కాదట. ఎప్పుడైనా కనిపించినా కోపంగా క్రూరంగా ఉండేవాడట. చిన్నప్పుడు రోడ్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు తన గొంతు కాస్త హై పిచ్ లో ఉందని మస్క్ తనని తిట్టేవాడని తాను ఎలా ఉండాలో ఆయనే డిసైడ్ చేసేవాడని వివిన్ చెప్పింది.
(02:36) మస్క్ జనాల సింపతీ కోసం అబద్ధాలు చెప్పే నార్సిసిస్ట్ అని ఆయన ఒక దయనీయమైన మగబిడ్డలా ప్రవర్తిస్తారని ఆమె విమర్శించింది. ఇక మస్క్ వర్షన్ ఏంటంటే కాలిఫోర్నియాలోని బడిపంతులు ధనవంతులంటే అసహ్యం పెంచుకునేలా తన కూతురిని కమ్యూనిస్టు గా మార్చేశరని ఆమెకు ఒక రకమైన వోక్ మైండ్ వైరస్ సోకిందని అంటున్నాడు. 2002 లో తన మొదటి కొడుకు నెవాడా చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు కూతురు తన జెండర్ మార్చుకున్నప్పుడు కూడా అంతే బాధపడ్డాను.
(03:02) ఆమె ఆ వైరస్ వల్ల చనిపోయినట్టే లెక్క అని మస్క్ పబ్లిక్ గా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు 21 ఏళ్ల వివియన్ కాలేజీలో చదువుకుంటూ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటూ సోషల్ మీడియాలో తన తండ్రి గురించి గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. అపరిమితమైన డబ్బు ఉన్నా కూడా సయోగందును మాత్రం కొనలేము అని మస్క్ విషయంలో క్లియర్ గా ప్రూవ్ అయింది. ఇక తర్వాతి కథ వారెన్ బఫెట్ గురించి.
(03:22) ఈయన గురించి మనందరికీ ఒకటే తెలుసు. ప్రపంచంలోనే అత్యంత సింపుల్ బిలియనేర్ 1958 లో కేవలం 35,500 డాలర్లకు కొన్న ఇంట్లోనే ఇప్పటికీ ఉంటున్నారు. మార్కెట్ బాగుంటే మక్డోనాల్డ్స్ లో 3 డాలర్ల బ్రేక్ఫాస్ట్ లేకపోతే అది కూడా లేదన్నట్టు ఉంటారు. తన 150 బిలియన్ డాలర్ల ఆస్తిలో 99% దానధర్మాలకే రాసిచ్చేశారు. ఇదంతా వినడానికి చాలా బాగుంది.
(03:47) కానీ ఆయన మనవరాలు నికోల్ బఫెట్ స్టోరీ వింటే మాత్రం ఈ పొదుపు వెనక ఇంత కఠినత్వం ఉందా అనిపిస్తుంది. నికోల్ వారెన్ బఫెట్ కొడుకు పీటర్ దత్తతిత తీసుకున్న కూతురు. చిన్నప్పుడు తాతయ్యతోనే ఒమాహాలోని ఇంట్లో క్రిస్మస్ గడిపేది. కానీ బఫెట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి. ఆయన పిల్లలకు చదువు వరకే డబ్బులు ఇస్తారు. అంతకుమించి చిల్లిగవ్వ కూడా ఇవ్వరు.
(04:06) ఒకసారి నికోల్ తన అపార్ట్మెంట్ లో పడుకోవడానికి ఒక ఫ్యూటెన్ అంటే సోఫా లాంటి బెడ్ కొనడానికి డబ్బులు సహాయం అడిగితే బఫెట్ ఏమన్నారో తెలుసా? రూల్స్ గుర్తున్నాయి కదా కేవలం చదువుకే డబ్బులు ఇస్తా ఇలాంటి వాటికి కాదు అని ముఖం మీద చెప్పేశారు. 2006 లో ది 1% అనే ఒక డాక్యుమెంటరీలో నికోల్ తన కుటుంబం గురించి సంపదలో ఉన్న తేడాల గురించి మాట్లాడింది.
(04:28) ఇది చూసి బఫెట్ తాతకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన తన ప్రైవసీని డ్రాగన్ బంగారం కాపాడినట్టు కాపాడుకుంటారు. వెంటనే ఆమెకు ఒక లెటర్ రాశారు. నిన్ను లీగల్ గా కానీ ఎమోషనల్ గా కానీ నేను మనవరాలిగా దత్తత చేసుకోలేదు. అప్పట్లో ఏదో సంతకం పెట్టానంతే నువ్వు నా ఫ్యామిలీ కాదు అని రాశారు. ఒకప్పుడు మనవరాలిగా కార్డుల మీద సంతకం పెట్టిన తాతయ్యే ఇలా అనేసరికి నికోల్ కుమిలిపోయింది.
(04:50) ఆ టైంలో ఆమె ఆర్ట్ అమ్ముకొని కేవలం ఏడాదికి 40వేల డాలర్లు సంపాదించేది. కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. లక్షల కోట్లు ఉన్న తాతయ్య మనవరాలికి కనీస సహాయం చేయలేదు. దాదాపు 10ఏళ్ల తర్వాత పాండమిక్ టైం లో ఆమె ఎన్ఎఫ్టీలు అమ్ముకుని సక్సెస్ అయ్యాక ఒక చిన్న ఈమెయిల్ పంపి కంగ్రాాట్స్ చెప్పారు బఫెట్.
(05:10) ఇప్పుడు వాళ్ళ రిలేషన్ పైకి బాగానే ఉన్నా జరిగిన గాయం మాత్రం మానలేదు. క్రమశిక్షణ ఉండాలి కానీ అది బంధాలు నరికేసే కత్తిలా ఉండకూడదు కదా. ఒమాహా ఆరికిల్ అని పిలవబడే బఫెట్ గొప్ప ఇన్వెస్టర్ కావచ్చు. కానీ ఫ్యామిలీలో ఇన్వెస్ట్ చేసే విషయంలో మాత్రం ఆయన రిటర్న్స్ జీరో అనే చెప్పాలి. ఇక appపిల్ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ విషయానికి వస్తే ఈయన టెక్నాలజీతో ప్రపంచాన్ని మార్చేశారు.
(05:32) పర్సనల్ కంప్యూటర్ ఐఫోన్ లతో ఒక రెవల్యూషన్ తెచ్చారు. కానీ ఒక తండ్రిగా మాత్రం ఆయన బిహేవియర్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఆయన 2011 లో చనిపోయే నాటికి ఆయన ఆస్తి వేల కోట్లు కానీ ఆయన కూతురు లిసా బ్రేన్ ఆన్ జాబ్స్ రాసిన బుక్ స్మాల్ ఫ్రై చదివితే కన్నీళ్లు ఆగవు. 1978 లో లిసా పుట్టినప్పుడు dఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చినా కూడా ఆ బిడ్డ నాది కాదు నేను అసలు పిల్లల్ని కనలేను అని కోర్టులో వాదించాడు.
(05:59) ఆపిల్ కంపెనీ లాభాల్లో దూసుకు వెళ్తుంటే ఇక్కడ లిసా ఆమె తల్లి పేదరికంలో బతికారు. కోర్టు గట్టిగా మొట్టికాయ వేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో నెలకు కేవలం 500 డాలర్లు ఇచ్చేవాడు.ఆపిల్ ఐపిఓ తర్వాత ఆయన ఆస్తి 200 మిలియన్లు దాటినా కూడా ఆయన బిహేవియర్ మారలేదు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఒకసారి లిసా ఏదో పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే నీ దగ్గర టాయిలెట్ వాసన వస్తుంది అని ఆమెను అవమానించారటఆపిల్ కంపెనీ లిసా పేరుతో ఒక కంప్యూటర్ రిలీజ్ చేసిన అది నీ పేరు మీద కాదు అని ఆమెతో అబద్ధం చెప్పారట చాలా ఏళ్ల తర్వాత ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నప్పుడు ఒప్పుకున్నారట. ఆయన చనిపోయే చివరి
(06:32) రోజుల్లో క్షమాపణలు చెప్పి కాస్త ఆస్తి రాసిచ్చిన చిన్నప్పుడు అందాల్సిన ప్రేమ మాత్రం ఆ అమ్మాయికి దక్కలేదు. ఆయన చనిపోయాక 120 మిలియన్ల విలువైన సూపర్ యాట్ వీనస్ గల్ఫ్ స్ట్రీమ్ జెట్ పాలో ఆల్టో లోని ఇల్లు అన్ని మిగిలాయి. కానీ సరిగ్గా నిలబడని బంధం మాత్రం మిగిలిపోయింది. ప్రపంచం మొత్తం కనెక్ట్ అయ్యే ఫోన్ కనిపెట్టాడు.
(06:53) కానీ సొంత కూతురితో మాత్రం కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఇక ఆస్ట్రేలియా వెళదాం. అక్కడ జీనా రైన్ హార్త్ అనే ఆవిడ ఉంది. ఆస్ట్రేలియాలోనే అత్యంత ధనవంతురాలు వేల కోట్లు ఆస్తి ప్రైవేట్ జెట్స్ అన్ని ఉన్నాయి. ఈమె తన తండ్రి లాంగ్ హాంకాక్ ఇచ్చిన కంపెనీని పెద్ద మైనింగ్ సామ్రాజ్యంగా మార్చింది. కానీ ఈమె నలుగురు పిల్లలు మాత్రం తల్లి మీద కోర్టులో యుద్ధం చేస్తున్నారు.
(07:14) దీనికంతటికీ కారణం ఈమె తండ్రి మనవళ్ళ కోసం రాసిన ఒక ట్రస్ట్ జీనా ఏం చేసిందంటే ఆ ట్రస్ట్ తాలకు డబ్బులు పిల్లలకు అందకుండా ఆ డేట్ ని నేరుగా 2068 కి మార్చేసింది. అంటే ఆ డబ్బులు చేతికి వచ్చేసరికి పిల్లలకు 8090 ఏళ్ళ వస్తాయి. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ తప్పించుకోవడానికే ఇలా చేశాను అని ఆమె చెప్పింది కానీ పిల్లలు నమ్మలేదు. 2011 లో పిల్లలు ఆమె మీద కేసు వేశారు.
(07:36) అప్పుడు జీనా రియాక్షన్ ఎలా ఉందంటే తన పిల్లల్నే బద్ధకస్తులని వాళ్ళకు డబ్బులు మేనేజ్ చేయడం రాదని వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదని పబ్లిక్ గా తిట్టింది. తన పెద్ద కొడుకు జాన్ అయితే 2004 నుండి తల్లి ముఖం కూడా చూడలేదు. దాదాపు 20 ఏళ్లగా తల్లి కొడుకుల మధ్య మాటలు లేవు. కేవలం లాయర్ల ద్వారామే కమ్యూనికేషన్.
(07:56) చివరకు చిన్న కూతురు గినియా తల్లి వైపు చేరిన మిగిలిన వాళ్ళు మాత్రం పోరాడుతూనే ఉన్నారు. 2015లో బియాంక అనే కూతురు ట్రస్ట్ మీద కంట్రోల్ తెచ్చుకుంది. కానీ లీగల్ బ్యాటిల్స్ మాత్రం ఆగలేదు. వేల కోట్లు లాయర్ల ఫీజులకే తగలేస్తున్నారు. సంపద ఒక ఆయుధంగా మారినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకోరు. కోర్టు నోటీసులు పంపుకుంటారు. అనడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ.
(08:16) రూపర్ మురుడోక్ కథ అయితే సేమ్ సక్సెషన్ అనే వెబ్ సిరీస్ లాగే ఉంటుంది. ఫాక్స్ న్యూస్ వాల్ స్ట్రీట్ జర్నల్ టైమ్స్ ఆఫ్ లండన్ లాంటి పెద్ద మీడియా సామ్రాజ్యం ఆయనది. 94 ఏళ్ల వయసులో కూడా ఆయన పవర్ తగ్గలేదు. కానీ ఆయన చిన్న కొడుకు జేమ్స్ ముర్డోక్ తండ్రి నడిపే న్యూస్ ఛానల్స్ చెప్పే క్లైమేట్ చేంజ్ అబద్ధాలు ఫేక్ న్యూస్ నచ్చక బోర్డు నుండి బయటకు వచ్చేసాడు.
(08:43) ఫ్యామిలీలో ఉన్న టాక్సిక్ కల్చర్ భరించలేక అతను దూరమయ్యాడు. తండ్రి తన సామ్రాజ్యాన్ని కన్జర్వేటివ్ ఐడియాలజీ ఉన్న మరో కొడుకు లాచ్లాన్ కి కట్టబెట్టడానికి ట్రై చేస్తుంటే ఫ్యామిలీ మొత్తం కోర్టుకఎక్కింది. చివరకు 2025 లో వేల కోట్లు సెటిల్మెంట్ చేసుకొని విడిపోయారు గానీ సోదరుల మధ్య బంధం మాత్రం ముక్కలైపోయింది. కోర్టులో సాక్ష్యం చెబుతున్నప్పుడు జేమ్స్ తన సోదరుడితో బంధం తెగిపోయినందుకు ఏడ్చాడట.
(09:11) ఐడియాలజీ కోసం సొంత తమ్ముడిని అన్నను దూరం చేసుకోవడం అంటే ఇదేనేమో ఇలాగే సమ్నర్ రెడ్ స్టోన్ అనే ఇంకో మీడియా మొగల్ వయాకామ సిబిఎస్ లాంటి కంపెనీలను కంట్రోల్ చేసేవాడు. కంటెంట్ ఈస్ కింగ్ అని నమ్మేవాడు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. కొడుకు కూతురితో గొడవలు పడి చివరి దశలో పిల్లలు ఎవరూ లేకుండా ఒంటరిగా డబ్బులు ఇచ్చి పెట్టుకున్న నర్సుల మధ్య చనిపోయాడు.
(09:36) ఆయన కొడుకు బ్రెంటల్దియే తండ్రి మీద కేసు వేసి సెటిల్మెంట్ తీసుకుని పబ్లిక్ లైఫ్ నుంచి మాయమైపోయాడు. కూతురు షరీతో కూడా చాలా గొడవలయ్యాయి. చివరికి హెచ్బిఓ సక్సెషన్ సిరీస్ కి ఇన్స్పిరేషన్ అయ్యేలా తయారయింది వారి ఫ్యామిలీ డ్రామా డొనాల్డ్ బ్రెన్ అనే రియల్ ఎస్టేట్ టైకూన్ అయితే ఇంకా ఘోరం. అమెరికాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాడు. 19 బిలియన్ డాలర్ల ఆస్తి ఉంది.
(10:01) కానీ పెళ్లి కాకుండా పుట్టిన ఇద్దరు పిల్లలు క్రిస్టీ డేవిడ్లు తమకు ఆస్తిలో వాటా కావాలని చిన్నప్పుడు సరిగ్గా చూసుకోలేదని కోర్టుకు వెళితే ఆయన కేవలం 12 ముక్కల్లో మేటర్ తేల్చేశడు. ఈ వ్యక్తులతో నాకు ఎలాంటి పర్సనల్ లేదా బిజినెస్ రిలేషన్ లేదు అని చెప్పి బంధాన్ని తెంచేసుకున్నాడు. జూరీ కూడా ఆయన వైపే నిలబడింది.
(10:24) తర్వాత ఆయన కొడుకు డేవిడ్ మోసాలు చేసి అడ్డంగా దొరికిపోయినా తండ్రి పట్టించుకోలేదు. డబ్బు ఉంటే బంధం అవసరం లేదు అనుకునే రకం ఈయన. వేన్ రాలిన్స్ అనే ఆయన చీమలు దోమల మందుల కంపెనీ పెట్టి కోట్లు సంపాదించాడు. కానీ చనిపోయేటప్పుడు పిల్లల మీద నమ్మకం లేక సమాధిలో నుంచి కూడా కంట్రోల్ చేయాలని చూశాడు. మనవాళ్ళకు డ్రగ్ టెస్ట్లు చేస్తేనే వాళ్ళ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే ఆస్తి ఇవ్వాలని కండిషన్లు పెట్టాడు.
(10:51) అంతేకాదు వాళ్ళని ఎలా పెంచాలో కూడా ఆయనే డిసైడ్ చేశాడు. దీంతో ఆ ఫ్యామిలీ మొత్తం కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. ఒకవైపు తండ్రి బాబాయిలు ఆస్తిని లాక్ చేస్తుంటే మనవాళ్ళు ఆ రూల్స్ ని ఫ్రాడ్ అని తిరగబడ్డారు. చివరకు తొమ్మిదేళ్ళు కోర్టుల చుట్టూ తిరిగాక 2019 లో ఏడ్చుకుంటూ ఒకరిని ఒకరు హగ్ చేసుకుని సెటిల్ చేసుకున్నారు. ఇది నిజంగా ఒక గ్రీక్ ట్రాజడీ లాంటిది.
(11:15) ఇక సోల్ గోల్డ్ మన్ అనే న్యూయార్క్ రియల్ ఎస్టేట్ కింగ్ కథ చూస్తే ఆయన చనిపోయాక దుఃఖం కంటే కోర్టు కేసులే ఎక్కువయ్యాయి. ఆయన భార్య ఆస్తి కోసం కేసు వేస్తే పిల్లలు తల్లి మీదే పోరాడారు. తర్వాత పిల్లల మధ్యే గొడవలు వచ్చాయి. ఒక కూతురు జైన్ మొత్తం కంట్రోల్ తీసుకుందని మిగిలిన వాళ్ళను మోసం చేసిందని తోడుబుట్టువులు ఆరోపించారు.
(11:36) చివరికి ఒకరి మీద ఒకరు కిరాయి గుండాలను పెట్టుకుంటామనే రేంజ్లో బెదిరించుకున్నారు. తండ్రి కష్టపడి సామ్రాజ్యాన్ని కడితే పిల్లలు మాత్రం దాన్ని ముక్కలు చెక్కలు చేసుకున్నారు. చివరగా ప్రిట్స్కర్ ఫ్యామిలీ స్టోరీ చూద్దాం. ఏ లిటిల్ ప్రిన్సెస్ అనే హాలీవుడ్ సినిమాలో సారాగా నటించిన చిన్న పాప లీసెల్ మాథ్యూస్ గుర్తుంది కదా ఆ పాప నిజ జీవితంలో కూడా పెద్ద ప్రిన్సెస్ హయత్ హోటల్స్ ఓనర్ల ఫ్యామిలీ ఆమెది.
(12:03) తన తండ్రి రాబర్ట్ బాబాయిలు కలిసి తన ఆస్తిని దాచేశరని తమ్మను ఫ్యామిలీ నుంచి దూరం పెట్టారని తెలిసి చిన్న వయస్సులోనే అంటే 18 ఏళ్లకే 6 బిలియన్ డాలర్ల కేసు వేసింది. ఇది డబ్బు కోసం కాదు నిజాయితీ కోసంని పోరాడింది. బహామాస్ లో ఉన్న సీక్రెట్ అకౌంట్స్ ని బయట పెట్టాలని డిమాండ్ చేసింది. చివరికి 2005 లో 500 మిలియన్ డాలర్లు గెలుచుకుంది.
(12:27) ఆ డబ్బుతో ఇప్పుడు సామాజిక సేవ చేస్తూ హ్యాపీగా ఉంది. ఇదొక హ్యాపీ ఎండింగ్ అనుకోవచ్చు ఆమె ప్రపంచాన్ని మార్చడానికి ఆ డబ్బును వాడుతుంది. మొత్తానికి చూశారుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ వీళ్ళంతా రచ్చ గెలిచారు ప్రపంచాన్ని గెలిచారు కానీ ఇంట మాత్రం ఓడిపోయారు. బయటకు వేల కోట్ల ఆస్తి ప్రైవేట్ జెట్లు విలాసవంతమైన జీవితం కనిపించినా లోపల మాత్రం ఎవరికీ ప్రశాంతత లేదు.
(12:56) డబ్బు అవసరమే కానీ అదే సర్వస్వం అనుకుంటే బంధాలు ఎలా బలవుతాయో మనుషులు ఎలా మారిపోతారో ఈ కథలే సాక్ష్యం. చివరికి మిగిలేది మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మనల్ని ప్రేమించే మనుషులే అని వీళ్ళని చూస్తే అర్థమవుతుంది

No comments:

Post a Comment