Sunday, March 22, 2026

******బ్రహ్మచర్యం: సామాన్యుడిని (Super_Human)గా మార్చే ఆ శక్తివంతమైన రహస్యం!​ #drpasupathirajgurejala

బ్రహ్మచర్యం: సామాన్యుడిని (Super_Human)గా మార్చే ఆ శక్తివంతమైన రహస్యం!​ #drpasupathirajgurejala

Author Name:Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rT9AM5Z4gaw



Transcript:
(00:00) నమస్కారం ప్రజలారా, ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం ఒక సాధారణ టాపిక్ కాదు. ఇది ఒక మనిషిని సాధారణ స్థితి నుండి అతిమానుషుడు అంటే సూపర్ హ్యూమన్ గా మార్చగల అత్యంత శక్తివంతమైన రహస్యం వేల సంవత్సరాల క్రితం మన దేశంలోని అడవుల నిశశబ్దంలో ఋషులు కళ్ళు మూసుకుని గాఢమైన ధ్యానంలో ఉండేవారు. అప్పుడు మనలాగా చేతిలో స్మార్ట్ ఫోన్లు లేవు. ఇంటర్నెట్ లేదు.
(00:25) బాహ్య ప్రపంచపు శబ్దాలు లేవు. కేవలం వారి అంతరాత్మలో వినిపించే ఒకే ఒక్క నినాదం బ్రహ్మచర్యమే దైవత్వం వైపు వేసే మొదటి నిచ్చెన. కానీ ఈ రోజుల్లో ఆ మాట వినగానే కొంతమంది నవ్వుతారు. మరి కొంతమంది ఆశ్చర్యపోతారు. ఇది పాతకాలపు ముసలమ్మ ముచ్చట. నేటి ఆధునిక యుగానికి ఇది సెట్ కాదు అని కొట్టి పారేస్తారు. చాలా మందికి బ్రహ్మచర్యం అంటే కేవలం శృంగారానికి దూరంగా ఉండటం అని మాత్రమే తెలుసు.
(00:52) కానీ వాస్తవానికి ఇది ఒక గొప్ప విజ్ఞానం. ఇది ఆత్మను శుద్ధి చేసుకునే ఒక గొప్ప సాధన. ఎవరైతే ఈ మార్గంలో నిజాయితీగా నడుస్తారో వాళ్ళు కేవలం నిగ్రహాన్ని పాటించడమే కాదు. వారి DNAన్ఏ లెవెల్ నుండే మారిపోతారు. ఈరోజు ఈ సుదీర్ఘ ప్రయాణంలో బ్రహ్మచర్యం వెనుక ఉన్న సైన్స్ స్పిరిచువాలిటీ మరియు అది మన జీవితాన్ని ఎలా మారుస్తుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం.
(01:16) మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శరీరం ఒక అద్భుతమైన ప్రయోగశాల. మన శరీరం ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ లాంటిది. మనం తీసుకునే ప్రతి ఆహారం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు ఆయుర్వేదం ప్రకారం మనం తినే ఆహారం ఏడు దశల గుండా ప్రయాణించి అత్యంత శక్తివంతమైన వీర్యంగా మారుతుంది.
(01:41) దీని గురించి సుశృత సంహితలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. రసాద్రక్తం తతోమాంసం మాంసాన్మేదస్తతోస్తి చ అస్తునోమజాతతః శుక్రం శుక్రాదోజః ప్రజాయతే దీని అర్థాన్ని లోతుగా విశ్లేషిద్దాం. మనం తిన్న ఆహారం మొదట షైల్ అంటే రసంగా మారుతుంది. ఐదు రోజుల తర్వాత ఆ రసం నుండి రక్తం పుడుతుంది. మరో ఐదు రోజులకు రక్తం నుండి మాంసం దాని నుండి కొవ్వు, దాని నుండి ఎముకలు, ఎముకల నుండి మజ్జ అంటే బోన్ మ్యారో, చివరగా ఆ మజ్జ నుండి శుక్రం అంటే వీర్యం తయారవుతుంది.
(02:22) అంటే మీరు ఈ రోజు తిన్న ఆహారం వీర్యంగా మారడానికి దాదాపు 30 రోజుల సమయం పడుతుంది. ఆలోచించండి శరీరంలోని అన్ని ధాతువుల సారం ఈ వీర్యం ఇంత సమయం ఇంత శక్తి వెచ్చించి శరీరం తయారు చేసిన ఈ పదార్థం కేవలం విసర్జన కోసమేనా ఒక్క చుక్క వీర్యంలో లక్షల జీవకణాలు ఉంటాయి. అంటే మీలో కోట్లాది ప్రాణులను సృష్టించగల శక్తి ఉంది. ఒక జీవిని సృష్టించగల శక్తి మీలో ఉన్నప్పుడు ఆ శక్తిని బయటకు పంపకుండా లోపలే దాచుకుంటే అది మీ మెదడును మీ నాడీ వ్యవస్థను ఎంత శక్తివంతంగా మారుస్తుందో ఊహించండి.
(02:55) ఆయుర్వేదం ప్రకారం ఈ శుక్రం నుండి ఓజస్సు పుడుతుంది. ఓజస్సు అంటే శరీరానికి ఉండే సహజమైన కాంతి. అయస్కాంత శక్తి మరియు అజయమైన రోగనిరోధక శక్తి. బ్రహ్మచారి ముఖంలో ఉండే ఆ ప్రత్యేకమైన మెరుపుకు కారణం ఇదే నేటి విజ్ఞాన శాస్త్రం కూడా బ్రహ్మచర్యం యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తోంది. 2003 లో చైనాలోని జేజియాంగ్ విశ్వవిద్యాలయం ఒక ప్రయోగం చేసింది.
(03:22) పురుషులు తమ వీర్యాన్ని రక్షించుకున్నప్పుడు వారి శరీరంలో హార్మోన్ల మార్పులు ఎలా ఉంటాయో వారు గమనించారు. ఆశ్చర్యకరంగా ఏడు రోజులపాటు వీర్య రక్షణ పాటించిన వారిలో టెస్టోస్టరోన్ స్థాయిలు ఏకంగా 145% పెరిగాయి. టెస్టోస్టిరాన్ అంటే కేవలం కండరాల బలం మాత్రమే కాదు. ఇది ఒక మనిషిలో ఉండే ఆత్మవిశ్వాసం నిర్ణయాత్మక శక్తి మరియు ధైర్యానికి మూలం.
(03:46) ఏడవ రోజు ఆ శక్తి శిఖరాగ్రానికి చేరుతుంది. ఆ సమయంలో ఆ శక్తిని కామవాంచలుగా వృధా చేయకుండా ధ్యానం లేదా క్రియేటివ్ పనుల వైపు మళ్లిస్తే అది మేదస్సుగా రూపాంతరం చెందుతుంది. దీనికి విరుద్ధంగా నేటి కాలంలో యువత చీప్ డోపామైన్ కి బానిసలవుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అశ్లీల చిత్రాలు క్షణికానందాన్ని ఇచ్చే అలవాట్ల వల్ల మెదడులో డోపమైన్ మోతాదు మించిపోతుంది.
(04:10) దీని వల్ల ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ దెబ్బతింటుంది. ఇది దెబ్బతింటే మనిషికి ఏకాగ్రత ఉండదు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చివరికి ఆత్మవిశ్వాసం కోల్పోయి మానసిక కొంగుబాటుకు లోనవుతారు. బ్రహ్మచర్యం ఈ డోపమైన్ వృధాను అడ్డుకొని మెదడును తిరిగి రివైర్ చేస్తుంది. మెదడులోని గ్రే మేటర్ సాంద్రత పెరగడం వల్ల మేధోశక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది.
(04:34) అడవుల్లో ఉండే ఋషులు ఎలాంటి జిమ్ములు కృత్రిమ ఆహారాలు లేకపోయినా ఎంతో తేజస్సుతో ఉండేవారు. వారి కళ్ళల్లో ఒక మెరుపు వారి మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. దీనికి అసలు కారణం బ్రహ్మచర్యం. పతంజలి యోగ సూత్రాల ప్రకారం బ్రహ్మచర్య ప్రతిష్టాయం వీర్య లాభ. బ్రహ్మచర్యం పాటించే వారి మాటల్లో ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. దీన్నే వాక్ సిద్ధి అంటారు.
(05:01) అంటే వారు ఏదైనా చెబితే అది జరిగి తీరుతుంది. దీనికి కారణం వారి లోపల నిక్షిప్తమైన శక్తి ఓజస్సుగా మారి వారి నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. ఉదాహరణకు స్వామి వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి శాస్త్రవేత్తలు ఆయన మేదస్సును చూసి ఆశ్చర్యపోయారు. ఆయన ఒక 1000 పేజీల పుస్తకాన్ని కేవలం ఒక గంటలో చదివి. అందులో ఏ పేజీలో ఏముందో అక్షరం పొల్లుపోకుండా చెప్పేవారు.
(05:26) దీనికి కారణం అడిగితే ఆయన చిరునవ్వుతో చెప్పిన సమాధానం బ్రహ్మచర్యం. 12 ఏళ్ల పాటు కఠినమైన బ్రహ్మచర్యం పాటించడం వల్ల నా మెదడులో మేధానాడి మేల్కొంది అని ఆయన చెప్పారు. సాధారణ మనిషికి 10 శాతం మెదడు పనిచేస్తే బ్రహ్మచారికి అది 100% వైపు వెళుతుంది. ఇప్పుడు మనం అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక కోణంలోకి వెళదాం. మన వెన్నెముక అడుగు భాగంలో మూలాధార చక్రం వద్ద ఒక శక్తి నిద్రపోతూ ఉంటుంది.
(05:54) దీన్నే కుండలిని అంటారు. సాధారణ మనిషిలో ఈ శక్తి అదోముఖంగా కిందకు ప్రవహిస్తుంది. అందుకే వారు కేవలం శారీరక సుఖాలకే పరిమితమవుతారు కానీ ఒక సాధకుడు బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు ఆ శక్తి ఊర్ధ్వ ముఖంగా పైకి ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో ఏడు చక్రాలు అంటే ఏడు ద్వారాలు ఉంటాయి. మూలాధారం ఇది వెన్నెముక చివర ఉంటుంది. ఇది మనుగడను భయాన్ని సూచిస్తుంది.
(06:23) బ్రహ్మచర్యం పాటించని వారి శక్తి ఇక్కడే ఆగిపోతుంది. ఇక్కడ శక్తి స్థిరపడితే మనిషికి అపారమైన శారీరక బలం కలుగుతుంది. స్వాధిష్టానం ఇది జననేంద్రియాల వద్ద ఉంటుంది. ఇది సృజనాత్మకతకు కేంద్రం ఇక్కడ శక్తి మేల్కొంటే మనిషి అద్భుతమైన కళాకారుడు లేదా సృష్టికర్త అవుతాడు. మణిపూర నాభి వద్ద ఉంటుంది. ఇది సంకల్ప బలానికి కేంద్రం ఇక్కడ శక్తి ఉంటే మనిషి అజయమైన నాయకుడు లీడర్ అవుతాడు. అనాహత హృదయం వద్ద ఉంటుంది.
(06:51) ఇక్కడ శక్తి చేరితే మనిషిలో స్వార్థం పోయి విశ్వ ప్రేమ, కరుణ కలుగుతాయి. విశుద్ధి, కంఠం వద్ద ఉంటుంది. ఇది సత్యానికి ప్రతీక. బ్రహ్మచారి వాక్కు ఇక్కడే పరమ పవిత్రమవుతుంది. ఆజ్ఞ చక్రం థర్డ్ ఐ. రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇక్కడ శక్తి చేరినప్పుడు మనిషికి అంతర్జ్ఞానం కలుగుతుంది. కాలానికి అతీతమైన విషయాలు తెలుస్తాయి.
(07:14) సహస్రారం తల పై భాగంలో ఉంటుంది. ఇక్కడ శక్తి చేరినప్పుడు మనిషికి విశ్వ చైతన్యంతో అనుసంధానం ఏర్పడుతుంది. దీన్నే సమాధి స్థితి అంటారు. బ్రహ్మచర్యం లేనిదే ఈ చక్రాలను దాటడం అసాధ్యం. శక్తి కిందకు జారిపోతే అది కేవలం క్షణికానందం. అదే పైకి లేస్తే అది అమృతం. చాలామంది బ్రహ్మచర్యం అంటే కోరికలను అణచివేయడం అనుకుంటారు. కానీ అది తప్పు కోరికలను అణచివేస్తే అవి మరింత బలంగా లోపల పేరుకు పోయి మానసిక రోగాలుగా మారుతాయి.
(07:45) నిజమైన బ్రహ్మచర్యం అంటే కోరికలను రూపాంతరం చెందించడం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు. విషయ వినీవర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనం ఒక చిన్న పిల్లాడికి పాత బొమ్మను వదిలిపెట్టమని చెబితే వాడు వినడు కానీ అంతకంటే పెద్ద ఆకర్షణీయమైన బొమ్మను చూపిస్తే వాడు పాతదాన్ని తనంతట తానుగానే వదిలేస్తాడు.
(08:14) అలాగే సాధకుడు ధ్యానం ద్వారా ఆత్మానందాన్ని, రుచి చూసినప్పుడు అతనికి శారీరక సుఖాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కోరికలను చంపడం కాదు వాటిని ధ్యానంగా మార్చుకోవాలి. కోరికలను కరుణగా మార్చుకోవాలి. చారిత్రక మరియు ఆధునిక ఉదాహరణలు చూద్దాం. బ్రహ్మచర్యం కేవలం ఋషులకే కాదు శాస్త్రవేత్తలకు మరియు క్రీడాకారులకు కూడా వర్తిస్తుందని చరిత్ర చెబుతోంది.
(08:41) నికోలా టెస్లా ప్రపంచానికి ఏసీ విద్యుత్తును అందించిన ఈ మేధావి తన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. నేను నా లైంగిక శక్తిని ఆవిష్కరణల శక్తిగా మార్చుకున్నాను అని ఆయన స్వయంగా చెప్పారు. హనుమంతుడు మరియు భీష్ముడు మన పురాణాల్లో అజయమైన శక్తికి మారుపేరు హనుమంతుడు ఆయన బల పరాక్రమాల వెనుక ఉన్న రహస్యం నైష్టిక బ్రహ్మచర్యం అలాగే భీష్మ పితామహుడు తన బ్రహ్మచర్య శక్తితోనే మృత్యువును కూడా శాసించే ఇచ్ఛామరణం పొందారు.
(09:10) మహమ్మద్ అలీ మరియు మైక్ టైసన్ బాక్సింగ్ దిగ్గజాలు తమ మ్యాచ్ లకు ముందు నెలలు తరబడి బ్రహ్మచర్యం పాటించేవారు. దీనివల్ల వారిలో అపారమైన ఎనర్జీ ఏకాగ్రత పుట్టేది. సర్ ఐజాక్ న్యూటన్. గ్రావిటీని కనుగొన్న న్యూటన్ తన జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించి ఆ శక్తిని విజ్ఞాన శాస్త్రానికి ధారపోశారు. బ్రహ్మచారి తన శక్తిని బీజాక్షరాలతో ఓం హ్రీం, క్లీం, శ్రీం జోడించినప్పుడు అతని నాడీ వ్యవస్థలో అద్భుతమైన ప్రకంపనలు మొదలవుతాయి.
(09:43) మన శరీరంలో ఇడా, పింగళ, సుషుమ్న అనే మూడు ప్రధాన నాడులు ఉంటాయి. ఇడా నాడి వెన్నెముకకు ఎడమవైపు ఉంటుంది. ఇది చంద్ర తత్వాన్ని శాంతిని సూచిస్తుంది. పింగళ నాడి కుడి వైపు ఉంటుంది. ఇది సూర్య తత్వాన్ని శక్తిని సూచిస్తుంది. సుషుమ్న నాడి వెన్నెముక మధ్యలో ఉంటుంది. ఇది బ్రహ్మచర్యం లేనిదే మేల్కొనదు. కుండలిని శక్తి సుషుమ్న నాడి ద్వారా ప్రయాణించినప్పుడు మనిషి తన పరిమితులను దాటి విశ్వంతో ఏకమవుతాడు.
(10:11) రామలింగ స్వామి వంటి మహాయోగులు ఈ స్థితిని చేరుకొని తమ శరీరాన్ని కాంతిగా మార్చుకున్నారు. ఆచరణాత్మక చిట్కాలు ఈ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలి? ఈ దారి అంత సులభం కాదు. ఇది ఒక అంతర్యుద్ధం లాంటిది. మీరు ఈ మార్గంలో నిలబడాలంటే ఈ క్రింది పద్ధతులు పాటించాలి. ఆహారం సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అతిగాక కారం, ఉప్పు, మసాలాలు శరీరంలో వేడిని పెంచి కామవాంఛంచలను ప్రేరేపిస్తాయి.
(10:38) బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు నుండి ఆరు గంటల మధ్య నిద్ర లేవడం వల్ల మెదడులో టీనియల్ గ్రంధి యాక్టివేట్ అవుతుంది. ఆ సమయంలో చేసే ధ్యానం వీర్యశక్తిని ఊర్ధ్వ ముఖం చేస్తుంది. సంగత్యం మీరు ఎవరితో ఉంటున్నారు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అన్నది మీ ఉపచేతన మనసుపై ప్రభావం చూపుతుంది. ప్రాణాయామం మరియు ముద్రలు శ్వాస మీద నియంత్రణ ఉంటేనే వీర్యం మీద నియంత్రణ ఉంటుంది.
(11:04) అశ్విని ముద్ర లేదా మూలబంధం వంటి ప్రక్రియలు శక్తిని పైకి పంపిస్తాయి. ముగింపుగా నా విశ్లేషణలో నేను చెప్పేది ఒక్కటే బ్రహ్మచర్యం అంటే మీ స్వేచ్ఛను కోల్పోవడం కాదు అసలైన స్వేచ్ఛను పొందడం కోరికలకు బానిస కాకుండా కోరికలను మీ బానిసలుగా మార్చుకోవడమే నిజమైన విజయం. మన శరీరం ఒక దేవాలయం. మనలోని వీర్యశక్తి ఆ దేవాలయంలో వెలిగే అఖండ జ్యోతి.
(11:30) ఆ జ్యోతిని ఆరిపోనివ్వకండి. మీరు బ్రహ్మచర్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నప్పుడు ఈ విశ్వమే మీకు తలవంచుతుంది. మీ సంకల్పంలో ఎంత శక్తి వస్తుందంటే మీరు దేని గురించి ఆలోచిస్తే అది సాక్షాత్కరిస్తుంది. మీ ముఖంలో ఉండే ఆ తేజస్సు మీ మాటలో ఉండే ఆ గాంభీర్యం చూసి లోకం విస్తుపోతుంది. నేటి నుండే ఒక సంకల్పం తీసుకోండి. ఇది కేవలం శారీరక నిగ్రహం మాత్రమే కాదు.
(11:54) ఇది మీ ఆత్మకు మీరు ఇచ్చే అత్యున్నతమైన బహుమతి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు వేల సంవత్సరాల భారతీయ విజ్ఞానం మీ వెన్నంటి ఉంది. మీరు ఈ గొప్ప మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ విజ్ఞానం మీలో ఎలాంటి ఆలోచనలను రేకెత్తించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేసి మన సనాతన ధర్మం మరియు విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో మీ వంతు పాత్ర పోషించండి. సర్వేజన సుఖినో భవంతు.
(12:24) మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.
(12:45) రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.

No comments:

Post a Comment