1. ఎవర్ని నమ్మాలి? అనే ఈ ప్రశ్నే ఒక పెద్ద అబద్ధం. దీని వెనుక ఉన్నది మోసపోతామన్న భయం కాదు, బాధ్యత తీసుకోవాలన్న మీ బద్ధకం!
2. మీకు నమ్మడానికి ఒక మనిషి కావాలి అంటే దాని అసలు అర్థం... మీ జీవితానికి సంబంధించిన steering వాడి చేతిలో పెట్టి, మీరు వెనుక సీట్లో హాయిగా నిద్రపోవాలని చూస్తున్నారు.
3. అసలు Trust అనే పదం మీ vocabulary లోకి ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రతి క్షణం పరిస్థితులకు తగ్గట్టు alert గా ఉండటం మీ వల్ల కాక, ఎవడో ఒకరి భుజాల మీద ఆధారపడిపోవాలనే cheap escapism అది.
4. వాడు మిమ్మల్ని మోసం చేయడు. కేవలం మీ comfort కోసం మీరు వాడికి తగిలించిన expectation అనే బరువును వాడు మోయలేక పక్కన పడేస్తాడు. ఆ పడేయడానికి మీ ego పెట్టుకున్న ముద్దు పేరే ద్రోహం.
5. మీ మీద మీకే control లేదు, మీ thoughts మీ మాట వినవు, మీ emotions మీ control లో ఉండవు. మరి ఏ మొఖం పెట్టుకుని ఇంకొక మనిషి ఆలోచనల నుంచి consistency ని demand చేస్తున్నారు?
6. మీ నమ్మకం అనేది ఒక పచ్చి business investment. వాడు మీ ego ని pamper చేస్తున్నంత కాలం వాడు దేవుడు; వాడి అవసరం, వాడి స్వార్థం వాడు చూసుకున్న క్షణం వాడు దెయ్యం. ఎంత hypocrisy ఇది!
7. ఈ సృష్టిలో ఏదీ స్థిరం కాదు. ప్రకృతి నియమానికి విరుద్ధంగా, ఒక మనిషి మనస్తత్వం ఎప్పటికీ మీ కోసం ఒకేలా ఫ్రీజ్ అయిపోవాలి అని మీరు expect చేయడమే అజ్ఞానానికి పరాకాష్ట.
8. నమ్మకం అనే ఈ మత్తుమందును వదిలేయండి. మనుషులతో సంబంధాలు పెట్టుకోండి, అంగీకరించండి, కానీ వాళ్ళను మీ ఊతకర్రలు లాగా వాడుకోవద్దు.
9. వీడిని నేను గుడ్డిగా నమ్మొచ్చు అనే Confirmation దొరికితే గానీ మీరు బతకలేకపోతున్నారు అంటే, మీ లోపల ఉన్నది ప్రేమ కాదు, కేవలం అంతులేని భయం.
10. ఎవర్ని నమ్మాలి అని పక్కవాడిని scan చేయడం ఆపి, ముందు మీ లోపల దాక్కున్న ఆ భయస్తుడిని పట్టుకుని గట్టిగా నిలదీయండి. అప్పుడు అర్థమవుతుంది... నమ్మకం అనేది అవసరం లేని ఒక చెత్త అని!🔵
Source: https://m.youtube.com/post/UgkxGhGXzZJFUfOquDZg-SjUjHb4SVCN4VYA
Comment:
@AJ-1426
11 hours ago
Hi Anna...nenu present oka certain group tho travel chestunna...I don't have other choice but learn from the teacher...they all treat me like I don't belong there...I felt left out... even the teacher also being toxic to me... Naku aa teacher nundi knowledge thappa Inkem akkarledu even thana tho connection kuda voddu...but being in such kind of atmosphere how will I be able to learn from him(who is treating me like I'm not worthy)... should I leave that place or keep my head down and learn from him???
anukulavedam
10 hours ago
ఒక వైపు నాకు కేవలం జ్ఞానం మాత్రమే కావాలి, కనెక్షన్ వద్దు అని చెబుతూనే... ఇంకో వైపు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, తక్కువ చేసి చూస్తున్నారు అని బాధపడుతున్నారు. ఇక్కడే మీ లాజిక్ ఫెయిల్ అవుతోంది.
మీరు ఒక దుకాణానికి సరుకులు కొనడానికి వెళ్ళారు. ఆ దుకాణదారుడు పొగరుగా ఉంటే మీకేంటి నష్టం? మీ లక్ష్యం సరుకులు తీసుకోవడం, బయటకు రావడం. ఆ టీచర్ దగ్గర జ్ఞానం అనే సరుకు ఉంది. దాన్ని లాక్కోండి. ఆయన మీతో ప్రేమగా ఉండాలని, మిమ్మల్ని గౌరవించాలని ఎందుకు ఆశిస్తున్నారు? చేతిలో చిప్ప పట్టుకుని అడుక్కోవడానికి వెళ్ళారా? లేక జ్ఞానాన్ని తీసుకోవడానికి వెళ్ళారా?
నన్ను Worthy గా ట్రీట్ చేయట్లేదు అని ఏడుస్తున్నది మీలోని అహంకారం. మీకు నిజంగా Knowledge మీద మాత్రమే ఆకలి ఉంటే, మీ దృష్టి మొత్తం ఆ సబ్జెక్ట్ మీదే ఉంటుంది తప్ప, మిమ్మల్ని ద్వేషించే పక్కన ఉన్నవాళ్ళ ముఖాల మీద కాదు.
వాళ్ళను వదిలేసి వెళ్ళిపోవద్దు. అలా చేస్తే మీ భయానికి, మీ అహంకారానికి మీరే ఓడిపోయినట్లు. Keep your head down అంటే భయపడి తలవంచుకోవడం కాదు... మీ లక్ష్యం పట్ల పూర్తి ఏకాగ్రతతో ఉండటం. ఆ గ్రూప్ ని, ఆ టీచర్ ని కేవలం మీ ఎదుగుదలకు వాడుకునే ఒక పనిముట్టులా మాత్రమే చూడండి. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఏడిస్తే మీకెందుకు?😎
No comments:
Post a Comment