Monday, March 23, 2026

The Gerasimov Doctrine: The Dark Side of Human Relationships | Nagna Satyam Telugu Podcast

The Gerasimov Doctrine: The Dark Side of Human Relationships | Nagna Satyam Telugu Podcast

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YOvsLhYShRg



Transcript:
(00:01) [సంగీతం] మీకో విషయం తెలుసా ఈ రోజుల్లో ఒక మనిషిని చంపాలంటే కత్తితో పొడవాల్సిన అవసరం లేదు. గన్ తీసి కాల్చాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వాళ్ళ మైండ్ తో ఆడుకుంటే చాలు వాళ్ళకు వాళ్లే నరకం చూసుకుంటారు. దీన్నే మిలిటరీ భాషలో గెరాసిమోఫ్ డాక్ట్రిన్ అంటారు. ఇది వినడానికి ఏదో పెద్ద రష్యన్ మిలిటరీ స్ట్రాటజీలా ఉంటుంది కానీ దీన్ని మన రిలేషన్షిప్స్ కి మన డైలీ లైఫ్ కి అప్లై చేస్తే అదో పెద్ద సైకలాజికల్ వార్ గా మారుతుంది.
(00:36) అసలు ఈ గరాసిమౌ ఏం చెప్పాడంటే ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే బార్డర్ దాటక్కర్లేదు. ఆ దేశం లోపల ఉన్న జనాల మైండ్స్ ని కన్ఫ్యూస్ చేస్తే చాలు వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టాలి. వాళ్ళు నమ్మే నిజాల్ని అబద్ధాలుగా మార్చాలి. సేమ్ ఇదే సీన్ మన లైఫ్ లో కూడా జరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు క్లోజ్ అనుకునే వాళ్ళు మీ బాస్ లు లేదా మీ పార్ట్నర్స్ వీళ్ళందరూ మీకు తెలియకుండానే మీ మీద ఈ సైకలాజికల్ వార్ డిక్లేర్ చేస్తున్నారు.
(01:04) ఇందులో మొదటి స్టెప్ ఏంటో తెలుసా రియాలిటీని బ్లర్ చేయటం. అంటే మీరు కళ్ళారా చూసిన నిజాన్ని కూడా మీరు అనుమానించేలా చేస్తారు. దీన్నే గ్యాస్ లైటింగ్ అంటారు. నేను అది అనలేదు నువ్వు తప్పు విన్నావు అని 100 సార్లు చెప్తారు. మీరు ఏదైనా లాజిక్ మాట్లాడితే నీకు మెంటల్ ఇష్యూ ఉంది నీకు అంతా నెగిటివ్ గానే కనిపిస్తోంది అని ముద్ర వేస్తారు.
(01:27) ఇలా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మెల్లమెల్లగా చంపేస్తూ ఒక్కసారి మీ మీద మీకు నమ్మకం పోయిందా ఇక మీరు వాళ్ళ చేతిలో బానిసలే. వాళ్ళు ఏది చెప్తే అదే నిజం వాళ్ళు ఏది చూపిస్తే అదే లోకం. ఇక రెండో పాయింట్ నిహిలిజం నీషే ఒక మాట అన్నాడు ఈ లైఫ్ కి అసలు మీనింగే లేదు అని ఎప్పుడైతే ఒక మనిషికి తన లైఫ్ మీద తన వాల్యూస్ మీద హోప్ పోతుందో వాడు దేనికైనా సిద్ధపడతాడు.
(01:54) గెరాసిమో డాక్ట్రిన్ లో కూడా ఇదే చేస్తారు. నువ్వు ఎంత కష్టపడ్డా వేస్ట్ ఈ ప్రపంచం మొత్తం మోసం నీకు ఎవ్వరూ తోడు ఉండరు అని మీ మైండ్ లో ఫీడ్ చేస్తారు. ఇలా మీ లైఫ్ లో ఉన్న మీనింగ్ ని తీసేస్తే మీరు ఒక ఖాళీ డబ్బాలాగా మిగిలిపోతారు. ఆ ఖాళీ డబ్బాలో వాళ్ళు ఏది కావాలంటే అది నింపుతూ మీలో ఉన్న ఆశని చంపేసి మిమ్మల్ని ఒక బ్రతికున్న సెవన్లా మారుస్తారు.
(02:19) ఇంకా మూడోది ఇంటర్నల్ సివిల్ వార్ అంటే మీలో మీకే యుద్ధం అన్నమాట. ఒకరోజు మీ మీద చాలా ప్రేమ చూపిస్తూ నెక్స్ట్ డే అసలు మీరు ఎవరో తెలియనట్టు బిహేవ్ [సంగీతం] చేస్తారు. ఈ కన్ఫ్యూజన్ వల్ల మీ బ్రెయిన్ లో డోపమైన్ లెవెల్స్ పిచ్చి పిచ్చిగా మారుతుంటాయి. మీరు వాళ్ళ అటెన్షన్ కోసం పిచ్చోళ్ళలా వెయిట్ చేస్తారు. అంటే మీ పీస్ మీ హ్యాపీనెస్ వాళ్ళ [సంగీతం] రిమోట్ కంట్రోల్ లో ఉంటాయి.
(02:44) వాళ్ళు బటన్ నొక్కితే మీరు నవ్వాలి ఏడవాలి. సో ఇది కేవలం మనుషులే కాదు మన చేతిలో ఉన్న ఫోన్లు కూడా చేస్తున్నాయి. అల్గారిథమ్స్ మనల్ని ఒక ట్రాప్ లో పడేస్తున్నాయి. మనకి నచ్చిన దాన్ని చూపిస్తూ మనల్ని ఒక బబుల్ లో బంధిస్తున్నాయి. మనకి తెలియకుండానే మనల్ని ఒక ఐడియాలజీకి బానిసలుగా మారుస్తున్నాయి. ఫాక్ట్స్ తో పనిలేదు కేవలం ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాయి.
(03:08) మరి దీని నుండి బయట పడడం ఎలా అంటే దీనికి ఒకటే దారి ఇంటలెక్చువల్ సావనింటిటీ అంటే నీ మైండ్ మీద నీకు కంట్రోల్ ఉండాలి. ఎవడో వచ్చి ఏదో చెప్పగానే రియాక్ట్ అయిపోవడం కాదు ప్రతి విషయాన్ని డౌట్ చేయు. ఒకడు నిన్ను విపరీతంగా పొగుడుతున్నా లేదా విపరీతంగా తిడుతున్నా వాడు నిన్ను మనిపులేట్ చేస్తున్నాడని అర్థం చేసుకో నీ లైఫ్ కి మీనింగ్ ఎవడో ఇవ్వక్కర్లేదు.
(03:32) నీ వాల్యూస్ నువ్వే డిసైడ్ చేసుకో గుర్తుపెట్టుకో యుద్ధాలు ఇప్పుడు బార్డర్ లో జరగటం లేదు. నీ బెడ్రూమ్లో నీ స్మార్ట్ ఫోన్ లో నీ ఆలోచనల్లో జరుగుతున్నాయి. నీ క్లారిటీని ఎవడైనా డిస్టర్బ్ చేస్తున్నాడంటే వాడు నీ శత్రువు అని ఫిక్స్ అయిపో నీ మైండ్ కి నువ్వు బాస్ అవ్వకపోతే ఎవడో ఒకడు నిన్ను బానిసగా మార్చుకుంటాడు.
(03:53) అప్పుడు నువ్వు ఒక తెలివి తక్కువ దద్దం అవ్వచ్చు.

No comments:

Post a Comment