సాయం అంటే వ్యాపారం కాదు! | Real Meaning of Help | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=i006D7Ef_eU
Transcript:
(00:00) ఒకసారి కళ్ళు మూసుకోండి మీ గుండె మీద చెయ్యి వేసుకోండి మీరు ఇన్నాళ్ళు చేసిన సాయం పంచుకున్న ప్రేమ నిజంగా అవతల వ్యక్తి కోసమేనా లేక మీకోసం మీరు చేసుకున్న ఒకే ఇన్వెస్ట్మెంటా ఈ ప్రశ్న మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం చాలా గొప్పవాళ్ళం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఎవరికైనా ఆపద వస్తే ఆదుకుంటాం, డబ్బులు లేకపోతే ఇస్తాం ఎవరైనా బాధలో ఉంటే ఓదారుస్తాం.
(00:23) ఇక్కడి వరకు అంతా బానే ఉంటుంది కానీ సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే ఆ సాయం చేసిన మరు క్షణమే మన మనసులో ఒక చిన్న విత్తనం పడుతుంది. అదే ప్రతిఫలం. మనం ఎవరికైనా ఫోన్ చేసి గంటలు తెరబడి వాళ్ళ బాధలు వింటాం. కానీ మనక ఒక అవసరం వచ్చి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు బిజీ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తే మన లోపల ఏదో తెలియని మంట మొదలవుతుంది.
(00:44) నేను వాడి కోసం ఎంత చేశాను వాడు కనీసం నా ఫోన్ కూడా ఎత్తడ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడే మనం సాయం అనే మసుగులో వ్యాపారం చేస్తున్నాం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. రమణ మహర్షి గారు ఒక మాట అనేవారు నేను చేస్తున్నాను అనే అహంకారం ఉన్నంత కాలం చేసే ఏ పనిలోనూ స్వచ్ఛత ఉండదు. మనం ఒకసారి సాయం చేసినప్పుడు ఆ వ్యక్తి మనకి రుణపడి ఉండాలని కోరుకుంటాం.
(01:06) వారు మనల్ని గౌరవించాలని మన పేరు చెప్పుకోవాలని చెప్పేసి ఆశిస్తాం. ఇది సాయం కాదు ఇది ఒక రకమైన అప్పు ఇవ్వడం లాంటిది. మనం ప్రేమను పంచడం లేదు. ప్రేమను వడ్డీతో సహా తిరిగి పొందాలని చూస్తున్నాం. ఈ వ్యాపార ధోరణి వలనే మన జీవితంలో ప్రశాంతత కరువు అవుతుంది. మీరు ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆ వ్యక్తి దాన్ని గుర్తించకపోతే మీకు కోపం వస్తుంది.
(01:27) అయితే మీరు చేసింది సాయం కాదు ఒక ఒప్పందం మాత్రమే ఈ ఆశ అసూయ ఈ కోపం ఎందుకు పుడుతున్నాయి ఎందుకంటే మనల్ని మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూసుకుంటున్నాం. నేను ఇచ్చేవాడిని వారు తీసుకునేవారు అనే ఒక అంతరాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఏదో ఉంది కాబట్టి మనం గొప్పవాళ్ళం అనే భావాన్ని మనం అహంకారానికి గురి చేస్తున్నాం. సొసైటీ కూడా మనల్ని అలాగే తయారు చేసింది.
(01:49) నువ్వు ఒకటి ఇస్తేనే నీకు ఒకటి వస్తుంది అని అది ఇప్పుడు నేర్పించింది కాదు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూనే ఉంది. అందుకే మన బంధంలో కూడా ఒక లెక్క ఉంటుంది. మనం ఒక పెళ్లికి వెళ్తే వాళ్ళు మనకి ఎంత చదివింపించారో మనం కూడా వాళ్ళకి అంతే ఇస్తాం. ఈ లెక్కలు మన రక్తంలో కలిసిపోయాయి. కానీ మనసు దగ్గరికి వచ్చేసరికి ఈ లెక్కలు తలకిందులు అవుతాయి.
(02:08) రమణ మహర్షి గారు చెప్పినట్లు అసలు సమస్య మనం అహంలోనే ఉంది. మనం చేసే ప్రతి పని వెనుక నాకేం వస్తుంది అనే ఆలోచన ఉంటుంది. మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మన మనసు ఒక అదృశ్యమైన రిజిస్టర్ లో దాన్ని రాసి పెట్టుకుంటుంది. భవిష్యత్తులో వాళ్ళు మనకి సహాయం చేయకపోతే ఆ పాత పేజీలు తిరిగేసి వాళ్ళని దోషులుగా నిలబెడతాం.
(02:31) అంటే ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేశమ అనుకోండి వాడు మన వల్ల బెనిఫిట్ పొందాడు హ్యాపీగా ఉన్నాడు అంతా అయిపోయింది. కాకపోతే ఏదో కొన్ని రోజులు గడిచిన తర్వాత అది కూడా ఒక 10 15 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఏదైనా అవసరం వచ్చి వాడిని ఒక హెల్ప్ అర్గారు అనుకోండి అతను చేయాలని ఉన్నా కూడా పరిస్థితులు సహకరించక అతను మీకు హెల్ప్ చేయలేకపోతాడు. దాంతో మీరు 15 సంవత్సరాల క్రితం వాడి కోసం నేను ఏం చేశాను కానీ ఇప్పుడు మాత్రం వీడు నాకు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ పేజీలన్నీ తిరిగేసి వాడిని దోషిగా నిలబెడతాం.
(03:00) దీనివల్ల బంధాలు విచ్చిన్నం అవుతాయి. మీ మనసులో నిరంతరం ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. అంటే నేను వాడికి ఇంత చేశాను వాడు నాకేం చేయట్లేదు అని చెప్పేసి మీ మైండ్ లో కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తప్ప తృప్తి రాదు. ఎదుటివారు మనం అనుకున్నట్లు ప్రవర్తించకపోతే కలిగే ఆ నిరాశ మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ లాజికల్ గా ఆలోచిస్తే అతను చేయాలనుకుంటే చేస్తాడు, చేయకూడదు అనుకుంటే చేయడు.
(03:27) ఒకవేళ చేయాలనుకున్నా కూడా పరిస్థితులు తన చేతిలో లేవు కాబట్టి చేయలేకపోతున్నాడేమో ఇన్ని ఫాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటిని కాకుండా మనం పక్కన పడేసి అతన్ని విలన్లా చూస్తూ తన గురించే కంటిన్యూగా ఆలోచిస్తూ మన మనసుని పాడు చేసుకుంటూ ఉంటాము. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే సాయం చేయడం మానేయాలా కాదు సాయం చేసే విధానాన్ని మార్చుకోవాలి. రమణ మహర్షి గారు ఒకసారి ఇలా అన్నారు సూర్యుడు వెలుగుని ఇస్తున్నాడు.
(03:51) చెట్టు నీడనిస్తుంది. అవి ఏమని తిరిగి ఆశిస్తున్నాయా ప్రకృతిలో ఏది ప్రతిఫలం కోసం పని చేయడం లేదు కానీ మనిషి మాత్రం ప్రతి అడుగులోనూ లాభం వెతుకుతున్నాడు. సో మొదటగా నేను చేస్తున్నాను అనే భావనని వదిలేయండి. ఒకసారి సాయం చేసే అవకాశం మీకు వచ్చింది అంటే అది మీ అదృష్టం. సాయం పొందిన వాడు మీకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు.
(04:13) నిజానికి మీకు ఆ అవకాశం ఇచ్చినందుకు మీరే అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సాయం చేసిన వెంటనే దాన్ని మర్చిపోవాలి. అది మన మెదడులో ఉండిపోకూడదు. ఎదుటి వ్యక్తి స్థితిని అర్థం చేసుకోండి. బహుశా వాళ్ళు తిరిగి ఇచ్చే స్థితిలో ఉండకపోవచ్చు లేదా వాళ్ళకి కృతజ్ఞత చూపే సంస్కారం లేకపోవచ్చు. అది వాళ్ళ సమస్య మీ సమస్య అయితే కాదు. మీ పని కేవలం ఇవ్వడం మాత్రమే.
(04:34) మీ దగ్గర ఉన్నది మీరు పంచుతున్నారు. అది మీ స్వభావం కావాలి. పువ్వు సువాసన ఇవ్వడం దాని స్వభావం. అది ఎవరి కోసం తన పరిమలాన్ని ఆపదు. మీరు కూడా అలాగే మారాలి. మీ సాయం ఒక నదిలా ప్రవహించాలి. ఇది ఎక్కడ ఆగిపోతుందో ఎవరికి చేరుతుందో మీకు అనవసరం. ఎప్పుడైతే మీరు ఈ అంచనాలను వదిలేస్తారో అప్పుడు మీ మనసులో ఒక అద్భుతమైన ప్రశాంతత మొదలవుతుంది. అదే నిజమైన ముక్తి.
(04:57) కాకపోతే మీకు చిన్న డౌట్ రావచ్చు. అసలు మనం పట్టించుకొని వాళ్ళ కోసం మనం ఎందుకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి మెయిన్ పాయింట్ ఏంటంటే అవతల వాడికి హెల్ప్ చేయాలని ఉన్నా సరే పరిస్థితులు సహకరించినప్పుడు అతను మాత్రం ఏం చేస్తాడు? ఒకవేళ అతని పరిస్థితులు బాగున్నప్పుడు మనక ఏం హెల్ప్ చేస్తాడు కానీ మనం మాత్రం మన ధర్మం ప్రకారం మన దగ్గర కొంచెం హెల్ప్ చేయడానికి ఉన్నప్పుడు చేయడంలో తప్పేముంది మన దగ్గర హెల్ప్ చేసేంత సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని అవతల వాళ్ళ కేటాయించడంలో తప్పేము ఉంది.
(05:22) కాబట్టి నేను ఏమంటానంటే హెల్ప్ చేస్తే మాత్రం నేను చేశాను కాబట్టి అతను నాకు చేయాలి అనే పాయింట్ ని వదిలేయండి. ఒకవేళ అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగినప్పుడు ఇతడికి నేను చేస్తే మళ్ళీ నాకు చేస్తాడో లేదో అనే డౌట్ ని కూడా వదిలేయండి. మీ దగ్గర టైం ఉంటే అవతల వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ దగ్గర డబ్బు ఉంటే అవతల వాళ్ళకి దానం చేయండి.
(05:41) మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఒక సలహా అడిగితే అవతల వాళ్ళకి మీకు తెలిసిన నాలెడ్జ్ ని పంచుకోండి అంతే అంతే తప్ప అవతల వ్యక్తి నుంచి మనం ఆశించడం అనేది అది వ్యాపారం అవుతుంది. అందులోనూ ప్రతి వ్యక్తికి మనకు సహాయం చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ చేసే పరిస్థితి కూడా సహకరించాలి. ఆ పరిస్థితులు సహకరించినప్పుడు పాపం అతను మాత్రం ఏం చేస్తాడు కాబట్టి దయచేసి వ్యాపారం చేయమాకండి అలా చేస్తే మీ ఉన్న మైండ్ పాడైపోతుంది.
(06:06) అందుకని మీకు నిజమైన విముక్తి అనేది కావాలి. అలా కావాలంటే సాయం చేసిన వెంటనే దాన్ని మర్చిపోండి. ఒకవేళ అతనికి చేయాలనిపిస్తే మీరు అడగకుండానే మీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకంటే మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు నుంచి ఒక కొత్త నిర్ణయం తీసుకుందాం. జీవితాన్ని లెక్కలతో కాకుండా ప్రేమతో చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వడం అలవాటు చేసుకుందాం.
(06:29) రమణ మహర్షి గారు అడిగేవారు నువ్వు ఎవరు అని ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు కేవలం ఈ శరీరం కాదు మీరు ఒక అనంతమైన చైతన్యం ఆ చైతన్యంలో అందరూ ఒక్కటే ఈ వారం మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. మీరు ఏ రకంగాను తిరిగి సాయం చేయలని వారికి ఏదైనా చేయండి. రోడ్డు మీద ఆకలితో ఉన్న ఒక మూగజీవికి ఆహారం పెట్టండి. లేదా ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న ఒక పేదవాడికి సహాయం చేయండి.
(06:55) అది చేసినట్లు ఎవ్వరికీ చెప్పకండి. కనీసం మీ భార్యకో లేకపోతే మీ పిల్లలకో అసలు ఎవ్వరికీ చెప్పకండి. ఆ సహాయం చేసినట్లు మీకు ఆ భగవంతుడికి మాత్రమే తెలిస్తే చాలు. అప్పుడు మీలో కలిగే ఆ సంతృప్తి ఉంది చూశారు అది కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా దొరకదు. ఎందుకంటే మనిషి అనేవాడు సహాయం చేస్తేనే గొప్పోడు లేకపోతే చేయకపోతే పిసినారోడు అని కాదు. సహాయం చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో మీకు తెలియదు.
(07:22) ఎందుకంటే సహాయం చేస్తేనే కదా మనకు అలవాట అయ్యేది. మీకు అనిపించొచ్చు అన్నగారు మనం మధ్య తరగతోలం మనకి చాలా కష్టాలు ఉంటాయి. మనం అవతల వాళ్ళకి సహాయం ఎలా చేస్తావ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సహాయం చేయాలి అంటే అవతల వాడి ఆకలిని ఒక పూట తీర్చడం కూడా సహాయమే. అందులోనూ ఒక మనిషికి బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనీసం తనకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం కూడా సహాయమే.
(07:43) సో నేను ఏమంటానంటే ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు సహాయం [సంగీతం] చేస్తే ఆ తృప్తి అందులోనూ మనందరినీ దేవుడు చూస్తాడు అని చెప్పేసి మనకు నమ్మకం ఉంది కదా నేనైతే నమ్ముతాను దేవుడు చూస్తాడు కచ్చితంగా మిమ్మల్ని కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. సో మీరు నిస్వార్థంగా మీకున్న దాంట్లో నుంచి ఎంతో కొంత మీకు నచ్చినంత అవతల వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే వచ్చే ఆ ఆనందం నిజంగా కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా దొరకదు.
(08:10) కాబట్టి మీలో మార్పు అనేది ఇప్పుడే రావాలి. మన చేతిలో ఉన్న ఈ క్షణంలోనే ఒక నిస్వార్థమైన పని చేద్దాం. సాయం చేయండి కానీ దాన్ని వ్యాపారంగా మార్చకండి. మీరు ఎంత ఎక్కువగా ఇస్తారో అంత ఎక్కువగా మీరు ఎదుగుతారు. ఇచ్చే కొద్ది మీ హృదయం విశాలం అవుతుంది. లెక్కలు చూసుకునేవాడు పేదవాడు. ఏమీ ఆశించకుండా ఇచ్చేవాడే అసలైన ధనవంతుడు. సో డబ్బులు ఇవ్వడానికి మనం ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు.
(08:36) మనకు ఉన్న దాంట్లో కొంతంటే కొంత అంటే కనీసం 1% ఇచ్చినా చాలు ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనం చనిపోయిన తర్వాత తీసుకెళ్ళేది ఏమీ లేదు అని చెప్పేసి కానీ నిజంగా చెప్పాలంటే మనం చేసిన పుణ్యాన్ని మాత్రమే తీసుకెళ్తాము కాబట్టి కచ్చితంగా మీకు ఉన్న దాంట్లో ఎంతో కొంత అవతల వాళ్ళకి సహాయం చేయండి. దయచేసి క్యాలిక్యులేషన్స్ మాత్రం చేయకండి.
(08:56) ఈ వీడియో మీరు ఇప్పటిదాకా చూశారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇప్పటివరకు చేసిన సహాయాల్లో అవతల వ్యక్తి మీకు థాంక్స్ చెప్పకపోయినా అందులోనూ అసలు మిమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు నేను నా ధర్మాన్ని చేశాను అని మీరు మనస్ఫూర్తిగా అనుకున్న సందర్భం ఏదైనా ఉందా ఉంటే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
(09:17) అంతేకాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో రెండు వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.
(09:51) బాయ్ ఆ ఓం
No comments:
Post a Comment