మీ అతి తెలివితేటలే మీ కొంప ముంచుతున్నాయా | Is Your Intelligence Ruining You | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1Ag5dVmiFrs
Transcript:
(00:00) మనం రాత్రి పగళ్లు కష్టపడుతూనే ఉన్నాం. రకరకాల ప్లాన్లు వేస్తున్నాం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం. అయినా సరే జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో తెలియని బాధ ఏదో తెలియని అసంతృప్తి. గమ్మత్తైన విషయం ఏంటంటే మిమ్మల్ని ఈ సమస్యల్లోకి నెడుతుంది ఎవరో బయట వ్యక్తులు కాదు. మీ సొంత తెలివి తేటలు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే పచ్చినిజం.
(00:23) ఈరోజు మనం మనసు పొరల్లో దాగి ఉన్న ఆ అతి తెలివి అనే ముసుగుని తీసి అసలు మనం ఎక్కడ దారి తప్పుతున్నామో చాలా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మనందరికీ ఒక పెద్ద జబ్బు పట్టుకుంది. అదేంటంటే నాకు అన్నీ తెలుసు అనుకోవడంగగు ఉంది, YouTube ఉంది, చేతిలో ఫోన్ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా నా జేబులో ఉందని ఒక భ్రమలో బతికేస్తున్నాం. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి కొన్ని మంచి మాటలు చెప్తుంటే ఆయన మాట పూర్తి కాకముందే ఆ అవన్నీ నాకు తెలుసులే అని మనసులో అనుకుంటున్నాం. అదే అసలు సమస్య.
(00:52) మీరు గమనించారో లేదో మన అతి తెలివి మనల్ని ఒక చిన్న గదిలో బంధించేస్తుంది. మనకు నచ్చింది మాత్రమే వింటాం. మనకు తోచింది మాత్రమే చేస్తాం. అనుభవజ్ఞుల మాట గాని మనకంటే ఎక్కువ తెలిసిన వారి సలహా గాని మన ఈగోకి అడ్డు వచ్చేస్తుంది. నేను చదువుకున్నాను నాకు టెక్నాలజీ తెలుసు. వాళ్ళకేం తెలుసు పాతకాలపు మనుషులు అనే గర్వం మనల్ని మనకి తెలియకుండానే నాశనం చేస్తుంది.
(01:17) రమణ మహర్షి గారు ఒక మాట అనేవారు అన్నింటిని తెలుసుకోవాలని ప్రయత్నించే మీరు అసలు మీరు ఎవరో తెలుసుకున్నారా అని మనం బయట ప్రపంచాన్ని జయించాలని చూస్తున్నాం కానీ మన లోపల ఉన్న ఆ అతి తెలివనే శత్రువుని గుర్తించలేకపోతున్నాం. ఆ అతి తెలివు వల్ల వచ్చే అతి పెద్ద నష్టం ఏంటంటే అది మిమ్మల్ని ఎవరి మాట విననివ్వదు. ఫలితంగా మీరు ఒంటరివారైపోతారు.
(01:37) మీ చుట్టూ మనుషులు ఉన్నా మానసికంగా మీరు ఒక చీకటి గదిలో ఉండిపోతారు. ఎందుకంటే ఎవరైనా మీకు మంచి చెప్పాలని చూస్తే మీ తెలివి తేటలు ఆ మంచి మాటల్ని ఒక విమర్శలుగా తీసుకుంటుంది. నన్ను తక్కువ అంచన వేస్తున్నారా అని చెప్పేసి మీ అహంకారం అడ్డు తగులుతుంది. ఈ ప్రవర్తన వల్ల మీరు సరైన అవకాశాలని సరైన వ్యక్తులని మీ జీవితంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు.
(02:00) కాకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారంటే నాకంతా తెలుసు నాకే తెలుసు అనే భ్రమలో ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ భూమ్మీద ఏ మనిషికైనా సరే కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండ అంతా అని చెప్పేసి అలా కాకుండా నాకు అంతా తెలుసు అనుకుంటే మాత్రం మీరు అవకాశాలని మిస్ అయిపోతారు.
(02:20) చాలా మంది మంచి మంచి వ్యక్తుల్ని మీ జీవితంలో మీరు కోల్పోతారు. అసలు ఈ అతి తెలివి ఈ అహంకారం మనలోకి ఎందుకు వస్తాయి? దీనికి కారణం మన మనసు చేసే ఒక చిన్న మాయాజాలం. మన మనసు ఎప్పుడూ తనను తాను కాపాడుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి చెప్పేది నిజము అని ఒప్పుకుంటే మన పాత ఆలోచనలు తప్పని ఒప్పుకోవాలి.
(02:39) అలా ఒప్పుకోవడం మన ఈగోకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఇది ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇదే నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ అన్నమాట. మరో ముఖ్య కారణం భయం. మనకు తెలియని విషయాలన్నా మన అదుపులో లేని విషయాలన్నా మనకి భయం. ఆ భయాన్ని కప్పి పుచ్చుకోవడానికి మనం అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉంటాం. మనం మనల్ని ఒక మేధావిగా ఊహించుకుంటాం.
(03:00) కానీ నిజానికి మనం చేస్తున్నది ఏంటంటే ఒక చిన్న సర్కిల్ గీసుకొని అందులోనే తిరుగుతున్నాం. సమాజం మనల్ని పొగడాలి అందరూ మనల్ని మెచ్చుకోవాలి అనే కోరిక మనల్ని నిజమైన జ్ఞానానికి దూరం చేస్తుంది. రమణ మహర్షి గారు చెప్పినట్లు సముద్రంలో కలిసే వరకు నదికి వేరుగా ఉందనే గర్వం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ సముద్రంలో కలిసిపోతుందో అప్పుడే దానికి ఒక పరిపూర్ణత వస్తుంది.
(03:24) మనం కూడా మన ఈగు అనే చిన్న నదిలో కొట్టుకుపోతున్నాం తప్ప అనుభవం అనే మహా సముద్రంలో కలవడానికి ఇష్టపడటం లేదు. అందుకే సమస్య మనల్ని వదలడం లేదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం మారటం అసాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. దానికి కావాల్సింది తెలివితేటట్లు కాదు. కేవలం సరెండర్. సరెండర్ అంటే ఎవరో కాళ్ళ మీద పట్టం అని కాదు. మీ ఈగోని పక్కన పెట్టి నాకు తెలియంది ఇంకా చాలా ఉంది అని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం మొదటిగా మీ జీవితంలో ఒక మెంటర్ ను లేదా ఒక గురువుని వెతుక్కోండి అది మీ తండ్రి కావచ్చు మీ బాస్ కావచ్చు లేదా మీరు గౌరవించే ఒక మిత్రుడు కూడా కావచ్చు ఏదైనా ముఖ్యమైన
(03:59) నిర్ణయం తీసుకునేటప్పుడు మీ మనసు నాకు తెలుసు అని అరుస్తున్నా సరే దాన్ని కాసేపు ఆపి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి సలహా అడగండి. మీరు అడిగే ఆ ఒక్క సలహా మిమ్మల్ని కొన్ని ఏళ్ల కాలం వృధా కాకుండా కాపాడుతుంది. రమణ మహర్షి గారు ఒక చక్కటి పద్ధతి చెప్పేవారు మౌనం మీరు అంతా తెలుసు అనిపించుకున్నప్పుడు కాసేపు మౌనంగా ఉండండి. ఎదుటివారు చెప్పేది వినండి.
(04:20) వారు చెప్పేది మీకు నచ్చకపోయినా అందులో ఉన్న సత్యాన్ని వెతకడానికి ప్రయత్నించండి. మనసు చెప్పే 100 ఆలోచనల కంటే క్రమశిక్షణతో కూడిన ఒక చిన్న అడుగు మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మీ అతి తెలివి మీకు షార్ట్ కట్స్ ని చూపిస్తుంది కానీ అనుభవం మీకు సరైన దారి చూపిస్తుంది. ఆ దారి కష్టంగా ఉన్నా సరే దాన్ని ఎంచుకునే ధైర్యం చేయండి. మీ ఈగోని పక్కన పెట్టేయండి.
(04:43) అప్పుడు మీకు ప్రపంచం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు మీరు నేర్పుకునే ప్రక్రియ ఆగిపోతుంది. కానీ నాకేం తెలియదు. నేను ఒక విద్యార్థిని మాత్రమే అనుకున్నప్పుడు ప్రతిరోజు మీకు ఒక కొత్త పాఠం నేర్పిస్తూనే ఉంటుంది. అలా కాకుండా నాకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు అవతల చెప్పే వాళ్ళకు కూడా మీ మీద చిరాకు వచ్చేస్తుంది.
(05:03) ఎందుకంటే వీడు చెప్పినా వినడు వీడికి తెలుసుకునేంత ఆలోచన లేదు. వీడికి అసలు జ్ఞానం లేదని చెప్పేసి అవతలి వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. కానీ మనం ఎప్పుడైతే అవతలి వాళ్ళ మాటలు వినటం మొదలు పెడతామో వాళ్ళు మంచి చెప్పని చెడు చెప్పని కానీ వాళ్ళు చెప్పే కొన్ని మాటల్లో ఒకటో రెండో ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. ఆ రెండు ఖచ్చితంగా మనకి తెలియని విషయాలై ఉంటాయి.
(05:26) ఎందుకంటే అందరికీ అన్ని తెలుసుకునే అంత సామర్థ్యం ఉండదు. మనం ఎంత తెలుసుకున్నా సరే తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉంటూనే ఉంటాయి. అదే మనిషి జీవితం. పాపం ఆ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకనే పెద్దవారు చెప్పేటప్పుడు వినాలి. అలా అని చెప్పేసి పెద్దవాళ్ళకి టెక్నాలజీ తెలియదు కదా మనక అన్నీ తెలుసు కదా మనమే గొప్ప అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే టెక్నాలజీ అనేది ఒక పనిని ఫాస్ట్ గా చేయడానికి ఉపయోగపడుతుంది.
(05:50) కానీ అనుభవం అనేది ఒక పనిని అర్థం చేసుకొని అది మళ్ళీ మనకి జీవితంలో ఎదురైనప్పుడు ధైర్యంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి టెక్నాలజీ వేరు, అనుభవం వేరు. అనుభవం పెద్ద వాళ్ళ దగ్గర ఉంటుంది. టెక్నాలజీ అనేది ఈ జనరేషన్ లో వాళ్ళకి చాలా ఈజీగా దొరికిపోయింది అనుకోండి ఆ తర్వాత సంగతి అనుభవం నుంచి వచ్చే మాటలు మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి.
(06:10) ఆ మాటలు గనుక మనకి లేకపోతే మనం దారి తప్పే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ ఉన్నంత మాత్రాన మనం తెలియగలవాళ్ళం కాదు. అలా అని చెప్పేసి సెల్ ఫోన్ వాటర్ అనంత మాత్రాన పెద్దవాళ్ళకి ఏమి తెలియదు అని చెప్పేసి కాదు. కాబట్టి పెద్దవాళ్ళకి తెలిసిన విషయాలు చాలా ఉంటాయి. వాటిని మనం వినాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిజమైన మార్పు అనేది మాటల్లో ఉండదు.
(06:32) మనం చేసే పనుల్లో ఉంటుంది. ఈరోజు నుంచి మీరు మీ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టొచ్చు. అతి తెలివితో ప్లాన్లు వేయడం ఆపేసి నిజాయితీతో పని చేయడం మొదలు పెట్టండి. మీరు గమనించండి ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వారు ఎవరు కూడా నాకన్నీ తెలుసు అని కూర్చోలేదు. వారు నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకంటూ అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.
(06:55) [సంగీతం] అలా తీసుకోవడం వల్ల బాగుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటేది ఖచ్చితంగా సలహాలు తీసుకున్న మీరే నిజానికి అది మిమ్మల్ని మరింత ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మీ మనసు చెప్పే వంకల కంటే ఒక క్రమ పద్ధతిలో సాగే జీవనశైలికి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు నేర్చుకోవడం కూడా మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ ప్రపంచమే మీకు ఒక పెద్ద పాఠశాల అవుతుంది.
(07:16) రమణ మహర్షి గారు అన్నట్లు శాంతి అనేది బయట ఎక్కడో లేదు. మీ అహంకారాన్ని వదిలేసిన చోట ఖచ్చితంగా మీకు దొరుకుతుంది అని చెప్పేసి మీ అతి తెలివిని మీ ఈగోని వదిలేయండి. ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రశాంతత ఆ తర్వాత క్లారిటీ వస్తాయి. ఎందుకంటే మనం ప్రతీది ఈగోతో చూస్తే అవతల ఉన్న ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మనకి వ్యక్తిలా కనిపించరు.
(07:39) నాకన్నా ఎక్కువైంది తెలుసఏంటి ఆ మనిషికి అని చెప్పేసి మనలో ఉన్న ఈగో మనల్ని చంపేస్తూ ఉంటుంది. అవతల వ్యక్తి మీద ఉన్న గౌరవాన్ని కూడా లేకుండా చేస్తుంది. అలా అవతల వ్యక్తులని మనం దూరం చేసుకోవడం అవసరమా అవతల వ్యక్తులని దూరం చేసే ఆ అతి తెలివి అలాగే ఆ ఈగో అనేది మన జీవితంలో అస్సలు ఉండకూడదు. నేను అవతల వ్యక్తి అంటుంది బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు సో ఇంట్లో వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వలేని ఆ తెలివి తేటలు ఆ ఈగో దీన్ని చెప్పండి కాబట్టి మనం ఇంట్లో వాళ్ళకి గౌరవించాలి బయట వాళ్ళకి ఇంకా గౌరవించాలి.
(08:09) కాబట్టి ఆ తెలివి తేటలని ఈగోని తీసి పక్కన పెడేయండి. ఈ క్షణం నుంచే మారాలి. రేపు అనేది భ్రమ. ఈ వీడియో చూసి అయిపోగానే మీ మనసు మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్ళాలని చూస్తుంది. కానీ మీరు దానికి లొంగకండి. మీ జీవితంలో మీరు తీసుకున్న అతి తెలివి నిర్ణయాల వల్ల ఎంత నష్టపోయారో ఒకసారి నిజాయితీగా లెక్క వేసుకోండి. ఆ నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీ ఇగోని అదుపులో ఉంచుకోవడం తప్ప మరో మార్గం లేదు వినయం అనేది బలహీనత కాదు అది అసలైన బలం ఆ బలం తోనే మీరు అనుకున్న శిఖరాలు చేరుకోగలరు.
(08:39) కాబట్టి మిమ్మల్ని కిందకి లాగేసే అలవాట్లని మీ జీవితంలో నుంచి తీసేయండి. మిమ్మల్ని శిఖరాలకు ఎక్కించే అలవాట్లు మీ జీవితంలో చేర్చుకోండి. కొత్తలో కొంచెం కఠినంగా ఉన్నా అవి గనుక అలవాటయితే మీ జీవితంలో ఉండే చాలా సమస్యలని మీరు దాటుకొని వచ్చేస్తారు. కాబట్టి ఆ మార్పు అనేది ఇప్పుడే మొదలవ్వాలి. మీ జీవితంలో మీరు తీసుకున్న ఒక అతి తెలివి నిర్ణయం వల్ల మీరు ఇప్పటికీ బాధపడుతున్న విషయం ఏదైనా ఉందా లేదా ఆ నిర్ణయం వల్ల మీరు నేర్చుకున్న పాఠం ఏమిటి? అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు కింద కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోండి. మీ అనుభవం ఇంకొకరికి
(09:12) గొప్ప పాఠం కావచ్చు. నేటి నుంచే ఒక కొత్త మనిషిగా వినయం కలిగిన విద్యార్థిగా మీ ప్రయాణాన్ని మొదలు పెడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక యుద్ధం ఇందులో మీ శత్రువు మీ అతి తెలివే దాన్ని జయించండి. జీవితాన్ని గెలవండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి.
(09:33) అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఆం
No comments:
Post a Comment