Sunday, March 22, 2026

అసలు ఎందుకు బ్రతుకుతున్నారో మీకు తెలుసా | The Real Purpose of Life Osho Wisdom | Satyagrahi

అసలు ఎందుకు బ్రతుకుతున్నారో మీకు తెలుసా | The Real Purpose of Life Osho Wisdom | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OLm13xw0KYg



Transcript:
(00:00) అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం మనం చేసే పనులు వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించండి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు పరిగెడుతుంటారు కష్టపడుతుంటారు సంపాదిస్తూ ఉంటారు కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారో అసలు ఆ కారణం ఏంటో మీకు గుర్తుందా లేక దారిలో కనిపించే మెరుపులను చూసి మురిసిపోయి మీ గమ్యాన్ని మర్చిపోయారా మన జీవితంలో జరుగుతున్న అతి పెద్ద ట్రాజడీ ఏంటో మీకు తెలుసా మనం చెరువు దగ్గరికి వెళ్తాం కానీ స్నానం చేయడం మర్చిపోయి గట్టు మీద ఆడుకొని తిరిగి వచ్చేస్తాం.
(00:31) ఆకలి వేసి రెస్టారెంట్ కి వెళ్తాం కానీ అక్కడున్న డెకరేషన్ చూస్తూ వెయిటర్లతో కబుర్లు చెప్తూ అసలు భోజనం చేయడమే మర్చిపోతాం. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు కానీ మనందరి జీవితాల్లో ప్రతిరోజు ఇదే జరుగుతుంది. మనం ఒక లక్ష్యం కోసం బయలుదేరుతాం. కానీ ఆ ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆకర్షణలు, అనవసరమైన గొడవలు, అహంకారాలు మనల్ని అసలు లక్ష్యం నుంచి పక్కకు నెట్టేస్తాయి.
(00:54) ఓషో గారు ఒక మాట అంటారు. జీవితం అనేది ఒక రహస్యం. అది సాధించాల్సిన సమస్య కాదు కానీ మనం ఏం చేస్తున్నాం జీవితాన్ని ఒక పెద్ద సమస్యగా మార్చుకొని దాన్ని సాల్వ్ చేసే పనిలో పడి అసలు జీవించడమే మర్చిపోతున్నామ అని మనలో చాలా మంది ఎలా తయారయ్యారంటే ఒక అద్భుతమైన ఉద్యాన వనానికి వెళ్తారు. అక్కడ పూలు సువాసనలు ఆస్వాదించడం మర్చిపోయి ఆ పూల మీద ఉన్న పురుగులు గురించి లేదా అక్కడ నేల మీద ఉన్న మట్టి గురించి వాదించుకుంటూ సమయాన్ని వృధా చేస్తారు.
(01:22) చివరికి తోట నుండి బయటికి వచ్చేటప్పుడు మీ చేతిలో సువాసన ఉండదు. కేవలం విమర్శలు మాత్రమే మిగులుతాయి. మీరు కూడా మీ జీవితంలో ఇలాగే ఎక్కడో ఒక చిన్న విషయాల్లో ఆగిపోయి అసలు అనుభవించాల్సిన మాధుర్యాన్ని కోల్పోవడం లేదు కదా అసలు మనం ఎందుకు ఇలా మన గమ్యాన్ని మర్చిపోతున్నాం ఎందుకు మనం చిన్న విషయాలకి ఇంతలా లోన అవుతున్నాం. దీనికి ప్రధాన కారణం అవేర్నెస్ లేకపోవడం.
(01:44) మనం ఒక యాంత్రికమైన జీవితానికి అలవాటు పడిపోయాం. మనం చేసే పనుల మీద మనకి స్పృహ ఉండటం లేదు. నలుగురు గొప్ప మేధావులు ప్రొఫెసర్లు ఒక రైల్వే స్టేషన్ లో కూర్చొని ఉన్నారు. వాళ్ళ విజ్ఞానం గురించి ప్రపంచ రాజకీయాల గురించి ఫిలాసఫీ గురించి గంటల తరబడి గొప్పగా చర్చించుకుంటున్నారు. రైలు వచ్చే సమయం అయింది. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ రైలు వచ్చిన విషయాన్ని గమనించలేదు.
(02:02) చివరి నిమిషంలో రైలు కాదటం చూసి నలుగురు పరిగెత్తారు. ముగ్గురు ఎలాగో రైలు ఎక్కగలిగారు కానీ ఒక్కరు మాత్రం ప్లాట్ఫార్మ్ మీదే ఉండిపోయారు. అక్కడ ఉన్న ఒక ముసలావిడ ఆ వ్యక్తిని చూసి అయ్యో బాబు రైలు మిస్ అయ్యావ అని చెప్పేసి అడిగింది. అప్పుడు ఆ ప్రొఫెసర్ నవ్వుతూ ఏం చెప్పాడో తెలుసా లేదమ్మా అసలు రైలు ఎక్కాల్సింది నేను ఆ ముగ్గురు నన్ను సాగనంపడానికి వచ్చారు.
(02:22) వాళ్ళు మాటల దోరణలో పడి ఎక్కాల్సింది ఎవరు అనే విషయం మర్చిపోయి వాళ్లే ఎక్కేశారు. చూశారా ఎంతటి జ్ఞానులైనా సరే తమ ఉద్దేశాన్ని మర్చిపోతే ఎంతటి పొరపాటు జరుగుతుందో మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనం పెళ్లి చేసుకునేది ఒకరితో ఒకరు ఆనందంగా ఉండటానికి కానీ కొంత కాలం తర్వాత ఆ ఆనందం అనే ఉద్దేశం మాయమైపోతుంది. దాని స్థానంలో నీదా నాదా అనే ఈగోలు పంతాలు పట్టింపులు వచ్చేస్తాయి.
(02:45) మనం ఒక వ్యాపారం మొదలు పెట్టేది ఆర్థిక స్వేచ్ఛ కోసం కానీ తర్వాత ఆ వ్యాపారమే మనల్ని బానిసలుగా మార్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కనీసం మనల్ని మనం కూడా మర్చిపోతున్నాం. ఓషో గారు చెప్పినట్లు మనం చాలా విషయాల గురించి తెలుసుకుంటున్నాం కానీ మన గురించి మనకి ఏమీ తెలియదు. సమాజం మనకి కొన్ని అబద్ధాలు నేర్పించింది.
(03:05) మీరు ఎప్పుడు గెలిచేలా పెరిగెత్తాలి పక్కవాడి కంటే గొప్పగా ఉండాలి అని చెప్పేసి కంటిన్యూస్ గా మన మెదడులో నూరు పోస్తూనే ఉంటుంది. ఈ పోటీలో పడి మనం మన సహజత్వాన్ని కోల్పోతున్నాం. మనలో ఉన్న ఒక స్వచ్ఛమైన మనిషిని చంపేసి బయట ప్రపంచానికి కనిపించే ఒక మేకప్ వేసుకొని ముఖాన్ని ప్రదర్శిస్తున్నాం. ఆ మేకప్ ఎంత దట్టంగా ఉందంటే అసలు మీ అసలు ముఖం ఎలా ఉంటుందో కూడా గుర్తులేనంతగా.
(03:27) మరి ఈ పరిస్థితి నుంచి బయటపడటం ఎలాగా మన గమ్యాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి దీనికి మొదటి మెట్టు మౌనం అలాగే అవేర్నెస్ మీరు ఏదైనా పని చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి నేను ఇది ఎందుకు చేస్తున్నాను దీనివల్ల నాకు ఆనందం కలుగుతుందా అని చెప్పేసి ప్రశ్నించుకోండి ఓషో గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు ఏది చేసినా అది ప్రార్థనగా మారాలి అంటే మీరు వంట చేసినా నడిచినా ఆఫీస్ పని చేసినా అది పూర్తి స్పృహతో చేయాలి.
(03:53) మీరు ఎవరితోనైనా గొడవ పడుతున్నప్పుడు ఒక క్షణం గుర్తు చేసుకోండి మీరు ఆ వ్యక్తితో కలిసి ఉన్నది గొడవ పడటానికా లేక ప్రేమగా ఉండటానికా ఆ గుర్తుకు రావడం అనేది మిమ్మల్ని రక్షిస్తుంది. కాకపోతే చాలా మంది ఏంటంటే ఒక గొడవ పడేటప్పుడు గానీ ఒక పని చేసేటప్పుడు గానీ ఆ గుర్తుకు రావడం అనే కాన్సెప్ట్ ని మర్చిపోయి ఆ క్షణంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు.
(04:12) ఒక భక్తురాలు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిందంట. రమణ మహర్షి గారు అంటే సాక్షాత్తు జ్ఞాన స్వరూపం కానీ ఆవిడ ఆయన దగ్గరికి వెళ్లి ఏమ అడిగిందో తెలుసా భగవాన్ మీరు చాలా సన్నబడిపోయారు అని చెప్పేసి మీ తల అలా ఊగుతుంది మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పిందంట ఆమె వెళ్ళింది జ్ఞానం కోసం కానీ అక్కడ కూడా భౌతికమైన శరీరం మీద పడి కొట్టి మెట్టాడుతుంది.
(04:30) ఆమెకి మహర్షి కలల్లో ఉన్న ఆ వెలుగు కనిపించలేదు. కేవలం వనుకుతున్న తల మాత్రమే కనిపించింది. మనం కూడా అంతే గుడికి వెళ్తాం కానీ దేవుణ్ణి చూడటం కంటే పక్కన వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారో మన చెప్పులు ఎక్కడ ఉన్నాయో అని చెప్పేసి ఆలోచనతోనే ఉంటూ ఉంటాం. ఈ సమస్యని అధిగమించాలంటే మనం మన సహజత్వాన్ని అంటే ఆథెంటిసిటీని తిరిగి రావాలి. ఒక గులాబీ పువ్వు గడ్డి మొక్కను చూసి ఈర్ష పడదు.
(04:54) గడ్డి మొక్క కూడా గులాబీ పువ్వులా మారాలని చెప్పేసి అసలు ప్రయత్నించదు. దేనికి ఉండే సహజత్వం దానికి ఉంటుంది. కానీ మనిషి మాత్రం ఎప్పుడూ వేరొకరిలా ఉండాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో తన ఎసెన్స్ ని కోల్పోతాడు. మీరు ఎప్పుడైతే మీరుగా ఉంటారో మీరు ఎప్పుడైతే పక్కవాడితో పోల్చుకోవడం మానేస్తారో అప్పుడే మీరు మీ గమ్యం వైపు నడవగలరు.
(05:14) కోరికల గురించి నావల్ రవికాంత్ గారు ఒక మాట అంటారు. ఇది ఓజో సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మీకు ఎన్ని ఎక్కువ కోరికలు ఉంటే మీరు అంత తక్కువ స్వేచ్ఛను కలిగి ఉంటారు అని చెప్పేసి కోరికలు మనల్ని గమ్యం నుంచి పక్కదారి పట్టిస్తాయి. కాబట్టి మీ అవసరాలని మీ లక్ష్యాలని స్పృష్టంగా ఉంచుకోండి. ప్రతి ఉదయం నిద్ర లేవగానే మీ జీవిత ఉద్దేశాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి.
(05:35) ఆ గుర్తే మిమ్మల్ని రోజంతా సరైన దారిలో నడిపిస్తుంది. పాపం చాలా మందికి ఏంటంటే ఈ విషయం తెలియదున్నమాట. కోరికలు అంటే జీవిత లక్ష్యం అనుకుంటారు. జీవిత లక్ష్యమే కోరిక అనుకుంటారు. కోరికకి జీవిత లక్ష్యానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నాకంటూ ఒక యంబిషన్ ఉంది అదేంటి క్రికెటర్ అవ్వాలి లేకపోతే బాగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించాలి అది కూడా కాకపోతే ఒక సినిమా తీయాలి ఇవి కోరికలు కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఐఫోన్ కొనుక్కోవాలి ఒక కాస్ట్లీ బైక్ కొనుక్కోవాలని చెప్పేసి వాటిని కూడా జీవిత లక్ష్యం అనుకుంటారు.
(06:03) సో మీరు ఒక క్రికెటర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఒక సినిమా దర్శకుడు అవ్వాలనుకున్నప్పుడు మీరు బాగా చదవాలనుకున్నప్పుడు మీకు ఐఫోన్ ఎందుకు మీకు బైక్ ఎందుకు లేదు నాకు అన్ని కోరికలు ఉన్నాయి. మనిషి అన్నాగా కోరికలు కోరుకోకూడదు ఏంటి అని చెప్పేసి మీరు అంటే మాత్రం ఇప్పుడు మీరు రోజంతా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది.
(06:20) మీరు ఒక రోజులో బైక్ కోసం కష్టపడతారా సెల్ ఫోన్ కోసం కష్టపడతారా అలా అని చెప్పేసి మీకు ఉద్యోగం తెచ్చి ఆ చదువు కోసం కష్టపడతారా? లాజికల్ గా మాట్లాడితే మీరు కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. మీరు అనుకోవచ్చు ఉద్యోగం వచ్చేదాక ఎందుకు అప్పుడు నా వయసు అయిపోతుంది కదా అని చెప్పి అంటే మాత్రం ఇప్పుడు ఈ బైక్ కోసం ఈ సెల్ ఫోన్ కోసం మీ లక్ష్యానికి మీరు దూరమైపోతారు.
(06:41) అదే చెప్తుంది నవల రవికంద్ గారు. సో మీకు లక్ష్యాలు చాలా తక్కువగా ఉండాలి. అందులోన ఒకటే ఉంటే ఇంకా బెటర్. ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే జీవితం అనేది చాలా చిన్నది. దీన్ని అనవసరమైన విషయాల కోసం వృధా చేయకండి. మీరు ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇది ఎలాగో తెలుసా కేవలం ప్రస్తుత క్షణంలో జీవించడం ద్వారా గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడటం భవిష్యత్తు గురించి ఆందోళన చెడటం మానేసి ఈ క్షణంలో మీరు చేస్తున్న పనిని ప్రేమించండి.
(07:07) మీరు ఏ పని మొదలు పెట్టినా దాని అసలు ఉద్దేశాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఉదాహరణకి మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న ఉద్దేశం ఏంటి? ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనే కదా. మరి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ పాత అలవాటులోకి వెళ్ళిపోతే, ఈ సమయం అంతా వృదైనట్లే కదా. అందుకే విన్న మాటలు జీవితంలో అన్వయించుకోండి.
(07:26) ఓషో గారు అంటారు సంతోషంగా ఉండటం అసలైన విషయం. కానీ మీరు ఎంత సంపాదించారు ఎంతమందికి తెలుసు అనేది ముఖ్యం కాదు. అది ముఖ్యం కాకపోయినా సరే అందులో సంతోషం ఉందని చెప్పేసి చాలా మంది అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సంతోషం లేదు. కేవలం డబ్బు మాత్రమే ఉందని చెప్పేసి మళ్ళీ సంతోషం కోసం వెతుకుతారు. సో ఏది ఏమైనా సరే ఎవరికైనా సరే సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్.
(07:46) అందులోనూ మీరు ఎంత హాయిగా ఉన్నారు అనేది కూడా చాలా ముఖ్యము. మీ జీవితంలో ఎన్ని మేకప్లు వేసుకున్నా మీ లోపల ఉన్న సహజత్వం మాత్రం చంపుకోకండి. ప్రపంచం కోసం బ్రతకడం మానేసి మీ ఆత్మ తృప్తి కోసం బతకండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో క్లారిటీ కలిగి ఉండాలి. దారిలో ఎన్ని ఆకర్షణలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ అసలు లక్ష్యాన్ని వదిలి పెట్టకండి.
(08:07) పండగలు జరుపుకున్న ప్రయాణాలు చేసినా ఉద్యోగం చేసినా ఆ పనులు వెనుకున్న అసలు సంతోషాన్ని వెతుక్కోండి. అనవసరమైన గొడవలు ఈగోలకి తాగు ఇవ్వకండి. ఎందుకంటే చివరికి మిగిలేది మీరు పొందిన ఆనందం మీరు పంచిన ప్రేమ మాత్రమే నేటి నుంచే ఈ క్షణం నుంచే మారాలి అని నిర్ణయించుకోండి. ఏ పనిని చేసేటప్పుడు నేను ఎందుకు బయలుదేరాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
(08:28) ఒక ప్రశ్న మిమ్మల్ని 100 తప్పుల నుంచి కాపాడుతుంది. మీరు ఈ భూమి మీదకు వచ్చింది కేవలం మనుగడ సాగించడానికి కాదు. ఒక అద్భుతమైన జీవితాన్ని అనుభవించడానికి. ఆ అనుభవాన్ని మిస్ అవ్వకండి. స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్లి గట్టు మీద ఆడుకొని మురికితో తిరిగి రాకండి. పరిశుభ్రంగా ప్రశాంతంగా తిరిగి రండి. ముగింపుగా మిమ్మల్ని ఒక లోతైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను.
(08:49) ఈ ప్రశ్న మీ మనసు లోతుల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. మీరు మీ జీవితాంతం పక్కవాడు గీసిన గీతలో నడుస్తారా ఒక రోబోలా బ్రతుకుతారా లేక మీలోని అసలు చైతన్యాన్ని గుర్తించి మీరు ఈ భూమి మీదకు వచ్చిన పరమార్థాన్ని నెరవేర్చుకుంటారా? మీ అంతరాత్మ ఈ నిమిషం మీకు ఏం చెప్తుందో కింద కామెంట్స్ లో రాయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే ఖచ్చితంగా లైక్ చేయండి.
(09:08) మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అంతే కాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీ కోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఓం ఓం

No comments:

Post a Comment